కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w16 డిసెంబరు పేజీలు 8-12
  • మీరు అపారదయ వల్ల విడుదల పొందారు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు అపారదయ వల్ల విడుదల పొందారు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అపారదయతో మనల్ని క్షమిస్తున్నాడు
  • దేవుని అపారదయకు కృతజ్ఞత చూపించడం
  • పాపంతో చేసే పోరాటంలో మీరు గెలవవచ్చు
  • దేవుని కృపకు కృతజ్ఞత చూపించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • దేవుని కృప గురించిన సువార్త ప్రకటించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • దయ చూపిస్తూ నడుచుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • దేవుని ప్రజలు దయను ప్రేమించాలి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
w16 డిసెంబరు పేజీలు 8-12
రోములో ప్రకటిస్తున్న అపొస్తలుడైన పౌలు

మీరు అపారదయ వల్ల విడుదల పొందారు

‘మీరు ఇప్పుడు దేవుని అపారదయ కింద ఉన్నారు కాబట్టి పాపాన్ని మీ మీద ఏలనివ్వకండి.’—రోమా. 6:14, NW.

పాటలు: 46, 13

మీరేమంటారు?

  • విమోచన క్రయధనం దేవుని అపారదయకు రుజువని ఎందుకు చెప్పవచ్చు?

  • క్రైస్తవులు ఏవిధంగా ‘పాపము విషయంలో చనిపోయినవాళ్లలా’ ఉన్నారు?

  • దేవుని అపారదయ పట్ల మనకు ప్రగాఢమైన కృతజ్ఞత ఉన్నప్పుడు అన్నిరకాల పాపాలకు దూరంగా ఎందుకు ఉంటాం?

1, 2. రోమీయులు 5:12వ వచనం మనకెలా సహాయం చేయగలదు?

రోమీయులు 5:12 లో ఇలా ఉంది, “ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.” మనకు బాగా తెలిసిన లేఖనాల్లో ఇది కూడా ఒకటి. ప్రజలకు బైబిలు గురించి నేర్పిస్తున్నప్పుడు ఈ వచనాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం.

2 బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలో ఈ వచనం చాలాసార్లు కనిపిస్తుంది. ఈ  పుస్తకంలోని 3, 5, 6 అధ్యాయాల్ని మన పిల్లలతో అలాగే వేరేవాళ్లతో చర్చిస్తున్నప్పుడు రోమీయులు 5:12 వ వచనాన్ని మనం చదువుతుంటాం. భూమి పరదైసుగా ఎందుకు లేదో, మనకు విమోచన క్రయధనం ఎందుకు అవసరమో, మనం ఎందుకు చనిపోతున్నామో అర్థంచేసుకునేందుకు వాళ్లకు సహాయం చేయడానికి ఈ వచనాన్ని ఉపయోగిస్తుంటాం. అయితే యెహోవాతో మనకున్న సంబంధంపట్ల కృతజ్ఞతను మరింత పెంచుకోవడానికి కూడా ఈ వచనం మనందరికీ సహాయం చేయగలదు. యెహోవాను సంతోషపెట్టాలని మరింత బలంగా నిర్ణయించుకోవడానికి, ఆయన మాటిచ్చిన వాటికోసం ఎదురుచూస్తూ ఉండడానికి కూడా అది మనకు సహాయం చేయగలదు.

3. మనమెలాంటి వాళ్లమని మనం గుర్తుంచుకోవాలి?

3 బాధాకరమైన విషయమేంటంటే, మనమందరం పాపులం. ప్రతీరోజు పొరపాట్లు చేస్తుంటాం. కానీ యెహోవా కనికరంగల దేవుడు. మనం అపరిపూర్ణులమని ఆయనకు తెలుసు, మనల్ని క్షమించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. (కీర్త. 103:13, 14) మన పాపాల్ని క్షమించమని దేవున్ని అడగాలని యేసు మనకు చెప్పాడు. (లూకా 11:2-4) మనం గతంలో చేసిన పొరపాట్లను యెహోవా క్షమించిన తర్వాత మనం ఇక వాటిగురించి ఆలోచిస్తూ ఉండాల్సిన అవసరంలేదు. అయితే యెహోవా మనల్ని దేన్నిబట్టి క్షమిస్తున్నాడో ఇప్పుడు పరిశీలిద్దాం.

అపారదయతో మనల్ని క్షమిస్తున్నాడు

4, 5. (ఎ) రోమీయులు 5:12 వ వచనాన్ని అర్థంచేసుకోవడానికి మనకేది సహాయం చేస్తుంది? (బి) ‘అపారదయ’ అనే మాటకు అర్థమేమిటి?

4 రోమీయులు 5:12 వ వచనాన్ని అర్థంచేసుకోవడానికి రోమీయులు పత్రిక మనకు సహాయం చేస్తుంది. ముఖ్యంగా 6వ అధ్యాయం మరింత సహాయం చేస్తుంది. అప్పుడు, యెహోవా మనల్ని దేనిబట్టి క్షమిస్తున్నాడో అర్థంచేసుకోగలుగుతాం. ‘అందరం పాపం చేశామని’ 3వ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం. ఆ తర్వాత పౌలు ఇలా వివరిస్తున్నాడు, ‘క్రీస్తుయేసు చెల్లించిన విమోచన క్రయధనం వల్ల కలిగిన విడుదల ద్వారా వాళ్లు నీతిమంతులుగా తీర్పు తీర్చబడుతున్నారు. ఇది, దేవుడు తన అపారదయతో ఇచ్చిన ఉచిత బహుమానం.’ (రోమా. 3:23, 24, NW) ‘అపారదయ’ అని అనువదించబడిన గ్రీకు పదానికి, తిరిగి ఏదీ ఆశించకుండా దయతో ఏదైనా చేయడమనే అర్థం ఉంది. అంటే ఉచితంగా, ఏమీ లాభం ఆశించకుండా చేయడాన్ని ఆ పదం సూచిస్తుంది.

5 దేవుడు లేదా క్రీస్తు చూపించిన అపారదయ గురించి బైబిలు మాట్లాడుతున్నప్పుడు, వాళ్లు మానవజాతిని పాపమరణాల నుండి రక్షించడానికి చేసినదాన్ని అది సూచిస్తుందని ఓ విద్వాంసుడు వివరించాడు. కాబట్టి నూతనలోక అనువాదం ఇంగ్లీషు బైబిల్లో ఆ గ్రీకు పదాన్ని ‘అపారదయ’ అని అనువదించారు. దేవుడు మనకోసం ఏమి చేశాడో, ఆయన చూపించిన అపారదయ వల్ల ఇప్పుడు మనకెలాంటి ప్రయోజనాలు ఉన్నాయో, భవిష్యత్తు విషయంలో ఎలాంటి నిరీక్షణ ఉందో తెలుసుకుందాం.

6. దేవుని అపారదయ నుండి ఎవరు ప్రయోజనం పొందవచ్చు?

6 ఆదాము పాపం చేసినందువల్ల, భూమ్మీద జీవించే ప్రతీ మనిషి పాపమరణాల బారినపడుతున్నాడు. అందుకే ‘ఒక్క మనిషి చేసిన పాపంవల్ల మరణం రాజుగా ఏలింది’ అని బైబిలు చెప్తోంది. కానీ యెహోవా గొప్ప అపారదయ చూపించి, ‘ఒక్క వ్యక్తి వల్ల అంటే యేసుక్రీస్తు వల్ల’ మానవజాతి అంతటినీ కాపాడే ఏర్పాటు చేశాడు. (రోమా. 5:12, 15, 17, NW) అవును, ‘ఒకని విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేయబడతారు.’ అంతేకాదు వాళ్లు ‘యేసుక్రీస్తు మూలంగా,’ ‘నిత్యజీవం’ కోసం ఎదురుచూడవచ్చు.—రోమా. 5:19-21.

7. దేవుడు ఏర్పాటు చేసిన విమోచన క్రయధనం ఆయన దయకు రుజువని, నిజానికి దాన్ని పొందేందుకు మనకు అర్హతలేదని ఎలా చెప్పవచ్చు?

7 నిజానికి తన కుమారుణ్ణి బలిగా అర్పించాల్సిన అవసరం యెహోవాకు లేదు. కానీ మనల్ని పాపమరణాల నుండి విడిపించడం కోసం ఓ ఏర్పాటు చేయడం ద్వారా గొప్ప దయను చూపించాడు. దేవుడు, యేసు చేసినదానికి మనలో ఎవ్వరం అర్హులం కాదు. మన పాపాలకు క్షమాపణ, శాశ్వతంగా జీవించే నిరీక్షణ ఇచ్చినందుకు వాళ్లకు మనమెంత రుణపడి ఉన్నామో కదా! వాళ్లపట్ల మనకున్న కృతజ్ఞతను మన జీవన విధానంలో చూపిద్దాం.

దేవుని అపారదయకు కృతజ్ఞత చూపించడం

8. ఎలాంటి ఆలోచన మనలో రానివ్వకూడదు?

8 మన పాపాల్ని, చివరికి గంభీరమైన పాపాల్ని కూడా క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని మనకు తెలుసు. కానీ ఆయన చూపించే అపారదయను సాకుగా తీసుకుని ఏదైనా తప్పు చేసేసి ‘యెహోవా నన్ను క్షమిస్తాడు’ అని ఎన్నడూ అనుకోకూడదు. మొదటి శతాబ్దంలో, కొంతమంది క్రైస్తవులు అలాంటి ఆలోచనతోనే ఉండేవాళ్లు, అప్పటికి అపొస్తలుల్లో కొంతమంది ఇంకా బ్రతికే ఉన్నారు. (యూదా 4 చదవండి.) నేడు మనం కూడా ఇతరుల ప్రభావానికి గురై మెల్లమెల్లగా అలా ఆలోచించడం మొదలుపెట్టకుండా జాగ్రత్తపడాలి.

9, 10. పౌలు, ఇతరులు పాపమరణాల నుండి ఎలా విడుదలయ్యారు?

9 ఓ వైపు పాపాలు చేస్తూ దేవుడు క్షమిస్తాడని అనుకోవడం తప్పని పౌలు క్రైస్తవులకు చెప్పాడు. ఎందుకంటే మనం ‘పాపం విషయంలో చనిపోయాం’ కాబట్టి అలాంటి ఆలోచనను రానివ్వకూడదని అతను చెప్పాడు. (రోమీయులు 6:1, 2 చదవండి.) ఇంతకీ పౌలు అన్న ఆ మాటలకు అర్థమేమిటి?

10 పౌలు అలాగే మొదటి శతాబ్దంలోని ఇతర క్రైస్తవులు చేసిన తప్పుల్ని దేవుడు విమోచన క్రయధనం ఆధారంగా క్షమించాడు. ఆ తర్వాత వాళ్లు తన కుమారులుగా ఉండేలా వాళ్లను పవిత్రశక్తితో అభిషేకించాడు. వాళ్లు చివరివరకు నమ్మకంగా ఉంటే పరలోకానికి వెళ్లి క్రీస్తుతోపాటు పరిపాలిస్తారు. కానీ వాళ్లు ఇంకా భూమ్మీద బ్రతికుండగానే ‘పాపం విషయంలో చనిపోయినవాళ్లు’ ఎలా అవుతారు? నిజానికి, మనిషిగా చనిపోయి అమర్త్యమైన ఆత్మగా పరలోకానికి పునరుత్థానం చేయబడిన యేసు ఉదాహరణను అక్కడ పౌలు ఉపయోగించాడు. ఆయన అలా పునరుత్థానం చేయబడడంతో ‘మరణానికి ఆయనపై ఇక అధికారం’ లేకుండా పోయింది. అదేవిధంగా తమ పాత జీవన విధానాన్ని పూర్తిగా విడిచిపెట్టిన అభిషిక్త క్రైస్తవులు కూడా ‘పాపం విషయంలో మృతులుగా, దేవుని విషయంలో క్రీస్తుయేసునందు సజీవులుగా’ ఉన్నట్లు పరిగణించుకోవచ్చు. (రోమా. 6:8, 9, 11) ఎందుకంటే వాళ్ల జీవన విధానం ఒకప్పటిలా లేదు. వాళ్లు తమ పాపపు కోరికల అధీనం నుండి విడుదల పొందారు. ఆ విధంగా వాళ్లు తమ గత జీవన విధానం విషయంలో చనిపోయినవాళ్లలా ఉన్నారు.

11. నేడు క్రైస్తవులు ఏవిధంగా ‘పాపం విషయంలో చనిపోయినవాళ్లుగా’ ఉన్నారు?

11 మరి నేడున్న క్రైస్తవుల విషయమేమిటి? యెహోవా మన పనుల్ని ఎలా భావించేవాడో తెలియక గతంలో ఎన్నో తప్పులు చేసి ఉండవచ్చు. ఒకవిధంగా మనం ‘అపవిత్రతకు, అక్రమానికి దాసులుగా,’ అంటే ‘పాపానికి దాసులుగా’ ఉండేవాళ్లం. (రోమా. 6:19, 20) కానీ మనమెలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడో బైబిలు నుండి నేర్చుకున్నప్పుడు మన జీవితాల్లో మార్పులు చేసుకుని, ఆయనకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్నాం. యెహోవా మాట వింటూ ఆయన్ను సంతోషపెట్టే విధంగా జీవించాలనే బలమైన కోరిక మనలో కలిగింది. ఆ రకంగా మనం ‘పాపం నుండి విమోచించబడి నీతికి దాసులయ్యాం.’ (రోమా. 6:17, 18) కాబట్టి మనం కూడా ‘పాపం విషయంలో చనిపోయినవాళ్లలా’ ఉన్నామని చెప్పవచ్చు.

12. ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం మనలో ప్రతీ ఒక్కరికీ ఉంది?

12 ఇప్పటికీ నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. పౌలు ఇలా అన్నాడు, “శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి.” (రోమా. 6:12) అయితే, మనం కావాలంటే పాపపు ఆలోచనలకు, కోరికలకు లొంగిపోవచ్చు లేదా వాటిని అదుపులో ఉంచుకోవచ్చు, నిర్ణయం మనదే. కాబట్టి మనమిలా ప్రశ్నించుకోవాలి, ‘చెడ్డ పనులు చేసేందుకు నడిపించేలా నాలో పాపపు కోరికలు బలంగా మారేందుకు నేను అనుమతిస్తున్నానా? లేదా వాటిని వెంటనే మనసులో నుండి తీసేస్తున్నానా?’ దేవుని అపారదయ పట్ల మనకు నిజంగా ప్రగాఢమైన కృతజ్ఞత ఉంటే ఆయన్ను సంతోషపెట్టేందుకు చేయగలిగినదంతా చేస్తాం.

పాపంతో చేసే పోరాటంలో మీరు గెలవవచ్చు

13. మనం సరైనది చేయగలమనే నమ్మకంతో ఎందుకు ఉండవచ్చు?

13 మొదటి శతాబ్దంలో కొరింథులోని కొంతమంది దొంగలుగా, స్వలింగ సంపర్కులుగా, వ్యభిచారులుగా, విగ్రహారాధకులుగా, తాగుబోతులుగా ఉండేవాళ్లు. కానీ వాళ్లు యెహోవా గురించి తెలుసుకుని ఆయన్ను ప్రేమించడం మొదలుపెట్టాక మార్పులు చేసుకున్నారు. గతంలో వాళ్లు చేసిన పనుల్నిబట్టి సిగ్గుపడ్డారు. (రోమా. 6:21; 1 కొరిం. 6:9-11) రోములోని క్రైస్తవులు కూడా అలాంటి మార్పులే చేసుకోవాల్సి వచ్చింది. వాళ్లకు పౌలు ఇలా చెప్పాడు, “మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి.” (రోమా. 6:13) వాళ్లు సరైనది చేస్తూ, దేవుని అపారదయ నుండి ప్రయోజనం పొందుతూ ఉంటారనే నమ్మకం పౌలు కలిగివున్నాడు.

14, 15. మనం ఏమని ప్రశ్నించుకోవాలి?

14 నేడు మనకాలంలో కూడా అంతే. కొంతమంది సహోదరసహోదరీలు కొరింథులోని ప్రజల్లా జీవించి ఉండవచ్చు. కానీ యెహోవా గురించి తెలుసుకున్నాక వాళ్లు మారి ‘కడుగబడ్డారు.’ యెహోవాను సంతోషపెట్టేందుకు మనందరం మన జీవితాల్లో మార్పులు చేసుకున్నాం. దేవుని అపారదయపట్ల మనకు కృతజ్ఞత ఉందని ఇప్పుడు కూడా మనం చూపించాలనుకుంటాం. కాబట్టి మనలోని తప్పుడు కోరికలతో పోరాడి, మన జీవితాన్ని యెహోవాను సేవించేందుకు ఉపయోగించాలని బలంగా నిర్ణయించుకున్నాం.

15 అయితే కొరింథులోని కొంతమంది చేసినలాంటి గంభీరమైన తప్పుల్ని మనం చేయకుండా జాగ్రత్తపడాలి. ఓ వైపు అలాంటి తప్పులు చేస్తూ, దేవుడు మనమీద తన అపారదయను చూపిస్తూ మనల్ని క్షమించాలని ఆశించకూడదు. అయితే కొంతమంది కొన్ని తప్పుల్ని గంభీరమైన వాటిగా భావించరు, మరి అలాంటి వాటిని మనం చేయవచ్చా? మనం అన్ని విషయాల్లో యెహోవాకు లోబడి ఉండాలని నిర్ణయించుకున్నామా?—రోమా. 6:14, 17.

16. మనం ఎలాంటి పాపాల్ని కూడా చేయకూడదని చెప్పవచ్చు?

16 అపొస్తలుడైన పౌలు గురించి ఒకసారి ఆలోచించండి. అతనిలా రాశాడు, ‘నేను పాపానికి అమ్మివేయబడిన మనిషిని. నేను ఏమి చేస్తున్నానో నాకు అర్థంకావట్లేదు. ఎందుకంటే నేను కోరుకున్నవాటిని చేయకుండా, నేను ద్వేషించేవాటిని చేస్తున్నాను.’ (రోమా. 7:14-15, NW) పౌలు 1 కొరింథీయులు 6:9-11 వచనాల్లో ఉన్న పనుల్ని చేయకపోయినా, తాను పాపం చేశానని ఒప్పుకున్నాడు. పౌలు యెహోవాను సంతోషపెట్టాలనుకున్నాడు, అందుకే అలాంటి చెడు పనులు చేయాలనే కోరికలతో పోరాడాడు. (రోమీయులు 7:21-23 చదవండి.) మనం పౌలును అనుకరిస్తూ, యెహోవాకు లోబడి ఉండడానికి చేయగలిగినదంతా చేద్దాం.

17. మీరెందుకు నిజాయితీగా ఉండాలనుకుంటున్నారు?

17 ఉదాహరణకు, మనం యెహోవాను సేవించాలంటే నిజాయితీగా ఉండాలని మనకు తెలుసు. (సామెతలు 14:5; ఎఫెసీయులు 4:25 చదవండి.) ‘అబద్ధానికి జనకుడైన’ సాతానులా మనం ఉండాలనుకోం. అననీయ, అతని భార్య అబద్ధం చెప్పడం వల్లే చనిపోయారని మనం గుర్తుంచుకుంటాం. కాబట్టి మనం అబద్ధాలు చెప్పం. (యోహా. 8:44; అపొ. 5:1-11) అయితే నిజాయితీగా ఉండడమంటే కేవలం అబద్ధాలు చెప్పకుండా ఉండడం కాదు. దేవుని అపారదయ పట్ల మనకు నిజంగా కృతజ్ఞత ఉంటే, ఇతర విషయాల్లో కూడా నిజాయితీగా ఉంటాం.

18, 19. నిజాయితీగా ఉండడమంటే ఏమిటి?

18 అబద్ధాలు చెప్పడమంటే నిజం కానిది చెప్పడమని అర్థం. ఉదాహరణకు యెహోవా ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పాడు, “మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు.” ఎందుకు? ఎందుకంటే, యెహోవా ఇలా చెప్పాడు, “మీరు పరిశుద్ధులై యుండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై యున్నాను. నేను మీ దేవుడనైన యెహోవాను.” (లేవీ. 19:2, 11) మనం అబద్ధం చెప్పకపోయినా, నిజాన్ని దాచిపెట్టి ఇతరుల్ని నమ్మించినా మనం నిజాయితీగా లేనట్లే.

తన తోటి ఉద్యోగస్తులు వింటుండగా తన యజమానితో మాట్లాడుతున్న ఓ సహోదరుడు

అబద్ధాలు చెప్పకూడదని, నిజాన్ని దాచిపెట్టి మోసం చేయకూడదని మనం నిర్ణయించుకున్నామా? (19వ పేరా చూడండి)

19 ఉదాహరణకు ఓ వ్యక్తి, తాను హాస్పిటల్‌కు వెళ్లాలి కాబట్టి ఆఫీసు నుండి కాస్త ముందుగా బయల్దేరతానని లేదా తర్వాతి రోజు ఆఫీసుకు రానని అతని యజమానితో లేదా తోటి ఉద్యోగస్థులతో చెప్పాడనుకుందాం. నిజానికి హాస్పిటల్‌లో అతనికి ఉన్నది కొద్దినిమిషాల పనే. అంటే మందులు షాపులో ఏవో తీసుకోవడం లేదా బిల్‌ కట్టడం లాంటిదన్న మాట. ఇంతకీ ఉద్యోగం నుండి త్వరగా బయల్దేరడానికి గల అసలు కారణమేమిటంటే, అతను సరదాగా బయటికి వెళ్లాలనుకున్నాడు లేదా కుటుంబాన్ని తీసుకుని బీచ్‌కు వెళ్లాలనుకున్నాడు. హాస్పిటల్‌కు వెళ్లాలని అతను చెప్పిన మాటలో కాస్త నిజం ఉండివుండవచ్చు. కానీ అతను నిజంగా నిజాయితీగా ఉన్నాడంటారా? లేదా ఇతరుల్ని మోసం చేస్తున్నాడా? కొన్నిసార్లు తమకు కావాల్సింది పొందడం కోసం లేదా శిక్షను తప్పించుకోవడం కోసం కొంతమంది ఇలా నిజాన్ని దాచిపెట్టి ఇతరుల్ని మోసం చేస్తారు. కానీ మనం యెహోవాకు లోబడతాం. ఆయనిలా చెప్పాడు, ‘మీరు బొంకకూడదు.’ ఆయన చెప్పేవి సరైనవి, పవిత్రమైనవి కాబట్టి మనం ఆయన చెప్పినట్లు చేస్తాం.—రోమా. 6:19.

20, 21. దేవుని అపారదయపట్ల మనకు కృతజ్ఞత ఉంటే, ఇంకా వేటికి దూరంగా ఉండాలి?

20 నిజమే, వ్యభిచారం, తాగుబోతుతనం, ఇతర గంభీరమైన పాపాల్ని మనం చేయం. అయితే కేవలం అవి మాత్రమే కాదు, యెహోవాకు ఇష్టంలేని ఏ పనినీ మనం చేయం. ఉదాహరణకు మనం అనైతిక పనులు చేయకపోవడమే కాదు, అలాంటి వాటిని చూపించే వినోదానికి కూడా దూరంగా ఉంటాం. మనం త్రాగుబోతుతనానికి దూరంగా ఉండడం మాత్రమే కాదు, ఇక దాదాపుగా మనపై మనం నియంత్రణ కోల్పోయేంతగా కూడా తాగకుండా ఉంటాం. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటే చాలా తీవ్రంగా కృషి చేయాలి, కానీ దూరంగా ఉండడం సాధ్యమే.

21 పౌలు ఇలా చెప్పాడు, “శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి.” ఈ మాటల్ని పాటించాలనే లక్ష్యాన్ని మనందరం పెట్టుకుంటాం. (రోమా. 6:12; 7:18-20) అన్నిరకాల పాపాలకు దూరంగా ఉండడం కష్టమే. కానీ అన్నిరకాల పాపాలకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు, మనపై దేవుడు, క్రీస్తు చూపించిన అపారదయ పట్ల నిజంగా కృతజ్ఞత కలిగివున్నామని చూపిస్తాం.

22. యెహోవా అపారదయకు మనం నిజంగా కృతజ్ఞత చూపిస్తే ఏ బహుమానం పొందుతాం?

22 యెహోవా మన పాపాల్ని క్షమించాడు, భవిష్యత్తులో కూడా క్షమిస్తాడు. ఆయన చూపిస్తున్న అపారదయకు మనం ఎంత రుణపడివున్నామో కదా! కాబట్టి ఆయన తప్పు అని చెప్తున్న వాటిని చేయకుండా ఉండడానికి తీవ్రంగా కృషిచేద్దాం. ఒకవేళ అవి తప్పుకాదని ఇతరులు భావించినా మనం వాటిని చేయకుండా ఉందాం. అప్పుడు మనం ఏ బహుమానం పొందుతాం? పౌలు ఇలా చెప్పాడు, “అయినను ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము.”—రోమా. 6:22.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి