కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp16 No. 3 పేజీలు 14-15
  • మీరు నమ్మేవాటిని నిజాలతో పోల్చి చూసుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు నమ్మేవాటిని నిజాలతో పోల్చి చూసుకోండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మనం నమ్మేవాటిని బైబిలుతో ఎలా పోల్చుకుని చూసుకోవాలి
  • దేవుని రాజ్యం అంటే ఏమిటి?
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • యేసుక్రీస్తు ఎవరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • దేవుని రాజ్యం అంటే ఏంటి?
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • యెహోవా సాక్షులు ఏమి నమ్ముతారు?
    యెహోవా సాక్షులు ఏమి నమ్ముతారు?
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
wp16 No. 3 పేజీలు 14-15

మీరు నమ్మేవాటిని నిజాలతో పోల్చి చూసుకోండి

మీరు క్రైస్తవులా? అయితే భూమి మీదున్న 200 కోట్లకన్నా ఎక్కువమందిలో మీరు ఒకరు. ప్రపంచ జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరు క్రైస్తవులని చెప్పుకుంటున్నారు. ఈ రోజు క్రైస్తవ మతంలో కొన్ని వేల శాఖలు ఉన్నాయి, వాళ్లందరికీ వేర్వేరు సిద్ధాంతాలు, వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి మీరు క్రైస్తవులైనప్పటికీ మీరు నమ్మే విషయాలు ఇతర క్రైస్తవులు నమ్మే విషయాలు వేరుగా ఉండవచ్చు. మరి మీరు నమ్మేది నిజమా కాదా తెలుసుకోవడం అవసరమా? అవును, ఒకవేళ మీరు బైబిల్లో ఉన్న విషయాలు పాటించాలనుకుంటే, అవసరమే.

యేసుక్రీస్తు తొలి అనుచరులను “క్రైస్తవులు” అని పిలిచేవాళ్లు. (అపొస్తలుల కార్యములు 11:26) అప్పుడు క్రైస్తవ విశ్వాసం ఒకటే ఉండేది కాబట్టి వాళ్లను వేర్వేరు పేర్లతో పిలవాల్సిన అవసరం ఉండేది కాదు. క్రైస్తవత్వాన్ని స్థాపించిన యేసు బోధల్ని, నిర్దేశాల్ని క్రైస్తవులు అందరూ అనుసరిస్తూ ఐక్యంగా ఉన్నారు. మరి మీ చర్చ్‌ అలాగే ఉందా? యేసు నేర్పించిన విషయాలను, మొదట్లో ఆయన్ను అనుసరించిన వాళ్లు నమ్మిన విషయాలను మీ చర్చ్‌ బోధిస్తుందని మీకు అనిపిస్తుందా? అది మీరెలా తెలుసుకోవచ్చు? దానికి మార్గం ఒక్కటే. మీ నమ్మకాలను బైబిలుతో పోల్చి చూసుకోవడం.

దీని గురించి ఆలోచించండి: లేఖనాలన్నీ దేవుని వాక్యమని యేసుక్రీస్తు నమ్మాడు. వాటిని చాలా గౌరవించాడు. మనుషులు కల్పించిన ఆచారాలకు విలువిచ్చి, బైబిలు బోధల్ని నీరుగార్చిన వాళ్లను ఆయన చేరనివ్వలేదు. (మార్కు 7:9-13) కాబట్టి యేసు నిజ అనుచరుల నమ్మకాలు బైబిలు ప్రకారమే ఉంటాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రతి క్రైస్తవుడు, ‘నా చర్చ్‌ నేర్పించే విషయాలు బైబిలు ప్రకారం ఉన్నాయా లేదా?’ అని ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నకు జవాబుగా మీ చర్చ్‌ నేర్పించే విషయాలను బైబిలు నిజంగా చెప్తున్న విషయాలతో పోల్చుకోండి.

మన ఆరాధన సత్యంపై ఆధారపడి ఉండాలని యేసు చెప్పాడు. ఆ సత్యం బైబిల్లోనే ఉంది. (యోహాను 4:24; 17:17) అపొస్తలుడైన పౌలు కూడా మన రక్షణ “సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానము” పైన ఆధారపడి ఉంటుందని చెప్పాడు. (1 తిమోతి 2:4) కాబట్టి మన నమ్మకాలు బైబిలు ఆధారంగా ఉండడం చాలా ముఖ్యం. లేకపోతే మనకు రక్షణ ఉండదు.

మనం నమ్మేవాటిని బైబిలుతో ఎలా పోల్చుకుని చూసుకోవాలి

ఇక్కడ ఇచ్చిన ఆరు ప్రశ్నల్ని వాటికి బైబిలిచ్చే జవాబుల్ని చూడమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అక్కడ ఇచ్చిన వచనాలు చూసి వాటి గురించి ఆలోచించండి. తర్వాత ఇలా ప్రశ్నించుకోండి, ‘నా చర్చి బోధలు బైబిలుతో పోలిస్తే ఎలా ఉన్నాయి?’

ఈ చిన్న క్విజ్‌ మీకు చాలా ఉపయోగపడుతుంది. మీ చర్చి బోధల్ని బైబిలుతో పోల్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? బైబిలు సత్యాల్ని స్పష్టంగా తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు మీకు సహాయం చేస్తారు. బైబిలు స్టడీ కోసం వాళ్లను అడగండి. లేదా మా వెబ్‌సైట్‌ jw.org చూడండి. (w16-E No. 4)

1 ప్రశ్న: దేవుడు ఎవరు?

జవాబు: యేసుకు తండ్రియైన యెహోవాయే నిత్య దేవుడు, సర్వశక్తిగల సృష్టికర్త.

బైబిలు ఏమి చెప్తుంది:

“మన ప్రభువగు యేసుక్రీస్తుయొక్క తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.”—కొలొస్సయులు 1:3.

“నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు.”—ప్రకటన 4:10, 11.

రోమీయులు 10:13; 1 తిమోతి 1:17 కూడా చూడండి.

2 ప్రశ్న: యేసుక్రీస్తు ఎవరు?

జవాబు: యేసు దేవుని మొదటి కుమారుడు. యేసును దేవుడు సృష్టించాడు కాబట్టి ఆయనకు పుట్టుక ఉంది. యేసు దేవునికి లోబడతాడు, ఆయన చిత్తానికి విధేయత చూపిస్తాడు.

బైబిలు ఏమి చెప్తుంది:

“తండ్రి నాకంటె గొప్పవాడు.”—యోహాను 14:28.

“[యేసు] అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు.”—కొలొస్సయులు 1:15.

మత్తయి 26:39; 1 కొరింథీయులు 15:28 కూడా చూడండి.

3 ప్రశ్న: పరిశుద్ధాత అంటే ఏంటి?

జవాబు: దేవుడు తన చిత్తాన్ని చేయడానికి ఉపయోగించే శక్తి పరిశుద్ధాత్మ. ఆ శక్తి వ్యక్తి కాదు. దేవుడు పరిశుద్ధాత్మను మనుషులకు ఇస్తాడు, దాని ద్వారా వాళ్లు శక్తిని పొందుతారు.

బైబిలు ఏమి చెప్తుంది:

• “ఎలీసబెతు మరియయొక్క వందనవచనము వినగానే, ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై.” —లూకా 1:41.

“పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు.”—అపొస్తలుల కార్యములు 1:8.

ఆదికాండము 1:2; అపొస్తలుల కార్యములు 2:1-4; 10:38 కూడా చూడండి.

4 ప్రశ్న: దేవుని రాజ్యం అంటే ఏమిటి?

జవాబు: దేవుని రాజ్యం పరలోకంలో ఉండే ప్రభుత్వం. యేసు దేవుని రాజ్యానికి రాజు. ఈ రాజ్యం త్వరలో దేవుని చిత్తం భూమి మీద జరిగేలా చేస్తుంది.

బైబిలు ఏమి చెప్తుంది:

“ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు—ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలుననెను.” —ప్రకటన 11:15.

దానియేలు 2:44; మత్తయి 6:9, 10.

5 ప్రశ్న: మంచివాళ్లందరూ పరలోకానికి వెళ్తారా?

జవాబు: వెళ్లరు. దేవుడు ఎన్నుకున్న “చిన్నమంద” లేదా కొంతమంది మాత్రమే పరలోకానికి వెళ్తారు.

బైబిలు ఏమి చెప్తుంది:

“చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది.”—లూకా 12:32.

“వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.”—ప్రకటన 20:6.

ప్రకటన 14:1, 3 కూడా చూడండి.

6 ప్రశ్న: భూమి విషయంలో, మనుషుల విషయంలో దేవుని ఉద్దేశం ఏంటి?

జవాబు: దేవుని రాజ్య పరిపాలనలో భూమి పరదైసుగా మారుతుంది. నమ్మకమైన మనుషులు సంపూర్ణ ఆరోగ్యాన్ని, శాశ్వత శాంతిని, మరణంలేని జీవితాన్ని ఆనందిస్తారు.

బైబిలు ఏమి చెప్తుంది:

“దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు.”—కీర్తన 37:10, 11.

“ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.”—ప్రకటన 21:3, 4.

కీర్తన 37:29; 2 పేతురు 3:13 కూడా చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి