కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w13 7/1 పేజీ 11
  • యెహోవాకు మీరంటే శ్రద్ధ ఉందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాకు మీరంటే శ్రద్ధ ఉందా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుడు మీ ఎడల శ్రద్ధ కల్గివున్నాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ‘యెహోవా, నేను నీకు తెలుసు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • యెహోవా ఇష్టపడే హృదయాన్ని సంపాదించుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • యెహోవాకు సన్నిహితమయ్యేందుకు ప్రజలకు సహాయం చేయటం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
w13 7/1 పేజీ 11

దేవునికి దగ్గరవ్వండి

యెహోవాకు మీరంటే శ్రద్ధ ఉందా?

“నాకేమాత్రం విలువలేదనే ఆలోచన వల్ల నేను దేవునికి దగ్గరవ్వలేకపోతున్నాను. అదే నాకున్న పెద్ద సమస్య.” యెహోవా శ్రద్ధను పొందడానికి తాను అస్సలు అర్హురాల్ని కాదనుకున్న ఓ మహిళ చెప్పిన మాటలవి. మీ పరిస్థితి కూడా అదేనా? అయితే, ‘యెహోవా తన ఆరాధకుల్లో ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా పట్టించుకుంటాడా?’ అనే ప్రశ్న మీకు రావచ్చు. ఆయన తప్పకుండా పట్టించుకుంటాడు! యెహోవా మనలో ప్రతీ ఒక్కరి మీద శ్రద్ధ చూపిస్తాడని నమ్మడానికి యేసు మాటలే రుజువు.—యోహాను 6:44 చదవండి.

యెహోవా మనస్సును, ఉద్దేశాలను అందరికంటే ఎక్కువగా అర్థం చేసుకున్న యేసు ఇంతకీ ఏమన్నాడు? (లూకా 10:22) ఆయన ఇలా అన్నాడు: “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు.” కాబట్టి, మన పరలోక తండ్రియైన యెహోవాయే ఇష్టపడి మనల్ని ఆకర్షించకపోతే, ఆయన్ని సేవించే భాగ్యం మనకు దొరకదు, మనం యేసు అనుచరులం కాలేము. (2 థెస్సలొనీకయులు 2:13) మనం యేసు మాటల ఆంతర్యాన్ని అర్థం చేసుకుంటే, దేవుడు తన సేవకుల్లో ప్రతీ ఒక్కరి పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తాడని స్పష్టంగా తెలుస్తుంది.

యెహోవా ఆకర్షిస్తాడు అంటే అర్థం ఏమిటి? ‘ఆకర్షించడం’ అని అనువదించబడిన గ్రీకు క్రియా పదాన్ని, వలను లాగడం వంటి విషయాల్ని ప్రస్తావించేటప్పుడు కూడా ఉపయోగించారు. (యోహాను 21:6, 11) అంటే, మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా దేవుడు తన సేవ చేసేలా మనల్ని తనవైపుకు బలవంతంగా లాగుతాడా? కానేకాదు. యెహోవా మనకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇచ్చాడు, అందుకే తనకు సన్నిహితమయ్యేలా ఆయన ఎవర్నీ బలవంతపెట్టడు. (ద్వితీయోపదేశకాండము 30:19, 20) ప్రపంచంలోని వందలకోట్ల హృదయాలను ఆయన పరిశీలిస్తూ, తన కోసం వెదికే సహృదయులను అన్వేషిస్తున్నాడు. (1 దినవృత్తాంతములు 28:9) అలాంటి వాళ్లు దొరికినప్పుడు, ఆయన వాళ్లతో ప్రేమగా వ్యవహరిస్తాడు. ఎలా?

సరైన మనోవైఖరిగల వ్యక్తి హృదయాన్ని యెహోవా ఆకర్షిస్తాడు లేదా తన వైపుకు సున్నితంగా లాగుతాడు. (అపొస్తలుల కార్యములు 13:48) యెహోవా దేవుడు రెండు విధానాల్లో, అంటే బైబిల్లోని సువార్త సందేశం ద్వారా అలాగే తన పరిశుద్ధాత్మ ద్వారా ఆ పని చేస్తాడు. బైబిలు సత్యానికి స్పందించే హృదయం ఒక వ్యక్తిలో ఉందని యెహోవా గమనించినప్పుడు, ఆయన పరిశుద్ధాత్మను ఉపయోగించి ఆ వ్యక్తి సత్యాన్ని గ్రహించేలా, తన జీవితంలో దాన్ని పాటించేలా సహాయం చేస్తాడు. (1 కొరింథీయులు 2:11, 12) దేవుని సహాయం లేకుండా మనం యేసు నిజమైన శిష్యులుగా ఉండలేము, యెహోవాకు ఇష్టమైన ఆరాధకులం కాలేము.

“యెహోవా మనకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇచ్చాడు, అందుకే తనకు సన్నిహితమయ్యేలా ఆయన ఎవర్నీ బలవంతపెట్టడు.”

అయితే, యోహాను 6:44లో యేసు చెప్పిన మాటలు యెహోవా గురించి మనకు ఏమి బోధిస్తున్నాయి? యెహోవా మనుషుల హృదయాల్లో మంచిని చూస్తాడు కాబట్టే వాళ్లను తన వైపుకు ఆకర్షించి, వాళ్లలో ప్రతీ ఒక్కరి గురించి శ్రద్ధ తీసుకుంటాడు. భరోసా ఇచ్చే ఈ సత్యాన్ని పైన ప్రస్తావించిన మహిళ అర్థం చేసుకుని ఓదార్పు పొందింది. ఆమె ఇలా అంది: “యెహోవా సేవ చేయడంకన్నా గొప్ప భాగ్యం ఏదీ లేదు. యెహోవా, నన్ను తన సేవకురాలిగా ఎంచుకున్నాడంటే, నేను ఆయన దృష్టిలో ఎంతో అమూల్యమైనదాన్ని అన్నమాట.” మీరేమంటారు? యెహోవా తన ఆరాధకుల్లో ప్రతి ఒక్కరి మీద శ్రద్ధ చూపిస్తాడని తెలుసుకున్న తర్వాత ఆయనకు దగ్గరవ్వాలని మీకు అనిపించడం లేదా? (w13-E 05/01)

ఆగస్టు నెలలో ఈ బైబిలు భాగం చదవండి:

రోమీయులు 1–16 అధ్యాయాలు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి