నేటి అపాయకరమైన కాలాలు
మానవజాతి “అపాయకరమైన కాలముల[ను]” ఎదుర్కొంటుందని బైబిలు ముందే తెలియజేసింది. ఈ కాలాలను అది “అంత్యదినములు” అని వర్ణిస్తోంది. (2 తిమోతి 3:1- 5; 2 పేతురు 3:3-7) “యుగసమాప్తి” గురించి తన శిష్యులు అడిగిన ఒక ప్రశ్నకు జవాబిస్తూ యేసుక్రీస్తు ఈ కాలం గురించే మాట్లాడాడు. (మత్తయి 24:3) మనమిప్పుడు అంత్యదినాల్లో జీవిస్తున్నామా? బైబిలు ముందే తెలియజేసినదానిని క్రింద ఇవ్వబడిన ఇటీవలి నివేదికలతో పోల్చి చూసి, మీరే ఒక ముగింపుకు రండి.
బైబిలు ముందే తెలియజేసినది: భూవ్యాప్త యుద్ధాలు—లూకా 21:10; ప్రకటన 6:4.
ఇటీవలి నివేదికలు తెలియజేస్తున్నది: “క్రీస్తు జన్మించిన కాలం నుండి గత శతాబ్దాలన్నిటిలో చనిపోయినవారి సంఖ్యతో పోలిస్తే, 20వ శతాబ్దపు యుద్ధాల్లో చనిపోయినవారి సంఖ్య మూడురెట్లు ఎక్కువగా ఉంది.”—వరల్డ్‌వాచ్ ఇన్‌స్టిట్యూట్.
బైబిలు ముందే తెలియజేసినది: కరువులు, వ్యాధులు—లూకా 21:11; ప్రకటన 6:5-8.
ఇటీవలి నివేదికలు తెలియజేస్తున్నది: భూవ్యాప్తంగా 2003లో కుపోషణకు గురైన వారికన్నా 70 లక్షలమంది ఎక్కువ అంటే 86 కోట్ల 30 లక్షలమంది 2004లో కుపోషణకు గురయ్యారని అంచనా వేయబడింది.—యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్.
దాదాపు 100 కోట్లమంది మురికివాడల్లో నివసిస్తున్నారు; 260 కోట్లమందికి సరైన మరుగుదొడ్ల సౌకర్యంలేదు; 110 కోట్లమందికి సురక్షిత త్రాగునీటి సౌకర్యంలేదు.—వరల్డ్‌వాచ్ ఇన్‌స్టిట్యూట్.
50 కోట్లమంది మలేరియా బారిన పడుతున్నారు; 4 కోట్లమంది హెచ్‌ఐవి ఎయిడ్స్‌తో జీవిస్తున్నారు, 2005లో కోటి 60 లక్షలమంది క్షయవ్యాధితో మరణించారు.—వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.
బైబిలు ముందే తెలియజేసినది: భూమిని నాశనం చేయడం—ప్రకటన 11:18.
ఇటీవలి నివేదికలు చెబుతున్నది: “మానవులు చేస్తున్న పనులవల్ల భూగ్రహంపైనున్న అనేక జాతులు త్వరలో అంతరించిపోతాయి.” “భూవ్యాప్తంగా ప్రకృతి మానవజాతికి చేసే సేవల్లో దాదాపు మూడింట రెండొంతులు తగ్గిపోతున్నట్లుగా కనుగొనబడింది.”—మిలేనియం ఎకోసిస్టమ్ ఎసెస్‌మెంట్.
“మానవుల మూలంగా ఏర్పడిన హరితగృహ వాయువులు, భూవాతావరణాన్ని అస్తవ్యస్తం చేస్తున్న అనేక విపత్తులు శిఖరస్థాయికి చేరుకునేలా చేసి, భూగ్రహం ప్రమాదకరమైన పర్యవసానాలను ఎదుర్కొనేలా చేస్తున్నాయి.”—నాసా, గొడ్డార్డ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ స్టడీస్.
బైబిలు ముందే తెలియజేసినది: దేవుని రాజ్య సువార్త భూవ్యాప్తంగా ప్రకటింప బడుతుంది —మత్తయి 24:14; ప్రకటన 14:6, 7.
ఇటీవలి నివేదికలు తెలియజేస్తున్నది: 2007లో 69,57,854 మంది యెహోవాసాక్షులు 236 దేశాల్లో దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి కోటి 40 లక్షలకన్నా ఎక్కువ గంటలు వెచ్చించారు.—2008 ఇయర్ బుక్ ఆఫ్ జెహోవాస్ విట్నెసెస్.
పైన పేర్కొన్నట్లుగా, ఈ చెడువార్తలన్నిటి మధ్య ఆశావహ దృక్పథం కలిగివుండడానికి కారణముంటుందని బైబిలు ముందే తెలియజేసింది. దేవుని రాజ్య “సువార్త” గురించి యేసు మాట్లాడాడు. దేవుని రాజ్యమంటే ఏమిటి? మానవజాతి మంచి భవిష్యత్తు కోసం ఎదురుచూడడానికి, దీనికి ఎలాంటి సంబంధముంది? దేవుని రాజ్యం మీ కోసం ఏంచేస్తుంది? (w08 8/1)
[5వ పేజీలోని బ్లర్బ్]
డు మనం చూస్తున్న లోక పరిస్థితులను బైబిలు ముందే తెలియజేసింది