కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w08 10/1 పేజీలు 3-4
  • భూగ్రహం త్వరలో నాశనమవుతుందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • భూగ్రహం త్వరలో నాశనమవుతుందా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అపాయంలోవున్న గ్రహం
  • ఆశావహ దృక్పథం కలిగివుండడానికి ఒక కారణం
  • మన భూమి ఎప్పటికీ ఉంటుందని దేవుడు మాటిచ్చాడు
    తేజరిల్లు!—2023
  • వాతావరణం పాడౌతోంది! మన భవిష్యత్తు పరిస్థితేంటి?
    అదనపు అంశాలు
  • సున్నితమైన మన గ్రహం దాని భవిష్యత్‌ విషయమేమిటి?
    తేజరిల్లు!—1996
  • ఆశావాదం మీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చగలదా?
    తేజరిల్లు!—2007
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
w08 10/1 పేజీలు 3-4

భూగ్రహం త్వరలో నాశనమవుతుందా?

ఈ క్రింది ప్రశ్నకు ఇవ్వబడిన సమాధానాల్లో ఏది సరైనదని మీరనుకుంటున్నారు?

సమీప భవిష్యత్తులో, భూమ్మీది పరిస్థితులు

(ఎ) మెరుగవుతాయా?

(బి) ఇలాగే ఉంటాయా?

(సి) ఇంకా ఘోరంగా తయారవుతాయా?

భవిష్యత్తు గురించి మీకున్న ఆశావహ దృక్పథాన్ని కాపాడుకోవడానికి మీరు ప్రయత్నిస్తారా? అలాంటి దృక్పథం కలిగివుండడంవల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. ఆశావహ దృక్పథమున్నవారు చదువుల్లో చురుగ్గా ఉంటారని, ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటారని అధ్యయనాలు చూపించాయి. జీవితంపట్ల నిరాశాపూరిత దృక్పథమున్నవారి కన్నా, ఆశావహ దృక్పథమున్నవారు హృద్రోగాలతో బాధపడే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్లు ఒక దీర్ఘకాలిక అధ్యయనం వెల్లడిచేసింది. ఈ విషయాలు, “సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును” అని ఎన్నో శతాబ్దాల క్రితం బైబిల్లో పేర్కొనబడినదానికి అనుగుణంగా ఉన్నాయి.—సామెతలు 17:22.

అయితే, భూగ్రహ భవిష్యత్తు గురించి వైజ్ఞానిక నిపుణులు చెబుతున్న దాని దృష్ట్యా ఆశావహ దృక్పథంతో సంతోషంగా ఉండడం చాలామందికి కష్టమవుతోంది. వారు చెబుతున్న, ప్రస్తుతం నలుగురూ మాట్లాడుకుంటున్న, భయం​గొలిపే కొన్ని విషయాలను పరిశీలించండి.

అపాయంలోవున్న గ్రహం

ఆర్థికంగా అభివృద్ధి సాధించడం కోసం పర్యావరణాన్ని నాశనంచేయడం ఆపకపోతే, “గ్రహ వాతావరణాన్ని, పర్యావరణాన్ని ఘోరంగా మార్చివేసే సంఘటనలు” చోటుచేసు​కోగలవని ప్రఖ్యాత స్టాక్‌హోమ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ 2002లో హెచ్చరించింది. భూవ్యాప్త దారిద్ర్యం, కొనసాగుతున్న అన్యాయం, ప్రకృతి వనరులు క్షీణించిపోవడం వంటివి సమాజం, “పర్యావరణ, సామాజిక, భద్రతా సంక్షోభాల్లో” చిక్కుకుపోయేలా చేస్తాయని కూడా ఆ నివేదిక తెలియజేసింది.

ఐక్యరాజ్య సమితి 2005లో, మిలేనియం ఎకోసిస్టమ్‌ ఎసెస్‌మెంట్‌ సింథెసిస్‌ రిపోర్టును విడుదల చేసింది. అది 95 దేశాలకు చెందిన 1,360 కంటే ఎక్కువమంది నిపుణులు భూపర్యావరణం గురించి నాలుగేళ్ళపాటు భూవ్యాప్తంగా జరిపిన అధ్యయనం ఆధారంగా రూపొందించబడింది. ఆ రిపోర్టు, “మానవుల చర్యలు భూ సహజ ప్రక్రియలపై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి, దానివల్ల భవిష్యత్‌ తరాలను పోషించడంలో భూగ్రహ పర్యావరణానికున్న సామర్థ్యంపై ఇక ఏమాత్రం ఆధారపడలేని పరిస్థితులు ఏర్పడ​తాయి” అని తీవ్రంగా హెచ్చరించింది. ఈ విపత్తును తప్పించుకోవాలంటే ఏం​చేయాలో తెలియజేస్తూ ఆ రిపోర్టు ఇలా పేర్కొంది, “కార్య​విధానాల్లో, పద్ధతుల్లో, కార్యాచరణల్లో గమనార్హ మైన మార్పులు రావడం అవసరం, అయితే ఆ మార్పులు ఇంకా రాలేదు.”

యునైటెడ్‌ నేషన్స్‌ హ్యూమన్‌ సెటిల్‌మెంట్‌ ప్రోగ్రామ్‌కు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆనా తిబైజుక, ఎక్కువమంది పరిశోధకులు నమ్ముతున్నదానిని తెలియజేస్తూ, “మనం ఇలాగే కొనసాగితే భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది” అని అంది.

ఆశావహ దృక్పథం కలిగివుండడానికి ఒక కారణం

ఈ పత్రికను ప్రచురించే యెహోవాసాక్షులు కూడా, భూమిని మార్చివేసే నాశనకరమైన సంఘటనలు త్వరలో చోటుచేసుకోబోతున్నాయని నమ్ముతున్నారు. అయితే వారు ఈ మార్పులు వినాశకరమైన భవిష్యత్తుకు దారితీస్తాయని కాకుండా, లోకం ఎప్పుడూ చవిచూడని ఎంతో అద్భుతమైన పరిస్థితులకు అవి మార్గాన్ని ఏర్పరుస్తాయని నమ్ముతున్నారు. వారిలో ఇలాంటి ఆశావహ దృక్పథం ఎందుకు ఏర్పడింది? ఎందుకంటే వారు దేవుని వాక్యమైన బైబిల్లోని వాగ్దానాలను పూర్తిగా నమ్ముతున్నారు. ఆ వాగ్దానాల్లో ఒక దానిని గమనించండి, “ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడక​పోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహు క్షేమము కలిగి సుఖించెదరు.”—కీర్తన 37:10, 11.

అలా జరుగుతుందని ఆశించడం కేవలం ఒక కలేనా? ఈ ప్రశ్నకు సమాధానమిచ్చేముందు, దీని గురించి ఆలోచించండి: ఇప్పుడు భూమిని, మానవజాతిని పట్టిపీడిస్తున్న అనేక గంభీరమైన సమస్యల గురించి బైబిలు వేల సంవత్సరాల క్రితమే ఖచ్చితంగా తెలియజేసింది. తర్వాతి ఆర్టికల్‌లో పేర్కొనబడిన లేఖనాలను చదివి, అవి చెబుతున్నదానిని, ఇప్పుడు లోకంలో జరుగుతున్నవాటితో పోల్చి చూడండి. మీరలా చేస్తే, భవిష్యత్తులో జరిగేవాటిని బైబిలు ముందే తెలియజేస్తుందన్న మీ నమ్మకం బలపడుతుంది. (w08 8/1)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి