కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w03 10/1 పేజీ 29
  • పాఠకుల ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • ఇలాంటి మరితర సమాచారం
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • ‘మృతులు లేపబడుదురు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • పునరుత్థాన నిరీక్షణ శక్తివంతమైనది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • పునరుత్థాన నిరీక్షణ తప్పకుండా నిజమౌతుంది!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
w03 10/1 పేజీ 29

పాఠకుల ప్రశ్నలు

మృతుల కొరకు బాప్తిస్మం అంటే ఏమిటి?

అపొస్తలుడైన పౌలు పరలోక పునరుత్థానం గురించి అత్యంత ఆసక్తికరమైన ఓ వాక్యం వ్రాశాడు. దాన్ని పరిశుద్ధ గ్రంథములో మనమిలా చదువుతాము: “ఇట్లు కానియెడల మృతులకొరకై బాప్తిస్మము పొందు వారేమి చేతురు? మృతులేమాత్రమును లేపబడనియెడల మృతులకొరకు వారు బాప్తిస్మము పొందనేల?” ద న్యూ జెరూసలేమ్‌ బైబిల్‌ ఈ వచనాన్ని ఇలా అనువదిస్తోంది: “మృతుల పక్షంగా బాప్తిస్మం తీసుకున్నవారి సంగతేమిటి? ఒకవేళ చనిపోయినవారు లేవడమే ఉండకపోతే, వారి పక్షంగా బాప్తిస్మం పొందడమెందుకు?​—1 కొరింథీయులు 15:29.

బాప్తిస్మం తీసుకోకుండా చనిపోయిన వారి తరఫున బ్రతికియున్నవారు బాప్తిస్మం తీసుకోవాలని పౌలు ఇక్కడ సూచిస్తున్నాడా? ఈ అనువాదాలు మరితర బైబిలు అనువాదాలనుండి ఆ భావం స్ఫురించవచ్చు. అయితే, ఇటు ఈ రెండు లేఖనాలను అటు పౌలు ఉపయోగించిన ఆదిమ గ్రీకుభాషను నిశితంగా పరిశీలిస్తే మరో విషయం తేలుతుంది. క్రీస్తువలెనే యథార్థంగా మరణించడానికి నడిపే జీవన విధానంలో ప్రవేశించడానికి అభిషిక్త క్రైస్తవులు బాప్తిస్మం పొందుతారని లేదా నీటిలో ముంచబడతారని పౌలు భావం. ఆ తర్వాత వాళ్లు క్రీస్తు మాదిరిగా ఆత్మసంబంధ జీవానికి పునరుత్థానం చేయబడతారు.

లేఖనాలు ఈ వివరణను ధృవీకరిస్తున్నాయి. పౌలు రోమీయులకు ఇలా వ్రాశాడు: “క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా?” (రోమీయులు 6:3) ఫిలిప్పీయులకు తాను వ్రాసిన పత్రికలో, పౌలు తనను గురించే మాట్లాడుతూ ఇలా చెప్పాడు: “ఏ విధముచేతనైనను మృతులలోనుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన [క్రీస్తు] మరణవిషయములో సమానానుభవముగలవాడనై [ఉన్నాను.]” (ఫిలిప్పీయులు 3:10, 11) క్రీస్తు అభిషిక్త అనుచరుని జీవిత విధానంలో పరీక్షా సమయంలో తన యథార్థతను కాపాడుకోవడం, ప్రతిదినం మరణం ఎదుర్కొంటూ, చివరకు యథార్థంగా మరణించి ఆ పిదప పరలోక పునరుత్థానం పొందడం ఇమిడి ఉంటాయని పౌలు సూచించాడు.

బాప్తిస్మం తీసుకున్న వారికి సంబంధించి మరణాన్ని సూటిగా సూచించిన పై వచనాలు మరితర లేఖనాలు చనిపోయిన వారిని కాదుగాని అప్పటికే బాప్తిస్మం తీసుకున్న సజీవులైన ఆయా వ్యక్తులను సూచించడం గమనార్హం. “మీరు బాప్తిస్మమందు ఆయనతోకూడ పాతిపెట్టబడినవారై ఆయనను మృతులలోనుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతోకూడ లేచితిరి” అని కూడా పౌలు తోటి అభిషిక్త క్రైస్తవులకు చెప్పాడు.​—కొలొస్సయులు 2:12.

1 కొరింథీయులు 15:29 లో “కొరకు” లేదా “పక్షంగా” అని వివిధ బైబిలు అనువాదాలు అనువదించిన హైపర్‌ అనే గ్రీకు ఉపసర్గాన్ని “ఉండేందుకు” అనికూడా అనువదించవచ్చు. ఇతర బైబిలు వచనాలకు అనుగుణంగా, పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము (ఆంగ్లం) ఈ వచనాన్ని సరైన రీతిలో ఇలా అనువదిస్తోంది: ‘మృతులుగా ఉండేందుకు బాప్తిస్మం పొందేవారు ఏమి చేస్తారు? మృతులు ఎంత మాత్రం లేపబడనియెడల మృతులుగా ఉండేందుకు వారు బాప్తిస్మం పొందడం ఎందుకు?’

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి