కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 11/15 పేజీ 3
  • బైబిలు నేడు మనకు సహాయం చేయగలదా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బైబిలు నేడు మనకు సహాయం చేయగలదా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఇలాంటి మరితర సమాచారం
  • అనేకమంది యౌవనస్థులు ఆసక్తి చూపని ఒక పుస్తకం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • ప్రతిదినం బైబిలు చదవడం నుండి ప్రయోజనం పొందుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • బైబిల్ని ఎలా చదివితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • మీరు సంతోషంగా జీవించడానికి దేవుడు ఎలా సహాయం చేస్తాడు?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 11/15 పేజీ 3

బైబిలు నేడు మనకు సహాయం చేయగలదా?

“మొత్తం బైబిలును తీసుకుంటే, దాంట్లో దాదాపు ఒక శాతం మాత్రమే చదవదగినది, మిగతాదంతా అసంగతమైనది, మన కాలానికి అనవసరమైనది.” ఒక యౌవనస్థుడు అలా అన్నాడు. చాలామంది ఆయనతో ఏకీభవిస్తారు. ప్రపంచవ్యాప్తంగా బైబిలు బాగా అమ్ముడుపోయే పుస్తకమై ఉన్నప్పటికీ, లక్షలాదిమంది దానికి ఎక్కువ అవధానం ఇవ్వరు, దాని బోధలతో వారికి పరిచయంలేదు.

స్యూట్‌డోయిష్‌ సైటుంగ్‌ అనే జర్మను వార్తాపత్రిక 1996 నాటి దాని క్రిస్మస్‌ సంచికలో, బైబిలును “ఎక్కువమంది చదవడంలేదు. ఈ భౌతిక శాస్త్ర యుగంలో, లౌకికవాదం అధికమౌతున్న ఈ కాలంలో, చాలామందికి బైబిలు వృత్తాంతాలు వింతైనవిగా, అర్థం చేసుకోవడం కష్టమన్నట్లుగా కనిపిస్తున్నాయి” అని వ్యాఖ్యానించింది. సర్వేలు ఈ రిపోర్టును ధృవీకరిస్తున్నాయి. కచ్చితంగా యేసు ఎవరన్నది కూడా చాలామంది పిల్లలకు తెలియదని కొన్ని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఒక సర్వేలో, ఇంటర్వ్యూ చేయబడిన వారిలో కనీసం సగంమంది తప్పిపోయిన కుమారుని కథ, మంచి సమరయుని కథ వంటి బైబిలు కథలను చెప్పలేకపోయారు.

స్విట్జర్లాండ్‌లో బైబిలుకు మునుపున్నంత డిమాండు ఇప్పుడు లేదని స్విస్‌ ఇవాంజిలికల్‌ చర్చ్‌ ప్రచురణ అయిన రేఫార్మీర్టెస్‌ ఫోరమ్‌ తెలియజేస్తుంది. బైబిలు తమ వద్దవున్న వారిలో కూడా, దానిమీద దుమ్ము పేరుకుపోతుందంతే. బ్రిటన్‌లో కూడా పరిస్థితిలో పెద్దగా మార్పులేదు. ఒక సర్వే ప్రకారం, చాలామంది దగ్గర బైబిలు ఉన్నప్పటికీ, వారిలో ఎక్కువమంది దాన్ని ఎప్పుడో గాని చదవరు.

మరో వైపు, ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది బైబిలు గురించి భిన్నమైన భావం కల్గివున్నారు. వాళ్లు దాన్ని దేవుని వాక్యంగా దృష్టిస్తారు, విలువైనదిగా, ప్రయోజనకరమైనదిగా పరిగణిస్తారు. కాబట్టి, వాళ్లు దాన్ని క్రమంగా చదువుతారు. ఒక యౌవనస్థురాలు ఇలా వ్రాసింది: “నేను ప్రతి రోజు బైబిల్లోనుండి ఒకటి రెండు అధ్యాయాలు చదవడానికి ప్రయత్నిస్తాను. అలా నేనెంతో ఆనందాన్ని అనుభవిస్తాను.” అలాంటి వారు బైబిలు బోధిస్తున్నదాన్ని జాగ్రత్తగా గమనించి, దాని ఉపదేశాన్ని తమ జీవితంలో అన్వయించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈనాటి కల్లోలిత లోకంలో బైబిలు తమకు సహాయం చేయగలదని వాళ్లు నమ్ముతారు.

మీ అభిప్రాయమేమిటి? బైబిలు ఆధునిక కాలానికి అసంగతమైనదా? లేక అది విలువైనదీ ప్రయోజనకరమైనదీనా? బైబిలు నేడు మనకు సహాయం చేయగలదా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి