కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 6/15 పేజీలు 10-13
  • మీరు మీ దృక్కోణాన్ని విశాలపర్చుకోవాలా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు మీ దృక్కోణాన్ని విశాలపర్చుకోవాలా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అన్ని కోణాల నుండి చూడండి
  • ఇతరులను మీరు దృష్టించడం
  • భౌతికంగా ఇవ్వడంలో
  • ఉపదేశం ఇచ్చేటప్పుడు
  • విశాలపర్చుకోవడానికి కృషి చేయండి
  • ఇతరులను మీరు యెహోవా చూసినట్లే చూస్తారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • ఇవ్వడంలోని ఆనందాన్ని అనుభవించండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • ఇతరుల పొరపాట్లను చూసి యెహోవాకు దూరమవ్వకండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • మీరు యెహోవాలా ఆలోచిస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 6/15 పేజీలు 10-13

మీరు మీ దృక్కోణాన్ని విశాలపర్చుకోవాలా?

పశ్చిమ జపాన్‌లోని కోబ్‌ నగరంలో వినాశకరమైన భూకంపం వచ్చింది. స్వయంత్యాగ స్ఫూర్తిగల స్వచ్ఛందసేవకులు బాధితులైన అక్కడి నివాసులకు సహాయపడేందుకు వెంటనే వచ్చారు. మందులను సరఫరా చేయమని వైద్యుల సందర్శక జట్టు ఒకటి చేసిన విజ్ఞప్తిని నగర హెల్త్‌ బ్యూరోలోని ఒకరు తిరస్కరించారు. ఆ అధికారి ఒక పెద్ద మునిసిపల్‌ ఆసుపత్రి డైరెక్టర్‌ కూడా. బాధితులు వైద్యుల చేత ఖరీదైన ఇంజెక్షన్లనూ, ఇన్‌ట్రావీనస్‌ ఫ్లూయిడ్‌లనూ రిలీఫ్‌ సెంటర్‌లలో వేయించుకునే బదులు, కోబ్‌లోని ఆసుపత్రులకు వెళ్ళి వేయించుకోవాలి అని అనుకున్నాడు. చివరికి వైద్యుల అభ్యర్థన మన్నించబడింది, కాని ఆ అధికారి మొదట్లో చూపించిన కఠిన వైఖరీ, సానుభూతి చూపకపోవడమూ అన్ని చోట్లా విమర్శలు జరగడానికి దారితీశాయి.

అధికారంలో ఉన్న ఒకరు మీతో రాజీపడడానికి సిద్ధపడని అనుభవం బహుశా మీకు ఉండి ఉండవచ్చు. ఒకవేళ మీరే అలా చేసి అపరాధ భావంతో ఉంటుండవచ్చు. మీరు మరింత విశాలమైన దృక్కోణాన్ని పెంపొందించుకోవడంలో ప్రయోజనం పొందగలరా?

అన్ని కోణాల నుండి చూడండి

వ్యక్తులు, విషయాలను ఒక కోణంలో నుండే, లేక ఒక దృక్కోణం నుండే చూడడమూ, తత్ఫలితంగా, తమ గ్రహణశక్తినీ, విషయాలను గురించిన తమ అవగాహననూ పరిమితం చేసుకోవడమూ సాధారణమే. విద్య, జీవితానుభవం, నేపథ్యం వంటి కారకాలే తరచూ ఇలా జరగడానికి కారణాలు. విషయాలను అన్ని కోణాల నుండి చూడడానికి శ్రమించినప్పుడు జ్ఞానపూర్వకమైన నిర్ణయాలను తీసుకోవచ్చు. ఉదాహరణకు, ట్రాఫిక్‌ లైట్లు ఏమీలేని, చాలా రద్దీగా ఉన్న జంక్షన్‌ను మీరు దాటబోతున్నారనుకోండి. అలాగైతే, కేవలం ముందుకు మాత్రమే చూడడం జ్ఞానయుక్తంగా ఉంటుందా? కానే కాదు! అలాగే, విషయాలను అన్ని కోణాల నుండి చూడగల్గేందుకు, మీ ఆలోచన సరళిని విశాలం చేసుకోవడం నిర్ణయాలు తీసుకోవడంలోనూ, బాధ్యతాయుతమైన విధంగా ప్రవర్తించడంలోనూ చాలా సహాయపడుతుంది. అది జీవితాన్ని కాపాడేదిగా కూడా ఉండగలదు.

మనమందరం కూడా ఈ విషయంలో మెరుగుపడే అవకాశం ఉంది. ‘నా ఆలోచనసరళిని విశాలపర్చుకోవడం ద్వారా నేను మెరుగుపడగల కొన్ని రంగాలు ఏవి?’ అని మీకై మీరు ప్రశ్నించుకోండి.

ఇతరులను మీరు దృష్టించడం

మీరు ఇతరులను చూసినప్పుడు మీరు దేనిని వీక్షిస్తారు? వాళ్ళు ఏది చెప్పినా, ఏది చేసినా, వేరే ఏ రంగులూ లేదా ఛాయలూ లేనట్లూ అయితే తెలుపు లేక నలుపు మాత్రమే అన్నట్లు దృష్టించే వైఖరా మీకున్నది? ఎవరైనా చేసే వ్యాఖ్యానం అయితే అభినందించడం, లేక అవమానించడమే అయ్యుంటుందా? ఒకరు చెప్పేది అయితే పూర్తిగా సరి లేకపోతే పూర్తిగా తప్పే అయ్యుంటుందా? అలాంటి దృక్కోణం ఉండడం, శరదృతువులోని ప్రకృతి దృశ్యంలో ప్రకాశవంతమైన ముదురు వర్ణాలను, వాటి లేత రంగులను లెక్కలోకి తీసుకోకుండా, కేవలం నలుపూ తెలుపూ మాత్రమే ఉన్నట్లు దృష్టించే ఫోటోగ్రాఫర్‌లా ఉంటుంది. లేదా మీరు ఒక వ్యక్తిలోని చెడు కోణాలపై మనస్సు నిలపడానికి మొగ్గు చూపుతారా, ఎవరో సందర్శకుడు అశ్రద్ధగా వేసిన చెత్త చెదారం వల్ల రమణీయమైన దృశ్యాన్ని ఆస్వాదించకుండా పోయే ఒక ప్రయాణికుడిలా ఉంటారా?—పోల్చండి ప్రసంగి 7:16.

మానవ తప్పిదాలను యెహోవా దేవుడు ఎలా దృష్టిస్తాడనే దానిని పరిగణనలోకి తీసుకోవడం ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. మానవుడి అనేక బలహీనతలూ, లోపాలూ తనకు తెలిసి ఉండగా, తను వాటిపైన మనస్సు నిలపవద్దనే, లేదా శ్రద్ధనిలపవద్దనే ఆయన నిశ్చయించుకుంటాడు. “యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?” అని కృతజ్ఞతాభావంతో నిండిన దావీదు పేర్కొన్నాడు. (కీర్తన 130:3) మన తప్పిదాలు మనకు దేవుడితో ఉన్న సంబంధాన్ని దెబ్బతీయకుండా ఉండేందుకే, పశ్చాత్తాపపడిన పాపుల తప్పిదాలను చాలా దూరంగా చేయడానికి యెహోవా సుముఖంగా ఉంటాడు. అవును, ఎంతో ఉదారంగా వాటిని తుడిచివేస్తాడు. (కీర్తన 51:1; 103:12) ఒకసారి బత్షెబతో గంభీరమైన తప్పిదాలు చేసిన దావీదును గురించి, “నా ఆజ్ఞలను గైకొని మనఃపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే చేసిన నా సేవకు[డు]” అని యెహోవా చెప్పగలిగాడు. (1 రాజులు 14:8) దేవుడు దావీదు గురించి ఇలా ఎందుకు చెప్పగలిగాడు? ఎందుకంటే, పశ్చాత్తాపపడిన దావీదు యొక్క మెరుగైన లక్షణాలపైనే ఆయన మనస్సు నిలిపాడు. ఆయన తత్సంబంధిత విషయాలనన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నాడు, తన సేవకుడికి కరుణను చూపించడంలో కొనసాగడానికే ఆయన ఎంపిక చేసుకున్నాడు.

ఇతరుల తప్పిదాల విషయంలో ఈ విశాలమైన దృక్కోణాన్ని క్రీస్తు యేసు ఏ మాత్రం తేడా లేకుండా ప్రతిబింబించాడు. (యోహాను 5:19) తన అపొస్తలుల లోపాలు తనకు తారసపడినప్పుడు, యేసు కరుణామయుడుగాను, అర్థం చేసుకునేవాడిగాను ప్రవర్తించాడు. అపరిపూర్ణ మానవుల విషయానికి వస్తే, “ఆత్మ సిద్ధం[గా]” ఉన్నా “శరీరము బలహీనమని” ఆయన గ్రహించాడు. (మత్తయి 26:41) దీన్ని మనస్సులో ఉంచుకుని, తన శిష్యుల బలహీనతలతో, పొరపాట్లతో ఓపికగా అవగాహనాపూర్వకంగా యేసు వ్యవహరించగలిగాడు. వాళ్ళు తప్పిపోయిన విషయాలపై కాదు కానీ, వాళ్ళ మంచి లక్షణాలపైనే ఆయన మనస్సు నిలిపాడు.

తమలో గొప్పవాడు ఎవరు అని తన శిష్యులు వాదించుకున్నందువల్ల, వాళ్ళను సరిదిద్దిన తర్వాత, “నా శోధనలలో నాతో కూడ నిలిచి యున్నవారు మీరే; గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్లయొద్ద అన్నపానములు పుచ్చుకొని, సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి మీరు తీర్పుతీర్చుటకై, నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను” అని కూడా యేసు అన్నాడు. (లూకా 22:24-30) అవును, అపొస్తలులు అనేక సార్లు తప్పిపోయినప్పటికీ, యేసు వారి నమ్మకత్వాన్నీ, తనపై వాళ్ళకున్న ప్రేమనూ గుర్తు చేసుకున్నాడు. (సామెతలు 17:17) వాళ్ళు ఏమి చేయగలరు, ఏమి చేస్తారు అనే విషయంలో యేసుకు నమ్మకం ఉండింది. కనుకనే ఆయన వాళ్ళతో రాజ్య ఒడంబడికను చేశాడు. అవును, ‘యేసు తన శిష్యులను అంతమువరకు ప్రేమించెను.’—యోహాను 13:1.

ఒకరి వ్యక్తిత్వంలో భాగమైన ఒక లక్షణం, లేదా లోపాలు మీకు చిరాకు కలిగిస్తున్నట్లయితే, యెహోవా, యేసూ ఎలా ఉంటారో అలా ఉండండి. మీ ఆలోచనసరళిని విశాలం చేసుకోండి, అన్ని కారకాలను పరిగణనలోకి తీసుకోవడానికి ప్రయత్నించండి. విషయాలను సరైన స్థానంలో పెట్టి చూస్తే, మీరు మీ సహోదరులను ప్రేమించడమూ, ప్రశంసించడమూ సులభమౌతుందని మీరు కనుగొంటారు.

భౌతికంగా ఇవ్వడంలో

క్రైస్తవుల ముందుంచబడిన ఆనందకరమైన విషయాల్లో ఇచ్చే ఆధిక్యత ఒకటి. మనం ఇవ్వడాన్ని ఏదో ఒక క్రియాశీలతకు మాత్రమే పరిమితం చేసుకోవలసిన అవసరముందా? ఉదాహరణకు, ప్రాంతీయ పరిచర్యలో పాల్గొనడం వరకేనా? (మత్తయి 24:14; 28:19, 20) ఇతరుల శారీరక అవసరాలను, క్షేమాన్ని కూడా ఇమిడ్చేంతగా మీరు మీ ఆలోచనసరళిని విశాలపర్చుకోగలరా? నిజమే, ఆధ్యాత్మికంగా ఇవ్వడం అన్నింటి కన్నా ప్రాముఖ్యమైనదని క్రైస్తవులందరూ గ్రహిస్తారు. (యోహాను 6:26, 27; అపొస్తలుల కార్యములు 1:8) అయితే, ఆధ్యాత్మికంగా ఇవ్వడం ఎంత ప్రాముఖ్యమో భౌతికంగా ఇవ్వడం కూడా అంతే ప్రాముఖ్యం కనుక, అది నిశ్చయంగా నిర్లక్ష్యం చేయకూడని విషయం.—యాకోబు 2:15, 16.

మన సొంత సంఘంలోని, అలాగే ప్రపంచమంతటా ఉన్న మన ఆధ్యాత్మిక సహోదరుల ఆవశ్యక అవసరాలను గురించి మనం ఆలోచించినప్పుడు, మనం వారి కోసం ఏమి చేయగలమో మరెక్కువ గ్రహించగలం. ఆ విధంగా చేసే పరిస్థితిలో ఉన్నవాళ్ళు, ఇతరులతో ఉదారంగా పంచుకుంటారు, అలా అందరికీ సమానంగా ఉంటుంది. ఈ విధంగా, మన సహోదరులందరి అవసరాలు తీర్చబడతాయి. “ప్రపంచంలోని ఒక భాగంలో అవసరం ఏర్పడితే, మరో భాగంలో ఉన్న సహోదరులు వాళ్ళ సహాయానికి వస్తారు. వాళ్ళు సహాయం చేసే పరిస్థితిలో లేకపోతే, మరో భాగంలో ఉన్న సహోదరులు చేస్తారు. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన సహోదరుల అవసరాలు తీర్చబడతాయి. ప్రపంచవ్యాప్త సహోదరత్వం నిశ్చయంగా అద్భుతమైనది” అని ఒక క్రైస్తవ సహోదరుడు వ్యక్తీకరించాడు.—2 కొరింథీయులు 8:13-15; 1 పేతురు 2:17.

తూర్పు యూరప్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశాల్లో ఒక దానికి హాజరు కావాలని ఒక క్రైస్తవ సహోదరి నిజంగా కోరుకుంది. కానీ ఆమె వెళ్ళే పరిస్థితిలో లేదు. అయితే, అక్కడ ఉన్న సహోదరులకు బైబిళ్ళ అవసరం చాలా ఉంది అని ఆమె విన్నది కనుక, ఆ సమావేశాలకు హాజరవుతున్న ఒకరి ద్వారా అలాంటి బైబిళ్ళ కోసం ఆమె విరాళాన్ని పంపించింది. ఆ విధంగా, ఆమె, ఇవ్వడంలోనూ, విదేశంలో ఉన్న సహోదరులతో పంచుకోవడంలోనూ సంతోషాన్ని అనుభవించింది.—అపొస్తలుల కార్యములు 20:35.

మీ ఆలోచనసరళిని విశాలం చేసుకోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎల్లప్పుడూ విస్తరిస్తూనే ఉండే బైబిలు విద్య పనికి మీరు మరింత ఎక్కువగా తోడ్పడగలరు. అది మీకూ అలాగే ఇతరులకు కూడా ఆనందాన్నిస్తుంది.—ద్వితీయోపదేశకాండము 15:7; సామెతలు 11:24; ఫిలిప్పీయులు 4:14-19.

ఉపదేశం ఇచ్చేటప్పుడు

మన ఆధ్యాత్మిక సహోదరులకు ఉపదేశాన్నీ, దిద్దుబాటునూ ఇచ్చేందుకు వాళ్ళను సందర్శించినప్పుడు, మనం వాళ్ళకు పరిగణనిస్తూ, సమతుల్యతతో తర్కించడం మనం వాళ్ళ గౌరవాన్ని సంపాదించేందుకు, నిజంగా ఫలవంతమైన సహాయాన్ని అందించేందుకు మనకు తోడ్పడుతుంది. కొన్ని వాస్తవాలపై మాత్రం మనస్సు నిలిపి, త్వరగా ఒక నిర్ణయానికి, ఏకపక్ష నిర్ణయానికి రావడం చాలా సులభం. అలా చేయడం, యేసు కాలంలో, లెక్కలేనన్ని నియంత్రణలతో ఇతరులపై భారాన్ని మోపే వైఖరిని చూపించిన మతనాయకుల్లా, మనమూ సంకుచిత మనస్కులమన్న అభిప్రాయాన్ని, అదీ కాకపోతే, వాస్తవాలను పరిశీలించడానికి సుముఖత చూపని మనస్కులమన్న అభిప్రాయాన్ని కలిగిస్తుంది. (మత్తయి 23:2-4) మరోవైపు, మనం మరీ విపరీతానికి పోకుండా, నీతియుక్తమే అయినా, సంతులితంగా, కరుణాపూర్వకంగా ఉండే యెహోవా ఆలోచనా సరళినే ప్రతిబింబిస్తూ, లేఖనాధార సూత్రాల బలమైన ఆధారంతో మంచి ఉపదేశాన్నిస్తే, మనమిచ్చే సూచనలను అంగీకరించడము, ఆచరణలో పెట్టడము ఇతరులకు చాలా సులభమౌతుంది.

కొన్ని సంవత్సరాల క్రితం, వివిధ సంఘాల్లోని యువ సహోదరులు క్రీడల్లో పాల్గొనేందుకు సమావేశమయ్యారు. విచారకరమైన విషయమేమిటంటే, వాళ్ళ మధ్య పోటీ స్ఫూర్తి పెరిగి, చివరికి ఒకరితోనొకరు కఠినంగా మాట్లాడుకోవడానికి దారితీసింది. స్థానిక సహోదరులు ఆ సమస్యతో ఎలా వ్యవహరించారు? యౌవనస్థులకు వినోదం అవసరముందన్న విషయాన్ని గుర్తించి, వాళ్ళు తమ క్రీడలను పూర్తిగా ఆపేయాలని వాళ్ళు చెప్పలేదు. (ఎఫెసీయులు 5:17; 1 తిమోతి 4:8) బదులుగా, పోటీ స్ఫూర్తి దేనికి నడిపించగలదు అనే విషయమై, గట్టిదే అయినా, సహేతుకమైన హెచ్చరికలను ఇచ్చారు. మీరు ఆడుకునేటప్పుడు, పెద్దవాళ్ళు, బాధ్యతగలవాళ్ళు ఉండాలి వంటి సహాయకరమైన సూచనలను ఇచ్చారు. ఆ యౌవనస్థులు ఆ ఉపదేశంలోని జ్ఞానాన్ని, సమతుల్యతను గ్రహించి చక్కగా ప్రతిస్పందించారు. అంతేకాక, పెద్దలపై వాళ్ళకున్న గౌరవమూ ఆప్యాయతా రెట్టింపయ్యాయి.

విశాలపర్చుకోవడానికి కృషి చేయండి

మీరు ఉద్దేశపూర్వకంగా గానీ కావాలని గానీ దురభిప్రాయాలను ఏర్పరచుకోకపోవచ్చు. కానీ, మీరు మీ ఆలోచనసరళిని విశాలం చేసుకోవడానికి దృఢనిశ్చయంతో కృషి చేయవలసిన అవసరముంటుంది. మీరు దేవుడి వాక్యాన్ని పఠిస్తుండగా, యెహోవా ఆలోచించే విధానాన్ని గ్రహించేందుకు దానిని గుణగ్రహించేందుకు ఆయన వాక్యాన్ని ధ్యానించండి. (కీర్తన 139:17) బైబిలులో వ్రాయబడిన మాటలకు, ఇమిడివున్న సూత్రాలకు గల కారణాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. యెహోవా విషయాలను ఎలా మదింపు చేస్తాడో, అలాగే మదింపు చేయడానికి శ్రమించండి. అలా చేయడం, “యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము నీత్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము” అని దావీదు చేసిన ప్రార్థనకు అనుగుణ్యంగా ఉంటుంది.—కీర్తన 25:4, 5.

మీరు విశాలమైన దృక్కోణాన్ని అలవరచుకుంటుండగా మీరు ఆశీర్వదించబడతారు. విశాలపర్చబడిన దృక్కోణం వల్ల కలిగే ఒక ఆశీర్వాదమేమిటంటే, మీరు సమతుల్యత గల వ్యక్తని, అవగాహన గల వ్యక్తని మంచి పేరును పొందుతారు. వివిధ పరిస్థితుల్లో, మీరు సహాయాన్ని అందించేటప్పుడు, మరింత సహేతుకంగాను, మరింత అవగాహనతోను ప్రతిస్పందించగల్గుతారు. ఈ విధంగా ఇది, క్రైస్తవ సహోదరత్వంలో అద్భుతమైన అనుగుణ్యతకూ, ఐక్యతకూ తోడ్పడుతుంది.

[12వ పేజీలోని చిత్రాలు]

ఉదారంగా ఇవ్వడం ఇతరులకు సహాయపడుతుంది, దాతకు ఆనందాన్నిస్తుంది, మన పరలోక తండ్రిని సంతోషింపజేస్తుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి