కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 6/1 పేజీలు 24-27
  • యెహోవాను బట్టి సంతోషించండి, ఉల్లసించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాను బట్టి సంతోషించండి, ఉల్లసించండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆనందభరితమైన స్ఫూర్తిని కాపాడుకోమని ఉద్బోధించబడ్డారు
  • ఆనందభరితమైన అనుభవాలూ, ఇంటర్వ్యూలూ
  • సంసిద్ధ స్ఫూర్తి ప్రజలను గిలియడ్‌కు తీసుకువస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • విజయవంతులైన విద్యార్థుల నుండి విజయవంతులైన మిషనరీలుగా
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • సేవచేయడానికి పురికొల్పబడ్డారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • గిలియడ్‌ స్కూల్‌ 60 సంవత్సరాల మిషనరీ శిక్షణ
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 6/1 పేజీలు 24-27

యెహోవాను బట్టి సంతోషించండి, ఉల్లసించండి

ప్రయోజనకరమైన ఒక ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేయడమనేది ఎల్లప్పుడూ ఆనందించదగ్గ ఒక సమయమే. న్యూయార్క్‌లోని పాటర్‌సన్‌లోవున్న వాచ్‌టవర్‌ ఎడ్యుకేషనల్‌ సెంటర్‌లో 1999, మార్చ్‌ 13న స్నాతకోత్సవ కార్యక్రమమనేది, వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ 106వ తరగతికి చెందిన 48 మంది విద్యార్థులకు నిజంగా అలాంటి ఒక సందర్భమైవుంది.

ఏడవ తరగతి గిలియడ్‌ గ్రాడ్యుయేటూ, పరిపాలక సభలోని ఒక సభ్యుడూ, ఈ కార్యక్రమ అధ్యక్షుడూ అయిన థియోడర్‌ జారజ్‌ చెప్పిన ప్రారంభమాటలు, “నీతిమంతులారా, యెహోవానుబట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయులారా, మీరందరు ఆనందగానము చేయుడి” అని కీర్తన 32:11లో ఉన్న మాటలను ఉన్నతపర్చాయి. ఈ సందర్భంలో అందరూ ఆనందించడం ఎందుకు సముచితమో వివరిస్తూ, “మన గిలియడ్‌ విద్యార్థులతోసహా యథార్థ హృదయులతో యెహోవా నెరవేరుస్తున్న దాన్నిబట్టి, మనం ఇలాంటి సందర్భాల్లో ఆనందిస్తాం” అని ఆయన అన్నారు. విద్యార్థులు గిలియడ్‌ స్కూల్‌కు రావడానికి పథకాలు వేసుకుని, మిషనరీ సేవకు యోగ్యులయ్యేలా ఎంతో శ్రద్ధాపూర్వకంగా శ్రమించగా, ప్రతిదీ సఫలమయ్యేలా సాధ్యంచేస్తున్నది యెహోవాయే. (సామెతలు 21:5; 27:1) ‘యెహోవాను బట్టి ఆనందించడానికి’గల కారణమదేనని సహోదరుడు జారజ్‌ నొక్కిచెప్పారు.

పాటర్‌సన్‌ ఆడిటోరియమ్‌లో ఉన్న ఆ ప్రేక్షకుల్లో, విద్యార్థుల కుటుంబ సభ్యులూ, అతిథులూ ఉన్నారు. ఈ అతిథులు ఈ ఆనందకరమైన కార్యక్రమాన్ని చూసేందుకు 12 దేశాల నుండి వచ్చారు. ఆడియో వీడియోలతో అనుసంధానం చేయబడిన పాటర్‌సన్‌, బ్రూక్లిన్‌, వాల్‌కిల్‌లలో ఉన్న బెతేలు కుటుంబ సభ్యులతోపాటు ఈ కార్యక్రమానికి హాజరైన 5,198 మంది జరుగనున్న కార్యక్రమం కోసం ఎదురు చూశారు. ఆనందభరితమైన స్ఫూర్తి అక్కడ వెల్లివిరిసిందన్న విషయం సుస్పష్టం.

ఆనందభరితమైన స్ఫూర్తిని కాపాడుకోమని ఉద్బోధించబడ్డారు

సహోదరుడు జారజ్‌ తన ప్రారంభ మాటలను ముగించిన తర్వాత, గిలియడ్‌ పట్టభద్రులకే కాక, ప్రేక్షకుల్లో ఉన్న అందరి కోసం ప్రోత్సాహకరమైన లేఖనాధార ఉద్బోధను సిద్ధం చేసుకున్న ఐదుగురు ప్రసంగీకుల్లో మొదటి వ్యక్తిని పరిచయం చేశారు.

మొదట మాట్లాడింది విలియమ్‌ మలెన్‌ఫంట్‌. ఆయన 34వ తరగతి గిలియడ్‌ పట్టభద్రుడు. ఇప్పుడు పరిపాలక సభ యొక్క బోధన కమిటీకీ సహాయకుడుగా పని చేస్తున్నాడు. ప్రసంగి 1:2 ఆధారపడిన “‘ప్రతిదీ’ వ్యర్థము కాదు!” అనే తన ప్రసంగాంశానికి సంబంధించి “వ్యర్థము అన్న పదానికున్న సంపూర్ణ అర్థంలో ప్రతిదీ వ్యర్థమని సొలొమోను నిజంగానే భావించాడా?” అన్న ప్రశ్నను ఆయన లేవదీశాడు. జవాబు: “అలా భావించలేదు. దేవుడి చిత్తం ఏమిటి అనే దానిని నిర్లక్ష్యం చేసే మానవ వ్యవహారాలు, దేవుడి చిత్తం నుండి వైదొలగే వ్యాపకాలు—ఇవన్నీ వ్యర్థమని సొలొమోను సూచిస్తున్నాడు.” దానికి భిన్నంగా, సత్య దేవుడైన యెహోవాను ఆరాధించడం వ్యర్థం కాదు; దేవుడి వాక్యమైన బైబిలును పఠించడం గానీ, దాన్ని ఇతరులకు బోధించడం గానీ వ్యర్థం కాదు. తన సేవకులు చేసే అలాంటి ప్రయత్నాలను దేవుడు మరిచిపోడు. (హెబ్రీయులు 6:10) వాస్తవానికి, దేవుడి అనుగ్రహాన్ని పొందినవారి జీవన మార్గంలో ఏదైనా ఒక విపత్తు సంభవించినప్పటికీ, వాళ్ళు “దేవుడైన యెహోవాయొద్ద నున్న జీవపుమూటలో కట్టబ[డ్డామని]” రుజువుపర్చుకుంటారు. (1 సమూయేలు 25:29) ఎంత హృదయోద్దీపకమైన తలంపది! ఈ విషయాలను గుర్తుంచుకోవడం యెహోవా ఆరాధకులందరూ ఆనందభరితమైన స్ఫూర్తిని కాపాడుకునేలా సహాయపడగలదు.

పరిపాలక సభలో ఒక సభ్యుడైన జాన్‌ బార్‌, “మీ మిషనరీ నియామకంలో ఆహ్లాదాన్ని పొందండి” అనే తన ప్రసంగంతో పట్టభద్రుల తరగతిని ప్రోత్సహించాడు. మిషనరీ సేవ అనేది యెహోవా దేవుడి హృదయానికి ఎల్లప్పుడూ అతి సన్నిహితంగా ఉండే సేవ అని ఆయన చూపించాడు. “లోకం మీద యెహోవాకున్న ప్రేమ వ్యక్తీకరణతో విడదీయరాని సంబంధముంది దానికి. ఆయన తన జనితైక కుమారుడ్ని ఈ భూమి మీదికి పంపాడు. యేసు మహా గొప్ప మిషనరీ, అత్యున్నత మిషనరీ.” భూమిమీది తన నియామకంలో సఫలీకృతుడయ్యేందుకు యేసు చేసుకోవాల్సివచ్చిన మార్పులను గురించి ఆ పట్టభద్రులు తలపోసుకోగలుగగా, యేసు చేసిన మిషనరీ సేవ వల్ల కలిగిన ప్రయోజనాలను అనుభవించాలనుకునేవారందరికీ, అవి ఇప్పటికీ లభ్యమౌతాయి. ఎందుకంటే, సహోదరుడు బార్‌ సూచించినట్లు, దేవుడి పని చేయడంలో యేసు ఆహ్లాదాన్ని పొందాడు, మానవులను ప్రేమించాడు కూడా. (సామెతలు 8:30, 31) తమ నియామకాలను సహించుకోవాల్సిన విషయంగాగాక, వాటిని హత్తుకొని ఉండడంలో గ్రాడ్యుయేట్లు ఆనందిస్తారు గనుకనే వాటిని హత్తుకోమని వాళ్లకు సహోదరుడు బార్‌ ఉద్బోధించారు. “నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును” అని ఆ తరగతివారిని ఆయన కోరారు.—కీర్తన 55:22.

రెండవ ప్రసంగీకుడు లోయిడ్‌ బ్యారీ. ఆయన పరిపాలక సభలోని మరొక సభ్యుడు. “నిరంతరం యెహోవా పేరట నడవడం” అనే అంశాన్ని ఆయన ఎన్నుకున్నాడు. గిలియడ్‌ 11వ తరగతి ముగించి, ఆ తర్వాత 25 కన్నా ఎక్కువ సంవత్సరాలు జపాన్‌లో మిషనరీగా సేవ చేసిన సహోదరుడు బ్యారీ, తొలి మిషనరీల కొన్ని అనుభవాలను చెప్పి, వాళ్ళు ఎదుర్కోవలసి వచ్చిన సవాళ్ళను వివరించాడు. గ్రాడ్యుయేటింగ్‌ తరగతికోసం ఆయన దగ్గర ఏ ఆచరణాత్మక సలహా ఉంది? “అన్నింటి కన్నా ముఖ్యంగా, మీ ఆధ్యాత్మికతను కాపాడుకోండి. అలాగే, భాషనూ, సంస్కృతినీ నేర్చుకోండి. మీ హాస్య చతురతను కాపాడుకోండి. మీ సేవను హత్తుకొని ఉండండి; సొమ్మసిల్లకండి, వదిలివెళ్ళకండి.” తమ విదేశీ నియామకాల్లో వాళ్ళు వివిధ దేవుళ్ళ, దేవతల పేరట నడిచే అనేకులను కలుస్తారని సహోదరుడు బ్యారీ చెప్పారు. “సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము” అన్న మీకా మాటలను ఆయన వాళ్ళకు గుర్తు చేశాడు. (మీకా 4:5) దేవుడి సేవకులందరూ యెహోవా పేరట నడుస్తూ ఉండేందుకు, నమ్మకంగా ఆయన సేవ చేసేందుకూ మునుపటి మిషనరీల మాదిరి నిశ్చయంగా ఒక శక్తివంతమైన ప్రేరణగా ఉంది.

కార్యక్రమంలో తరవాతి ప్రసంగీకుడు, లారన్స్‌ బౌవన్‌. ఆయన గిలియడ్‌ ఇన్‌స్ట్రక్టర్‌. ఆయన ప్రసంగాంశం “మీరెవరని రుజువు చేయబడతారు?” అనే ప్రశ్నను లేవదీసింది. దేవుడి సేవలో సాఫల్యం అనేది యెహోవా మీది విశ్వాసంపై, నమ్మకంపై ఆధారపడి ఉంటుందని ఆయన చూపించారు. యెహోవాను పూర్తిగా ఆశ్రయించడం, రాజైన ఆసాకు శత్రువైన వెయ్యి వేల సైన్యంపై చాలా గొప్ప విజయాన్ని తీసుకువచ్చింది. అయినప్పటికీ, యెహోవాను ఆశ్రయించడంలో కొనసాగవలసిన అవసరముందని అజర్యా ప్రవక్త ఆయనకు గుర్తు చేశాడు: “మీరు యెహోవా పక్షపువారైనయెడల ఆయన మీ పక్షమున నుండును.” (2 దినవృత్తాంతములు 14:9-12; 15:1, 2) యెహోవా అనే దేవుడి పేరు, ఆయన తన ఉద్దేశాన్ని నెరవేర్చేందుకు తాను ఏమి కావలసి వస్తే అలా—ప్రదాతగా, సంరక్షకుడుగా, కావలసి వస్తే, శిక్షను అమలు చేసే వ్యక్తిగా కూడా—మారుతాడనే తలంపును తెలియజేస్తుంది కనుక, యెహోవాను ఆశ్రయించి, ఆయన ఉద్దేశానికి అనుగుణ్యంగా పని చేసే మిషనరీలు తమ నియామకాల్లో సఫలులని నిరూపించుకుంటారు. (నిర్గమకాండము 3:14) “మీరు యెహోవా ఉద్దేశాన్ని మీ ఉద్దేశంగా చేసుకున్నంత కాలం, మీరు మీ నియామకాన్ని నెరవేర్చేందుకు మీరు ఏమి కావలసి ఉంటే అది అయ్యేలా ఆయన చేస్తాడన్న విషయాన్ని ఎన్నడూ మరిచిపోవద్దు” అని అంటూ సహోదరుడు బౌవన్‌ ముగించారు.

ఈ కార్యక్రమంలోని చివరి ప్రసంగీకుడు వాలాస్‌ లివరన్స్‌. ఈయన మునుపు మిషనరీ. ఇప్పుడు ఈ స్కూల్‌ రెజిస్ట్రార్‌. “దేవుడి వాక్యాన్ని మీలో సజీవంగా ఉంచి, దాన్ని మీలో పనిచేయనివ్వండి” అన్న ఆయన ప్రసంగాంశం, నెరవేరేదిశగా ఎల్లప్పుడూ సాగిపోతున్న, నిరర్థకంకాని దేవుడి సందేశంపై లేదా వాగ్దానంపై అవధానాన్ని నిలిపింది. (హెబ్రీయులు 4:12) అది తమపై ప్రభావం చూపడానికి అనుమతించేవారి జీవితాలపై ప్రభావం చూపుతుంది. (1 థెస్సలొనీకయులు 2:13) ఆ వాక్యాన్ని మన జీవితాల్లో సజీవంగానూ, పని చేసేదిగానూ ఎలా ఉంచవచ్చు? శ్రద్ధాపూర్వకమైన బైబిలు అధ్యయనం ద్వారానే. దేవుడి వాక్యాన్ని చదవడం, దాని భావాన్ని వివరంగా తెలుసుకోవడం, దాన్ని అన్వయించుకోవడంతో సహా, గిలియడ్‌లో నేర్చుకున్న బైబిలును పఠించే పద్ధతులను గురించి పట్టభద్రులకు సహోదరుడు లివరన్స్‌ గుర్తు చేశాడు. 50 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం స్థాపించబడిన గిలియడ్‌ స్కూల్‌ కమిటీ అధ్యక్షుడుగా సేవ చేసిన, పరిపాలక సభ సభ్యుడైన ఆల్బర్ట్‌ ష్రోడర్‌ అన్న మాటలను ఆయన ప్రస్తావించాడు: “ఒకరు సందర్భాన్ని పరిగణనలోనికి తీసుకోవడం ద్వారా, దేవుడు తన వాక్యంలో లభ్యం చేసిన ఆధ్యాత్మిక శక్తి యొక్క పూర్తి ప్రభావాన్ని, ఖచ్చితమైన ప్రభావాన్ని పొందగల్గుతారు.” ఈ విధంగా బైబిలును పఠించడం దేవుడి వాక్యాన్ని సజీవంగా ఉంచి అది పనిచేసేలా చేస్తుంది.

ఆనందభరితమైన అనుభవాలూ, ఇంటర్వ్యూలూ

ఈ ప్రసంగాల తర్వాత, విద్యార్థులు చెప్పిన కొన్ని ఆనందభరితమైన అనుభవాలు ప్రేక్షకులకు ఆనందం కలిగించాయి. మునుపు మిషనరీ, అలాగే, ప్రస్తుతం గిలియడ్‌ ఇన్‌స్ట్రక్టరూ అయిన మార్క్‌ నూమార్‌ నిర్దేశం క్రింద విద్యార్థుల గుంపొకటి వివిధ పరిస్థితుల్లో సాక్ష్యం ఇవ్వడానికి తాము ఎలా కృషిచేశారో తెలియజేశారు, ప్రదర్శించి కూడా చూపారు. అక్కడి టెరిటరీలో ఉన్న ప్రజల పరిస్థితులనూ, వాళ్ళ వ్యక్తీకరణలనూ గమనించేవారిగా ఉండడం ద్వారా, వాళ్ళ మీద వ్యక్తిగత శ్రద్ధను చూపించడం ద్వారా కొందరు విద్యార్థులు బైబిలు పఠనాలను ప్రారంభించి, నిర్వహించగల్గారు. అలా, విద్యార్థులు ‘తమను గురించీ, తమ బోధను గురించీ జాగ్రత్త కలిగి ఉంటూ’ ఇతరులు రక్షణను పొందేందుకు సహాయపడడంలో నిజంగా ఆసక్తి కలిగివున్నారు.—1 తిమోతి 4:16.

ఆచరణాత్మక సూచనలు అనేకం ఇవ్వబడ్డాయి. వాచ్‌ టవర్‌ ఎడ్యుకేషనల్‌ సెంటర్‌లో నిర్వహించబడే బ్రాంచ్‌ కమిటీ మెంబర్ల స్కూల్‌లో తర్ఫీదును పొందుతున్న అనేక మంది అనుభవజ్ఞులైన సహోదరులు కూడా మిషనరీ సేవలో దొరికే ఆనందాన్ని రుజువు చేశారు. ప్రధాన కార్యాలయ సిబ్బందిలో సభ్యులైన సహోదరులు సామ్యేల్‌ హెర్డ్‌, రాబర్ట్‌ జాన్సన్‌లు బొలీవియా, జింబాబ్వే, నికరాగ్వా, మధ్య ఆఫ్రికా రిపబ్లిక్‌, డొమినికన్‌ రిపబ్లిక్‌, పాపువా న్యూ గినియా, కామెరూన్‌ దేశాల్లోని బ్రాంచ్‌ ఆఫీస్‌ నుండి వచ్చిన ప్రతినిధులతో ఉత్సాహవంతమైన ఇంటర్వ్యూలను జరిపారు.

అనుభవాలూ, ఇంటర్వ్యూలు అయిన తర్వాత, 41వ తరగతి గిలియడ్‌ పట్టభద్రుడూ, ఇప్పుడు పరిపాలక సభలో సభ్యుడూ అయిన గెరట్‌ లోష్‌, “‘మీరు కోరదగినవ్యక్తి’యేనా?” అనే ఆలోచింపజేసే అంశంపై చివరి ప్రసంగాన్ని ఇచ్చారు. దేవుడి పరిపూర్ణుడైన కుమారుడైన యేసును కోరదగిన వ్యక్తిగా ప్రజలు దృష్టించలేదు, “అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును” ఆయెను అని సహోదరుడు లోష్‌ పట్టభద్రులకు మొదట గుర్తు చేశాడు. (యెషయా 53:3) కనుక, నేడు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో జనసమ్మతం కానివారిగా అంటే, వ్యక్తిగతంగా అంగీకరించబడని వారిగా, లేక ఆహ్వానించబడని వారిగా మిషనరీలు దృష్టించబడడంలో ఆశ్చర్యం లేదు. మరొక వైపు, బబులోనులో ఎన్నో సంవత్సరాలు సేవలో ఉన్న దానియేలును సృష్టికర్త ఒక దూత ద్వారా “ఎంతో కోరదగినవాడవు” అని మూడుసార్లు పిలిచాడు. (దానియేలు 9:23; 10:11, 19, NW) కోరదగినవ్యక్తిగా దానియేలును చేసిందేమిటి? బబులోను సంస్కృతికి సర్దుకుపోతున్నప్పుడు, బైబిలు సూత్రాల విషయంలో ఆయన ఎన్నడూ రాజీపడలేదు; ఆయన తన స్థానాన్ని వ్యక్తిగత ప్రయోజనానికి ఎన్నడూ ఉపయోగించుకోలేదు, అన్ని విధాల్లోనూ ఆయన నిజాయితీగా ఉండేవాడు; దేవుడి వాక్యాన్ని పట్టుదలగా పఠించేవాడు. (దానియేలు 1:8, 9; 6:4; 9:2) ఆయన యెహోవాకు క్రమంగా ప్రార్థనలు చేసేవాడు. తాను కార్యాలను సాధించినప్పుడు, దేవుడికి వెంటనే మహిమను చెల్లించేవాడు. (దానియేలు 2:20) దానియేలు మాదిరిని అనుసరించడం ద్వారా దేవుడి సేవకులు లోకం దృష్టిలో కాదు కానీ, యెహోవా దేవుడి దృష్టిలో కోరదగినవారమని నిరూపించుకోగలరు.

ఆధ్యాత్మికంగా ఉప్పొంగజేసే ఈ కార్యక్రమాన్ని ముగించబోతూ, ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన టెలిగ్రాములలో నుండి, సందేశాలలో నుండి కొన్నింటిని అధ్యక్షుడు చదివి వినిపించారు. తర్వాత, 24 జంటల్లోని ప్రతి జంటా డిప్లోమాలను తీసుకున్నారు, వాళ్ళు ఏ దేశానికి నియమించబడ్డారో కూడా ప్రకటించబడింది. చివరికి, గత ఐదు నెలల్లో తాము పొందిన తర్ఫీదు, సిద్ధపాటుల విషయమై తమకు గల మెప్పుదలను వ్యక్తపరుస్తూ పరిపాలక సభకూ, బెతేల్‌ కుటుంబానికీ వ్రాసిన ఉత్తరాన్ని ఆ తరగతి ప్రతినిధి ఒకరు చదివారు.

కార్యక్రమం దాని ముగింపుకు వచ్చినప్పుడు, అక్కడి నుండి నిష్క్రమిస్తున్నగుంపు మధ్య ‘కృతజ్ఞతా స్తుతులతో కూడిన సంతోషం’ కనిపించింది.—నెహెమ్యా 12:27, NW.

[27వ పేజీలోని బాక్సు]

తరగతి గణాంకాలు

ప్రాతినిధ్యం వహించిన దేశాలు: 10

నియమించబడిన దేశాలు: 19

విద్యార్థుల సంఖ్య: 48

వివాహితులైన దంపతుల సంఖ్య: 24

సరాసరి వయసు: 33

సరాసరి సత్యంలో ఉన్న సంవత్సరాలు:16

పూర్తి పరిచర్యలో ఉన్న సరాసరి సంవత్సరాలు: 13

[25వ పేజీలోని చిత్రం]

106వ తరగతి వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌

ఈ క్రింది లిస్ట్‌లో, వరుసలు ముందు నుండి వెనక్కి లెక్కించబడ్డాయి, ప్రతి వరుసలోను పేర్లు ఎడమ నుండి కుడికి పేర్కొనబడ్డాయి.

(1) డీకన్‌, డి.; పూవోపోలో, ఎమ్‌.; లగూన, ఎమ్‌.; డవోల్ట్‌, ఎస్‌.; డోమిన్గస్‌, ఈ.; బర్క్‌, జే. (2) గావుట, ఎస్‌.; వాస్‌కస్‌, డబ్ల్యు.; సీబ్రూక్‌, ఎ.; మోస్కా, ఎ.; హెలీ, ఎల్‌.; బ్రూవర్డ్‌, ఎల్‌. (3) బ్రన్‌డన్‌, టి.; ఓలివారస్‌, ఎన్‌.; కోల్‌మన్‌, డి.; స్కోట్‌, వి.; పీటర్‌సన్‌, ఎల్‌.; మ్యాక్‌లావుద్‌, కె. (4) మ్యాక్‌లావుద్‌, జె.; థామ్‌సన్‌, జె.; లూబరిస్‌, ఎఫ్‌.; స్పేట, బీ.; లేటమాకీ, ఎమ్‌.; లగూన జె. (5) గావుట, యు.; డోమిన్గస్‌, ఆర్‌.; హెలీ, ఎఫ్‌.; స్మిత్‌, ఎమ్‌.; బైయర్‌, డి.; మోస్కా, ఏ. (6) స్కోట్‌, కె.; సీబ్రూక్‌, వి.; స్పేట, ఆర్‌.; కోల్‌మన్‌, ఆర్‌.; బ్రూవర్డ్‌, ఎల్‌.; డవోల్ట్‌, డబ్ల్యు. (7) స్మిత్‌, డి.; లేటమాకీ, టి.; పీటర్‌సన్‌, పి.; థామ్‌సన్‌, జి.; వాస్‌కస్‌, ఆర్‌.; బైయర్‌, ఎ. (8) లూబరిస్‌, ఎమ్‌.; డీకన్‌, సి.; బ్రన్‌డన్‌, డి.; పూవోపోలో, డి.; ఓలివారస్‌, ఓ.; బర్క్‌, ఎస్‌.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి