కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 5/1 పేజీలు 30-31
  • పౌలు ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పౌలు ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తాడు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఓడ బ్రద్దలైపోయింది
  • మెలితేలో అద్భుతం
  • మన కోసం పాఠం
  • “మీలో ఏ ఒక్కరూ చనిపోరు”
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
  • ద్వీపం దగ్గర ఓడ బద్దలు కావడం
    నా బైబిలు కథల పుస్తకము
  • పౌలును రోముకు పంపించారు
    నా బైబిలు పుస్తకం
  • ఓడలో ఉన్నవాళ్లలో ధైర్యం నింపాడు
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 5/1 పేజీలు 30-31

వారు యెహోవా చిత్తాన్ని చేశారు

పౌలు ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తాడు

పౌలు నిరాశాపూరితమైన పరిస్థితిలో ఉన్నాడు. పౌలూ, అతనితోపాటు 275 మంది ఇతరులూ ప్రయాణిస్తున్న ఓడ, ఊరకులోను అనే పెనుగాలుల్లో—మధ్యధరా సముద్రంపై వీచే ప్రచండమైన పెనుగాలుల్లో—చిక్కుకుపోయింది. ఆ తుపాను ఎంత తీవ్రమైందంటే ఉదయంపూట సూర్యుడు కానీ రాత్రిపూట నక్షత్రాలు కానీ కనపడలేదు. ప్రయాణికులు భయంతో తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని ఉంటారన్న విషయం అర్థం చేసుకొనతగినదే. అయినప్పటికీ, స్వప్నంలో తనకు దైవికంగా బయల్పర్చబడిన విషయాన్ని వారికి తెలియజేస్తూ, పౌలు వారిని “ఓడకేగాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు” అని ఓదారుస్తాడు.—అపొస్తలుల కార్యములు 27:14, 20-22.

ఉద్ధృతమైన ఆ తుపాను వచ్చిన 14వ రోజు రాత్రి నావికులు నీళ్ళు కేవలం ఇరవై బారల లోతు మాత్రమే ఉన్నాయన్న ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలుసుకున్నారు.a మరికొంచెం దూరం ప్రయాణించిన తర్వాత వాళ్లు మరోసారి లోతును కొలుస్తారు. ఈసారి నీళ్ళు పదిహేను బారల లోతు ఉంది. తీరం దగ్గరపడుతోంది! అయితే, ఆ శుభవార్తలోనే ప్రమాద సూచన పొంచివుంది. అంతగా లోతులేని నీళ్ళలో ఓడ అటు ఇటు కొట్టుకొని పోతున్నప్పుడు, అది బండలకు గుద్దుకొని నాశనం అయిపోవచ్చు. తెలివిగా, ఆ నావికులు లంగరులు వేస్తారు. వారిలో కొంతమంది సముద్రంలో తమ అదృష్టాన్ని పరీక్షించదలచి ఓడలోనుండి పడవను దింపి దాంట్లో వెళ్ళి పోవాలని అనుకుంటారు.b కానీ పౌలు వారిని ఆపుచేస్తాడు. ఆ శతాధిపతితోనూ, సైనికులతోనూ, ఆయన “వీరు ఓడలో ఉంటేనేగాని మీరు తప్పించుకొనలేరు” అని చెప్తాడు. శతాధిపతి పౌలు మాటలను వింటాడు, ఇప్పుడు 276 మంది ప్రయాణికులు తెల్లవారడం కోసం ఆతురతతో ఎదురుచూస్తూ ఉంటారు.—అపొస్తలుల కార్యములు 27:27-32.

ఓడ బ్రద్దలైపోయింది

మరుసటి రోజు ఉదయం ఓడలోని ప్రయాణికులు దగ్గర్లో ఉన్న సముద్రపు పాయను చూశారు. తప్పించుకోవచ్చనే క్రొత్త ఆశతో నావికులు లంగరు త్రాళ్ళను కోసేసి, తెరచాపను పైకి ఎత్తారు. నిస్సందేహంగా ఆనందంతో కూడిన కేకల మధ్య ఓడ తీరం వైపుకు కదలనారంభిస్తుంది.—అపొస్తలుల కార్యములు 27:39, 40.

అయితే, అకస్మాత్తుగా ఓడ ఇసుక మెట్ట మీద కూరుకుపోతుంది. అంతకంటే ఘోరంగా ఉద్ధృతమైన అలలు అమరాన్ని ఢీకొని బద్దలుగొడుతున్నాయి. ఓడలోని ప్రయాణీకులందరూ ఓడను విడిచిపెట్టవలసి వస్తుంది! (అపొస్తలుల కార్యములు 27:41) కానీ ఇదొక సమస్యను సృష్టిస్తుంది. ఓడలోని వారంతా—పౌలుతో సహా—ఖైదీలు. రోమా చట్టం ప్రకారం, ఖైదీలను తప్పించుకొనేందుకు అనుమతించే సైనికుడు, ఆ ఖైదీలకు పడే శిక్షను అనుభవించడం తప్పనిసరి. ఉదాహరణకు, ఒక హంతకుడు తప్పించబడినట్లయితే, అశ్రద్ధ చూపిన సైనికుడు తన ప్రాణాన్ని మూల్యంగా చెల్లించాల్సివుంటుంది.

సైనికులు అలాంటి పర్యవసానాల గురించి భయపడి ఖైదీలనందరినీ చంపేయాలని నిశ్చయించుకుంటారు. అయినప్పటికీ, పౌలుతో స్నేహపూర్వకంగా ఉన్న ఆ శతాధిపతి అడ్డుపడతాడు. ఈదగల వారు సముద్రములోనికి దుమికి ఒడ్డుకు చేరుకొమ్మని ఆజ్ఞాపిస్తాడు. ఈదలేని వారు ఓడ పలకల మీదనూ, లేదా ఓడలోని ఇతర వస్తువులను ఉపయోగించి ఒడ్డుకు చేరుకోవాలని ఆజ్ఞాపించాడు. ఒకరి తర్వాత ఒకరు ప్రయాణీకులు బద్దలౌతున్న ఆ ఓడలో నుండి మెల్లగా తీరానికి చేరుకున్నారు. పౌలు మాటలు నిజమే ఎవరికీ ప్రాణహాని జరుగలేదు!—అపొస్తలుల కార్యములు 27:42-44.

మెలితేలో అద్భుతం

అలసిపోయిన ఈ మనుష్యులు మెలితే దీవిలో ఆశ్రయాన్ని కనుగొన్నారు. అక్కడి నివాసులు మాట్లాడేది గ్రీకు భాష కాదు. వాళ్ళు “అనాగరికులు”గా, అక్షరాలా “బర్బేరియన్‌లు”గా (గ్రీకులో వార్వరోస్‌) దృష్టించబడ్డారు.c కానీ మెలితీయులు క్రూరులు మాత్రం కాదు. దానికి విరుద్ధంగా, పౌలు యొక్క తోటి ప్రయాణసహచరుడైన లూకా, వారు “మాకు చేసిన ఉపచారమింతంతకాదు, వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పురాజబెట్టి మమ్మును అందరిని చేర్చుకొనిరి” అని తెలియజేస్తున్నాడు. పుల్లలు ఏరి మంటలో వేయడంలో మెలితే వాసులతో పౌలు కూడా చేరాడు.—అపొస్తలుల కార్యములు 28:1-3.

అకస్మాత్తుగా, ఒక సర్పము పౌలు చేతిని చుట్టుకుంటుంది! ఆ ద్వీపవాసులు పౌలు హంతకుడై ఉంటాడని అనుకుంటారు. మన శరీరంలోని ఏ భాగంతో పాపం చేస్తామో ఆ భాగంపై దాడి చేయడం ద్వారా దేవుడు పాపులను శిక్షిస్తాడని బహుశా వారు ఆలోచించివుండవచ్చు. కానీ చూడండి! ఆ నివాసులకు చాలా ఆశ్చర్యాన్ని కల్గిస్తూ పౌలు ఆ సర్పాన్ని మంటలో విదిలిస్తాడు. లూకా ప్రత్యక్ష్య సాక్ష్య కథనం ఇలా చెప్తుంది: “వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి.” తర్వాత ఆ ద్వీపవాసులు వారి మనస్సులను మార్చుకొని పౌలు దేవత అని చెప్పడం మొదలుపెట్టారు.—అపొస్తలుల కార్యములు 28:3-6.

పౌలు తర్వాతి మూడు నెలలు మెలితేలో గడిపి, ఆ సమయంలో, తనకు స్నేహభావంతో ఆతిథ్యమిచ్చిన ఆ ద్వీపానికి ముఖ్యుడైన పొప్లి తండ్రినీ, అక్కడ రోగంతో బాధపడుతున్న మరితరులనూ పౌలు స్వస్థపరిచాడు. అంతేకాక, ఆయన సత్యపు విత్తనాలను నాటాడు, ఫలితంగా ఆతిథ్యమిచ్చిన మెలితే నివాసులు అనేక ఆశీర్వాదాలు పొందారు.—అపొస్తలుల కార్యములు 28:7-11.

మన కోసం పాఠం

తన పరిచర్య కాలంలో, పౌలు చాలా సవాళ్ళను ఎదుర్కొన్నాడు. (2 కొరింథీయులు 11:23-27) పై వృత్తాంతంలో, సువార్త నిమిత్తమై ఆయన ఖైదీ అయ్యాడు. తర్వాత, అతి భయంకరమైన తుపాను దాని వెంటనే ఓడ బ్రద్దలవ్వడం లాంటి ఊహించని శోధనలకు గురికావలసి వచ్చింది. అయినా పౌలు సువార్తను బోధించే పనిలో ఉత్సాహంగా కొనసాగాలనే తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తన అనుభవం నుండి, “ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండియుండుటకును ఆకలిగొనియుండుటకును, సమృద్ధి కలిగియుండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొనియున్నాను. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను” అని ఆయన వ్రాస్తున్నాడు.—ఫిలిప్పీయులు 4:12, 13.

జీవిత సమస్యలు నిజదేవునికి ఉత్సాహకర పరిచారకులుగా ఉండాలన్న మన నిర్ణయాన్ని సడలించడానికి అనుమతించకూడదు! ఊహించని శోధన తలెత్తినప్పుడు మన భారాన్ని యెహోవా మీద మోపుదాం. (కీర్తన 55:22) అప్పుడు మనం పరీక్షను సహించడాన్ని ఆయన ఎలా సాధ్యం చేస్తాడో సహనంతో వేచి చూద్దాం. ఈ మధ్యలో, మన పట్ల ఆయన శ్రద్ధ వహిస్తున్నాడనే నమ్మకంతో ఆయన సేవలో విశ్వాసంతో కొనసాగుదాం. (1 కొరింథీయులు 10:13; 1 పేతురు 5:7) మనం కూడా పౌలు లాగే స్థిరంగా కొనసాగడం ద్వారా ఎలాంటి సమస్యలనైనా, ప్రతికూల పరిస్థితులనైనా అధిగమించవచ్చు.

[అధస్సూచీలు]

a ఒక బార సాధారణంగా నాలుగు క్యూబెట్లు లేదా ఆరు అడుగులు అని దృష్టించబడుతుంది.

b ఇక్కడ పడవ అని చెబుతున్నది, ఓడను తీరం దగ్గర లంగరు వేసినప్పుడు, ఒడ్డుకు చేరేందుకు ఉపయోగించే చిన్న పడవ. ఓడ ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఏమి చేయాలో ఏమీ తెలియని ఆ ప్రయాణికుల ప్రాణాల గురించి ఏమీ పట్టించుకోకుండా, ఆ నావికులు తమ ప్రాణాలను మాత్రం కాపాడుకోవడానికి ప్రయత్నించారనేందుకు ఋజువులు ఉన్నాయి.

c విల్‌ఫ్రెడ్‌ ఫంక్స్‌ యొక్క వోర్డ్‌ ఆరిజిన్స్‌ నివేదిస్తున్న ప్రకారం “గ్రీకులు తమ స్వంత భాషకాక మరే భాషనైనా ఏహ్యభావంతో చూస్తూ, ఆ భాష ‘వార్‌ వార్‌’ అన్నట్లుంటుందని అనేవారు, ఆ భాష మాట్లాడే వాళ్ళనెవరినైనా వార్వరోస్‌ అని పిలిచేవారు.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి