కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 9/8 పేజీ 12
  • ఈ మతాల దగ్గర సమాధానమున్నదా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఈ మతాల దగ్గర సమాధానమున్నదా?
  • తేజరిల్లు!—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • గర్భస్రావముల అపారసంఖ్య
    తేజరిల్లు!—1993
  • గర్భస్రావం గురించి బైబిలు ఏం చెప్తుంది?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • గర్భస్రావ సందిగ్ధావస్థ—ఆరు కోట్ల మరణాలు దీనికి పరిష్కారమా?
    తేజరిల్లు!—1993
తేజరిల్లు!—1993
g93 9/8 పేజీ 12

ఈ మతాల దగ్గర సమాధానమున్నదా?

గర్భస్రావాన్ని గూర్చిన నైతిక సందిగ్ధతలో, చాలామంది ఆత్మీయ గురువుల మార్గదర్శకం కొరకు ఎదురుచూస్తారు. వీరెలా ప్రతిస్పందిస్తారు?

గర్భం ధరించినప్పుడే జీవం ఆరంభమౌతుందని బోధిస్తూ, కెథోలిక్‌ చర్చి గర్భస్రావానికి వ్యతిరేకంగా దృఢమైన స్థానాన్ని తీసుకుంటున్నది. కొంతమంది మతగురువులు రాజకీయంగా తలదూర్చి, గర్భస్రావానికి అనుకూలంగా ఓటువేసే కెథోలిక్‌ రాజకీయవేత్తలను బహిష్కరించాలని పోప్‌కు పిలుపునిచ్చారు. అయినప్పటికి, చాలామంది కెథోలిక్కులు గర్భస్రావం యెడల మక్కువకల్గి, గర్భస్రావం చేయించుకునే స్వతంత్రంకొరకు వత్తిడి చేస్తున్నారు.

“గర్భస్రావం పాపమని బైబిలు బోధిస్తున్నదని 46శాతం పాదిరీలు విశ్వసించడం లేదని” ప్రెస్బిటేరియన్‌ చర్చి (అమెరికా) నివేదిస్తున్నది. ఈ చర్చి నాయకులు గర్భస్రావానికి అనుకూలంగా వున్నారు.

అమెరికాలో యునైటెడ్‌ చర్చ్‌ ఆఫ్‌ క్రైస్ట్‌ 16వ సెనెడ్‌ సాధారణ సమావేశం తీర్మానించినదేమనగా ‘యోగ్యమైన కుటుంబ నియంత్రణా సేవలు పొందడానికి, న్యాయబద్ధంగా సురక్షిత గర్భస్రావాన్ని ఎంచుకోడానికి స్త్రీలకు, పురుషులకు ఉన్న హక్కును మేము ఆమోదిస్తున్నాము.’

గర్భస్రావమనేది “కేవలం చివరి గడియలలో నైతికంగా ఎన్నుకోవలసిన ఎంపిక మాత్రమేనని” ది ఇవాంజెలికల్‌ లూథరన్‌ చర్చ్‌ పాలసీ వివరిస్తున్నది; అయినను ఇది గర్భస్రావం “పాపము” అని పిలుచుటకు లేదా “గర్భం ధరించినప్పుడే జీవం ఆరంభమౌతుందని” చెప్పుటకు నిరాకరించింది.

సదరన్‌ బాప్టిస్ట్‌ కన్వెన్షన్‌ అను మతసంస్థ గర్భస్రావాన్ని దృఢంగా వ్యతిరేకిస్తున్నది. కాని అమెరికన్‌ బాప్టిస్ట్‌ చర్చ్‌ యిలా వివరిస్తున్నది: “గర్భస్రావాన్ని గూర్చి చర్చియొక్క సరియైన తీర్మాన విషయంలో ప్రభుత్వానికి చెప్పుటకు మాలో భిన్నాభిప్రాయముంది. ఫలితంగా, మేము ప్రతివ్యక్తి అతని లేదా ఆమె విశ్వాసాలు ప్రతిబింబించేవిధంగా గర్భస్రావం యెడల వారి అభిప్రాయాన్ని వ్యక్తపరచుటకు స్వతంత్రం కల్గియున్నారని అంగీకరిస్తున్నాము.”

రిఫార్మ్‌, కన్సెర్వేటివ్‌ యూదులు చాలామట్టుకు గర్భస్రావాన్ని ఆమోదిస్తుండగా, యూదామతం ఈవిషయంలో ఐక్యంగాలేదు, ఆర్థొడాక్స్‌ శాఖ చాలామట్టుకు గర్భస్రావానికి వ్యతిరేకంగా వున్నది.

జీవం ఆరంభమైన మొదటి 40రోజులలోపు ఏకారణం చేతనైనా గర్భస్రావం చేయించుకోడానికి ఇస్లాం అనుమతిస్తున్నది, కాని తల్లి జీవితం ప్రమాదమైతే మాత్రమే ఆతర్వాతకూడ గర్భస్రావం చేయించుకోవచ్చును. హాడిత్‌ చెబుతున్నదేమనగా శిశువు “నలభై రోజులపాటు బీజరూపంలో ఉంటాడు, ఆతర్వాత దాదాపు అంతేకాలం రక్తపుగడ్డలా వుంటాడు, ఆతర్వాత అంతేకాలం మాంసపుముద్దలా వుంటాడు, ఆతర్వాత . . . అతనిలో జీవాయువు ఊదడానికి దేవదూత అతనిదగ్గరకు పంపబడుతుంది.”

షింటోయిజమ్‌ ఎటూ చెప్పడం లేదు. అది గర్భస్రావాన్ని వ్యక్తిగత నిర్ణయంపైనే వదలివేస్తున్నది.

హిందువులు, బౌద్ధులు, సిక్కులు జీవాన్ని గౌరవించాలని బోధిస్తారు. కాని వారు పునర్జన్మను నమ్ముతారు కాబట్టి, గర్భస్రావ వివాదం మీద వాదంలో కలహించరు; గర్భస్రావం కేవలం జన్మించని బిడ్డను మరొక జీవంలోకి మాత్రమే పంపుతుంది. (g93 5/22)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి