కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 3/1 పేజీలు 3-4
  • సవతి కుటుంబాలలో ఉండే ప్రత్యేకమైన సమస్యలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సవతి కుటుంబాలలో ఉండే ప్రత్యేకమైన సమస్యలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పిల్లల పెంపకంలో సమస్యలు
  • సవతి కుటుంబాలు విజయవంతం కాగలవు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • సవతి తలిదండ్రులకు సహాయపడే సమాచారం
    తేజరిల్లు!—1993
  • మీ గృహంలో శాంతిని కాపాడుకోండి
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
  • మీ యింటివారి రక్షణకొరకు కష్టించి పనిచేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 3/1 పేజీలు 3-4

సవతి కుటుంబాలలో ఉండే ప్రత్యేకమైన సమస్యలు

సంతోషకరమైన సవతి కుటుంబాలు సాధ్యమే! ఎలా?

ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో, సవతి కుటుంబాలు సర్వసాధారణమయ్యాయి. అయినప్పటికీ, సవతి కుటుంబాలకు ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి. అత్యంత సవాలుదాయకమైన విషయం, పిల్లల పెంపకమే. అయినప్పటికీ, సవతి కుటుంబ వాతావరణంలో సహితం పిల్లలను విజయవంతంగా పెంచడం సాధ్యమేనని చూపించడానికి ఈ క్రిందనున్న రెండు శీర్షికలు ప్రయత్నిస్తాయి.

పారంపర్యంగా సవతి తల్లులపై సవతి తండ్రులపై, ఒక దురభిప్రాయం ఉంటుంది. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, క్రూరురాలైన తన సవతి తల్లి చేతుల్లో అష్టకష్టాలు అనుభవించిన సిన్‌డ్రిల్లా కథను ఏదొక రూపంలో మనలో అనేకులం వినే ఉంటాం. ఐరోపా ఖండంలోని పిల్లలకి స్నో వైట్‌ అండ్‌ ద సెవన్‌ డ్వోర్ఫ్స్‌ అనే కథ తెలుసు. స్నో వైట్‌ సవతి తల్లి దుష్ట మాంత్రికురాలిగా మారుతుంది.

సవతి కుటుంబాల గురించిన ఖచ్చితమైన దృక్కోణాన్ని అలాంటి కల్పితకథలు అందిస్తాయా? సవతి తల్లిదండ్రులందరూ నిజంగా అంత క్రూరులా? కారు. వారిలో అనేకమంది వివాహం ద్వారా తమకు లభించిన పిల్లలకు శ్రేష్ఠమైనదేదో దాన్నే చేయాలని అనుకుంటారు. కాని సవతి కుటుంబ జీవితంలో ఉండే కొన్ని క్లిష్టమైన సమస్యలను వారు ఎదుర్కోవలసి ఉంటుంది.

పిల్లల పెంపకంలో సమస్యలు

మొదటి వివాహం విఫలమయ్యిందంటే దానికి కారణం తరచు వైవాహిక జంటలో పరిణితి లేకపోవడమే. పునర్వివాహంలో, పిల్లలతో వ్యవహరించడం వైవాహిక సంబంధాన్ని దెబ్బతీయవచ్చు. వివాహం చేసుకున్న మొదటి ఐదేళ్లలో ప్రతీ పది సవతి కుటుంబాలలో నాలుగుకన్నా ఎక్కువ విడాకులతో ముగిసిపోతున్నాయని కొన్ని రికార్డులు చూపిస్తున్నాయి.

క్రొత్తగా పునర్వివాహం చేసుకున్నవాళ్లు, సవతి పిల్లల్లో సవతి తల్లి/తండ్రి రాక పుట్టించే భావోద్రేక సంక్షోభాన్నీ, యథార్థతను చూపించడం విషయంలో జరిగే సంఘర్షణనూ, అసూయాభావాన్నీ, ఆగ్రహాన్నీ గుర్తించకపోవచ్చు. తమ సవతి తల్లి/తండ్రి చూపించే ప్రేమ కన్నా తమ సొంత తల్లి/తండ్రి చూపించే ప్రేమే మిన్నయైనదని బహుశ వాళ్లు భావించవచ్చు. అంతేకాక, తనను వదిలేసిన భర్తకూ, తన పిల్లలకూ మధ్య ఇంకా కొనసాగుతున్న అనుబంధాన్ని అర్థంచేసుకోవడం, వదిలి పెట్టబడిన ఆ భార్యకు కష్టంకావచ్చు. ఒక అబ్బాయి తన కన్నతండ్రితో తనకున్న మంచి సంబంధం గురించి వివరించడానికి ప్రయత్నించాడు. “అమ్మా, నాన్న నిన్ను సరిగా చూడలేదని నాకు తెలుసు, కానీ నేనంటే ఆయనకు ఇష్టమే కదా!” అలాంటి మాటలు నిజాయితీతో కూడినవే అయినప్పటికీ, పిల్లవాని తండ్రిమీద ఆ తల్లికి చెప్పలేనంత కోపం పుట్టుకొచ్చేలా చేయగలవు.

ఒక సవతి తండ్రి ఇలా ఒప్పుకున్నాడు: “నా సవతి పిల్లల పెంపకంలో తలెత్తే సమస్యలను ఎదుర్కోవడానికి నేను నిజంగా సంసిద్ధుడినై ఉండలేదు. ఇప్పుడు వాళ్ళ అమ్మని నేను పెళ్ళి చేసుకున్నాను గనుక నేను వాళ్ళ తండ్రిని అన్న ఆలోచనలోనే ఉండిపోయాను, మొదట నాకు అంత కష్టంగా ఉన్నట్టు అన్పించలేదు! పిల్లలకి వారి కన్నతండ్రి మీదున్న ప్రేమను నేను అర్థంచేసుకోలేక పోయాను, నేను ఎన్నో పొరపాట్లు చేశాను.”

ఒత్తిళ్లు తలెత్తగలవు, మరి ముఖ్యంగా క్రమశిక్షణ విషయానికి వచ్చేటప్పటికి. పిల్లలకి ప్రేమతో కూడిన క్రమశిక్షణ అవసరం, కానీ తరచూ వారు క్రమశిక్షణకు ఎదురు తిరుగుతారు, అంతెందుకు వారి కన్నతల్లి ఇచ్చే శిక్షణను సహితం తృణీకరిస్తారు. సవతి తల్లి/తండ్రి నుండి పొందే క్రమశిక్షణను అంగీకరించాలంటే ఇంకెంత కష్టం ! సర్వసాధారణంగా, సవతి తండ్రి క్రమశిక్షణను ఇస్తే, ఆ సవతి కొడుకు ఇలా చెప్పవచ్చు, “నువ్వు మా సొంత నాన్నవేం కాదు!” సదుద్దేశంతో క్రమశిక్షణను ఇచ్చే సవతి తండ్రికి అలాంటి మాటలు ఎంత బాధను కల్గిస్తాయోకదా!

సవతి కుటుంబాలలో పిల్లలను విజయవంతంగా పెంచవచ్చా? విజయవంతమైన సవతి కుటుంబాన్ని కట్టడానికి సవతి తల్లిదండ్రులు ఒక అనుకూలమైన పాత్రను నిర్వహించగలరా? సవతి కుటుంబ సభ్యులందరూ దేవుని ప్రేరేపిత వాక్యమైన బైబిలు సలహాను పాటించినట్లయితే ఆ రెండు ప్రశ్నలకు సమాధానం అవుననేదే.

[3వ పేజీలోని చిత్రం]

“నువ్వు మా సొంత నాన్నవేం కాదు!”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి