కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 2/1 పేజీ 24
  • ఒంటరిగావున్న చిన్న ద్వీపం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఒంటరిగావున్న చిన్న ద్వీపం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 2/1 పేజీ 24

ఒంటరిగావున్న చిన్న ద్వీపం

సెయింట్‌ హలీన ద్వీపాన్ని వర్ణించేందుకు “ఒంటరిది,” “చిన్నది” అనే విశేషణాలు చాలా తరచూ ఉపయోగించబడ్డాయి. ఈ దీవికి ఈ విశేషణాలను ఉపయోగించడం సముచితమే. ఎందుకంటే, ఈ దీవి కేవలం 17 కిలోమీటర్ల పొడవూ, 10 కిలోమీటర్ల వెడల్పూ ఉంటుంది. దానికి అన్నింటికన్నా సమీపంలో ఉండే ఆగ్నేయ ఆఫ్రికా తీరానికి అది 1,950 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 1815లో, పరాజితుడైన నెపోలియన్‌ బోనాపార్ట్‌ తన శేషజీవితాన్ని గడిపేందుకు ద్వీపాంతరవాసిగా ఇక్కడికే పంపించబడ్డాడు.

సముద్రం మీది నుండి చూస్తే, ఈ దీవి దుర్భేద్యమైన కోటగా కనిపిస్తుంది. నిజానికి ఇది ఒక నిర్జీవ అగ్నిపర్వతం. ఇది అట్లాంటిక్‌ మహా సముద్రం మీద నిటారుగా ఉంటుంది. దీని శిఖరాగ్రాలు 500 నుండి 700 మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి. దీని మధ్యభాగంలో ఉండే మౌంట్‌ అక్టీయన్‌ 818 మీటర్ల ఎత్తులో ఉండి, దీవి అంతటిలో బాగా ఎత్తుగా కనిపిస్తుంది. దక్షిణ అట్లాంటిక్‌ సముద్రపు చల్లని వ్యాపారపవనాల వల్లా, సముద్ర ప్రవాహం వల్లా, ఈ దీవి సాధారణంగా సమశీతోష్ణంగా ఉంటుంది. ఇక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. లోతులేని సముద్ర తీరం నుండి పర్వత ప్రాంతాల వరకు లోపలికి వెళ్తున్న కొలది, వివిధ వాతావరణ పరిస్థితులూ, వివిధ రకాల వృక్షాలూ ఈ దీవిలో కనిపిస్తాయి.

సెయింట్‌ హలీన 17వ శతాబ్దపు చివరి భాగం నుండి బ్రిటీష్‌ అధీనంలో ఉంటోంది. ఇక్కడి జనాభా చాలా తక్కువ—దాదాపు 5,000 మంది. ఇక్కడిది మిశ్రిత జనాభా—యూరోపియన్లు, ఆసియా దేశస్థులూ, ఆఫ్రికానుండి వచ్చినవాళ్ళూ ఉన్నారు. ఈ దీవిలో అన్నిచోట్లా ఇంగ్లీష్‌ మాట్లాడుతారు. కాకపోతే ఉచ్చారణ మాత్రం వేర్వేరుగా ఉంటుంది. ఇక్కడ ఏర్‌పోర్ట్‌ లేదు; బయటి ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోవడం సముద్ర మార్గాన మాత్రమే సాధ్యమౌతుంది. ఇక్కడి నుండి దక్షిణ ఆఫ్రికాకూ, ఇంగ్లండ్‌కూ రెగులర్‌గా ట్రిప్పులున్నాయి. వాస్తవానికి, సాటిలైట్‌ కనెక్షన్‌ సహాయంతో ఇక్కడ టెలివిజన్‌ ప్రసారం లభ్యమయ్యింది 1990ల మధ్యకాలంలోనే.

దేవుని రాజ్య సువార్త మొదటిసారిగా 1930ల తొలిభాగంలో ఈ దీవికి చేరుకుంది. (మత్తయి 24:14) సంవత్సరాలుగా, అనేక ద్వీపవాసులు సువార్త అనే ఈ నిక్షేపంపై పట్టు సాధించారు. ఈ నిక్షేపం ముందు వస్తుసంపద వెలవెలపోతుంది. (మత్తయి 6:19, 20) నేడు సాక్షుల సంఖ్యను జనాభాతో పోల్చి చెబితే ఇక్కడ ప్రతి 31 మంది వ్యక్తులకు ఒక సాక్షి చొప్పున ఉన్నారు. ఇంతటి నిష్పత్తి సెయింట్‌ హలీనలోనే కనిపిస్తుంది. ప్రపంచమంతటిలో ఇక్కడిది మంచి నిష్పత్తి!

[24వ పేజీలోని చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

సెయింట్‌ హలీన

జేమ్స్‌టౌన్‌

లెవెల్‌వుడ్‌

ఆఫ్రికా

అట్లాంటిక్‌ మహాసముద్రం

సెయింట్‌ హలీన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి