కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 10/1 పేజీలు 4-6
  • సత్యముతో దేవుడ్ని ఆరాధించడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సత్యముతో దేవుడ్ని ఆరాధించడం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సత్యాన్ని గూర్చిన జ్ఞానం భయాన్ని పోగొడుతుంది
  • ఎందుకంత భిన్నం?
  • ‘యెహోవాయందు విశ్వాసముంచే’ యౌవనస్థులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • యెహోవాసాక్షులు నిజమైన క్రైస్తవులా?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • క్రైస్తవులు ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • ‘సత్యంలో నడుస్తూ ఉండండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 10/1 పేజీలు 4-6

సత్యముతో దేవుడ్ని ఆరాధించడం

ఆరాధన దేవునికి అంగీకారమైనదిగా ఉండాలంటే అది సత్యముపై ఆధారపడి ఉండాలి. (యోహాను 4:23) సత్యారాధకులు “జీవముగల దేవుని సంఘము”కు చెందినవారని బైబిలు గుర్తిస్తుంది, “ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై యున్నది.” (1 తిమోతి 3:15) దేవుని సంఘంగా రూపొందించబడినవారు దేవుని వాక్య సత్యాన్ని నమ్మడమేగాక, దానికి అనుగుణ్యంగా జీవిస్తూ, దానికి మద్దతునిస్తూ, దాన్ని భూమియందంతటా వ్యాప్తిచేస్తారు.—మత్తయి 24:14; రోమీయులు 10:9-15.

యెహోవాసాక్షులు తమ బైబిలు విద్యా కార్యక్రమాన్ని బట్టి అందరికీ సుపరిచితులే, ఆ పని ఇప్పుడు 200 కంటే ఎక్కువ దేశాల్లో కొనసాగించబడుతోంది. వాళ్లు బైబిలును పఠించి, మానవ తత్వాల ప్రభావంతో దాన్ని బలహీనపర్చకుండా, సత్యంగా దాన్ని బోధిస్తారు. వారి బైబిలు ఆధారిత బోధలతో మీకు పరిచయం ఉందా? యెహోవాసాక్షులను గురించి అంతటా ప్రచారమౌతున్న ప్రతికూలమైన సమాచారాన్ని బట్టి అనేకులు వారు చెప్పేది వినడానికి సంకోచిస్తారు. కాని సాక్షులు ప్రకటిస్తున్నది సత్యమో కాదో తమకు తాముగా నిర్ణయించుకోమని యథార్థ హృదయులైన ప్రజలు ఆహ్వానింపబడుతున్నారు. అలాంటి ప్రాముఖ్యమైన నిర్ణయం ఇతరులు చెప్పేదానిపై ఆధారపడి ఉండకూడదు. యెహోవాసాక్షుల బోధలను వ్యక్తిగతంగా పరిశీలించినవారు ఎంతో ప్రయోజనాన్ని పొందారు.

సత్యాన్ని గూర్చిన జ్ఞానం భయాన్ని పోగొడుతుంది

ఉదాహరణకు ఏయుకేన్యా విషయాన్ని పరిశీలించండి. ఆమె నిష్ఠగల క్యాథలిక్‌ కుటుంబంలో పెరిగింది. 1979లో పోపు మెక్సికో సందర్శనానికి ఏర్పాట్లు చేసినవారిలో ఆమె తండ్రి ఒకరు. స్నేహితుల దగ్గరికి వెళ్లినప్పుడు ఏయుకేన్యా యెహోవాసాక్షులను కలిసింది. వారి సహాయంతో ఆమె బైబిలు చెబుతున్నదాన్ని మరింత జాగ్రత్తగా పరిశీలించనారంభించింది. ఆమె ఇలా జ్ఞాపకం తెచ్చుకుంటోంది: “మొదట్లో భయం ఆవహించింది. నేను సత్యాన్ని కనుగొన్నాను! కాని దానితో, నాకు ముందున్న నమ్మకాల్లో ఎక్కువ భాగం తప్పేనని తెలిసింది. నా కుటుంబం, నా స్నేహితులు, నేను ప్రేమించినవారు—వాళ్లందరి నమ్మకాలు తప్పే. నేను కంగారు పడిపోయాను. నేను క్రొత్తగా కనుగొన్నదానికి నా కుటుంబం ఎలా ప్రతిస్పందిస్తుందా అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉండేదాన్ని. సమయం గడుస్తుండగా నేను యెహోవా సహాయంతో ఈ గొప్ప అనుభవానికి సర్దుకోగలిగాను. ఒకరోజు, మా కుటుంబ స్నేహితుడైన ఒక తత్వశాస్త్ర ప్రొఫెసర్‌తో ఈ విషయాలన్నీ మాట్లాడాలని నేను నిర్ణయించుకున్నాను. సత్యాన్ని తెలుసుకోవాలని నాకున్న కోరిక గురించి నేను ఆయనకు చెప్పాను. ఆయనిలా అన్నాడు, ‘నీకు సత్యం తెలుసుకోవాలని ఉంటే యెహోవాసాక్షుల కోసం వెదుకు.’

ఏయుకేన్యా భయపడినట్లుగానే, ఆమె కుటుంబం ఆమెను ఇంట్లోనుండి గెంటేసింది. అయితే, సాక్షులు ఆమెకు ఆధ్యాత్మిక సహాయాన్ని ఇవ్వడం కొనసాగించారు. ఆమె ఇలా వ్యాఖ్యానిస్తోంది: “సత్యం పక్షం వహించేలా నేను బలపర్చబడ్డాను. నిజంగా అది పోరాడదగినదని నేను గుర్తించాను. యెహోవాసాక్షుల నుండి నేను పొందిన ఆదరణ చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ సంఘంలో నేను ఎంతో ప్రేమను పొందాను. దేవుని సంస్థకు సన్నిహితమవ్వడం, ఒంటరిగా సత్యం పక్షం వహించాలనే భయాన్ని అధిగమించడానికి నాకు సహాయం చేసింది.”

మరో ఉదాహరణను పరిశీలించండి. కుటుంబమంతా కలిసి బైబిలు గురించి క్రమంగా చర్చించుకోవడం సబ్రీనా వాళ్ల ఇంట్లో వాడుకగా జరిగేది. వాస్తవానికి, వాళ్లు ఒక విధమైన ‘కుటుంబ మతాన్ని’ పెంపొందించుకున్నారు. ఆమె వేర్వేరు మతాలకు చెందిన సభ్యులతో సహవసించడాన్ని ఒక అలవాటుగా చేసుకుంది, అలా వాళ్ల మతంలోని లోపాల్ని ఎత్తి చూపించేది. యెహోవాసాక్షుల్లో ఒకరు ఆమెకు బైబిలు పఠనం గురించి చెప్పినప్పుడు, వారి నమ్మకాలను కూడా తప్పని నిరూపించవచ్చనే ఉద్దేశంతో వెంటనే బైబిలు పఠనానికి ఒప్పుకుంది. ఆమె ఇలా జ్ఞాపకం చేసుకుంటోంది: “ఒక సంవత్సరంకంటే ఎక్కువ కాలంపాటు పఠించిన తర్వాత, నేను ‘నా సత్యాన్ని’ కోల్పోతానేమోనని భయపడ్డాను. నేను ఏ యే మతాల్లో నిమగ్నమై ఉండేదాన్నో ఆ మతాల లోపాలను బయటపెట్టడం నాకు సులభంగా ఉండేది, కాని ఈసారి మాత్రం అంత సులభంగా లేదు.”

సబ్రీనా భయం, యెహోవాసాక్షులతో ఆమె తన బైబిలు పఠనాన్ని నిలిపివేసేలా చేసింది. కాని ఆమె ఆధ్యాత్మికంగా శూన్యత ఏర్పడినట్లు భావించింది. ఆమె పఠనాన్ని పునఃప్రారంభించడానికి నిర్ణయించుకుని, క్రొత్తగా కనుగొన్న ఈ సత్యాన్ని చివరికి అంగీకరించింది. తాను నేర్చుకుంటున్నది ఇతరులతో పంచుకోవాలని కోరుకునేంతగా సబ్రీనా అభివృద్ధి సాధించింది. సాక్షులతో పాటు ఇంటింటి పరిచర్యకు వస్తానని కూడా విజ్ఞప్తి చేసింది. సబ్రీనా ఇలా వివరిస్తోంది: “యెహోవాసాక్షులతోపాటు ప్రకటించేందుకు అనుమతి పొందడానికి ముందు నన్ను ఇలా అడగడం జరిగింది: ‘యెహోవాసాక్షుల్లో ఒకరై ఉండాలని మీరు నిజంగా కోరుకుంటున్నారా?’ ‘లేదు!’ అని నేను సమాధానమిచ్చాను. మళ్లీ నాకు భయమేసింది.” చివరికి, కూటాలన్నిటికీ హాజరవ్వడం కొనసాగిస్తూ, దేవుని ప్రజలు ఎలా బైబిలు సూత్రాలను అన్వయించుకుంటున్నారన్నది గమనించిన తర్వాత, సబ్రీనా నిజంగా ఇదే సత్యమనే ముగింపుకు వచ్చింది.

ఎందుకంత భిన్నం?

‘యెహోవాసాక్షుల బోధలు ఇతర మతాల బోధల నుండి ఎందుకంత భిన్నంగా ఉంటాయి?’ అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. సాక్షులు విశ్వసిస్తున్న వాటిని క్లుప్తంగా పరిశీలించడం, వారు యథార్థవంతులైన క్రైస్తవులనీ, మనస్సాక్షిగల బైబిలు విద్యార్థులనీ తెలుసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. వారి ప్రాథమిక నమ్మకాలను గూర్చిన సమీక్షలోని లేఖనాలను మీ స్వంత బైబిలులో చూసుకోమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము.

యెహోవాసాక్షులు ఏమి నమ్ముతారు, బైబిలు బోధిస్తున్నదాన్ని వాళ్లు ఎలా అంటిపెట్టుకుని ఉంటారు అనే విషయాలను మీరు జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా, సత్యము అనుగ్రహించే స్వాతంత్ర్యంతో మీరు ఆశీర్వదించబడతారు. (యోహాను 17:17) సత్యం గురించి భయపడవలసిన అవసరం లేదు. యేసు చేసిన ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం ఉంచుకోండి: “మీరు . . . సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయు[ను.]”—యోహాను 8:31, 32.

[6వ పేజీలోని బాక్సు]

యెహోవాసాక్షుల కొన్ని ప్రాథమిక నమ్మకాలు

◯ యెహోవాయే సర్వశక్తిమంతుడైన దేవుడు. బైబిలు యొక్క తొలి వ్రాతప్రతుల్లో ఆయన వ్యక్తిగత నామం 7,000 కంటే ఎక్కువసార్లు కనిపిస్తుంది.—కీర్తన 83:18.

◯ యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన మానవజాతి కోసం తన జీవాన్ని ఇచ్చేందుకు భూమి మీదికి వచ్చాడు. (యోహాను 3:16, 17) యెహోవాసాక్షులు, సువార్తలలో కనుగొనబడినట్లుగా యేసుక్రీస్తు బోధలను అనుసరిస్తారు.

◯ యెహోవాసాక్షులు అనే పేరు, “మీరు . . . నాకు సాక్షులు . . . ఇదే యెహోవా వాక్కు” అని చెబుతున్న యెషయా 43:10 మీద ఆధారపడి ఉంది.

◯ “పరలోక ప్రార్థన”లో ప్రజలు ఏ రాజ్యం గురించైతే ప్రార్థిస్తారో ఆ పరలోక ప్రభుత్వం, బైబిలు వాగ్దానం చేస్తున్న పరదైసుకు మార్గం సుగమం చేస్తూ ఈ ప్రపంచంలో ఉన్న బాధా వేదననంతటినీ త్వరలోనే తీసేస్తుంది.—యెషయా 9:6, 7; దానియేలు 2:44; మత్తయి 6:9, 10; ప్రకటన 21:3, 4.

◯ దేవుని చిత్తాన్ని చేసే ప్రతి ఒక్కరికీ, రాజ్య ఆశీర్వాదాలను నిరంతరం పొందే అవకాశం ఉంది.—యోహాను 17:3; 1 యోహాను 2:17.

◯ బైబిలు చెబుతున్నదాని ప్రకారం క్రైస్తవులు తమ ప్రవర్తనను మలుచుకోవాలి. వాళ్లు నిజాయితీగా ఉండడానికీ, నైతికంగా పరిశుభ్రమైన జీవితాన్ని గడపడానికీ, తమ పొరుగువారి పట్ల ప్రేమ చూపించడానికీ కృషి చేయాలి.—మత్తయి 22:39; యోహాను 13:35; 1 కొరింథీయులు 6:9, 10.

[5వ పేజీలోని చిత్రం]

యెహోవాసాక్షులు 200 కంటే ఎక్కువ దేశాల్లో ప్రజలకు బైబిలు సత్యాన్ని తెలియజేస్తున్నారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి