కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 9/15 పేజీలు 15-20
  • “మిగుల ఆశతో తేరిచూచుచు” వేచివుండడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “మిగుల ఆశతో తేరిచూచుచు” వేచివుండడం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్రీస్తు ప్రత్యక్షతా కాలంలో మెలకువగా ఉండడం
  • యేసుక్రీస్తు ఎందుకు వస్తాడు?
  • క్రీస్తు బయల్పర్చబడడం కోసం ఆతురతతో వేచి ఉండడం
  • “సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది”
  • యెహోవా దీర్ఘశాంతాన్ని వహించడమంటే రక్షణయని అర్థం
  • ఓపికతో కనిపెట్టండి
  • మన నిరీక్షణను బట్టి ఆనందిద్దాం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • కనిపెట్టుకొని ఉండండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • నేడు మన చురుకైన నాయకుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • ప్రతి ఒక్కరూ స్వతంత్రులుగా ఉంటారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 9/15 పేజీలు 15-20

“మిగుల ఆశతో తేరిచూచుచు” వేచివుండడం

“దేవుని కుమారుల ప్రత్యక్షతకొరకు [“బయల్పర్చబడడానికి,” NW] సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది.”—రోమీయులు 8:19.

1. నేటి క్రైస్తవుల పరిస్థితికీ, మొదటి శతాబ్దపు క్రైస్తవుల పరిస్థితికీ మధ్య ఏ సామ్యం ఉంది?

నేటి క్రైస్తవుల పరిస్థితి మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల పరిస్థితిని పోలివుంది. మెస్సీయా ఎప్పుడు కనిపిస్తాడో గుర్తించేందుకు ఆ కాలంలోని యెహోవా సేవకులకు ఓ ప్రవచనం సహాయపడింది. (దానియేలు 9:24-26) అదే ప్రవచనం యెరూషలేము నాశనాన్ని గురించి ప్రవచించిందిగానీ, ఆ నగరమెప్పుడు నాశనమౌతుందో ముందుగా తెలుసుకునేలా క్రైస్తవుల్ని సంసిద్ధుల్నిచేసే ఎటువంటి సంకేతాల్ని కల్గిలేదు. (దానియేలు 9:26బి, 27) అదే విధంగా ఒక ప్రవచనం, 19వ శతాబ్దపు యథార్థవంతులైన బైబిలు విద్యార్థులు కనిపెడుతూ ఉండడానికి దైవానుగ్రహం మూలంగా తెలిసింది. దానియేలు 4:25లో ఉన్న “ఏడు కాలములు”తో “అన్యజనముల కాలముల”ను ముడిపెట్టడం ద్వారా, వాళ్లు క్రీస్తు 1914లో రాజ్యాధికారాన్ని పొందుతాడని ఎదురుచూశారు. (లూకా 21:24; యెహెజ్కేలు 21:25-27) దానియేలు పుస్తకంలో అనేక ప్రవచనాలు ఉన్నప్పటికీ, సాతాను యావత్తు విధానమూ ఖచ్చితంగా ఎప్పుడు నాశనమౌతుందో లెక్కించేందుకు నేటి బైబిలు విద్యార్థులకు వాటిలో ఏదీ సహాయపడదు. (దానియేలు 2:31-44; 8:23-25; 11:36, 44, 45) అయినా, మనం “అంత్యకాలము”లో జీవిస్తున్నాం గనుక, ఇది త్వరలోనే సంభవిస్తుంది.—దానియేలు 12:4.a

క్రీస్తు ప్రత్యక్షతా కాలంలో మెలకువగా ఉండడం

2, 3. (ఎ) రాజ్యాధికారంతో కూడిన క్రీస్తు ప్రత్యక్షతా కాలంలో మనం జీవిస్తున్నామనే ప్రధానమైన రుజువునేది ఇస్తోంది? (బి) యేసుక్రీస్తు ప్రత్యక్షతా కాలంలో క్రైస్తవులు మెలకువగా ఉండాలని ఏది చూపించింది?

2 నిజమే, క్రీస్తు 1914లో రాజ్యాధికారాన్ని చేపట్టక ముందే క్రైస్తవులు కనిపెడుతూ ఉండేలా ఒక ప్రవచనం చేసింది. కానీ తన ప్రత్యక్షతకూ, విధానాంతానికీ క్రీస్తు ఇచ్చిన “సూచన,” సంఘటనలను ఎత్తి చూపించింది. ఈ సంఘటనలలో అనేకం ఆయన ప్రత్యక్షత ఆరంభమైన తర్వాత కన్పించాయి. అలాంటి సంఘటనలు అంటే యుద్ధాలూ, కరవులూ, భూకంపాలూ, తెగుళ్లూ, అక్రమము విస్తరించడమూ, క్రైస్తవుల్ని హింసించడమూ, ప్రపంచవ్యాప్తంగా రాజ్య సువార్త ప్రకటించబడడమూ వంటి సంఘటనలు, రాజ్యాధికారంతో కూడిన క్రీస్తు ప్రత్యక్షతా కాలంలో మనమిప్పుడు జీవిస్తున్నామనే దానికి ప్రధానమైన రుజువుగా పనిచేస్తున్నాయి.—మత్తయి 24:3-14; లూకా 21:10, 11.

3 అయినప్పటికీ, తన శిష్యులకు యేసు ఇచ్చిన వీడ్కోలు సలహా యొక్క యావత్‌ తాత్పర్యం ఏమిటంటే “జాగ్రత్తగా ఉండండి! ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి. . . . ఎప్పుడూ మెళుకువగా వుండండి!” (మార్కు 13:33, 37 పరిశుద్ధ బైబిల్‌ లివింగ్‌ బైబిల్స్‌ ఇండియా వారి; లూకా 21:36) మెలకువగా ఉండడానికి సంబంధించిన ఈ ఉద్భోధనల యొక్క సందర్భాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయడం, క్రీస్తు తన ప్రత్యక్షతారంభపు సూచన విషయంలో జాగరూకతతో ఉండమని మాత్రమే ప్రాథమికంగా మాట్లాడ్డంలేదని చూపిస్తాయి. బదులుగా, ఆయన తన ప్రత్యక్షతా కాలంలో మెలకువగా ఉండాలని తన నిజ శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. దేని కోసం నిజ క్రైస్తవులు మెలకువగా ఉండాలి?

4. యేసు ఇచ్చిన సూచన ఏ ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది?

4 “ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? [“సూచన ఏది,” పరిశుద్ధ బైబిల్‌]” అనే ప్రశ్నకు జవాబుగా యేసు గొప్ప ప్రవచనాన్ని తెలియజేశాడు. (మత్తయి 24:3) ప్రవచించబడిన సూచన, క్రీస్తు ప్రత్యక్షతను గుర్తించడం మాత్రమేగాక ప్రస్తుత దుష్ట విధానాంతానికి నడిపించే సంఘటనల్ని కూడా గుర్తించేలా పనిచేస్తుంది.

5. ఆధ్యాత్మికంగా ‘ప్రత్యక్షత’లో ఉన్నప్పటికీ, తానింకా ‘రానైవున్నాడని’ యేసు ఎలా చూపించుకున్నాడు?

5 తన ‘ప్రత్యక్షతా’ (గ్రీకు, పరౌసియా) కాలంలో తాను అధికారంతోనూ, మహిమతోనూ వస్తానని యేసు చూపించాడు. (ఎర్‌కోమయ్‌ అనే గ్రీకు పదరూపంచే సూచించబడిన) అలాంటి “రాకడ” లేదా “వచ్చుట”ను గురించి ఆయనిలా ప్రకటించాడు: “అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు. . . . అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపుకొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంత కాలము యంక సమీపముగా ఉన్నదని మీకు తెలియును. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన [క్రీస్తు] సమీపముననే, ద్వారముదగ్గరనే యున్నాడని తెలిసికొనుడి. . . . కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.” (ఇటాలిక్కులు మావి.)—మత్తయి 24:30, 32, 33, 42, 44.

యేసుక్రీస్తు ఎందుకు వస్తాడు?

6. “మహా బబులోను” నాశనం ఎలా జరుగుతుంది?

6 పందొమ్మిదివందల పద్నాలుగు నుండీ రాజుగా ప్రత్యక్షతలో ఉన్నప్పటికీ, యేసుక్రీస్తు తాను దుష్టులపై తీర్పును అమలుచేయడానికి ముందు వ్యవస్థలకూ, వ్యక్తులకూ తీర్పుతీర్చాల్సి ఉంది. (పోల్చండి 2 కొరింథీయులు 5:10.) ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన “మహా బబులోను”ను నాశనంచేసే ఆలోచనను రాజకీయ పాలకుల మనస్సుల్లో యెహోవా త్వరలోనే ఉంచుతాడు. (ప్రకటన 17:4, 5, 16, 17) యేసుక్రీస్తు “ధర్మవిరోధి”ని అంటే “మహా బబులోను”లో ప్రముఖ భాగమైన క్రైస్తవమత సామ్రాజ్యానికి చెందిన భ్రష్ట మతగురువుల తరగతిని నాశనం చేస్తాడని అపొస్తలుడైన పౌలు నిర్దిష్టంగా తెలియజేశాడు. పౌలు ఇలా రాశాడు: “ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటియూపిరిచేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును.”—2 థెస్సలొనీకయులు 2:3, 8.

7. మనుష్యకుమారుడు తన మహిమతో వచ్చినప్పుడు, ఆయన ఏ తీర్పును తీరుస్తాడు?

7 సమీప భవిష్యత్తులో, ఇంకను భూమిపై ఉన్న తన సహోదరులపట్ల జనాంగాలకు చెందిన ప్రజలెలా ప్రవర్తించారనే దానిపై ఆధారపడి యేసు వారికి తీర్పుతీరుస్తాడు. మనమిలా చదువుతాం: “తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతోకూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును. అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. . . . రాజు—మిక్కిలి అల్పులైన యూ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో [గొఱ్ఱెలతో] అనును. . . . వీరు [మేకలు] నిత్యశిక్షకును నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు.”—మత్తయి 25:31-46.

8. భక్తిహీనులపై తీర్పును అమలుచేయడానికి క్రీస్తు రావడాన్ని గురించి పౌలు ఏ విధంగా వర్ణించాడు?

8 గొఱ్ఱెలు, మేకలను గురించిన తన ఉపమానంలో చూపించినట్లుగా, యేసు భక్తిహీనులందరిపైనా తన అంతిమ తీర్పును అమలుచేస్తాడు. “ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతోకూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై [“బయల్పర్చబడి,” NW] దేవుని నెరుగని వారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని . . . శ్రమపొందుచున్న మీకు మాతోకూడ విశ్రాంతియు అనుగ్రహించు”నని పౌలు బాధలననుభవిస్తున్న తోటి విశ్వాసులకు నమ్మకాన్ని కలిగించాడు. పౌలు ఇంకా ఇలా అన్నాడు: “అట్టివారు ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమనుండియు పారదోలబడి నిత్యనాశనమను దండన పొందుదురు.” (2 థెస్సలొనీకయులు 1:7-10) మనముందున్న ఈ ఉత్తేజిత సంఘటనలన్నిటినిబట్టి, క్రీస్తు రాకడ కోసం విశ్వాసాన్ని అలవర్చుకుంటూ, ఆతురతతో మెలకువగా ఉండమా?

క్రీస్తు బయల్పర్చబడడం కోసం ఆతురతతో వేచి ఉండడం

9, 10. భూమిపై ఇప్పటికీ ఉన్న అభిషిక్తులు యేసుక్రీస్తు బయల్పర్చబడడం కోసం ఎందుకు ఆతురతతో కనిపెడుతున్నారు?

9 ‘ప్రభువైన యేసు . . . పరలోకంనుంచి వెల్లడి అవడం [బయల్పర్చబడడం],’ దుష్టులపైకి నాశనాన్ని మాత్రమేగాక నీతిమంతులకు ప్రతిఫలాన్ని కూడా తీసుకొస్తుంది. ఇప్పటికీ భూమిపై ఉన్న క్రీస్తు అభిషిక్త సహోదరులలో శేషించినవారు బహుశా క్రీస్తు బయల్పర్చబడే లోపల బాధల్ని ఇంకనూ అనుభవించాల్సి ఉన్నప్పటికీ, వాళ్లు తమ మహిమాయుక్తమైన పరలోక నిరీక్షణలో ఆనందిస్తున్నారు. అభిషిక్త క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై యున్నంతగా సంతోషించుడి.”—1 పేతురు 4:13.

10 క్రీస్తు తమను ‘తనతోపాటు ఉండేలా కూర్చుకొనేంత’ వరకు అభిషిక్త క్రైస్తవులందరూ నమ్మకస్థులుగా ఉండాలని నిశ్చయించుకున్నారు కాబట్టి వారి విశ్వాసము “పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు [“బయల్పర్చబడినప్పుడు,” NW] . . . మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.” (2 థెస్సలొనీకయులు 2:2; 1 పేతురు 1:7) అలాంటి విశ్వాసులైన ఆత్మజనిత క్రైస్తవులకు సంబంధించి, ఇలా చెప్పవచ్చు: “క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున . . . ఏ కృపావరమునందును లోపములేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత [“బయల్పర్చబడడం,” NW] కొరకు ఎదురుచూచుచున్నారు.”—1 కొరింథీయులు 1:5, 6, 7.

11. యేసుక్రీస్తు బయల్పర్చబడడాన్ని గురించి ఎదురుచూస్తూనే అభిషిక్త క్రైస్తవులు ఏమి చేస్తారు?

11 అభిషిక్త శేషం పౌలు భావించినట్టు భావిస్తున్నారు, ఆయనిలా రాశాడు: “మనయెడల ప్రత్యక్షము కాబోవు [“బయల్పర్చబడబోవు,” NW] మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను.” (రోమీయులు 8:18) వారి విశ్వాసానికి కాల గణనల ఆసరా అవసరంలేదు. వాళ్లు యెహోవా సేవలో బిజీగా ఉంటూ, తమ సహవాసులైన “వేరే గొఱ్ఱెలు” ఎదుట అద్భుతకరమైన మాదిరిని ఉంచుతున్నారు. (యోహాను 10:16) ఈ దుష్ట విధానాంతం సమీపించిందని ఆ అభిషిక్తులకు తెలుసు, మరి వాళ్లు పేతురు ఉద్బోధనను లక్ష్యపెట్టారు: “మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు [“బయల్పర్చబడినప్పుడు,” NW] మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి.”—1 పేతురు 1:13.

“సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది”

12, 13. మానవ సృష్టి ఏ విధంగా ‘వ్యర్థపర్చబడింది,’ వేరే గొఱ్ఱెలు దేనికోసం ఎదురుచూస్తున్నాయి?

12 ఆతురతతో కనిపెడుతూ జీవించడానికి, వేరే గొఱ్ఱెలకు కూడా ఎదురుచూడడానికి ఏదైనా ఉందా? ఖచ్చితంగా వాళ్లకు కూడా ఉంది. తన ఆత్మజనిత “కుమారులు”గా, పరలోక రాజ్యంలో “క్రీస్తుతోడి వారసు[లు]”గా యెహోవా దత్తత తీసుకొన్న వారి మహిమకరమైన నిరీక్షణను గురించి మాట్లాడిన తర్వాత, పౌలు ఇలా తెలియజేశాడు: “దేవుని కుమారుల ప్రత్యక్షతకొరకు [“బయల్పర్చబడడం కోసం,” NW] సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందునను నిరీక్షణకలదై, స్వేచ్ఛగా కాక దాని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచబడెను.”—రోమీయులు 8:14-21; 2 తిమోతి 2:10-12.

13 పాపియైన ఆదాము ద్వారా, పాప మరణాల దాస్యంలో జన్మించినవారిగా ఆయన సంతానమంతా ‘వ్యర్థపర్చబడింది.’ అలాంటి దాస్యంలో నుండి వాళ్లు తమను తాము విడుదల చేసుకోలేకపోయారు. (కీర్తన 49:7; రోమీయులు 5:12, 21) ఓహ్‌, ‘నాశనమునకు లోనయన దాస్యములో’ ఉన్న వేరే గొఱ్ఱెలు ‘విడుదల పొందాలని’ ఎంతగా అపేక్షిస్తున్నారో కదా! కానీ విడుదల జరగడానికి ముందు, యెహోవా కాలాలూ, రుతువులూ ప్రకారంగా కొన్ని విషయాలు తప్పక జరగాల్సివుంది.

14. ‘దేవుని కుమారులు బయల్పర్చబడడం’లో ఏం చేరివుంది, ‘వ్యర్థపర్చబడిన’ మానవజాతి ‘విడుదల పొందడానికి’ ఇదెలా కారణమౌతుంది?

14 అభిషిక్తులైన ‘దేవుని కుమారుల’ శేషం మొదటిగా ‘బయల్పర్చబడాలి.’ దీంట్లో ఏం చేరివుంది? దేవుని నిర్ణయిత కాలంలో, అభిషిక్తులు చివరకు ‘ముద్రించ’బడ్డారనీ, క్రీస్తుతోపాటు పరిపాలించేందుకు మహిమపర్చబడ్డారనీ వేరే గొఱ్ఱెలకు తేటతెల్లమౌతుంది. (ప్రకటన 7:2-4) సాతాను దుష్ట విధానాన్ని నాశనం చేయడంలో పునరుత్థానులైన “దేవుని కుమారులు” క్రీస్తుతో భాగంవహించినప్పుడు వాళ్లు ‘బయల్పర్చబడతారు.’ (ప్రకటన 2:26, 27; 19:14, 15) అటు తర్వాత, క్రీస్తు వెయ్యేండ్ల పాలనా కాలంలో, వాళ్లు యేసు విమోచన క్రయధన బలి ప్రయోజనాలను మానవ “సృష్టి”కి అన్వయింపచేసే యాజకసంబంధమైన మాధ్యమాలుగా ‘బయల్పర్చబడతారు.’ ఇది, ‘వ్యర్థపర్చబడిన’ మానవజాతి ‘విడుదల పొంది,’ చివరకు “దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము”లోనికి ప్రవేశించడానికి కారణమౌతుంది. (రోమీయులు 8:21; ప్రకటన 20:5; 22:1, 2) అలాంటి దివ్యమైన ఉత్తరాపేక్షలతో, వేరే గొఱ్ఱెలు ‘దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం [‘బయల్పర్చబడడం కోసం,’ NW] సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టివుండడంలో’ ఆశ్చర్యమేమైనా ఉందా?—రోమీయులు 8:19.

యెహోవా దీర్ఘశాంతాన్ని వహించడమంటే రక్షణయని అర్థం

15. సంఘటనల్ని గూర్చిన యెహోవా కాలం విషయంలో మనం దేన్ని ఎన్నడూ మర్చిపోకూడదు?

15 యెహోవా గొప్ప సమయపాలకుడు. సంఘటనలను గూర్చిన ఆయన కాలం పరిపూర్ణమైనదని రుజువౌతుంది. మనం వ్యక్తిగతంగా ఎదురుచూసిన రీతిలో సంఘటనలు ఎల్లప్పుడూ జరగకపోవొచ్చు. అయినా, దేవుని వాగ్దానాలన్నీ నెరవేరతాయనే సంపూర్ణ నమ్మకాన్ని మనం కల్గివుండొచ్చు. (యెహోషువ 23:14) అనేకమంది ఎదురుచూసిన దానికన్నా ఎక్కువ కాలమే సంఘటనలను ఆయన అనుమతించవచ్చు. కానీ ఆయన మార్గాల్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించి, ఆయన జ్ఞానాన్ని ప్రశంసిద్దాం. పౌలు ఇలా రాశాడు: “ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్యములు; ఆయన మార్గము లెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు?”—రోమీయులు 11:33, 34.

16. యెహోవా దీర్ఘశాంతాన్నుండి ప్రయోజనాన్ని పొందేందుకు ఎవరు నిలబడతారు?

16 పేతురు ఇలా రాశాడు: “ప్రియులారా, వీటికొరకు [పాత “ఆకాశములు,” పాత “భూమి” నాశనం కొరకూ, వాటి స్థానంలో రాబోయే దేవుడు వాగ్దానం చేసిన “కొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును”] మీరు కనిపెట్టువారు గనుక శాంతముగలవారై, ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను [“చివరకు,” NW] కనబడునట్లు జాగ్రత్త పడుడి [“సాధ్యమైనంతమేరకు ప్రయత్నింపుడి,” పవిత్ర గ్రంథము క్యాతలిక్‌ అనువాదము]. మరియు మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి.” యెహోవా దీర్ఘశాంతం మూలంగానే, “దొంగవచ్చినట్లు”గా అనుకొనని గడియలో రాబోయే “యెహోవా దినము” నుండి రక్షించబడేందుకు కోట్లాదిమందికి అవకాశం ఇవ్వబడింది. (2 పేతురు 3:9-15) ఆయన దీర్ఘశాంతం, ‘భయముతోను వణకుతోను మన సొంతరక్షణను కొనసాగించ’డానికి మనలో ప్రతిఒక్కరికీ అవకాశాన్ని ఇస్తోంది కూడా. (ఫిలిప్పీయులు 2:12) “మనుష్యకుమారుడు” తీర్పుతీర్చడానికి వచ్చినప్పుడు ఆయన “యెదుట నిలువబడుటకు” మనం అంగీకరించబడాలనీ, సఫలీకృతులవ్వాలనీ మనం కోరుకున్నట్లైతే ‘మన విషయమై మనం జాగ్రత్తగా ఉంటూ,’ ‘మెలకువగా ఉండాలని’ యేసు తెలియజేశాడు.—లూకా 21:34-36; మత్తయి 25:31-33.

ఓపికతో కనిపెట్టండి

17. అపొస్తలుడైన పౌలు చెప్పిన ఏ మాటల్ని హృదయంలోకి తీసుకోవాలి?

17 ‘దృశ్యమైనవాటిపైగాక అదృశ్యమైనవాటిపైనే’ వారి దృష్టిని నిలపమని పౌలు తన ఆధ్యాత్మిక సహోదరులకు ఉద్బోధించాడు. (2 కొరింథీయులు 4:16-18) వారి ఎదుట ఉంచబడిన పరలోక బహుమానం విషయంలో వారికున్న దృక్పథాన్ని ఏదీ మరుగుచేయకూడదని ఆయన కోరుకున్నాడు. మనం అభిషిక్త క్రైస్తవులమైనా లేదా వేరే గొఱ్ఱెలకు చెందినవారమైనా సరే, మన ఎదుట ఉంచబడిన అద్భుతకరమైన నిరీక్షణను మనస్సులో ఉంచుకొని, విడిచిపెట్టకుందాం. “మనము నశించుటకు వెనుకతీయువారము కాముగాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినవారమైయున్నాము” అని రుజువుచేసుకుంటూ, ‘ఓపికతో కనిపెడదాం.’—హెబ్రీయులు 10:39; రోమీయులు 8:25.

18. కాలాల్నీ, రుతువుల్నీ యెహోవా చేతుల్లోనికి మనం నిశ్చింతగా ఎందుకు విడిచిపెట్టవచ్చు?

18 కాలాల్నీ, రుతువుల్నీ యెహోవా చేతుల్లో మనం నిశ్చింతగా విడిచిపెట్టవచ్చు. ఆయన కాలపట్టిక ప్రకారంగా చూస్తే, ఆయన వాగ్దానాల నెరవేర్పు “ఆలస్యం కాకుండా . . . జరిగి తీరుతుంది.” (హబక్కూకు 2:3, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) తిమోతికి పౌలు చేసిన ఉద్బోధన మన విషయంలో మరింత అర్థాన్ని సంతరించుకుంటోంది. ఆయనిలా తెలియజేశాడు: “దేవునియెదుటను సజీవులకును మృతులకును తీర్పుతీర్చు క్రీస్తుయేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును [“అనుకూల రుతువులోనూ, అననుకూల రుతువులోనూ,” NW] ప్రయాసపడుము . . . సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము.”—2 తిమోతి 4:1-5.

19. యెహోవా ప్రజలు ఏమి చేయడానికిది ఇంకా సమయమై ఉంది, ఎందుకు?

19. మన ప్రాణాలూ, మన పొరుగువారి ప్రాణాలూ అపాయంలో ఉన్నాయి. పౌలు ఇలా రాశాడు: “నిన్నుగూర్చియు నీ బోధనుగూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు.” (1 తిమోతి 4:16) ఈ దుష్ట విధానానికున్న సమయం త్వరలో గతించిపోనైవుంది. మన ముందున్న ఉత్తేజిత సంఘటనల కోసం ఆతురతతో కనిపెడుతున్నప్పటికీ, ఇది తన ప్రజలు రాజ్య సువార్తను ప్రకటించేందుకైన యెహోవా కాలమూ, రుతువూ అయివుందని మనమెప్పుడూ తెలిసికొని ఉందాం. ఆయనకు సంతృప్తికరమైన రీతిలో ఆ పని తప్పక నెరవేర్చబడాలి. “అటుతరువాత” యేసు తెలియజేసినట్లుగా “అంతము వచ్చును.”—మత్తయి 24:14.

[అధస్సూచీలు]

a వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా వారు ప్రచురించిన నిత్యజీవానికి నడిపించు జ్ఞానము పుస్తకంలో 10, 11 అధ్యాయాల్ని చూడండి.

పునఃసమీక్షించడం ద్వారా

◻ కాలగణనల విషయంలో, మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల పరిస్థితిని పోలి మన పరిస్థితి ఎలా ఉంది?

◻ క్రీస్తు ప్రత్యక్షతా కాలంలో సహితం క్రైస్తవులు ఎందుకు ‘మెలకువగా ఉండాలి’?

◻ మానవ సృష్టి ఎందుకు ‘దేవుని కుమారుడు బయల్పర్చబడాలని ఆతృతతో కనిపెడుతోంది’?

◻ కాలాల్నీ, రుతువుల్నీ యెహోవా చేతుల్లో మనమెందుకు నిశ్చింతగా విడిచిపెట్టవచ్చు?

[17వ పేజీలోని చిత్రం]

క్రైస్తవులు క్రీస్తు రాకడను కనిపెట్టడంలో మెలకువగా ఉండాలి

[18వ పేజీలోని చిత్రం]

అభిషిక్త శేషం కాలగణనలపై తమ విశ్వాసాన్ని ఆసరా చేసుకొనక యెహోవా సేవలో బిజీగా ఉన్నారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి