కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 8/15 పేజీలు 3-4
  • ఎందుకు నమ్మకం లేకుండాపోయింది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎందుకు నమ్మకం లేకుండాపోయింది?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కాలముల సూచన
  • నమ్మకాన్ని పునరుద్ధరించవచ్చు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • దేవుని నీతినందు మన నమ్మకాన్ని బలపర్చుకోవడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • మన నమ్మకం యెహోవాయై ఉండాలి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • మా బలం, మా నిరీక్షణ, మా ధైర్యం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 8/15 పేజీలు 3-4

ఎందుకు నమ్మకం లేకుండాపోయింది?

‘ఈ రోజుల్లో మీరెవరినైనా నిజంగా నమ్మగలరా?’ ఆశాభంగం చెందిన వ్యక్తి ఇలా ప్రశ్నించడాన్ని మీరు వినివుండవచ్చు. లేదా మీ జీవితంలో ఎదురైన అనుకోని మార్పులకు భావోద్వేగపరంగా కలతచెంది మీరే ఈ ప్రశ్న అడిగివుండవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా సంస్థాపనాల్లోనూ, ఇతర ప్రజల్లోనూ నమ్మకం లేకుండా పోతోందన్న విషయం నిర్వివాదాంశం. ఇలా నమ్మకం లేకుండా పోవడమన్నది తరచూ సరియైనదిగానే ఎంచబడుతుంది. ఎన్నికలకు ముందు అనేకమంది రాజకీయవేత్తలు చేసే వాగ్దానాలను వాళ్లు నిలుపుకుంటారని ఎవరైనా నిజంగా ఎదురు చూస్తారా? 1990లో జర్మనీలో 1,000 మంది విద్యార్థులపై జరిపిన ఒక సర్వే, రాజకీయవేత్తలు ప్రపంచ సమస్యలను పరిష్కరించగలరన్న నమ్మకాన్ని ఆ విద్యార్థుల్లో 16.5 శాతం మంది వ్యక్తపర్చగా, అంతకు రెండింతలమంది బలమైన అనుమానాలను వ్యక్తపర్చారని సూచించింది. సమస్యలను పరిష్కరించడంలో రాజకీయవేత్తలకున్న సామర్థ్యంపైనా, అలా చేయడంలో వారికున్న సుముఖతపైనా తమకు నమ్మకం లేదని ఎక్కువమంది చెప్పారు.

స్టట్‌గార్టర్‌ నాక్రిక్‌టెన్‌ అనే వార్తాపత్రిక ఇలా ఫిర్యాదు చేసింది: “చాలామంది రాజకీయవేత్తలకు తమ స్వంత ఆసక్తులే ప్రాథమికంగా మనస్సులో ఉంటాయి, ఆ తర్వాత వీలైతే, అప్పుడు తమ ఓటర్ల ఆసక్తుల గురించి ఆలోచిస్తారు.” ఇతర దేశాల్లోని ప్రజలు దీనితో ఏకీభవిస్తారు. ది యూరోపియన్‌ అనే వార్తాపత్రిక ఒక దేశం గురించి ఇలా చెప్పింది: “రాజకీయవేత్తల విషయంలో యౌవనులకు నమ్మకం లేకపోవడం సహేతుకమైనదే, వారి పెద్దవారికి కూడా అదే అభిప్రాయం ఉంది.” ‘ఓటర్ల సముదాయం తరచూ రాజకీయ పార్టీలను అధికారంలో నుండి తొలగిస్తోందని’ అది పేర్కొంది. ఆ వార్తాపత్రిక ఇంకా ఇలా తెలియజేసింది: “[ఆ దేశంలోని] యౌవనస్థులతో సమయం గడిపే ఎవరైనా, వారికి నమ్మకం లేకపోవడాన్నీ, వారికి స్థిరత్వం లేకపోవడాన్నీ వెంటనే గుర్తిస్తారు.” అయినప్పటికీ, ప్రజా నమ్మకం లేకుండా ప్రజాస్వామ్య ప్రభుత్వం సాధించేది అంతంత మాత్రంగానే ఉంటుంది. అమెరికా మాజీ అధ్యక్షుడైన జాన్‌. ఎఫ్‌. కెనెడీ ఒకసారిలా పేర్కొన్నాడు: “ప్రజా నమ్మకమే ప్రభావవంతమైన ప్రభుత్వానికి ఆధారం.”

ఆర్థిక ప్రపంచంలో నమ్మకం విషయానికి వస్తే, ఆర్థికవిషయాల్లో హఠాత్తుగా సంభవించే మార్పులూ, త్వరగా ధనవంతులయ్యే పథకాలు తలక్రిందులవ్వడమూ అనేకులు సంకోచించేలా చేస్తున్నాయి. అక్టోబరు 1997లో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు ఊగిసలాడినప్పుడు, ఒక వార్తాపత్రిక “విపరీతమైన, కొన్నిసార్లు తర్కరహితమైన అపనమ్మకం” గురించీ, “అపనమ్మకమనే అంటురోగం” గురించీ మాట్లాడింది. “పాలనాయంత్రాంగపు ఉనికికే ముప్పువాటిల్లేంతగా [ఆసియాలోని ఒక దేశంలో] నమ్మకం అంతరించిపోయింది.” సంక్షిప్తంగా, దానిలో వ్యక్తపర్చబడిన సందేశం ఏమిటంటే: “ఆర్థిక వ్యవస్థలు నమ్మకంపై ఆధారపడి ఉన్నాయి.”

నమ్మకాన్ని ఉత్పన్నం చేయడంలో మతం కూడా విఫలమయ్యింది. జర్మను మతపత్రికయైన క్రిస్ట్‌ ఇన్‌ డే గేగెన్‌వార్ట్‌ విచారకరంగా ఇలా వ్యాఖ్యానించింది: “చర్చిమీద ప్రజలకున్న నమ్మకం అంతకంతకూ తగ్గిపోతోంది.” 1986-1992 మధ్య కాలంలో, చర్చీనందు నమ్మకం ఉన్న, కనీసం కొంతమేరకు నమ్మకం ఉన్న వారి శాతం 40 నుండి 33 శాతానికి పడిపోయింది. వాస్తవానికి, మునుపటి తూర్పు జర్మనీలో, అది 20 కంటే తక్కువ శాతానికి పడిపోయింది. పోల్చిచూస్తే, చర్చిమీద కొంతమేరకు నమ్మకం ఉన్న లేక అస్సలు నమ్మకంలేని వారి శాతం మునుపటి పశ్చిమ జర్మనీలో 56 నుండి 66 శాతానికి పెరుగగా, తూర్పు జర్మనీలో 71 శాతానికి పెరిగింది.

మానవ సమాజానికి మూడు స్థంభాలైన మత, రాజకీయ, ఆర్థిక రంగాల్లో కాక ఇతర రంగాల్లో కూడా నమ్మకం తగ్గిపోతున్నట్లు స్పష్టమౌతుంది. మరో ఉదాహరణ, చట్టాన్ని అమలుచేయడం. శిక్షాస్మృతిలోని లొసుగులు, చట్టాన్ని న్యాయంగా అమలుపర్చడంలోగల సంక్లిష్టతలు, ప్రశ్నించదగిన కోర్టు నిర్ణయాలు ప్రజల నమ్మకాన్ని కూకటివేళ్లతో కదిలించివేశాయి. టైమ్‌ పత్రిక ప్రకారం, “భయంకరమైన నేరస్థులను త్వరలోనే వీధుల్లో విడిచిపెట్టే వ్యవస్థ మీద నమ్మకం ఉంచలేనంతగా పౌరులు, పోలీసులు విసుగెత్తిపోయారు.” పోలీసుల లంచగొండితనం, పోలీసు జులుం, పోలీసు వ్యవస్థపై కూడా నమ్మకం లేకుండా పోయేలా చేశాయి.

శాంతి గురించిన చర్చలకూ, కాల్పుల విరమణకూ భంగం ఏర్పడడం అంతర్జాతీయ రాజకీయాల విషయంలో నమ్మకం లేకుండా పోవడాన్ని నిరూపిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితికి అమెరికా రాయబారి అయిన బిల్‌ రిచర్డ్‌సన్‌, “నమ్మకం కొరవడుతోంది,” అని చెబుతూ, మధ్యప్రాచ్యంలో శాంతిని స్థాపించడానికి ముఖ్య అడ్డంకు ఏమిటన్నది స్పష్టంగా చూపిస్తున్నాడు.

అయితే మరింత వ్యక్తిగత స్థాయిలో అనేకమంది ప్రజలకున్న నమ్మకం సడలిపోతుంది, మానవులు సాధారణంగా సమస్యలు ఉన్నప్పుడు అవగాహన కోసమూ ఓదార్పు కోసమూ ఎవరివైపైతే తిరుగుతారో, ఆ సన్నిహిత బంధువులూ, స్నేహితులపై నుండి కూడా వారి నమ్మకం సడలిపోతోంది. ఈ పరిస్థితి, “స్నేహితునియందు నమ్మికయుంచవద్దు, ముఖ్యస్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొనియున్న దానియెదుట నీ పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము” అని హెబ్రీ ప్రవక్తయైన మీకా వర్ణించిన పరిస్థితిలానే ఉంది.—మీకా 7:5.

కాలముల సూచన

జర్మను సైకాలజిస్టు ఆర్ధర్‌ ఫిషర్‌ ఇటీవల ఇలా అన్నట్లు చెప్పబడుతోంది: “సమాజ అభివృద్ధికీ, ఒకరి వ్యక్తిగత భవిష్యత్తుకూ సంబంధించి అన్ని రంగాల్లోను నమ్మకం చాలా తగ్గిపోయింది. సమాజ సంస్థాపనాలు తమకు సహాయం చేయగలవా అని యౌవనస్థులు సందేహిస్తున్నారు. రాజకీయ, మత, లేక మరితర ఏ సంస్థలోనైనప్పటికీ వారి నమ్మకం అంతరించిపోతోంది.” సోషియాలజిస్ట్‌ ఉల్రిక్‌ బెక్‌, ఎంతోకాలంగా ఉన్న అధికారుల విషయంలో, సంస్థాపనాల విషయంలో, నిపుణుల విషయంలో “సందేహాస్పద సంస్కృతి” ఉత్పన్నం కావడం గురించి మాట్లాడుతున్నాడంటే అందులో ఆశ్చర్యంలేదు.

అలాంటి సంస్కృతిలో, ప్రజలు అధికారాన్నంతటినీ నిరాకరించి, వ్యక్తిగత ప్రమాణాల ప్రకారం జీవిస్తూ, ఇతరుల ఉపదేశ నిర్దేశాలను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటూ ప్రక్కకు ఉండిపోడానికి ఇష్టపడతారు. కొందరు తాము ఇక ఎంతమాత్రం నమ్మలేమని అనుకునే వారితో వ్యవహరించేటప్పుడు మరింత అనుమానంతో, మరింత నిర్దయగా తయారవుతారు. ఈ దృక్పథం, బైబిల్లో వర్ణించబడిన ఇలాంటి హానికరమైన వాతావరణాన్ని ఉత్పన్నం చేస్తుంది: “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తలిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞతలేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయంచనివారునై యుందురు.” (2 తిమోతి 3:1-5; సామెతలు 18:1) నిజంగా నేడు నమ్మకం లేకపోవడమన్నది కాలముల సూచనగా, “అంత్యదినముల” సూచనగా ఉంది.

పైన వర్ణించబడినటువంటి ప్రజలతో నిండివున్న, నమ్మకంలేని ఈ లోకంలో జీవితాన్ని పూర్తిగా ఆనందించడం నిజంగా సాధ్యం కాదు. కాని పరిస్థితులు మారుతాయని అనుకోవడం వాస్తవిక విషయమేనా? నేడున్నటువంటి నమ్మకం లేని పరిస్థితిని అధిగమించడం సాధ్యమౌతుందా? అయితే, ఎలా, ఎప్పుడు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి