“దైవిక జీవిత మార్గం” 1998-1999 సమావేశం సమీపిస్తోంది
కేవలం ఇండియాలోనే, అక్టోబరు నుండి డిసెంబరు వరకు, 17 సమావేశాలు నిర్వహించడానికి పట్టిక వేయబడింది. బహుశ, ఈ మూడు రోజుల—శుక్రవారం నుండి ఆదివారం వరకు—సమావేశాల్లో ఒకటి, మీ ఇంటికి దగ్గరలోని నగరంలో జరుగవచ్చు. అనేక స్థలాల్లో, కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9:30 నిమిషాలకు సంగీతంతో ప్రారంభమౌతుంది.
శుక్రవారం ఉదయకాల కార్యక్రమం ప్రపంచంలోని వివిధ భాగాల్లో జరుగుతున్న రాజ్యప్రకటన యొక్క అభివృద్ధిని గూర్చిన నివేదికలను ఉన్నతపరుస్తుంది. సమావేశ ముఖ్యాంశం, “క్రీస్తు విమోచన క్రయధనం—దేవుని రక్షణ మార్గం” అనే ముఖ్యాంశ ప్రసంగం ద్వారా నొక్కి చెప్పబడుతుంది.
మధ్యాహ్నం, “తల్లిదండ్రులారా—మీ పిల్లల్లో దైవిక మార్గాన్ని నాటండి” అనే గోష్ఠి, యౌవనులు యెహోవాను ప్రేమించేలా, ఆయన సేవ చేసేలా వారిని ఎలా పురికొల్ప వచ్చుననేదాని గురించి సలహాలను అందజేస్తుంది. “మరణానంతర జీవితం ఉందా?” అనే ప్రసంగంతో మధ్యాహ్న కార్యక్రమం ముగుస్తుంది.
యెహోవాసాక్షులు చేస్తున్న శిష్యులను చేసే పని, “జీవమార్గంపైకి రావడానికి ప్రజలకు సహాయం చేయడం,” “ప్రజలను చేరడంలో ఉన్న సవాలు,” “క్రీస్తు ఆజ్ఞాపించినవాటినన్నింటినీ శిష్యులకు బోధించడం” అనే మూడు భాగాలుగా ఉంటుంది. శనివారం ఉదయకాల కార్యక్రమంలో ఆ మూడు భాగాలూ ఒకదాని తర్వాత ఒకటిగా చర్చించబడతాయి. ఉదయకాల కార్యక్రమ ముగింపులో, క్రొత్త శిష్యులు బాప్తిస్మం తీసుకోవడానికి ఏర్పాటు చేయబడుతుంది.
శనివారం మధ్యాహ్న ప్రారంభ ప్రసంగమైన, “అంతంలేని జీవిత ఉత్తరాపేక్షతో సేవచేయడం” అనేది మనం దేవుని సేవ చేయడానికి గల వ్యక్తిగత కారణాల గురించి ప్రార్థనాపూర్వకంగా అలోచించడాన్ని ప్రోత్సహిస్తుంది. “దైవిక మార్గాన్ని బోధించే ‘మనుష్యులలోని ఈవులను’ మెచ్చుకోవడం” మరియు “పాత వ్యక్తిత్వాన్ని తొలగించుకొని, క్రొత్తదాన్ని ధరించండి” అనే ప్రసంగాలు ఎఫెసీయులు 4వ అధ్యాయంలోని ప్రతి వచనం యొక్క జ్ఞానవంతమైన పరిశీలనను అందజేస్తాయి. ఆ తర్వాత, “ఇహలోకమాలిన్యము మీకంటకుండా కాపాడుకోండి” అనే ప్రసంగంలోనూ, “యౌవనులారా—దైవిక మార్గాన్ని అనుసరించండి” అనే మూడు భాగాల గోష్ఠిలోనూ చక్కని లేఖనాధార ఉపదేశం ఇవ్వబడుతుంది. “సృష్టికర్త—ఆయన వ్యక్తిత్వం, ఆయన మార్గాలు” అనే ప్రసంగంతో మధ్యాహ్న కార్యక్రమం ముగుస్తుంది.
ఆదివారం ఉదయకాల కార్యక్రమంలో, బైబిలు పుస్తకమైన యెహెజ్కేలు నందలి ముగింపు అధ్యాయాలను అలాగే వాటి ప్రవచనార్థక అన్వయింపును చర్చించే మూడు భాగాల గోష్ఠి ఉంటుంది. ముగ్గురు హెబ్రీ యువకుల విశ్వాస్యతపై రూపొందించబడిన, పూర్తి క్యాస్టూమ్డ్ నాటకం ఉదయకాల కార్యక్రమ ముగింపుగా ఉంటుంది. మధ్యాహ్నం, “నిత్యజీవానికి నడిపించే ఏకైక మార్గం” అనే బహిరంగ ప్రసంగం సమావేశ ఉన్నతాంశంగా ఉంటుంది.
మూడు రోజులూ అక్కడ ఉండడం ద్వారా మీరు తప్పకుండా ఆధ్యాత్మికంగా సుసంపన్నమౌతారు. ప్రతి కార్యక్రమానికీ మీరు హృదయపూర్వకంగా ఆహ్వానించబడుతున్నారు, అయితే అవన్నీ ఉచితమే. మీ ఇంటికి దగ్గరలో ఉండే సమావేశ స్థలం కొరకు స్థానిక యెహోవాసాక్షుల రాజ్యమందిరాన్ని సంప్రదించండి లేదా ఈ పత్రిక ప్రకాశకులకు వ్రాయండి.