ఒక ప్రత్యేక సందర్భానికి దయచేసి మాతోపాటు సమావేశమవ్వండి శనివారం, ఏప్రిల్ 11, 1998
దేవుడిచ్చిన బహుమానమైన, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకునేందుకు యెహోవాసాక్షులు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. ఈ బహుమానం మూలంగా, భూమిపై నిత్యజీవాన్ని అనుభవించగల ఉత్తరాపేక్ష మానవజాతి కొరకు తెరువబడింది.—యోహాను 3:16.
ఈ సంవత్సరం యేసు మరణ జ్ఞాపకార్థ కూటమి ఏప్రిల్ 11 శనివారం సూర్యాస్తమయం తర్వాత ఆచరించబడుతుంది. ఆ తేదీ, బైబిలు యొక్క చాంద్రమాన క్యాలెండరులోని నీసాను 14వ తేదీకి సరిసమానమైనది. కూటం ఎక్కడ ఏ సమయంలో జరుగుతుందనే వివరాలకు మీ ప్రాంతంలోని యెహోవాసాక్షులను దయచేసి సంప్రదించండి.