కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 3/1 పేజీలు 3-4
  • చర్చీలు తప్పు ఒప్పుకుంటున్నాయి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • చర్చీలు తప్పు ఒప్పుకుంటున్నాయి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పోప్‌ క్షమాపణ కోరుతున్నప్పుడు
  • ఎందుకని?
  • వాళ్ళెందుకు క్షమాపణ కోరుతున్నారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • మతం పక్షం వహిస్తుంది
    తేజరిల్లు!—1994
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 3/1 పేజీలు 3-4

చర్చీలు తప్పు ఒప్పుకుంటున్నాయి

“పోప్‌ చర్చీని విచారణ చేస్తున్నాడు.” “ఇన్‌క్విజిషన్‌ మరియు యాంటీ-సెమిటిజమ్‌—చర్చి తన మేయా కుల్పాను [లాంఛనప్రాయంగా తప్పొప్పుకోవడం] తయారుచేస్తోంది.”* “మారణహోమానికి మేయా కుల్పా.” “పాశ్చాత్య అమెరికన్‌ ఇండియన్‌ల ఎదుట మెథడిస్టులు తప్పొప్పుకుంటూ విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు.”

ఇలాంటి హెడ్డింగ్‌లను మీరెప్పుడైనా చదివారా? చర్చీలు నిందను అంగీకరించి, శతాబ్దాలుగా తాము చేసినవాటిని మన్నించమని మరీ తరచుగా అడుగుతున్నట్లు కనిపిస్తుంది. సమాచార మాధ్యమాలు పోప్‌ తప్పు ఒప్పుకోవడాన్ని ఎడతెగక ఉన్నతపరుస్తున్నాయి.

పోప్‌ క్షమాపణ కోరుతున్నప్పుడు

1980 మరియు 1996 మధ్యకాలంలో, జాన్‌ పాల్‌ II కనీసం 94 సార్లు ‘చర్చి యొక్క చారిత్రాత్మక తప్పిదాలను గుర్తించడమో, క్షమాపణ కోరడమో’ జరిగింది అని క్వాండో ఈల్‌ పాపా క్యెడ్‌ పెర్‌డోనో (పోప్‌ క్షమాపణ కోరుతున్నప్పుడు) అనే తన పుస్తకంలో వాటికన్‌ వ్యాఖ్యాతయైన లూయీజీ ఆకాటోలీ అంటున్నాడు. ఆకాటోలీ చెబుతున్న దాని ప్రకారం, “కాథలిక్‌ చర్చీలో, కేవలం పోప్‌ మాత్రమే మేయా కుల్పా చేయగల్గుతాడు.” ఆయన క్యాథలిక్‌ చరిత్ర యొక్క అత్యంత వివాదాస్పదమైన పేజీలను గూర్చి—క్రూసేడ్లు, యుద్ధాలు, నిరంకుశ పరిపాలనలకు మద్దతు, చర్చీల్లో విభజనలు, యాంటీ సెమిటిజమ్‌, ఇన్‌క్విజిషన్‌లు, మాఫియా, జాతివిచక్షణ వంటి విషయాలను గూర్చి మాట్లాడుతూ తప్పు ఒప్పుకున్నాడు. 1994లో కార్డినల్‌లకు పంపబడిన ఒక మెమోరాండమ్‌లో (దాన్ని పోప్‌ సంబంధిత అతి ప్రాముఖ్యమైన పత్రంగా కొందరు పరిగణిస్తారు), జాన్‌ పాల్‌ “వెయ్యి సంవత్సరాలుగా జరిగిన తప్పిదాలను బహిరంగంగా ఒప్పుకోవడాన్ని” ప్రతిపాదించాడు.

చాలా మంది ప్రిలేట్లు ఈ పోప్‌ మాదిరిని అనుకరించారు. 1994 డిసెంబర్‌లో, ఇటలీ వార్తాపత్రికయైన ఈల్‌ జొర్నాల్‌ ఇలా నివేదించింది: “చాలామంది అమెరికన్‌ బిషప్‌లు టి.వి.లో బహిరంగంగా క్షమాపణ కోరారు.” ఎందుకని? పిల్లలతో సంపర్కం చేసే ప్రీస్ట్‌ల వల్ల వచ్చే సమస్యను, బాధితులైన చాలా మంది పిల్లలకు కలిగిన హానిని తక్కువ అంచనా వేసినందుకే. 1995 జనవరిలో, లా రేపూబ్లీకా అనే వార్తాపత్రిక “సమకాలీన క్యాథలిసిజమ్‌ చరిత్రలో మునుపెన్నడూ కనిపించని సంకేతం” విషయమై—సూచించబడిన మారణహోమం విషయమై పోప్‌ పయస్‌ XII మౌనం వహించిన సమస్యపై నివేదించింది. రోమన్‌ క్యాథలిక్కులు నాజీల నేరాలకు మద్దతునివ్వడం ద్వారా చేసిన “అనేక తప్పులకు” జర్మన్‌ బిషప్‌ సంఘం క్షమాపణ కోరిందని 1995 జనవరిలో అదే వార్తాపత్రిక నివేదించింది. అనేక ప్రొటెస్టెంట్‌ చర్చీలు కూడా తమకై తాము ఆత్మవిమర్శ చేసుకున్నాయి.

ఎందుకని?

మనం తప్పిదం చేసినప్పుడు క్షమాపణ కోరాలని బైబిలు మనలను ప్రోత్సహిస్తుంది.a చర్చీలు తమకై తాము ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు అనేకులు ప్రశంసించారు. (యాకోబు 5:16) కానీ చర్చీలు ఎందుకిలా చేస్తున్నాయి? మనం వాటిని దృష్టించే విధానాన్ని అదెలా ప్రభావితం చేయాలి?

[అధస్సూచి]

a * లాటిన్‌లో (ద కొన్‌ఫిట్‌యోర్‌ లేదా “నేను తప్పొప్పుకుంటున్నాను”) “నా సొంత తప్పు” అనే పదబంధం క్యాథలిక్‌ ప్రార్థనలో ఒక భాగం. ప్రార్థించే సమయంలో విశ్వాసులు ఆ పదబంధాన్ని పునశ్చరణ చేస్తారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి