కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 11/1 పేజీలు 2-4
  • ప్రపంచ సమైక్యత—అదెన్నటికైనా వాస్తవమౌతుందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రపంచ సమైక్యత—అదెన్నటికైనా వాస్తవమౌతుందా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రపంచ సమైక్యత కనుచూపుమేరలో ఉందా?
  • అణచి వేయబడిన వారికి ఆదరణ
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ప్రపంచ సమైక్యత—అదెలా వస్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • శ్రేష్ఠమైన జీవితమార్గాన సమైక్యమై
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఐక్యతనుబట్టి సత్యారాధనను గుర్తించవచ్చు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 11/1 పేజీలు 2-4

ప్రపంచ సమైక్యత—అదెన్నటికైనా వాస్తవమౌతుందా?

“రాబోవు కొన్ని తరాల్లో, మనం జీవించే స్వతంత్ర దేశాల ప్రపంచాన్ని ఓ విధమైన యథార్థ అంతర్జాతీయ సమాజంగా మార్చడంలో మనం గనుక సఫలులమైతే, . . . అప్పుడు మనం ప్రాచీన యుద్ధవ్యవస్థను సమర్థవంతంగా తుడిచివేసినవారమౌతాం. . . . మనం గనుక విఫలులమైతే బహుశా . . . నాగరికతే ఉండదు.” అలా అని, సైనిక చరిత్రకారుడైన గ్విన్‌ డైర్‌ యుద్ధం (ఆంగ్లం) అనే పేరుగల తన పుస్తకంలో చెబుతున్నాడు.

తమ మధ్యనున్న విబేధాల్ని పరిష్కరించుకునేందుకు యుద్ధాన్ని ఆశ్రయించిన దేశాల్ని గూర్చిన, మరితర శక్తిమంతమైన గుంపుల్ని గూర్చిన వృత్తాంతాలతో చరిత్ర పుటలు నిండిపోయాయని డైర్‌ చెబుతున్నాడు. వాటి మధ్యనున్న అనైక్యత కోట్లాదిమంది బాధితుల జీవితాల్ని సర్వనాశనం చేస్తుంది. తన కాలంలోని ప్రజలపై ఇదెలా ప్రభావం చూపించిందనే దాన్ని గూర్చి రాజైన సొలొమోను ఇచ్చిన వివరణ నేడు కూడా తగినదైవుంది. ఆయన ఇలా రాశాడు: “సూర్యునిక్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించితిని. బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు; వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడును లేకపోయెను.”—ప్రసంగి 4:1.

పై చరిత్రకారుడు సూచిస్తున్నట్లుగానే ప్రస్తుత కాలంలో, ‘బాధింపబడువారి . . . కన్నీళ్లను’ చూసి జాలిపడడమేగాక, స్వతంత్ర దేశాల ప్రపంచాన్ని ఓ విధమైన యథార్థ అంతర్జాతీయ సమాజంగా మార్చడానికి ఏదొక మార్గాన్ని కనుగొనేందుకు మరో కారణంవుంది: నాగరికత మనుగడే అపాయంలో ఉంది! ఆధునిక సంగ్రామం, దాన్ని ఆశ్రయించే ప్రతీ దేశాన్నీ నాశనం చేస్తుందని ఎదురుచూసేందుకు ఆస్కారాన్నిస్తుంది, అది విజేతల్ని కూడా విడిచిపెట్టదు.

ప్రపంచ సమైక్యత కనుచూపుమేరలో ఉందా?

ప్రపంచ సమైక్యత కొరకు ఏ ఉత్తరాపేక్షలు ఉన్నాయి? భూమి మనుగడకు ముప్పునుతెచ్చే విభాజిత శక్తుల్ని మానవ సమాజం అధిగమించగలదా? అధిగమించగలదని కొంతమంది అభిప్రాయపడతారు. బ్రిటన్‌ నుండి వెలువడే డైలీ టెలిగ్రాఫ్‌ యొక్క డిఫెన్స్‌ సంపాదకుడైన జాన్‌ కీగాన్‌ ఇలా రాస్తున్నాడు: “అనిశ్చయతా గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ యుద్ధంలేని ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించడమంత కష్టమేమీకానట్టు కనబడుతోంది.”

ఈ ఆశావాద దృక్పథం ఆయనకు కలగడానికి కారణమేమిటి? మానవజాతి సుదీర్ఘమైన యుద్ధ చరిత్రను కల్గివున్నా, తనను తాను విజయవంతంగా పాలించుకోలేని మానవ అసమర్థత కనబడుతున్నా, ఎందుకు అనేకమంది ఆశాజనకంగా ఉన్నారు? (యిర్మీయా 10:23) ‘మానవజాతి ముందుకు వెళ్తోంది. కొనసాగుతున్న అభివృద్ధిని గూర్చిన నమూనాను చరిత్ర చూపిస్తోంది’ అని కొంతమంది ఒకానొకప్పుడు వాదించేవారు. నేడు కూడా, మానవుని స్వాభావిక మంచితనం ఏదొక విధంగా చెడును జయిస్తుందని అనేకులు విశ్వసిస్తారు. అది వాస్తవిక నిరీక్షణయేనా? లేక అది మరింత నిస్పృహకు నడిపించే ఓ భ్రాంతి మాత్రమేనా? ప్రపంచాన్ని గూర్చిన క్లుప్త చరిత్ర (ఆంగ్లం) అనే తన పుస్తకంలో, చరిత్రకారుడైన జె. ఎమ్‌. రాబర్ట్స్‌ వాస్తవికంగా ఇలా రాశాడు: “ప్రపంచ భవిష్యత్తు భద్రంగా ఉందని చెప్పడం కష్టం. మానవ బాధలకు అంతమనేది కనుచూపుమేరలో లేదు, లేక బాధ అంతమౌతుందని విశ్వసించడానికి ఏ ఆధారమూ లేదు.”

పరస్పర అపనమ్మకాన్నీ, విభాజిత విభేదాల్నీ ప్రజలూ దేశాలూ నిజంగా అధిగమిస్తాయని విశ్వసించేందుకుగల యథార్థమైన కారణాలు ఉన్నాయా? లేక మానవ ప్రయత్నాలకన్నా మిన్నయైన ప్రయత్నాలు అవసరమా? ఈ ప్రశ్నలను తర్వాతి శీర్షిక పరిశీలిస్తుంది.

[2వ పేజీలోని చిత్రసౌజన్యం]

Background globe on the cover: Mountain High Maps® Copyright © 1995 Digital Wisdom, Inc.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి