మానవజాతికి అద్భుత స్వస్థత సమీపించింది
‘మనమీలాటి కార్యములను ఎన్నడును చూడలేదు.’ పక్షవాయువుగల ఒక మనుష్యుడ్ని యేసు అద్భుతంగా అప్పటికప్పుడే స్వస్థపర్చడాన్ని ప్రత్యక్షంగా చూసినవారు అలా అన్నారు. (మార్కు 2:12) యేసు గ్రుడ్డివారిని, మూగవారిని, కుంటివారిని కూడా స్వస్థపర్చాడు, ఆయన అనుచరులు కూడా అదేవిధంగా చేశారు. యేసు ఏ శక్తితో అలా చేశాడు? విశ్వాసం ఇక్కడ ఎటువంటి పాత్రను వహించింది? ఈ మొదటి శతాబ్దపు అనుభవాలు నేటి అద్భుత స్వస్థతలపై ఎటువంటి వెలుగును ప్రసరింపజేస్తున్నాయి?—మత్తయి 15:30, 31.
“నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను”
12 ఏండ్లనుండి రక్తస్రావరోగముగల ఒక స్త్రీ స్వస్థత కొరకు యేసు దగ్గరికి వచ్చినప్పుడు, “నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను” అని ఆయన ఆమెతో చెప్పిన మాటల్ని ఉల్లేఖించడమంటే నేటి విశ్వాస స్వస్థతలు చేసేవారికి చాలా ఇష్టం. (లూకా 8:43-48) ఆమె స్వస్థత ఆమె విశ్వాసంపైన ఆధారపడివుందని యేసు మాటలు సూచించాయా? అది నేడు చేస్తున్నటువంటి “విశ్వాస స్వస్థతల”కు ఒక ఉదాహరణా?
మనం బైబిలును జాగ్రత్తగా చదివినప్పుడు, అత్యధిక సందర్భాల్లో వ్యాధిగ్రస్థులు స్వస్థత పొందడానికి ముందు తమ విశ్వాసాన్ని ప్రకటించాలని యేసుగానీ ఆయన శిష్యులుగానీ కోరలేదని మనం చూస్తాము. పైన పేర్కొనబడిన స్త్రీ వచ్చి, యేసుకు ఏమీ చెప్పకుండానే వెనుకనుండి ఆయన వస్త్రాన్ని నెమ్మదిగా ముట్టుకుంది, “వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను.” మరో సందర్భంలో, యేసు తనను బంధించడానికి వచ్చినవారిలో ఒకరిని స్వస్థపర్చాడు. చివరికి యేసెవరో ఏమాత్రం తెలియని ఒక వ్యక్తిని కూడా ఆయన స్వస్థపర్చాడు.—లూకా 22:50, 51; యోహాను 5:5-9, 13; 9:24-34.
మరి విశ్వాసం ఏ పాత్రను వహించింది? యేసూ ఆయన శిష్యులూ తూరు సీదోనుల జిల్లాలో ఉన్నప్పుడు ఒక కనాను స్త్రీ వచ్చి, “ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపట్టి, బహు బాధపడుచున్నదని” కేకలు వేసింది. ‘ప్రభువా, నాకు సహాయము చేయి!’ అని విజ్ఞప్తి చేసినప్పటి ఆమె నిరాశను మీరూహించండి. కనికరంతో నిండినవాడై, యేసు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు: “అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక.” మరి ఆమె కుమార్తె “ఆ గడియలోనే . . . స్వస్థతనొందెను.” (మత్తయి 15:21-28) స్పష్టంగా, విశ్వాసం ఇమిడివుంది, కానీ ఎవరి విశ్వాసం? యేసు ఇక్కడ మెచ్చుకున్నది వ్యాధితోవున్న కుమార్తె విశ్వాసాన్ని కాదుగానీ తల్లి విశ్వాసాన్ని అని గమనించండి. అయితే ఎందులో విశ్వాసం? ఆ స్త్రీ యేసును “ప్రభువా, దావీదు కుమారుడా” అని సంబోధించడం ద్వారా, వాగ్దానం చేయబడిన మెస్సీయ యేసు అని బహిరంగంగా అంగీకరిస్తుంది. అది దేవునిలో విశ్వాసమో లేక స్వస్థపర్చేవారి శక్తిలో విశ్వాసమో ప్రకటిస్తూ మామూలుగా అన్న మాట కాదు. యేసు “నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను” అని అన్నప్పుడు, తాను మెస్సీయా అని బాధితులకు తనలో విశ్వాసం లేకపోతే స్వస్థత పొందడానికి తనదగ్గరికి వచ్చేవారేకాదని ఆయన ఉద్దేశం.
యేసు చేసిన స్వస్థత నేడు సాధారణంగా కనిపించే స్వస్థతలకు లేక జరుగుతున్నాయని చెప్పుకునే స్వస్థతలకు ఎంతో భిన్నమైనదని ఈ లేఖనాధార ఉదాహరణల నుండి చూడగలం. జనాలు అరవడమూ, పదాల్ని వల్లించడమూ, రోదించడమూ, మూర్ఛపోవడమూ వంటి మరితర రకాలైన తీవ్రమైన భావోద్రేక ప్రదర్శన అక్కడ లేదు, యేసు వెర్రి ఆవేశంతోకూడిన ఉన్మాదంతో ప్రవర్తించనూ లేదు. దానికితోడు, వారికి విశ్వాసం లేదన్న సాకు చెబుతూనో లేక వారు చందాలు ఉదారంగా ఇవ్వలేదన్న సాకు చెబుతూనో యేసు రోగులను స్వస్థపర్చకుండా ఉండలేదు.
దేవుని శక్తితో స్వస్థతలు
యేసూ, ఆయన శిష్యులూ చేసిన స్వస్థతలు ఎలా సంభవించాయి? “ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు (“యెహోవా,” NW) శక్తి ఆయనకుండెను” అని జవాబు చెబుతోంది బైబిలు. (లూకా 5:17) ఒకసారి స్వస్థత జరిగిన తర్వాత “అందరు దేవుని మహాత్మ్యమును [“దేవుని శక్తిని,” NW] చూచి ఆశ్చర్యపడిరి” అని లూకా 9:43 చెబుతోంది. యుక్తమైన రీతిలోనే, యేసు స్వస్థపర్చేవానిగా తనవైపుకే అవధానాన్ని మళ్లించుకోలేదు. ఒక సందర్భంలో దయ్యాల వేధింపునుండి తాను విముక్తుని చేసిన ఒక వ్యక్తితో ఆయన, “నీవు నీ యింటివారియొద్దకు వెళ్లి, ప్రభువు (“యెహోవా,” NW) నీయందు కనికరపడి, నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పుమనెను.”—మార్కు 5:19.
యేసూ, ఆయన అపొస్తలులూ దేవుని శక్తితో స్వస్థతలు చేశారు కాబట్టి, స్వస్థత జరగడానికి స్వస్థపర్చబడిన వాని విశ్వాసం అన్నిసార్లూ ఎందుకు అవసరం కాలేదో గ్రహించడం సులభమౌతుంది. అయితే, స్వస్థపర్చేవారికి బలమైన విశ్వాసం అవసరం. అందుకని, తన అనుచరులు విశిష్టమైన రీతిలో శక్తివంతంగా ఉన్న ఒక దయ్యాన్ని వెళ్లగొట్టడంలో విఫలులైనప్పుడు “మీ అల్పవిశ్వాసము చేతనే” అని అంటూ వారి వైఫల్యానికిగల కారణాన్ని యేసు వారికి చెప్పాడు.—మత్తయి 17:20.
అద్భుత స్వస్థతల సంకల్పం
తన భూపరిచర్యంతటిలో యేసు ఎన్నో స్వస్థతలు చేసినప్పటికీ, ఆయన ప్రాథమికంగా ఒక ‘స్వస్థతా పరిచర్య’ను చేయడంలేదు. ‘రాజ్య సువార్తను ప్రకటించడం’ అనేది ఆయనకు ప్రాముఖ్యమైన పని. అద్భుత స్వస్థత అనేది దాని తర్వాతే వస్తుంది. అందుకు ఆయన ఎన్నడూ ప్రజలనుండి డబ్బు వసూలు చేయడమో లేక చందాలు సేకరించడమో చేయలేదు. (మత్తయి 9:35) ఒక సందర్భంలో, “ఆయన వారిని చేర్చుకొని, దేవుని రాజ్యమునుగూర్చి వారితో మాటలాడుచు, స్వస్థత కావలసినవారిని స్వస్థపరచెను” అని నమోదు చేయబడిన వృత్తాంతం చెబుతుంది. (లూకా 9:11) సువార్త వృత్తాంతాల్లో, యేసును తరచూ “బోధకుడా” అని పిలిచారేగానీ ఆయనను ఎన్నడూ “స్వస్థపర్చేవాడు” అని పిలువలేదు.
మరైతే యేసు అద్భుతమైన స్వస్థతలను ఎందుకు చేసినట్టు? ప్రాముఖ్యంగా వాగ్దత్త మెస్సీయ అన్న తన గుర్తింపును స్థాపించుకోవడానికే వాటిని చేశాడు. బాప్తిస్మమిచ్చే యోహాను అన్యాయంగా జైల్లో వేయబడినప్పుడు, దేవుడు ఏమి చేయడానికి తనను పంపాడో అది తాను చేశాడన్న నిర్ధారణపూర్వకమైన హామీని ఆయన కోరుకున్నాడు. ఆయన తన స్వంత శిష్యులను యేసు దగ్గరికి పంపించి ఇలా అడిగాడు: “రాబోవు వాడవు నీవేనా, మేము మరియొకనికొరకు కనిపెట్టవలెనా?” యేసు యోహాను శిష్యులకు ఏమి చెప్పాడో గమనించండి: “మీరు వెళ్లి, విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపుపొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది.”—మత్తయి 11:2-5.
అవును, యేసు కేవలం స్వస్థతలు మాత్రమే కాదుగానీ సువార్తల్లో నమోదు చేయబడిన మరితర అద్భుత క్రియలు కూడా చేశాడన్న వాస్తవం, ‘రాబోవు వాడు’ అనీ—వాగ్దత్త మెస్సీయ అనీ ఆయన గుర్తింపును స్థిరంగా స్థాపించింది. “మరియొకనికొరకు కనిపెట్ట”వలసిన అవసరం ఎవరికీ లేదు.
నేడు అద్భుత స్వస్థతలా?
అందుకని, మరి దేవుడు తన శక్తిని నిరూపించుకోవడానికి స్వస్థతలు చేయాలని మనం అపేక్షించాలా? లేదు. వస్తాడని దేవుడు వాగ్దానం చేసిన మెస్సీయా తానే అని, దేవుని శక్తితో తాను చేసిన అద్భుత క్రియలద్వారా యేసు ఏమాత్రం సందేహం లేకుండా స్థాపించుకున్నాడు. యేసు చేసిన శక్తివంతమైన క్రియలు అందరూ చదవడానికి బైబిలులో నమోదు చేయబడ్డాయి. దేవుడు తన శక్తిని నిరూపించుకోవడానికి అటువంటి క్రియల్ని ప్రతి తరంలోనూ మళ్లీ మళ్లీ చేయాల్సిన అవసరం లేదు.
ఆసక్తికరంగా స్వస్థతలూ, మరితర అద్భుత కార్యాలూ కేవలం కొంతమేరకే ఒప్పింపజేసేవిగా ఉన్నాయి. యేసు చేసిన అద్భుతాలకు ప్రత్యక్షసాక్షులైన కొంతమంది కూడా ఆయనకు పరలోక తండ్రి మద్దతు ఉందని నమ్మలేదు. “ఆయన వారి యెదుట యిన్ని సూచక క్రియలు చేసినను వారాయనయందు విశ్వాసముంచరైరి.” (యోహాను 12:37) అందుకనే, మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘంలోని వేర్వేరు సభ్యులకు దేవుడు ఇచ్చిన ప్రవచన వరం, భాషలు మాట్లాడే వరం, స్వస్థపరచే వరం మొదలైన వివిధ అద్భుత వరాల్ని గురించి చర్చించిన తర్వాత, పౌలు ఇలా చెప్పడానికి ప్రేరేపించబడ్డాడు: “ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచిపోవును; జ్ఞానమైనను నిరర్థకమగును; మనము కొంతమట్టుకు ఎరుగుదుము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముకానిది నిరర్థకమగును.”—1 కొరింథీయులు 12:28-31; 13:8-10.
నిజమే, దేవునియందు విశ్వాసం కలిగివుండడమన్నది మన సంక్షేమానికి అవసరం. అయితే, ఒకరి విశ్వాసాన్ని స్వస్థతకు సంబంధించిన అబద్ధ వాగ్దానాలపై ఆధారంచేసికొంటే అది కేవలం ఆశాభంగానికే నడిపిస్తుంది. అంతేగాక, అంత్యదినాల గురించి యేసు ఈ హెచ్చరికనిచ్చాడు: “అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు.” (మత్తయి 24:24) బూటకపు వైద్యమూ, మోసమూ వంటివాటితోపాటు దయ్యాల శక్తియొక్క ప్రదర్శనలు కూడా ఉంటాయి. తత్ఫలితంగా, వివరింపశక్యంకాని సంఘటనలు జరిగాయన్న వాదనలు మనల్ని ఆశ్చర్యపర్చకూడదు, నిశ్చయంగా ఇవి దేవునిలో నిజమైన విశ్వాసానికి ఆధారం కావు.
యేసు చేసినట్టుగా ఎవ్వరూ నేడు స్వస్థతలు చేయలేరు గనుక మనకు ఏ ప్రయోజనమూ లేదా? అలా ఎంతమాత్రం కాదు. నిజానికి, యేసు స్వస్థపర్చినవారు మళ్లీ చివరికి రోగులయ్యారు. వారందరూ వృద్ధులై చనిపోయారు. వారు పొందిన స్వస్థతా ప్రయోజనాలు చాలా తక్కువ కాలం నిలిచాయి. అయినా, యేసు స్వస్థతలకు నిరంతరం నిలిచే అర్థం ఉంది అంటే అవి భవిష్యత్తు ఆశీర్వాదాల్ని ముందుగా సూచించాయి.
అందుకని, మునుపు పేర్కొనబడిన ఆలిషాండ్రే, బెనడీటలు దేవుని వాక్యమైన బైబిలును పరిశీలించిన తర్వాత ఆధునిక విశ్వాస స్వస్థతల్లోనూ, అభిచార సంబంధ స్వస్థతల్లోనూ ఇక ఎంతమాత్రం విశ్వాసం ఉంచడంలేదు. అదే సమయంలో, అద్భుత స్వస్థతలు గతానికి మాత్రమే చెందిన విషయాలు కాదని వారు ఒప్పించబడ్డారు. ఎందుకలా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమందిలాగానే వారు దేవుని రాజ్యం క్రింద స్వస్థతా ఆశీర్వాదాల కొరకు ఎదురుచూస్తున్నారు.—మత్తయి 6:10.
రోగమూ, మరణమూ ఇక ఉండవు
మనం మునుపు చూసినట్లుగానే, యేసు పరిచర్యయొక్క ముఖ్య లక్ష్యం రోగులను స్వస్థపర్చడమో లేక మరితర అద్భుతాలను చేయడమో కాదు. బదులుగా, దేవుని రాజ్యాన్ని గూర్చిన సువార్తను ప్రకటించడమే ఆయన తన ప్రధానమైన పనిగా చేసుకున్నాడు. (మత్తయి 9:35; లూకా 4:43; 8:1) మానవజాతి అద్భుత స్వస్థతను పొందడానికీ, పాపమూ అపరిపూర్ణతలు మానవ కుటుంబానికి తెచ్చిపెట్టిన నష్టాన్నంతటినీ భర్తీచేయడానికీ దేవుడు ఉపయోగించుకునే మాధ్యమమే ఆ రాజ్యం. ఆయన దీన్నెలా, ఎప్పుడు సాధిస్తాడు?
సుదూరంలోని భవిష్యత్తును గురించి ముందే చెబుతూ క్రీస్తు యేసు తన అపొస్తలుడైన యోహానుకు ఒక ప్రవచనార్థక దర్శనాన్నిచ్చాడు: “ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునివాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను!” (ప్రకటన 12:10) దేవుని గొప్ప వ్యతిరేకి అయిన సాతాను 1914లో భూ పరిధిలోనికి పడద్రోయబడ్డాడనీ, మరి అప్పటినుండి రాజ్యం ఇప్పుడు ఒక వాస్తవంగా పనిచేస్తుందనీ సాక్ష్యాధారం చూపిస్తోంది! యేసు మెస్సీయా రాజ్యానికి రాజుగా స్థాపించబడ్డాడు, ఇప్పుడు భూమ్మీద గొప్ప మార్పులను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
చాలా దగ్గర్లోని భవిష్యత్తులో యేసు యొక్క పరలోకపు ప్రభుత్వం, ప్రాథమికంగా ఒక “క్రొత్త భూమి” అయినటువంటి నీతియుక్తమైన ఒక క్రొత్త మానవ సమాజంపైన పరిపాలన చేస్తుంది. (2 పేతురు 3:13) అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇక్కడ మహిమాన్వితమైన ఒక దర్శనం ముందే ఇవ్వబడింది చూడండి: ‘నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను . . . [దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.’—ప్రకటన 21:1, 4.
మానవజాతియొక్క అద్భుతమైన స్వస్థత నిజమైనప్పుడు జీవితం ఎలా ఉంటుందో మీరూహించగలరా? “నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడును అనడు. దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును.” అవును, విశ్వాస స్వస్థతలు చేసేవారు చేయలేని దానిని దేవుడు సాధ్యపరుస్తాడు. “మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగివేయును.” నిజానికి, “ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్పబిందువులను తుడిచివేయును.”—యెషయా 25:8; 33:24.
[7వ పేజీలోని చిత్రం]
దేవుని రాజ్యం క్రింద మానవజాతి అద్భుతంగా స్వస్థపర్చబడుతుంది