అందరికీ తగినంత ఆహారం ఏ మూలం ద్వారా?
“ఈ శతాబ్దంలో ఆహార సరఫరాలను గురించి మనం ఎన్నో విషయాలను తెలుసుకున్నాము, అయితే వాటిని అమలు చేసేందుకు మనం చేయగల అత్యంత శ్రేష్టమైన ప్రయత్నాలు కూడా సరిపోవు” అని వాషింగ్టన్, డి.సి.లోని వరల్డ్వాచ్ సంస్థ యొక్క అధ్యక్షుడైన లెస్టర్ బ్రౌన్ పేర్కొంటున్నాడు. న్యూ సైంటిస్ట్ పత్రిక ప్రకారం, 1995 ప్రారంభంలో ప్రపంచ ధాన్య నిల్వలు ఎన్నడూ తగ్గని రీతిలో, ప్రపంచాన్ని 48 రోజులు పోషించగల్గేంతకు అంటే 255 మిలియన్ టన్నులకు తగ్గిపోయాయి. గత సంవత్సరాల్లో నిల్వలు 60 దినాలకు సరిపోయేంత స్థాయికి తగ్గిపోయినప్పుడు ఆ కొరతను తిరిగి భర్తీ చేసేందుకు వీలైంది. అయితే ఇప్పుడు ఆ నష్టాన్ని తట్టుకోగల సామర్థ్యం భూమికి ఉందో లేదో వరల్డ్వాచ్ సంస్థకు తెలియదు.
మూడు సంవత్సరాలు పంటలు సరిగ్గా పండకపోవడం మరియు అభివృద్ధి చెందుతున్న అనేక దేశాలు తమ జంతువులకు దాణాగా ధాన్యాన్ని ఉపయోగించడం మూలంగా ధాన్యమే తమ అనుదిన ఆహారంగా గల పేద ప్రజలకు తగినంత ధాన్యం అందుబాటులో లేదు. ఈ పరిస్థితి వైపు వెంటనే అవధానాన్ని మళ్లించకపోతే, తమ ఆదాయంలో కనీసం 70 శాతాన్ని ఆహారం కొరకు వెచ్చించే ఒక వందకోట్ల ప్రజలు ఆకలితో అలమటించడం మొదలౌతుందని న్యూ సైంటిస్ట్ హెచ్చరిస్తుంది.
మన కాలంలోని భూనివాసులు ‘కరవులను’ అనుభవిస్తారని బైబిలు ముందే చెప్పింది. (లూకా 21:11) అయినప్పటికీ దేవుడు ఈ సమస్యను గురించి ఉదాసీనంగా లేడు. వాస్తవానికి, మానవుని దుస్థితి ఎడల ఆయనకుగల చింత ఆయన రాజ్యం భూపరిస్థితులను అదుపులో పెట్టే సమయంలో సంపూర్ణంగా కనపర్చబడుతుంది. “అప్పుడు భూమి దాని ఫలములిచ్చును.” “దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును.” (కీర్తన 67:6; 72:16) అప్పుడు సృష్టికర్తను గురించిన ఈ ప్రవచనార్థక మాటలు నెరవేరుతాయి: “నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు . . . లోయలు సస్యములతో కప్పబడియున్నవి.”—కీర్తన 65:9, 13.
ఈ అద్భుతమైన వాగ్దానం మీకు నచ్చిందా? అందులో మీరూ ఒక భాగం ఎలా కాగలరో మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఈసారి యెహోవాసాక్షులు మిమ్మల్ని దర్శించేందుకు వచ్చినప్పుడు వాగ్దానం చేయబడిన ఈ పరదైసును గురించి మరింత చెప్పమని వారిని అడగండి. కష్టాలతో నిండియున్న ఈ లోకంలో సహితం, దేవుని గూర్చి, ఆయన రాజ్యాన్ని గూర్చి, మానవజాతి ఎడల ఆయన అద్భుతకరమైన సంకల్పాన్ని గూర్చిన కచ్చితమైన జ్ఞానం మూలంగా మీరు సంతోషాన్ని పొందగలరు. మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే లేదా ఉచితంగా మీతో బైబిలును పఠించడానికి ఎవరైనా మీ ఇంటికి రావాలంటే, దయచేసి Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., India, లేదా రెండవ పేజీలో ఇవ్వబడిన చిరునామాలలో మీకనుకూలమైన దానికి వ్రాయండి.
[32వ పేజీలోని చిత్రసౌజన్యం]
ఇన్సెట్: Pictorial Archive (Near Eastern History) Est.