మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?
మీరు ఇటీవలి కావలికోట సంచికలను శ్రద్ధగా గమనించారా? అలాగైతే, ఈ క్రింద ఇవ్వబడిన వాటిని జ్ఞాపకం చేసుకోవడం ఆసక్తికరంగా ఉంటుందని మీరు భావించవచ్చు:
◻ అకుల, ప్రిస్కిల్లలు చూపిన మంచి మాదిరిని నేడు అనేకమంది వివాహిత దంపతులు ఏ విధంగా అనుసరిస్తున్నారు?
అకుల, ప్రిస్కిల్లలు అనేక వేర్వేరు సంఘాలలో సేవచేశారు. వారివలె, అనేకమంది ఉత్సాహపూరిత ఆధునికదిన క్రైస్తవులు అవసరం ఎక్కడ ఎక్కువగా ఉందో అక్కడికి వెళ్లడానికి తమను తాము అందుబాటులో ఉంచుకున్నారు. వారు కూడా రాజ్యాసక్తులు అభివృద్ధి చెందడాన్ని చూడడం నుండీ అమూల్యమైన క్రైస్తవ స్నేహాలను వికసించుకోగలగడం నుండీ వచ్చే ఆనందాన్ని, సంతృప్తిని అనుభవిస్తున్నారు.—12/15, పేజీ 24.
◻ మద్యపానీయాలను గూర్చిన బైబిలు దృక్కోణం ఏమిటి?
మద్యపానీయాలను గూర్చిన బైబిలు దృక్కోణం సమతుల్యమైనది. ఒకవైపు, వైన్ దేవుని నుండి వచ్చిన కానుక అని బైబిలు చెబుతుంది. (కీర్తన 104:1, 15) మరొకవైపు, అది అమిత మద్యపానాన్ని ఖండిస్తుంది. (లూకా 21:34; 1 తిమోతి 3:8; తీతు 2:3; 1 పేతురు 4:3)—12/15, పేజీ 27.
◻ బైబిలు పుస్తకమైన హగ్గయి యొక్క విశిష్టత ఏమిటి?
కేవలం 38 వచనాలతో రూపొందించబడిన హగ్గయి పుస్తకంలో, దేవుని నామము 35 సార్లు ఉపయోగించబడింది. యెహోవా అనే నామానికి బదులుగా “ప్రభువు” అనే బిరుదును ఉపయోగించినప్పుడు అలాంటి ప్రవచనం నిర్జీవమైపోయినట్లు అనిపిస్తుంది.—1/1, పేజీ 6.
◻ దావీదూ మనష్షేలు చేసిన పాపాల నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠమేమిటి?
యెహోవా దావీదునూ మనష్షేను క్షమించినప్పటికీ, వీరిరువురూ వీరితోపాటు ఇశ్రాయేలీయులు తమ పాపభరిత క్రియల పర్యవసానాలతో జీవించవలసి వచ్చింది. (2 సమూయేలు 12:11, 12; యిర్మీయా 15:3-5) అదే విధంగా, పశ్చాత్తాపం చెందిన పాపులను యెహోవా క్షమించినప్పటికీ, వారి ప్రవర్తన మూలంగా కల్గిన పర్యవసానాలు కొన్ని ఉండవచ్చు, వాటిని నివారించలేము.—1/1, పేజీ 27.
◻ దేవుని రాజ్యసువార్తను ప్రకటించువాని “పాదములు సుందరములు” అని ఏ విధంగా రుజువైంది? (యెషయా 52:7)
అది ఒక వ్యక్తి ఇతరులకు ప్రకటించడానికి వెళ్తుండగా అతన్ని తీసుకెళ్లే పాదమే. అటువంటి పాదం నిజానికి ఆ వ్యక్తికి ప్రాతినిధ్యం వహిస్తుంది. రాజ్య సువార్తను గూర్చి విని, దానికి ప్రతిస్పందించిన అనేకమందికి, అటువంటి సందేశకుల పాదాలు నిజానికి చూడ ముచ్చటైన దృశ్యంగా ఉందని మనం నిశ్చయంగా చెప్పగలం.—1/15, పేజీ 13.
◻ “సువార్తను ప్రకటించు”టలో ఏ రెండు అంశాలు ఇమిడివున్నాయి? (1 కొరింథీయులు 9:16)
మొదటిగా, మనం దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి. ఈ పని యొక్క రెండవ అంకంలో రాజ్య ప్రకటనకు అనుకూలంగా ప్రతిస్పందించే వారికి బోధించడం ఇమిడి ఉంది.—1/15, పేజీ 23.
◻ సంఘకూటాల్లో మనం రాజ్యగీతాలను పాడటం మనకు ఎటువంటి వ్యక్తిగత ప్రయోజనాలను తెస్తుంది?
మన సృష్టికర్త ఎడల మనకున్న భావాలను వ్యక్తం చేసేందుకు పాటలు పాడటం మనకు వీలు కలిగిస్తుంది. (కీర్తన 149:1, 3) సంఘంతో పాటూ మనం హృదయపూర్వకంగా పాడటం, తర్వాతి కార్యక్రమాన్ని చక్కగా వినేందుకు అది మనలను సరైన మానసిక, హృదయ పరిస్థితిలో ఉంచగలదు. యెహోవా ఆరాధనలో మరింత ఎక్కువగా పాల్గొనేందుకు మనలను పురికొల్పగలదు.—2/1, పేజీ 28.
◻ ఏ విధంగా మరణ దినం, జన్మదినానికన్నా మేలైనది కాగలదు? (ప్రసంగి 7:1)
మరణించే నమ్మకమైన వారిని పునరుత్థానం చేయగల యెహోవా దగ్గర ఒకడు మంచిపేరును తాను మరణించే నాటికి సంపాదించుకుంటే అతని జన్మదినంకంటే మరణ దినం మేలని దీని భావం. (యోహాను 11:25)—2/15, పేజీ 12.
◻ ప్రసంగి పుస్తకం మనకు వ్యక్తిగతంగా ఎందుకు సహాయపడాలి?
ఇది జీవితంపైనా, మనం కేంద్రీకరించే వాటిపైనా మన దృక్కోణాన్ని సరిచేసుకోవడానికి మనలో ప్రతి ఒక్కరికీ సహాయపడగలదు. (ప్రసంగి 7:2; 2 తిమోతి 3:16, 17)—2/15, పేజీ 16.
◻ యెహోవాసాక్షులు మూలసిద్ధాంతవాదులా?
కాదు. వారికి మతసంబంధంగా గట్టి నమ్మకాలు ఉన్నప్పటికీ, మూలసిద్ధాంతవాదులు అన్న పదం ఏ అర్థంలో ఉపయోగించబడుతుందో ఆ అర్థంలో వారు మూలసిద్ధాంతవాదులు కారు. తమతో ఏకీభవించని వారికి వ్యతిరేకంగా హింసాకాండకు ప్రదర్శనలకు ఒడిగట్టరు. వారు తమ నాయకుడైన యేసుక్రీస్తును అనుకరిస్తారు.—3/1, పేజీ 6.
◻ దేవుని ప్రతీకారాన్ని అమలు చేసేందుకు యేసు వచ్చే కచ్చితమైన సమయం తెలియకపోవడం, క్రైస్తవులపై ఏ ప్రభావాన్ని కల్గివుంటుంది?
ఇది క్రైస్తవులను మెలకువగా ఉండేటట్లు చేస్తూ యెహోవాను నిస్వార్థమైన దృక్పథాలతో సేవిస్తున్నామని రుజువు చేసుకునే అవకాశాన్ని ప్రతిదినమూ వారికి ఇస్తుంది.—3/1, పేజీ 13.
◻ మనలను మోసం చేసిన సహోదరునిపై చట్టపరమైన చర్యను తీసుకోవడానికి ముందుగా పరిగణనలోకి తీసుకోవలసినది ఏమిటి?
మనం చట్టబద్ధమైన చర్య తీసుకోవడం గురించి ఆలోచిస్తుంటే, అది మనపై, మరో వ్యక్తిపై లేక ఇతర వ్యక్తులపై, సంఘంపై, బయటివారిపై చూపగల ప్రభావాలను మనం పరిగణనలోకి తీసుకోవాలి. (1 కొరింథీయులు 6:7)—3/15, పేజీ 22.
◻ నిజమైన సంతోషాన్ని ఎలా పొందగలము?
నిజమైన సంతోషం అనేది యథార్థ విశ్వాసంపై మరియు యెహోవా దేవునితోనున్న మంచి సంబంధంపై ఆధారపడిన హృదయ పరిస్థితి. (మత్తయి 5:3)—3/15, పేజీ 23.
◻ జూరీ పని కొరకు పిలువబడినప్పుడు ఒక క్రైస్తవుడు ఏమి చేయాలి?
జూరీ పని మీద ఉన్న ప్రతి క్రైస్తవుడు బైబిలు గురించి తనకున్న అవగాహనపైనా, తన స్వంత మనస్సాక్షిపైనా ఆధారపడి, ఏ విధానాన్ని అనుసరించాలనేది నిశ్చయించుకోవాలి. (గలతీయులు 6:5)—4/1, పేజీ 29.