లక్షలాదిమంది వెళ్తున్నారు—మీరూ వెళ్తున్నారా?
వెళ్లేది ఎక్కడికి? యేసుక్రీస్తు మరణదిన వార్షిక ఆచరణకే. 1996వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1,29,21,933 మంది హాజరయ్యారు.
ప్రజలు ఎందుకు వెళ్తారు? మానవజాతి కొరకు యేసు మరణం సూచిస్తున్నదాన్ని బట్టే. ఇది రోగాలనుండి, బాధలనుండి, మరణంనుండి ఉపశమనాన్ని తీసుకొస్తుంది. అలాగే పరదైసుగా పునరుద్ధరించబడిన భూమిపై జీవించేందుకు మరణించిన ప్రియమైనవారిని పునరుత్థానులను చేస్తుంది.
యేసుక్రీస్తు మరణం అలాంటి ఆశీర్వాదాల్ని ఎలా తీసుకురాగలదు? దానిని తెలుసుకొనేందుకు మీరు ఆహ్వానించబడుతున్నారు. ఈ ప్రాముఖ్యమైన సంఘటన జరిగే సమయంలో తమతోపాటు సమావేశమయ్యేందుకు యెహోవాసాక్షులు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు.
మీకు సమీపంలోవున్న రాజ్యమందిరంలో హాజరవ్వండి. అది ఈ సంవత్సరం మార్చి 23, ఆదివారం సూర్యాస్తమయం తర్వాత జరుగుతుంది. కచ్చితమైన సమయం కోసం, స్థానికంగావున్న యెహోవాసాక్షుల్ని సంప్రదించండి.