కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 4/1 పేజీలు 3-4
  • ఈ కాలాలు ఎందుకింత చెడ్డగా ఉన్నాయి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఈ కాలాలు ఎందుకింత చెడ్డగా ఉన్నాయి?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?
    దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?
  • బైబిలు ఏం చెప్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2017
  • మనం బాధలనుభవించడానికి దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు?
    తేజరిల్లు!—2004
  • మానవ బాధలు—అవి ఎప్పటికైనా అంతమౌతాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 4/1 పేజీలు 3-4

ఈ కాలాలు ఎందుకింత చెడ్డగా ఉన్నాయి?

వార్తాపత్రిక చదవడానికో లేక టీవీ వార్తలు చూద్దామనో, రేడియోలో వచ్చే వార్తల్ని విందామనో మీరు కూర్చున్నప్పుడు, ఏదో దుర్వార్తను వినాల్సి వస్తుందని మీరనుకుంటారు, అనుకోరా? ఎంతో కాలంనుండి కొనసాగుతున్న ఒక యుద్ధం ఇంకా ఆగిపోలేదని, దౌర్జన్యపూరితమైన నేరం ఇంకా పెచ్చుపెరిగి పోతోందనీ లేక క్షామం ఒక వర్ధమాన దేశాన్ని ఇంకా పట్టి పీడిస్తూనే ఉందనే విషయాలను మీరు విన్నప్పుడు మీకు ఆశ్చర్యం కలుగకపోవచ్చు.

ఈ సంగతులు జరుగుతున్న ప్రాంతాలకు మీరు కొంత దూరంలో నివసిస్తుంటే, అలాంటి నివేదికల మూలంగా మీరు పదే పదే అంత పెద్దగా కలత చెందకపోవచ్చు. ఎంతైనా, అలా కష్టాలనుభవిస్తున్న జనాలందరి గురించీ చింతించే ఓపిక ఎవరికుంది? అయినప్పటికీ, బాధ వ్యక్తులను ప్రభావితం చేస్తున్న విధానాన్ని మనం ముఖాముఖిగా చూడవలసి వచ్చినప్పుడు మనం చలించకుండా ఉండలేము. వేరే మాటల్లో చెప్పాలంటే, ఒక యుద్ధాన్ని గురించి చదవడం, దానిలో మరణించిన వారి గణాంక వివరాలను గురించీ చదవడం ఒక విషయమైతే, ఒక బాంబు తమ ఇంటిని విధ్వంసం చేసినప్పుడు తన తల్లిని కోల్పోయిన బోస్నియాకు చెందిన ఓ తొమ్మిదేళ్ల పిల్లవాడైన అడ్నన్‌ను గురించి చదవడం పూర్తిగా భిన్నమైన విషయం. కొన్ని నెలల తర్వాత, అడ్నన్‌ తన తండ్రితో కలిసి వీధిలో నడిచి వెళ్తుండగా, ఒక తుపాకీ గుండు వచ్చి ఆ అబ్బాయి తండ్రికి తగలడంతో ఆయన మరణించాడు. కొన్ని వారాల తర్వాత అతని సహోదరి పాఠశాల ఆవరణలో వచ్చిపడిన బాంబు పేలినప్పుడు అతని కళ్లెదుటే ఆమె రక్తం స్రవించి మరణించడాన్ని చూశాడు. అడ్నన్‌కు మానసికంగా తగిలిన గాయాలకు చికిత్స చేస్తున్న వైద్యులు, ఆ పిల్లవాడు భావాలకు అతీతంగా పూర్తిగా స్తబ్ధుగా అయిపోయాడనీ కనీసం సంగతులను తెలుసుకోవాలనే ఆసక్తి కూడా లేదనీ గుర్తించారు. భయాలూ చేదు జ్ఞాపకాలు అతన్ని పగటి వేళ పీడిస్తున్నాయి; రాత్రివేళ పీడకలలు అతనికి ప్రశాంతంగా నిద్రపట్టనిచ్చేవి కాదు. అడ్నన్‌ ఓ గణాంకం కాదు. వాడు బాధపడుతున్న పిల్లవాడు; మనం వాడిని గురించి తప్పకుండా చింతిస్తాము.

అలాగే ప్రపంచంలోని ఇతర జబ్బుల విషయంలో కూడా అంతే. క్షామాన్ని గురించిన విషయాన్ని చదవడం ఒక విషయం; ఆకలితో నకనకలాడుతూ చావబోతున్న, కడుపు ఉబ్బెత్తుగా ఉండి కట్టెపుల్లల్లాంటి కాళ్లూ చేతులున్న ఐదేళ్ల పాప ఫోటోను చూడటం మరో విషయం. నేర గణాంక వివరాలను గురించి చదవడం ఒక విషయం; ఒక పెద్ద వయస్కురాలైన వితంతువు క్రూరంగా కొట్టబడి, దోచుకోబడి మానభంగానికి గురికావడాన్ని గురించి చదవడం పూర్తిగా వేరైన విషయం. కుటుంబం విచ్ఛిన్నం కావడాన్ని గురించి చదవడం ఒక విషయం; ఒక తల్లి తన స్వంత పిల్లవాన్ని ఉద్దేశపూర్వకంగా ఎండగాల్చి, భయంకరంగా హింసించడాన్ని గురించి తెలుసుకోవడం పూర్తిగా భిన్నమైన విషయం.

అలాంటి విషయాలను గురించి చదవడం బాధాకరంగా ఉంటుంది. అయితే ఈ ప్రపంచవ్యాప్త మహామారుల్లో ఒకటి ప్రత్యక్షంగా మనల్ని బాధిస్తుంటే అప్పుడెంత దుఃఖకరంగా ఉంటుంది! మీరు వ్యక్తిగతంగా దుష్టత్వాన్ని ఎదుర్కొంటే, ప్రపంచ వార్తల్లో నివేదించబడుతున్న భయంకరమైన పరిస్థితి నిస్సహాయతను కలిగిస్తుంది. నేరం, యుద్ధం, క్షామం మరియు వ్యాధుల ద్వారా కలిగే బాధ మానవచరిత్రలో ఊహించలేనంత ప్రమాణంలో పెరిగిపోతుందన్న వాస్తవాన్ని ఎదుర్కోవడం భయాన్ని కలిగిస్తుంది. ఈ ఇరవయ్యవ శతాబ్దంలోని వాస్తవాలతో వ్యవహరించడం వల్ల వచ్చే ప్రభావాలు చాలా విపరీతంగా ఉండవచ్చు, ఆందోళన, భయం మరియు నిరాశ అనేవి సర్వ సాధారణం.

పరిస్థితులు ఎందుకింత చెడ్డగా ఉన్నాయి? మానవజాతి ఎటు పయనిస్తోంది? వంటి కలతపరిచే ప్రశ్నలకు సమాధానాలను కనుగొనాలని అనేక మతాలకు చెందిన ప్రజలు ప్రయత్నిస్తున్నారు.

దుఃఖకరంగా, నేటి మతాలు సంతృప్తిదాయకమైన సమాధానాలను సాధారణంగా ఇవ్వలేవు. ఈ పత్రిక ముఖపత్రంపై ఉన్న ప్రశ్నను మీరు మొదట చదివినప్పుడు మీరు నిరాశావాదంగా ప్రతిస్పందించి ఉంటారు, అది అర్థం చేసుకోగల ప్రతిస్పందన. మూల సిద్ధాంత వాద మతాలు తరచూ బైబిలు చెప్పని విషయాలను అంటే ఈ ప్రపంచం ఏ దినంలోని ఏ గడియలో అంతమొందుతుంది అనే విషయాన్ని దాని నుండి అన్వయించాలని ప్రయత్నిస్తారు. (మత్తయి 24:36 చూడండి.) ఈ పత్రిక ప్రకాశకులు విషయాలను బైబిలు తానే వివరించేందుకు దాన్ని అనుమతిస్తారు. అంత్య దినాలను గురించిన బైబిలు చర్చ వాస్తవమైనది సహేతుకమైనదని తెలుసుకుని మీరు ఆశ్చర్యపోవచ్చు. పరిస్థితులు ఎందుకింత చెడుగా మారుతున్నాయో వివరించడం కంటే బైబిలు ఎక్కువే చేస్తుంది. నిజంగా ఆదరణకరమైన నిరీక్షణను కూడా అది భవిష్యత్తు కొరకు అందిస్తుంది. అదెలా సాధ్యమో తెలుసుకునేందుకు మా తదుపరి శీర్షికలను పరిశీలించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

Jobard/Sipa Press

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి