అణచి వేయబడిన వారికి ఆదరణ
మీ జీవితకాలమందంతటిలో కొన్ని మాటలు పతాక శీర్షికల్లో పదేపదే పునరావృతం కావడాన్ని మీరు గమనించారా? యుద్ధం, నేరం, విపత్తులు, ఆకలి, బాధ వంటి మాటల్ని చదివి చదివి విసిగిపోయారా? అయితే ఒక్క పదం మాత్రం వార్తా నివేదికల్లో ప్రముఖంగా కనబడకుండా పోయింది. అయినా అది మానవజాతికి తప్పక అవసరమైన దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పదం. ఆ పదమే “ఆదరణ.”
“ఆదరణ” అంటే ఒకనికి “బలాన్ని, నిరీక్షణను ఇవ్వడమని” మరియు “దుఃఖం లేక కష్టాన్నుండి ఉపశమనం కల్గించడమని” భావం. ఈ 20వ శతాబ్దంలో ప్రపంచం అనుభవించిన కల్లోలం మూలంగా, నిరీక్షణ మరియు బాధనుండి విముక్తి ఎంతైనా అవసరం. నిజమే, మన పూర్వికుల ఊహకు కూడా అందని అనేకమైన వసతి సౌకర్యాల్ని మనలో కొంతమంది నేడు అనుభవిస్తున్నారు. ప్రధానంగా ఇది విజ్ఞానశాస్త్ర పురోభివృద్ధి మూలంగానే సాధ్యమైంది. కాని మానవజాతి నుండి బాధకు కారణాలైన వాటినన్నిటినీ తొలగించివేసే రీతిలో విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం మనల్ని ఆదరించలేదు. ఈ కారణాలు ఏవైవున్నాయి?
అనేక శతాబ్దాల క్రిందటే జ్ఞానియైన సొలొమోను “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు” అని చెప్పినప్పుడు బాధకు ప్రధానమైన ఓ కారణాన్ని గూర్చి ఆయన తెలియజేశాడు. (ప్రసంగి 8:9) తన తోటి మానవునిపై పెత్తనం చెలాయించాలని కోరుకొనే మానవ ప్రవృత్తిని విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం మార్చలేకపోయాయి. ఈ 20వ శతాబ్దంలో, ఇది దేశాల్లో అణచివేసే నియంతృత్వ పాలనలకు, దేశాల మధ్య భయానకమైన యుద్ధాలకు నడిపించింది.
1914 నుండి యుద్ధాల మూలంగా పదికోట్లమందికి పైగా ప్రజలు చనిపోయారు. ఈ సంఖ్యకు ప్రాతినిధ్యం వహిస్తున్న మానవ ఆవేదనను అంటే ఆదరణ అవసరమైన దుఃఖసాగరంలో ఉన్న కోట్లాది కుటుంబాల ఆవేదనను గూర్చి ఆలోచించండి. హింసాత్మక మరణాలతోపాటు అనేకమైన ఇతర బాధలకు యుద్ధాలు నడిపించాయి. రెండవ ప్రపంచ యుద్ధానంతరం, యూరప్‌నందు 1.2 కోట్లమందికిపైగా శరణార్థులు ఉన్నారు. ఇటీవల సంవత్సరాల్లో ఆగ్నేయ ఆసియాలోని యుద్ధ ప్రదేశాల్ని విడిచి 15 లక్షలమందికి పైగా పారిపోయారు. బాల్కన్స్‌లోని యుద్ధం 20 లక్షలమందికి పైగా తమ ఇళ్లను విడిచి పారిపోయేలా ఒత్తిడి చేసింది. మరి అనేక సందర్భాల్లోనైతే “జాతి ప్రక్షాళన” నుండి తప్పించుకోవాల్సి వచ్చింది.
శరణార్థులకు, విశేషంగా తాము మోసుకెళ్లగల్గేవే తప్ప మరేవీలేని వారికి, ఎక్కడికెళ్లాలో తెలియక లేక తాము, తమ కుటుంబాల భవిష్యత్ ఏమిటో ఎరుగక, తమ ఇళ్లను విడిచి వెళ్లాల్సి వచ్చినవారికి ఆదరణ తప్పక అవసరం. అణచివేతకు గురై మరింత దయనీయమైన స్థితిలోవున్న బాధితులలో అటువంటి ప్రజలు ఉన్నారు, వారికి ఆదరణ అవసరం.
మరింత శాంతియుతంగావున్న భూభాగాల్లో, ప్రపంచ ఆర్థిక విధానానికి కోట్లాదిమంది ప్రజలు నిజంగా ఊడిగం చేస్తున్నారు. నిజమే, కొందరు సమృద్ధికరమైన వస్తు సంపదను కల్గివున్నారు. అయినా, అత్యధికులు జీవనాధారాన్ని సంపాదించడంలో అనుదిన పోరాటం సల్పుతున్నారు. అనేకులు మంచి ఇళ్ల కొరకు అన్వేషిస్తున్నారు. నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోంది. “2020వ సంవత్సరం నాటికి 130 కోట్లమంది అదనంగా ఉద్యోగాల వేటలో ఉండడంతో ఇంతకు ముందెన్నడూలేనంతగా ఉద్యోగ విపత్తును ప్రపంచం ఎదుర్కోబోతోంది” అని ఒక ఆఫ్రికన్ వార్తాపత్రిక జోస్యం చెప్పింది. ఆర్థికంగా అణచివేయబడిన వారికి “బలాన్ని, నిరీక్షణను” ఇచ్చే ఆదరణ కచ్చితంగా అవసరం.
విషమ పరిస్థితులకు ప్రతిస్పందనగా కొందరు నేరస్థులుగా మారారు. వారి బారిన పడినవారికి ఇది కష్టాల్ని మాత్రమే సృష్టిస్తుంది అనుకోండి, అణచివేయబడ్డామన్న భావనకు పెరుగుతున్న నేరాల రేట్లు తోడయ్యాయి. దక్షిణ ఆఫ్రికాలోని జోహాన్స్‌బర్గ్ వార్తాపత్రికయైన ది స్టార్‌లో ఇటీవల ఓ పతాక శీర్షిక ఇలా పేర్కొంది: “‘ప్రపంచంలోని ఘోర హత్యోన్ముఖ దేశంలో’ ఓరోజు జీవితం.” జోహాన్స్‌బర్గ్‌లోను దాని చుట్టుప్రక్కల ఓ విశిష్టమైన రోజును గురించి ఆ శీర్షిక వర్ణించింది. ఆ ఒక్కరోజులోనే నల్గురు హత్యచేయబడ్డారు, ఎనిమిదిమంది మోటారు వాహనాలు దొంగిలించబడ్డాయి. ఒక మధ్య తరగతి వాళ్లు నివసిస్తున్న నగర శివార్లలో పదిహేడుమంది దోపిడీ దొంగలున్నట్టు పేర్కొనబడింది. దానికితోడు, సాయుధ దొంగల ముఠాలు అనేకం ఉన్నాయి. ఈ రోజు “చెప్పాలంటే నెమ్మదైన” రోజు అని పోలీసులు వర్ణించినట్లు ఆ వార్తాపత్రిక నివేదించింది. హత్యకు గురైనవారి బంధువులు అలాగే ఇళ్లదోపిడికి, కార్ల దొంగతనానికి గురైనవారు ఎంతగానో అణచివేయబడినట్లు భావిస్తారన్న విషయం గ్రహించదగినదే. వారికి అభయం, నిరీక్షణ అదే ఆదరణ అవసరం.
కొన్ని దేశాల్లో తమ పిల్లల్ని వ్యభిచారానికి అమ్మే తల్లిదండ్రులు ఉన్నారు. “లైంగిక విహార యాత్రల”పై సందర్శకులు తండోపతండాలుగా వచ్చే ఒక ఆసియా దేశం, 20 లక్షలమంది వ్యభిచారిణులను కల్గివున్నట్లు నివేదించింది, వారిలో అనేకులు పిల్లలుగా ఉన్నప్పుడే అమ్మివేయబడ్డారు లేక అపహరించబడ్డారు. దయనీయ స్థితిలోవున్న ఈ బాధితులకన్నా ఎక్కువగా అణచివేయబడిన వారెవరైనా ఉన్నారా? టైమ్ మాగజీన్ ఈ నీచమైన వృత్తిని గూర్చి చర్చిస్తూ 1991 నాటి ఆగ్నేయ ఆసియా మహిళల సంస్థల కాన్ఫరెన్స్‌ను గురించి రిపోర్టు చేసింది. “1970ల మధ్య కాలం నుండి ప్రపంచవ్యాప్తంగా మూడుకోట్లమంది స్త్రీలు అమ్మబడ్డారని” అక్కడ అంచనావేయబడింది.
పిల్లలు బాధితులయ్యేందుకు వేశ్యావృత్తికే అమ్మబడనవసరంలేదు. తల్లిదండ్రులచే, బంధువులచే తమ స్వంత గృహాల్లోనే శారీరకంగా హింసించబడిన లేదా అత్యాచారం గావించబడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. అటువంటి పిల్లలు భావోద్రేక గాయాల్ని దీర్ఘకాలంగా భరించాల్సి ఉండవచ్చు. అణచివేతకు గురైన విషాదకరమైన బాధితులుగా వారికి కచ్చితంగా ఆదరణ అవసరమే.
అణచివేతను నిశితంగా పరిశీలించిన ఓ ప్రాచీనవ్యక్తి
మానవ అణచివేత స్థాయిని చూసి రాజైన సొలొమోను విభ్రాంతి చెందాడు. ఆయనిలా వ్రాశాడు: “సూర్యునిక్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించితిని. బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు; వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడును లేకపోయెను.”—ప్రసంగి 4:1.
ఆదరణకర్త కావాల్సిన విషమ పరిస్థితిలో అణచివేయబడినవారు ఉన్నారని 3,000 సంవత్సరాల క్రిందటే జ్ఞానియైన రాజు గ్రహిస్తే, ఈనాటి పరిస్థితిని గురించి ఆయనేమని చెప్పగలడు? అయితే, తనతోసహ ఏ అపరిపూర్ణ మానవుడూ మానవజాతికి అవసరమైన ఆదరణను ఇవ్వలేడని సొలొమోనుకు తెలుసు. బాధించువారిని నిర్మూలించడానికి గొప్పవాడొకడు అవసరం. అటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా?
బైబిలులో కీర్తన 72 సమస్త జనుల్ని ఆదరించే ఓ గొప్ప ఆదరణకర్తను గురించి మాట్లాడుతోంది. ఈ కీర్తనను సొలొమోను తండ్రియైన దావీదు వ్రాశాడు. దాని పైవిలాసం ఇలా చదువబడుతోంది: “సొలొమోనుకు సంబంధించిన.” తన సింహాసనాన్ని స్వతంత్రించుకొనే వానిని గౌరవిస్తూ వృద్ధుడైన దావీదు దీనిని వ్రాశాడని స్పష్టమౌతుంది. ఈ కీర్తన ప్రకారంగా ఈయన, అణిచివేయబడిన వారికి శాశ్వతమైన ఉపశమనాన్ని తీసుకొస్తాడు. “అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపోవువరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రమునుండి సముద్రమువరకు . . . భూదిగంతములవరకు అతడు రాజ్యము చేయును.”—కీర్తన 72:7, 8.
దావీదు ఈ మాటల్ని వ్రాసినప్పుడు ఆయన తన కుమారుడైన సొలొమోను గురించి యోచిస్తున్నట్లుగా కనబడుతోంది. కాని ఆ కీర్తనలో వర్ణించబడిన రీతిలో మానవజాతికి సేవచేయడం తన శక్తికి మించినదని సొలొమోను గుర్తించాడు. ఆ కీర్తనలోని మాటల్ని ఆయన కేవలం తక్కువ స్థాయిలో, యావత్ భూనివాసుల ప్రయోజనార్థంగాక ఇశ్రాయేలు జనాంగం పక్షంగా మాత్రమే నెరవేర్చగలిగాడు. ప్రేరేపించబడిన ఈ ప్రవచనాత్మక కీర్తన, సొలొమోను కన్నా ఎంతో గొప్పవాడైన ఒకనిని సూచిస్తోంది. ఆయనెవరు? ఆయన యేసుక్రీస్తు మాత్రమే కాగలడు.
యేసు జననాన్ని గురించి దేవదూత ప్రకటించినప్పుడు ఆయనిలా చెప్పాడు: “ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును.” (లూకా 1:32) అంతేగాక యేసు తననుతాను ‘సొలొమోనుకంటె గొప్పవానిగా’ తెలియజేసుకున్నాడు. (లూకా 11:31) యేసు దేవుని కుడిపార్శ్వానికి పునరుత్థానం చేయబడినప్పటి నుండి, ఆయన తాను కీర్తన 72లోని మాటల్ని నెరవేర్చగలిగే స్థలమైన పరలోకంలో ఉన్నాడు. అంతేకాకుండా, మానవులను బాధించేవారి కాడిని విరుగగొట్టేందుకు దేవుని నుండి శక్తిని, అధికారాన్ని ఆయన పొందాడు. (కీర్తన 2:7-9; దానియేలు 2:44) కాబట్టి కీర్తన 72లోని మాటల్ని నెరవేర్చేవాడు యేసుక్రీస్తే.
అణచివేత త్వరలోనే అంతమౌతుంది
దీని భావం ఏమిటి? మానవ అణచివేతలన్నిటి నుండి లభించబోయే స్వాతంత్ర్యం త్వరలోనే నిజం కాబోతుందని దాని భావం. ఈ 20వ శతాబ్దం చవిచూసిన నివారింపలేని బాధ, అణచివేతలు ‘ఈ విధానాంతాన్ని’ గుర్తించే సూచనలోని భాగంగా యేసు ప్రవచించాడు. (మత్తయి 24:3) ఇతర విషయాలతోపాటు “జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును” అని ఆయన ప్రవచించాడు. (మత్తయి 24:7) 1914లో ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద్ధ కాలాన్ని గూర్చిన ఆ ప్రవచనపు విశిష్టభాగ నెరవేర్పు ఆరంభమైంది. “అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును” అని కూడా యేసు తెలియజేశాడు. (మత్తయి 24:12) అక్రమము, ప్రేమలేనితనం ఒక చెడ్డదైన అణచివేసే తరాన్ని ఉద్భవింపజేశాయి. అందుకే, భూమి యొక్క క్రొత్త రాజుగా యేసుక్రీస్తు జోక్యం చేసుకోవడానికి సమయం ఆసన్నమైంది. (మత్తయి 24:32-34) యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మరియు దైవికంగా నియమించబడిన మానవజాతి ఆదరణకర్తగా ఆయనవైపు చూచు అణచివేయబడిన మానవుల విషయంలో దీని భావం ఏమై ఉంటుంది?
ఆ ప్రశ్నకు జవాబుగా, యేసుక్రీస్తునందు నెరవేరిన కీర్తన 72లోని కొన్ని అదనపు మాటల్ని మనం చదువుదాము: “దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును. బీదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును.” (కీర్తన 72:12-14) ఆ విధంగా దేవుని నియమిత రాజైన యేసుక్రీస్తు అణిచివేత మూలంగా ఎవ్వరూ బాధపడకుండా చూస్తాడు. అన్ని రకాలైన అన్యాయాల్ని అంతంచేసే శక్తి ఆయనకుంది.
‘అది బాగానే ఉంది గాని ఇప్పటి సంగతేమిటి? ఇప్పుడు బాధను అనుభవిస్తున్న వారికి ఏ ఆదరణవుంది?’ అని ఒకరు అడగవచ్చు. నిజానికి, అణిచివేయబడిన వారికి ఆదరణవుంది. ఈ పత్రికలోని తర్వాతి రెండు శీర్షికలు ఇప్పటికే లక్షలాదిమంది సత్యదేవుడైన యెహోవాతోను ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుతోను సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకోవడం ద్వారా ఆదరణను ఎలా అనుభవిస్తున్నారో చూపిస్తాయి. అటువంటి సన్నిహిత సంబంధం ఈ అణచివేత కాలాల్లో మనకు ఆదరణను ఇవ్వగలవు మరియు అణచివేతలేని నిత్యజీవానికి ఒక వ్యక్తిని నడిపించగలవు. దేవునికి చేసిన ప్రార్థనలో యేసు ఇలా చెప్పాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.”—యోహాను 17:3.
[4, 5వ పేజీలోని చిత్రం]
దేవుని నూతన లోకంలో మానవులెవ్వరూ ఒకరినొకరు అణచివేసుకోరు