కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 10/1 పేజీలు 14-19
  • విభాగిత ప్రపంచంలో క్రైస్తవ ఆతిథ్యం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విభాగిత ప్రపంచంలో క్రైస్తవ ఆతిథ్యం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘దిక్కులేనివారిని విధవరాండ్రను పరామర్శించడం’
  • మన మధ్య విదేశీయులున్నారా?
  • పరిశుద్ధులతో పాలివారవ్వండి
  • ప్రత్యేక సందర్భాలు
  • ‘సణుగుకొనకుండ ఆతిథ్యము ఇవ్వండి’
  • ఆతిథ్యం—సంతోషాన్నిచ్చే ప్రాముఖ్యమైన చర్య
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • “ఆతిథ్యము ఇచ్చుచుండుడి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ‘ఒకరికొకరు ఆతిథ్యమివ్వండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • అనాథలకు విధవరాండ్రకు కష్ట సమయాల్లో అండగా నిలవండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 10/1 పేజీలు 14-19

విభాగిత ప్రపంచంలో క్రైస్తవ ఆతిథ్యం

“మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టివారికి ఉపకారముచేయ [“ఆతిథ్యమివ్వ,” NW] బద్ధులమై యున్నాము.”—3 యోహాను 8.

1. బహుగా కోరదగిన ఏ బహుమానాలు సృష్టికర్త మానవజాతికి అనుగ్రహించాడు?

“అన్నపానములు పుచ్చుకొని సంతోషించుటకంటె మనుష్యులకు లాభకరమైనదొకటియులేదు . . . బ్రదికి కష్టపడ వలెనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగానున్నది.” (ప్రసంగి 8:15) తన మానవ సృష్టి ఆనందాన్ని సంతోషాన్ని పొందాలని మాత్రమే కాదుగాని వారు వాటిని పొందే మార్గదర్శకాల్ని కూడా దేవుడు ఏర్పాటు చేశాడని సమాజాన్ని సమకూర్చేవాడైన ప్రాచీన హెబ్రీయుడు మనకు ఆ మాటలలో తెలియజేస్తున్నాడు. తాము ఆనందించాలని, ఆహ్లాదకరమైన సమయాన్ని గడపాలనే ఓ సామాన్యమైన కోరిక మానవజాతి చరిత్రయంతటా ప్రతిచోటవున్న ప్రజల్లో కనబడుతుంది.

2. (ఎ) మానవజాతి కొరకు యెహోవా సంకల్పించిన దానిని వారేవిధంగా దుర్వినియోగపర్చారు? (బి) దాని ఫలితమేమిటి?

2 ప్రజలు విలాసాల్ని వెంబడించడంలోను కాలక్షేపం చేయడంలోను మునిగిపోయిన సుఖవాదిత సమాజంలో నేడు మనం జీవిస్తున్నాం. బైబిలు ప్రవచించినట్లుగానే ప్రజల్లో అనేకులు “స్వార్థప్రియులు . . . దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు”నై ఉన్నారు. (2 తిమోతి 3:1-4) అవును, ఇది యెహోవా దేవుడు సంకల్పించిన దానికి ఘోర వక్రీకరణయైవుంది. సరదా సమయాల్ని వెంబడించడమే మీ ప్రధాన గమ్యమైనప్పుడు లేక స్వసంతోషమే ఏకైక లక్ష్యమైనప్పుడు నిజమైన సంతృప్తి ఉండదు, ‘అదంతా వ్యర్థము, గాలికి ప్రయాసపడినట్టుగానే’ ఉంటుంది. (ప్రసంగి 1:14; 2:11) తత్ఫలితంగా లోకం ఏకాంతంగానున్న నిరుత్సాహపర్చబడిన ప్రజలతో నిండిపోయింది, తిరిగి వారు సమాజంలోని అనేక సమస్యలకు కారణమౌతున్నారు. (సామెతలు 18:1) ప్రజలు ఒకరినొకరు సంశయించేవారై జాతిపరంగాను తెగలుపరంగాను సాంఘికంగాను ఆర్థికంగాను విభాగించబడ్డారు.

3. నిజమైన ఆనందాన్ని తృప్తిని మనమెలా కనుగొనగలం?

3 ఇతరులతో యెహోవా వ్యవహరించిన విధానాన్ని అంటే దయగాను ఉదారంగాను ఆతిథ్యమిచ్చేవారిగాను ఉండడాన్ని ప్రజలు అనుకరించినట్లయితే పరిస్థితులు ఎంత భిన్నంగా ఉంటాయో! మన స్వంత కోరికల్ని తృప్తిపర్చుకోవడానికి ప్రయత్నించడంలో నిజమైన సంతోషానికి కీలకంలేదని విశదపర్చాడు. బదులుగా, కీలకమిదే: “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.” (అపొస్తలుల కార్యములు 20:35) నిజమైన ఆనందాన్ని సంతృప్తిని కనుగొనేందుకు మనల్ని పరిమితంచేసే ప్రతిబంధకాల్ని, విభజనల్ని మనం అధిగమించాలి. మనతోపాటు యెహోవాను సేవిస్తున్న వారిని మనం చేరుకోవాలి. మనమీ సలహాను లక్ష్యపెట్టడం అవసరం: “మనము సత్యమునకు సహాయకుల మవునట్టు అట్టివారికి ఉపకారముచేయ [“ఆతిథ్యమివ్వ,” NW] బద్ధులమై యున్నాము.” (3 యోహాను 8) మన పరిస్థితులు అనుమతించిన మేరకు అర్హులైనవారికి ఆతిథ్యాన్ని ఇవ్వడం, రెండు విధాలుగా లాభాన్ని చేకూరుస్తుంది—అది ఇచ్చేవారికి, పుచ్చుకునేవారికి ఇరువురికీ ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. అయితే మనం ‘ఆతిథ్యానికి ఆహ్వానించవలసిన’ అర్హులైనవారు ఎవరు?

‘దిక్కులేనివారిని విధవరాండ్రను పరామర్శించడం’

4. కొంతమంది యెహోవా ప్రజల్లో సహితం కుటుంబ బాంధవ్యాల్లో ఏ మార్పు కనబడింది?

4 సుస్థిరమైన కుటుంబాలు, సంతోషకరమైన వివాహ జీవితాలు నేడు అరుదు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న విడాకుల రేట్లు, అవివాహిత తల్లుల సంఖ్య సాంప్రదాయక కుటుంబ వ్యవస్థను తీవ్రంగా మార్చివేశాయి. తత్ఫలితంగా, ఇటీవల సంవత్సరాల్లో యెహోవాసాక్షులైన వారిలో అనేకులు విడిపోయిన కుటుంబాల నుండి వచ్చినవారే. వారు అటు విడాకులు తీసుకున్నవారైనా కావొచ్చు లేక ఇటు తమ వివాహజతల నుండి వేరైనవారైనా కావొచ్చు, లేక తల్లిదండ్రులలో ఏ ఒక్కరోవున్న కుటుంబాల్లో జీవిస్తున్నవారై ఉంటారు. దానికితోడుగా యేసు ప్రవచించినట్లుగానే, ఆయన బోధించిన సత్యం అనేక కుటుంబాల్లో విభజనల్ని తీసుకొచ్చింది.—మత్తయి 10:34-37; లూకా 12:51-53.

5. విభాజిత కుటుంబాల్లో ఉన్నవారికి ప్రోత్సాహకరమైన మూలంగా ఉండగలిగే దేనిని యేసు తెలియజేశాడు?

5 సత్యం నిమిత్తం క్రొత్తవారు స్థిరమైన స్థానాన్ని తీసుకోవడాన్ని చూడడం మన హృదయాన్ని ఉల్లసింపజేస్తుంది, యేసు చేసిన ఈ ప్రోత్సాహకరమైన వాగ్దానంతో మనం వారిని తరుచుగా ఓదారుస్తాము: “నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతోపాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”—మార్కు 10:29, 30.

6. మనమే విధంగా ‘దిక్కులేనివారికి, విధవరాండ్ర’కు ‘సహోదరులు, సహోదరీలు, తల్లులు, పిల్లలము’ కాగలము?

6 అయినా, ఈ ‘సహోదరులు, సహోదరీలు, తల్లులు మరియు పిల్లలు’ ఎవరై ఉన్నారు? తమ్మును తాము సహోదరులు, సహోదరీలు అని పిల్చుకుంటున్న రాజ్యమందిరంలో పెద్ద సంఖ్యలోవున్న ప్రజల్ని, తరచుగా వందమందో లేక అంతకుపైగానోవున్న ప్రజల్ని చూడడమే ఒక వ్యక్తికి, వీళ్లే నా సహోదరులు సహోదరీలు తల్లులు మరియు పిల్లలు అనే భావనను దానంతటదే కలుగజేయదు. ఈ విషయాన్ని ఆలోచించండి: మన ఆరాధన యెహోవాకు ప్రీతికరమైనదిగా ఉండు నిమిత్తం మనం ‘దిక్కులేనివారిని విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించాలి మరియు ఇహలోకమాలిన్యాన్ని మనకంటకుండ మనల్ని మనం కాపాడు’కోవాలని శిష్యుడైన యాకోబు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. (యాకోబు 1:27) ఆర్థిక గర్వం, సామాజిక స్థాయి వంటి ప్రాపంచిక దృక్పథాలు అలాంటి ‘దిక్కులేనివారి ఎడల విధవరాండ్ర ఎడల’ మన కరుణా ద్వారాల్ని మూసివేయడానికి మనం అనుమతించకూడదని దాని భావం. బదులుగా, మన సహవాసాన్ని, ఆతిథ్యాన్ని వారి ఎడల విస్తృతపర్చేందుకు మనం తప్పక చొరవ తీసుకోవాలి.

7. (ఎ) ‘దిక్కులేని వారికి, విధవరాండ్ర’కు ఆతిథ్యం ఇవ్వడంలోగల నిజమైన ఉద్దేశ్యం ఏమిటి? (బి) క్రైస్తవ ఆతిథ్యాన్ని కనపర్చడంలో ఎవరు కూడా భాగం వహించగల్గవచ్చు?

7 ‘దిక్కులేనివారికి విధవరాండ్రకు’ ఆతిథ్యాన్ని ఇవ్వడమంటే ప్రతిసారి వస్తుదాయకంగా వారికి కొదువుగా ఉన్నవాటిని తీర్చడమనే కాదు. తల్లిదండ్రులలో ఒక్కరేవున్న కుటుంబాలు లేక మతపర విభాజిత కుటుంబ సభ్యులు ఆర్థిక సంక్లిష్టమైన పరిస్థితిలో ఉండకపోవచ్చు. అయినా, క్షేమాభివృద్ధికరమైన సహవాసం, కుటుంబ వాతావరణం, విభిన్న వయస్కులైన వ్యక్తులతో సహవాసం, మంచి ఆత్మీయ విషయాల్ని పంచుకోవడం వంటివే అమూల్యమైన జీవిత ముఖ్య లక్షణాలైవున్నాయి. కాబట్టి ఆ సంఘటన భారీఎత్తున జరగడం కాదుగాని ప్రేమ ఐక్యత భావాలే ప్రాముఖ్యమని గుర్తుంచుకోవాలి, అప్పుడప్పుడు ‘దిక్కులేనివారు, విధవరాండ్రు’ కూడా తోటి క్రైస్తవులకు ఆతిథ్యాన్ని ఇవ్వడంలో భాగం వహించడం ఎంత చక్కని విషయమో కదా!—1 రాజులు 17:8-16 పోల్చండి.

మన మధ్య విదేశీయులున్నారా?

8. యెహోవాసాక్షుల అనేక సంఘాల్లో ఏ మార్పు కనబడింది?

8 విస్తృతస్థాయిలో ప్రవాసం జరుగుతున్న కాలంలో మనం జీవిస్తున్నాం. “తాము పౌరులుకాని దేశాల్లో ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్లమందికి పైగా ప్రజలు జీవిస్తున్నారు, తమ స్వదేశాల నుండి రెండుకోట్ల ముప్పైలక్షలమంది నిర్వాసితులయ్యారు” అని వల్డ్‌ ప్రెస్‌ రివ్యూ చెబుతోంది. ఒక జాతి లేక జనాంగంతో కూర్చబడిన యెహోవా ప్రజల సంఘాలున్న అనేక ప్రాంతాల్లో విశేషంగా పెద్ద నగరాల్లో ఈ ప్రత్యక్ష పరిణాముంది, అవి ఇప్పుడు ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాలనుండి వచ్చిన ప్రజల్ని కల్గివున్నాయి. బహుశా మీరున్న ప్రాంతంలో కూడా ఇది నిజమై ఉండవచ్చు. అయినా మన భాష, ఆచారాలు, జీవన పద్ధతులకు భిన్నమైన వాటిని కల్గివున్న ‘పరదేశీయులని’ ‘విదేశీయులని’ లోకం పిలుస్తున్న వీరిని మనమెలా దృష్టించాలి?

9. క్రైస్తవ సంఘంలోనికి వస్తున్న ‘పరదేశుల్ని,’ ‘విదేశీయుల్ని’ మనం దృష్టించే విధానం విషయంలో మనమే గంభీరమైన ఉరిలో చిక్కుకోగలం?

9 సరళంగా చెప్పాలంటే, అపరిచితమైన లేక అన్య దేశంగా ప్రసిద్ధిగాంచిన దేశంనుండి వచ్చిన వారికన్నా సత్యాన్ని తెలుసుకున్న మనం మరింత ఆధిక్యతాపాత్రులమని భావించేలాచేసే విదేశీయవిముఖతా ధోరణులను మనం అనుమతించకూడదు; లేక క్రొత్తగా వచ్చిన వీరు రాజ్యమందిరాన్ని లేక ఇతర ఆస్తుల్ని అక్రమంగా ఉపయోగించుకుంటున్నట్లుగా మనం భావించకూడదు. అటువంటి దృక్పథాలకు ఆశ్రయమిచ్చిన మొదటి శతాబ్దంలోని యూదా క్రైస్తవులలో కొందరికి, నిజంగా యోగ్యుడైనవాడెవడూ లేడని అపొస్తలుడైన పౌలు జ్ఞాపకంచేయాల్సి వచ్చింది; ఎవడైనా రక్షణ పొందేందుకు చివరకు సాధ్యంచేసేది దేవుని కృపాతిశయమే. (రోమీయులు 3:9-12, 23, 24) ఏదో ఒకవిధంగా, సువార్త వినే అవకాశాన్ని నిరాకరించిన అనేకమంది ప్రజల్ని దేవుని కృపాతిశయం ఇప్పుడు చేరుకుంటున్నందుకు మనం సంతోషించాలి. (1 తిమోతి 2:4) వారి ఎడలగల మన మక్కువ యథార్థమైనదని మనమెలా చూపగలం?

10. మన మధ్యవున్న ‘విదేశీయుల’కు మనం యథార్థంగా ఆతిథ్యమిస్తున్నామని మనమెలా కనబరుచుకోగలం?

10 పౌలు యొక్క ఈ ఉద్బోధనను మనం అనుసరించగలం: “క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చుకొనుడి.” (రోమీయులు 15:7) ఇతర ప్రాంతాలనుండి లేక వెనుకచరిత్రలనుండి వచ్చిన ప్రజలు తరచూ కనీస సౌకర్యాల్లేనివారని గుర్తించాలి, మనం దయను శ్రద్ధను చూపించగల్గినప్పుడు వాటిని వారి ఎడల చూపించాలి. వారిని మనమధ్యకు ఆహ్వానించి, “మీలో పుట్టినవానివలె” వారిలో ప్రతి ఒక్కరిని ఆదరించి, “నిన్నువలె వానిని ప్రేమింపవలెను.” (లేవీయకాండము 19:34) దీనిని చేయడమంత సులభంకాకపోవచ్చు గాని మనం ఈ సలహాను జ్ఞాపకముంచుకొంటే సఫలీకృతులం కాగలం: “మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.”—రోమీయులు 12:2.

పరిశుద్ధులతో పాలివారవ్వండి

11, 12. (ఎ) ప్రాచీనకాల ఇశ్రాయేలులోని (బి) మొదటి శతాబ్దంలోని కొంతమంది యెహోవా సేవకులకు ఏ ప్రత్యేకమైన శ్రద్ధ ఇవ్వబడింది?

11 మన శ్రద్ధ ఆతిథ్యాల్ని నిజంగా పొందడానికి యోగ్యులైన వారిలో మన ఆత్మీయ క్షేమం నిమిత్తం కష్టించి పనిచేసే పరిపక్వతకు ఎదిగిన క్రైస్తవులు ఉన్నారు. ప్రాచీన కాలంలోని యాజకులు లేవీయుల కొరకు యెహోవా ప్రత్యేకమైన ఏర్పాట్లను చేశాడు. (సంఖ్యాకాండము 18:25-29) ప్రత్యేకమైన సామర్థ్యాలతో తమ్మును సేవించిన వారి ఎడల శ్రద్ధ చూపాలని మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు కూడా ఉద్బోధించబడ్డారు. తొలి క్రైస్తవుల్లోవున్న సన్నిహిత ప్రేమబంధాన్ని 3 యోహాను 5-8లోని వివరణ మనకు చూపిస్తుంది.

12 సంఘాన్ని సందర్శించడానికి పంపిన ప్రయాణ సహోదరుల ఎడల గాయు చూపించిన దయను ఆతిథ్యాన్ని వృద్ధుడైన యోహాను ఎంతో విలువైనవిగా పరిగణించాడు. ఈ ఉత్తరాన్ని తీసుకొచ్చినవానిగా కన్పిస్తున్న దేమేత్రితోపాటు ఈ సహోదరులు అందరూ గాయుకు ఇంతకుమునుపు అపరిచితులే లేక తెలియనివారే. కాని ‘[దేవునికి] తగినట్టుగా వారు సాగనంప’బడ్డారు గనుక వారు అతిథులుగా ఆహ్వానించబడిరి. యోహాను ఈ విధంగా చెబుతున్నాడు: “మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టివారికి ఉపకారముచేయ [“ఆతిథ్యమివ్వ,” NW] బద్ధులమై యున్నాము.”—3 యోహాను 1, 7, 8.

13. ‘ఆతిథ్యం ఇవ్వడానికి’ నేడు మనలో ఎవరు నిజంగా యోగ్యులై ఉన్నారు?

13 నేడు, యెహోవా సంస్థయందే, యావత్‌ సహోదర సహవాస పక్షంగా చురుకుగా పాటుపడుతున్నవారు అనేకమంది ఉన్నారు. సంఘాల్ని బలపర్చడంలో ప్రతివారం తమ కాలాన్ని శక్తిని వినియోగిస్తున్న ప్రయాణ కాపరులు; విదేశాల్లో ప్రకటించడానికి తమ కుటుంబాల్ని, స్నేహితుల్ని విడిచిపెట్టిన మిషనరీలు; ప్రపంచవ్యాప్త ప్రకటనా పనికి మద్దతు ఇచ్చేందుకు తమ సేవల్ని ఉచితంగా అందిస్తూ బేతేలు గృహాల్లోను బ్రాంచ్‌ కార్యాలయాల్లోను సేవచేస్తున్న వారు; ప్రాంతీయ పరిచర్యనందు తమ సమయంలో మరియు శక్తిలో అధిక భాగాన్ని వెచ్చిస్తున్న పయినీరు సేవలోవున్న వారు వీరిలో చేరివున్నారు. ప్రాథమికంగా, వ్యక్తిగతమైన ఏ మహిమ కొరకో లేక లాభం కొరకో కాదుగాని క్రైస్తవ సహోదరత్వం ఎడల యెహోవా ఎడలగల ప్రేమనుబట్టి వీరందరూ కష్టించి పనిచేస్తున్నారు. వారి హృదయపూర్వక భక్తినిబట్టి మనం అనుకరించడానికి వారు యోగ్యులై ఉన్నారు, ‘ఆతిథ్యానికి ఆహ్వానించ’డానికి పాత్రులైవున్నారు.

14. (ఎ) విశ్వాసులైన వారికి మనం ఆతిథ్యాన్ని ఇచ్చినప్పుడు మనమెలా మరింత శ్రేష్ఠమైన క్రైస్తవులమవుతాము? (బి) మరియ “ఉత్తమమైన దానిని” ఎంచుకున్నదని యేసు ఎందుకు చెప్పాడు?

14 మనం “అట్టివారికి ఉపకారము” [“ఆతిథ్యమిచ్చినప్పుడు,” NW] చేసినప్పుడు “మనము సత్యమునకు సహాయకుల”మౌతామని అపొస్తలుడైన యోహాను సూచించాడు. తత్ఫలితంగా ఒక అర్ధంలో మనం శ్రేష్ఠమైన క్రైస్తవులంకాగలం. ఎందుకంటే క్రైస్తవ పనుల్లో తోటి విశ్వాసులకు మంచి చేయడం చేరివుంది. (సామెతలు 3:27, 28; 1 యోహాను 3:18) మరో రీతిలో కూడా ప్రతిఫలాలు ఉన్నాయి. మరియ, మార్త తమ ఇంటికి యేసును ఆహ్వానించినప్పుడు ఆయన కొరకు ‘అనేకమైన వాటిని’ సిద్ధంచేయడం ద్వారా మార్త మంచి ఆతిథ్యదాతగా ఉండాలని కోరుకుంది. మరియ ఆతిథ్యాన్ని మరో రీతిలో చూపించింది. ఆమె ప్రభువు “పాదములయొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను,” “ఉత్తమమైన దానిని” ఎంచుకున్నందున యేసు ఆమెను మెచ్చుకున్నాడు. (లూకా 10:38-42) అనేక సంవత్సరాల అనుభవాన్ని కల్గివున్న వారితో చేసిన సంభాషణలు చర్చలు, తరచూ వారి సహవాసంలో గడిపిన ఓ సాయంత్రపు ఉన్నతాంశాలుగా ఉంటాయి.—రోమీయులు 1:11, 12.

ప్రత్యేక సందర్భాలు

15. యెహోవా ప్రజలకు ఏ ప్రత్యేక సందర్భాలు సంతోషకరమైన సమయాలుగా నిర్ధారించబడవచ్చు?

15 జనాదరణ పొందిన ఆచరణల్ని లేక ప్రాపంచిక సెలవు దినాల్ని పండుగల్ని నిజ క్రైస్తవులు ఆచరించకపోయినా, ఒకరి సహవాసాన్ని మరొకరు అనుభవించేందుకు వారు సమకూడే సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు, యేసు కానాలోని వివాహ విందుకు హాజరై, తన మొదటి అద్భుతాన్ని అక్కడ చేయడం ద్వారా ఆ సందర్భాన్ని ఆనందమయం చేయడానికి దోహదపడ్డాడు. (యోహాను 2:1-11) అదేవిధంగా నేడూ అలాంటి ప్రత్యేక సందర్భాల్లో కలుసుకొనే సంతోషకర సమయాల్ని యెహోవా ప్రజలు కల్గివున్నారు మరియు సముచితమైన ఆచరణ, ఉత్సవం అలాంటి సంఘటనలకు ఎంతో చేకూరుస్తుంది. అయితే, సముచితమైనదంటే ఏమిటి?

16. ప్రత్యేక సందర్భాల్లో సహితం సరియైన విధంగా ప్రవర్తించడానికి ఏ నడిపింపు సూత్రాలు మనకున్నాయి?

16 బైబిలులో పఠించినదాని నుండి క్రైస్తవులకు తగిన ప్రవర్తన ఏమైవుందో మనం నేర్చుకున్నాం మరి దీనిని మనం అన్నివేళలా అనుసరించాలి. (రోమీయులు 13:12-14; గలతీయులు 5:19-21; ఎఫెసీయులు 5:3-5) వివాహాలకు సంబంధించినదైనా లేక మరే ఇతర కారణం నిమిత్తమైనా కూడుకొనే సామాజిక కలయికలు మన క్రైస్తవ ప్రమాణాల్ని విడనాడడానికిగానీ సామాన్యంగా మనం చేయని వాటిని చేయడానికిగానీ మనకు లైసెన్స్‌ని ఇవ్వవు; లేక మనం నివసిస్తున్న దేశాచారాలన్నింటినీ అనుసరించ బద్ధులమూ కాదు. అటువంటివాటిలో అనేకం అబద్ధ మతాచరణలపై లేక మూఢాచారాలపై ఆధారపడి ఉన్నాయి, ఇతరమైనవాటిలో స్పష్టంగా క్రైస్తవులకు అంగీకృతంకాని ప్రవర్తన ఇమిడివుంది.—1 పేతురు 4:3, 4.

17. (ఎ) కానాలో జరిగిన వివాహం బాగుగా సంస్థీకరించబడిందని, సరియైన విధంగా పర్యవేక్షించబడిందని ఏ వాస్తవాలు చూపుతున్నాయి? (బి) ఆ సందర్భాన్ని యేసు సమ్మతించాడని ఏది చూపిస్తున్నది?

17 యోహాను 2:1-11 వచనాల్ని చదవడం మూలంగా ఆ సందర్భం విస్తృతమైనదని, అక్కడ ఓ పెద్ద సంఖ్యలో అతిథులు ఉన్నారని గ్రహించడం మనకంత కష్టమేమి కాదు. అయినా, యేసు ఆయన శిష్యులు ‘ఆహ్వానింపబడిన’ అతిథులు; వారిలో కనీసం కొంతమంది ఆతిథ్యదాతకు బంధువులైనప్పటికీ వాళ్లు ఊరకనే సందర్శించడానికి రాలేదు. ‘పరిచారము’ చేయువారు అలాగే వేటిని వడ్డించాలి లేక ఏమి చెయ్యాలి అని నిర్దేశాల్నిచ్చే ఓ “ప్రధాని” అక్కడ ఉండడాన్ని కూడా మనం గుర్తిస్తాం. ఆ కార్యక్రమం బాగా సంస్థీకరించబడిందని సరియైనరీతిగా పర్యవేక్షించబడిందని ఇదంతా సూచిస్తోంది. విందులో తాను చేసిన దానినిబట్టి యేసు ‘తన మహిమను బయల్పర్చు’కున్నాడని తెలియజేయడం ద్వారా ఆ వివరణ ముగుస్తుంది. ఓ రౌడీ పార్టీగా అదుపుచేయలేని పార్టీగా ఉండేలా చెయ్యడానికి ఆ సందర్భాన్ని ఆయన ఎన్నుకునేవాడేనా? నిస్సందేహంగా ఎన్నుకునేవాడు కాదు.

18. ఏ సామాజిక సంఘటన విషయంలోనైనా గంభీరంగా పరిశీలించబడాల్సినవేవి?

18 అయితే, మనం ఆతిథ్యదాతగా ఉండబోయే ఏ ప్రత్యేక సందర్భాల విషయమైనా ఏమిటి? మనమందరమూ ‘సత్యమునకు సహాయకులము కావడమే’ ఇతరులను ఆతిథ్యానికి ఆహ్వానించడంలోగల ఉద్దేశమని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి “సాక్షుల” కలయిక అని ఒక సంఘటనకు పేరుపెట్టడమే సరిపోదు. మనం ఎవరై ఉన్నాం, మనం ఏమి విశ్వసిస్తున్నాం అనేదానికి నిజంగా అదో తార్కాణంగావుందా? అని ప్రశ్నించుకోవచ్చు. “శరీరాశయు నేత్రాశయు జీవపుడంబము”లతోపాటు మనం ఎంతమేరకు సన్నిహితంగా లోకపు పోకడలను అనుకరించవచ్చో తెలుసుకునేందుకు అవకాశాలుగా మనం ఆ సందర్భాల్ని ఎన్నడూ దృష్టించకూడదు. (1 యోహాను 2:15, 16) బదులుగా, ఈ సందర్భాలు యెహోవాసాక్షులుగా మన పాత్రను తగినవిధంగా ప్రతిబింబించాలి, మనం చేసేది యెహోవాకు మహిమ ఘనతల్ని తెస్తున్నదని మనం నిశ్చయపర్చుకోవాలి.—మత్తయి 5:16; 1 కొరింథీయులు 10:31-33.

‘సణుగుకొనకుండ ఆతిథ్యము ఇవ్వండి’

19. ‘సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యాన్ని’ మనమెందుకు ఇవ్వాల్సివుంది?

19 ప్రపంచ పరిస్థితులు క్షీణిస్తూ, ప్రజలు అంతకంతకూ విభజించబడుతుండగా, నిజ క్రైస్తవుల్లోవున్న సన్నిహిత బంధాన్ని మనం బలపర్చగల్గేందుకు చేయగల్గినంతా చేయాల్సిన అవసరం ఉంది. (కొలొస్సయులు 3:14) ఇందు నిమిత్తమై అపొస్తలుడైన పేతురు మనకు ఉద్భోదించినట్లుగా మనం ‘ఒకరి ఎడల ఒకరం మిక్కుటమైన ప్రేమగలవారై’ ఉండాలి. తర్వాత, ఆచరణీయమైన పదాల్లో ఆయన ఇలా తెలియజేస్తున్నాడు: “సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి.” (1 పేతురు 4:7-9) మన సహోదరులకు ఆతిథ్యమిచ్చేందుకు, దయగాను సహాయకరంగాను ఉండడానికి మనం ప్రయాసపడేందుకు మనం చొరవ తీసుకోవడానికి సుముఖంగా ఉన్నామా? లేక అలాంటి అవకాశం వచ్చినప్పుడు మనం సణుగుకొంటున్నామా? మనం అలాచేస్తే మనం కల్గివున్న ఆనందాన్ని మనం పాడుచేసుకొంటాం అలాగే మంచివాటిని చేయడం కొరకైన సంతోషకర ప్రతిఫలాన్ని కోల్పోతాం.—సామెతలు 3:27; అపొస్తలుల కార్యములు 20:35.

20. ఈనాటి విభాజిత ప్రపంచంలో మనం ఆతిథ్యాన్నిస్తూ ఉన్నట్లయితే మనకే ఆశీర్వాదాలు వేచివుంటాయి?

20 మన తోటి క్రైస్తవులతో సన్నిహితంగా పనిచేయడం మరియు ఒకరి ఎడల మరొకరం దయగాను ఆతిథ్యమిచ్చేవారిగాను ఉండడం, పట్టజాలనంత ఆశీర్వాదాన్ని తీసుకొస్తాయి. (మత్తయి 10:40-42) ‘తన గుడారాన్ని వారిమీద కప్పుతానని వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదని’ యెహోవా అలాంటి వారికి వాగ్దానం చేశాడు. యెహోవా గుడారంలో ఉండడమంటే ఆయన కాపుదలను ఆతిథ్యాన్ని అనుభవించడమే. (ప్రకటన 7:15, 16; యెషయా 25:6) అవును, యెహోవా ఆతిథ్యాన్ని నిరంతరమూ అనుభవించే ఆధిక్యత సమీపంలోనేవుంది.—కీర్తన 27:4; 61:3, 4.

మీరు వివరించగలరా?

◻ నిజమైన ఆనందాన్ని, తృప్తిని మనం కనుగొనాలనుకుంటే మనం వేటిని ఉపేక్షించకూడదు?

◻ ‘దిక్కులేనివారు, విధవరాండ్రు’ ఎవరు, వారిని మనమెలా ‘పరామర్శించాలి’?

◻ మన మధ్యనున్న ‘పరదేశుల్ని’ ‘విదేశీయుల్ని’ మనమెలా దృష్టించాలి?

◻ ప్రత్యేకమైన శ్రద్ధకు నేడు అర్హులైనవారు ఎవరు?

◻ ఆతిథ్యాన్ని గూర్చిన నిజమైన స్ఫూర్తిని ప్రత్యేక సందర్భాలెలా ప్రతిబింబించాలి?

[16, 17వ పేజీలోని చిత్రం]

విదేశీయులకు, తండ్రుల్లేని పిల్లలకు, పూర్తికాలసేవలో ఉన్నవారికి, ఇతర అతిథులకు మనం ఉత్సాహభరితమైన సందర్భాల్లో ఆతిథ్యాన్ని ఇవ్వవచ్చు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి