కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 8/15 పేజీలు 30-31
  • పాఠకుల ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఇలాంటి మరితర సమాచారం
  • మేము కూడా మీతో వస్తాం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • ప్రభువు రాత్రి భోజనం మీకు ఏ భావాన్నిస్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • ‘మేము మీతో వస్తాం’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • “పవిత్రశక్తే మన మనసుకు సాక్ష్యమిస్తుంది”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 8/15 పేజీలు 30-31

పాఠకుల ప్రశ్నలు

గత కొన్ని సంవత్సరాలుగా జ్ఞాపకార్థ చిహ్నాలలో భాగం వహించే వారి సంఖ్య కొద్దిగా పెరిగినట్టు రిపోర్టులు చూపిస్తున్నాయి. అనేకమంది కొత్తవారు పరిశుద్ధాత్మతో అభిషేకించబడుతున్నారని ఇది సూచిస్తుందా?

1,44,000మంది అభిషిక్త క్రైస్తవుల సంఖ్య, దశాబ్దాల క్రిందటే పూర్తయిందని విశ్వసించడానికి తగిన కారణమేవుంది.

అపొస్తలుల కార్యములు 2:1-4 నందు, ఆ పరిమితమైన గుంపులోని మొదటివారిని గురించి మనమిలా చదువుతాం: “పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.”

అటుతరువాత యెహోవా ఇతరులను ఎన్నుకొని, వారిని తన పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. క్రైస్తవత్వపు తొలి సంవత్సరాల్లోనే వేలాదిమంది చేర్చబడ్డారు. మన కాలంలో జరిగే జ్ఞాపకార్థదిన ఆచరణలో ప్రసంగికుడు తరచూ, అభిషిక్తులు ‘కుమారులుగా దత్తపుత్రాత్మను పొందుతారని’ తెలియజేస్తున్న రోమీయులు 8:15-17లోని అపొస్తలుడైన పౌలు మాటలపై మన అవధానాన్ని నిలుపమని కోరతాడు. ‘వారు దేవుని పిల్లలని, క్రీస్తుతోడి వారసులని వారి ఆత్మతో కూడ’ వారు పొందిన పరిశుద్ధాత్మ ‘సాక్ష్యమిస్తున్నదని’ కూడా పౌలు తెలియజేశాడు. నిజంగా ఈ ఆత్మాభిషేకాన్ని పొందినవారు, దాన్ని నిశ్చయంగా ఎరుగుదురు. అది కేవలమొక కోరికనో లేక తమను గూర్చిన భావోద్రేకపరమైన, అవాస్తవికమైన దృక్పథం యొక్క ప్రతిబింబమో కాదు.

అంధకార యుగాలని పిలువబడిన కాలాల్లో అతి తక్కువమంది అభిషిక్తులున్న సమయాలు ఉన్నప్పటికీ, ఈ పరలోక పిలుపు శతాబ్దాలుగా కొనసాగిందని మనం అర్థం చేసుకోవచ్చు.a దాదాపు గత శతాబ్దాంతానికి నిజ క్రైస్తవత్వం పునరుద్ధరించబడడంతో అనేకమంది పిలువబడి, ఎంపిక చేసుకోబడ్డారు. కాని 1930ల మధ్య కాలానికల్లా 1,44,000 మంది పూర్తి సంఖ్య ప్రాథమికంగా పూర్తైనట్టు కనబడుతోంది. ఆవిధంగా భూ నిరీక్షణగల నమ్మకమైన క్రైస్తవుల గుంపు కనబడడం ఆరంభమైంది. అంగీకృతమైన ఒకే మందగా అభిషిక్తులతోపాటు ఆరాధనలో ఐక్యపర్చబడే వారిని యేసు “వేరేగొఱ్ఱెలు” అని పిలిచాడు.—యోహాను 10:14-16.

అభిషిక్తుల పిలుపు పూర్తికావడాన్ని, “మహాశ్రమ” నుండి రక్షించబడాలనే నిరీక్షణగల్గినటువంటి వృద్ధిచెందుతున్న “గొప్ప సమూహము”పై యెహోవా ఆశీర్వాదాన్ని దశాబ్దాలుగా వాస్తవాలు ప్రతిబింబించాయి. (ప్రకటన 7:9, 14) ఉదాహరణకు, 1935లో జ్ఞాపకార్థదిన ఆచరణకు 63,146 మంది హాజరవ్వగా, తమ్మును అభిషిక్తులుగా వెల్లడిపర్చుకోవడానికి రుజువుగా చిహ్నాల్లో భాగం వహించినవారి సంఖ్య 52,465. ముప్పై సంవత్సరాల తరువాత లేదా 1965లో హాజరైనవారు 19,33,089 మందైతే, చిహ్నాల్లో భాగం వహించినవారు 11,550కు తగ్గిపోయారు. ముప్పై సంవత్సరాలు ముందుకు వెళ్తే అంటే 1995లో హాజరు 1,31,47,201కి పెరిగింది, కాని 8,645 మంది మాత్రమే రొట్టె ద్రాక్షారసంలో భాగం వహించారు. (1 కొరింథీయులు 11:23-26) దశాబ్దాలు గడుస్తుండగా, శేషించబడినవారమని వెల్లడిచేసుకున్న వారి సంఖ్య తీవ్రంగా తగ్గిపోయిందని అంటే దాదాపు 1935లో 52,400కి; 1965లో 11,500కి; 1995లో 8,600కి తగ్గిపోయిందని స్పష్టమవుతుంది. అయితే, భూ నిరీక్షణగలవారు ఆశీర్వదించబడ్డారు, వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఇటీవల ప్రచురించబడిన రిపోర్టు అంటే 1995వ సంవత్సరం కొరకైన రిపోర్టు, అది గత సంవత్సరంకన్నా 28 మంది ఎక్కువగా భాగం వహించారని, అయితే హాజరైనవారితో పోల్చిచూస్తే భాగంవహించిన వారి నిష్పత్తి నిజానికి తగ్గిపోయిందని చూపిస్తోంది. అన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకుంటే, మరికొద్దిమంది చిహ్నాల్లో భాగం వహించడానికి ఎంచుకోవడం, అంతగా కలతపర్చాల్సిన విషయమేం కాదు. కొన్ని సంవత్సరాలుగా కొద్దిమంది, కొత్తగా బాప్తిస్మం తీసుకున్నవారు సహితం ఆకస్మికంగా భాగంవహించడం ఆరంభించారు. అనేక సందర్భాల్లో, కొంతకాలం తర్వాత ఇది పొరపాటేనని వారు అంగీకరించారు. బహుశా భౌతిక లేక మానసిక ఒత్తిడికొక భావోద్రేక ప్రతిస్పందనగా, తాము భాగం వహించినట్లు కొందరు గుర్తించారు. అయితే నిజానికి తాము పరలోక జీవితం కొరకు పిలువబడలేదని వారు చివరకు గుర్తించారు. వారు దేవుని దయాపూర్వకమైన అవగాహన కొరకు అర్థించారు. భూమిపై నిత్యజీవ ఉత్తరాపేక్షను కల్గివున్న, శ్రేష్ఠమైన నమ్మకమైన క్రైస్తవులుగా వారాయనను సేవించడంలో కొనసాగుతున్నారు.

ఒక వ్యక్తి చిహ్నాల్లో భాగంవహించడం ఆరంభించినా లేక మానుకున్నా, మనలో ఎవరికీ దానిని గురించి ఆసక్తి చూపించాల్సిన అవసరం లేదు. ఒకరు వాస్తవంగా పరిశుద్ధాత్మతో అభిషేకించబడి పరలోక జీవితానికి పిలువబడ్డారా లేదా అనేది నిర్ణయించడం నిజానికి మన బాధ్యత కాదు. “నేను గొఱ్ఱెల మంచి కాపరిని, . . . నేను నా గొఱ్ఱెలను ఎరుగుదును” అని యేసు ఇచ్చిన స్థిరమైన అభయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే తాను ఆత్మీయ కుమారులుగా ఏర్పర్చుకున్న వారిని నిశ్చయంగా యెహోవా ఎరుగును. అభిషిక్తులు పెరుగుతున్న వయస్సు, అనుకొనని సంఘటనల మూలంగా తమ భూ జీవితాన్ని ముగిస్తుండగా వారి సంఖ్య తగ్గిపోతూ ఉంటుందని విశ్వసించడానికి ప్రతీ కారణం ఉంది. అయితే, జీవకిరీటాన్ని పొందటానికి ఎదురుచూస్తూ ఈ నిజమైన అభిషిక్తులు మరణం వరకు నమ్మకమైనవారిగా నిరూపించుకుంటుండగా, గొఱ్ఱెపిల్ల రక్తంలో వస్త్రాల్ని ఉదుకుకొనిన వేరేగొఱ్ఱెలు రానైవున్న మహాశ్రమ నుండి తప్పించుకోవడానికి ఎదురు చూడగలరు.—2 తిమోతి 4:6-8; ప్రకటన 2:10.

[అధస్సూచీలు]

a మార్చి 15, 1965 కావలికోట (ఆంగ్లం) 191-2 పేజీలను చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి