నిపుణులు రక్తానికి గల ప్రత్యామ్నాయాల్ని పరిశీలించుట
అమెరికా నలుమూలలనుండి సుమారు 200 మంది నిపుణులు వైద్య రంగంలో అధిక ఆసక్తికర విషయమైన రక్తరహిత మందులు మరియు శస్త్రచికిత్సను గూర్చి చర్చించేందుకు ఒహాయోలోని క్లీవ్‌లాండ్ నందు అక్టోబరు 7, 1995 శనివారం నాడు కూడుకున్నారు.
అనేక కష్టతరమైన సందర్భాల గురించి చర్చ జరిగింది. ఉదాహరణకు, ఓ రోగి తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతున్నట్లైతే అప్పుడేమిటి? సమయానికి ఎంతో ముందుగా జన్మించిన బిడ్డకు రక్తంలేకుండా ఎలా చికిత్సచేయవచ్చు? రక్తమార్పిడులు లేకుండా విజయవంతంగా గుండె శస్త్రచికిత్స చేయవచ్చా? ఆసక్తికరంగా, రక్తరహిత శస్త్రచికిత్స అంటే తరచూ శరీరం దానంతటదే రక్త సరఫరాను అధికం చేసుకునే విధానాలను ఉపయోగించే శస్త్రచికిత్స ఈ పరిస్థితులన్నిటిలో మంచి ఫలితాలతో ఇప్పటికే ఉపయోగించడం జరిగింది.a
రక్తమార్పిడులకు ప్రత్యామ్నాయాలు ఎందుకు అవసరం? “రక్తమార్పిడి తరచూ రోగాలను, ప్రత్యేకంగా కాలేయపువాపును సంక్రమింపజేస్తుందని మనం తెలుసుకున్నాము. రక్తం అంటువ్యాధిని సంక్రమింపజేయకపోయినప్పటికీ అది ఆ రోగి యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థ ప్రతిస్పందనను అణచివేస్తుంది” అని క్లీవ్‌లాండ్‌లో ఉన్న సెయింట్. విన్సెంట్ చారిటీ ఆసుపత్రినందున్న సెంటర్ ఫర్ బ్లడ్‌లెస్ మెడిసిన్ అండ్ సర్జరీ అధ్యక్షురాలైన షారన్ వెర్నన్ చెబుతోంది. స్క్రీనింగ్ ద్వారా ఎయిడ్స్ సంక్రమణ తగ్గినప్పటికీ, అలాంటి పరీక్షల్లో దొరకకుండా తప్పిపోయే ఇతర అనేక రోగాలు ఉన్నాయి. అంతేకాకుండ, రక్తరహిత శస్త్రచికిత్సకు గొప్ప సిద్ధపాటు అవసరమైనప్పటికీ, అది రోగులు కలుషిత రక్తాన్ని పొందడం ద్వారా వచ్చే చట్టపరమైన సమస్యలు లేకుండా చేస్తుంది కనుక ఆసుపత్రులకు అది చవకైన చికిత్సగా పనిచేస్తుంది.
రక్తాన్ని తీసుకోకపోవడానికి యెహోవాసాక్షులకు మరింత ప్రాముఖ్యమైన కారణం ఉంది: దేవుని చట్టం దాన్ని నిషేధిస్తుంది. (అపొస్తలుల కార్యములు 15:29) అయినప్పటికీ, సాధ్యమైనంత శ్రేష్ఠమైన వైద్య చికిత్సను పొందాలని వారు కోరుకుంటున్నారు. ఆ విధంగా, రక్తరహిత వైద్య చికిత్స నిమిత్తం పరిశోధనలు జరిపేందుకు ముందడుగు వేసిన వైద్యులతో వారు సహకరించారు. అలాంటివి యెహోవాసాక్షులకు మాత్రమే కాదు కానీ రక్తమార్పిడుల వల్ల వచ్చే అపాయాల గురించి శ్రద్ధ కల్గివున్న అనేకమంది ఇతరులకు కూడా ప్రయోజనకరమైనవి.
[అధస్సూచీలు]
a తేజరిల్లు! నవంబరు 22, 1993 (ఆంగ్లం) సంచికలోని 24-7 పేజీలను మరియు ఫిబ్రవరి 8, 1996 సంచికలోని 31వ పేజీని చూడండి.
[32వ పేజీలోని చిత్రసౌజన్యం]
WHO photo by P. Almasy