పాఠకుల ప్రశ్నలు
సహోదరులు దేవుని రాజ్యము భూమ్మీదికి రావడాన్ని గూర్చి మాట్లాడడమో, దాని కోసం ప్రార్థన చేయడమో మనం కొన్నిసార్లు వింటుంటాం. ఇలా చెప్పడం సరైనదేనంటారా?
కచ్చితంగా చెబితే, అలా చెప్పడం లేఖనాధార శైలి కాదు. దేవుని రాజ్యం పరలోక సంబంధమైనది. కనుక, “ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక, ఆమేన్” అని అపొస్తలుడైన పౌలు వ్రాయగలిగాడు.—2 తిమోతి 4:18; మత్తయి 13:44; 1 కొరింథీయులు 15:50.
ఆ రాజ్యం 1914లో పరలోకంలో స్థాపించబడింది, పునఃస్థాపించబడిన భూ పరదైసుకు లేదా మరోచోటికి అదెన్నడూ బదిలీ చేయబడదు. యేసుక్రీస్తు ఆ రాజ్యానికి రాజు. రాజుగా యేసుకు దూతలపై అధికారముంది. కనుక, ఆయన సరైన పరిపాలన స్థలం పరలోకంలో దేవుని కుడిపార్శ్వమే. అభిషిక్త క్రైస్తవులు పరలోకంలో ఆయనతోపాటు రాజులుగాను యాజకులుగాను చేరుతారు.—ఎఫెసీయులు 1:19-21; ప్రకటన 5:9, 10; 20:6.
అయితే, దీని భావం ప్రభువు ప్రార్థనలోని “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అనే భాగంలోని అభ్యర్థనలను దేవునికి తెలియజేయకూడదనా? (మత్తయి 6:10) దానికి భిన్నంగా, ఆ ప్రార్థన సరైనదే, ఇప్పటికీ భావగర్భితమైనదే.
దేవుని రాజ్యం భవిష్యత్తులో భూమి ఎడల నిర్ణయాత్మకమైన విధంగా చర్య గైకొంటుంది, మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభువు ప్రార్థనలోని పదాలకు సాదృశ్యమైనవాటిని ఉపయోగించేటప్పుడు మన మనస్సులో ఈ విషయమే ఉంటుంది. ఉదాహరణకు, ఆ రాజ్యం మిగిలిన రాజ్యములన్నింటిని నిర్మూలం చేసి, ఈ భూమిపైని ఆధిపత్యాన్ని తీసుకోవడానికి ‘వస్తుంది’ అని దానియేలు 2:44 ముందుగా చెబుతుంది. ప్రకటన 21:2 పరలోకం నుండి క్రొత్త యెరూషలేము దిగి రావడాన్ని గూర్చి మాట్లాడుతుంది. క్రొత్త యెరూషలేము క్రీస్తు పెండ్లి కుమార్తెగా ఉండే 1,44,000 అభిషిక్త క్రైస్తవులతో రూపొందించబడింది. వారు యేసుతోపాటు రాజ్యంలో ఉమ్మడి వారసులు కూడా. కనుక ప్రకటన 21:2, వారు భూమివైపుకు తమ శ్రద్ధను మళ్ళించడంతో నమ్మకస్థులైన మానవజాతికి గొప్ప ఆశీర్వాదాలు కుమ్మరించడాన్ని గూర్చి వర్ణిస్తుంది.—ప్రకటన 21:3, 4.
ఈ ప్రవచనాలు, మరితర ప్రవచనాలు నెరవేరేంత వరకూ, “నీ రాజ్యము వచ్చు గాక” అని యేసు చెప్పిన మాటలకు అనుగుణ్యంగా మనం యెహోవాకు ప్రార్థన చేయడం సరైనదిగానే ఉంటుంది. కాని ఆ రాజ్యం అక్షరార్థ భావంలో భూగ్రహం మీదకు రాదని మనం గుర్తుంచుకోవాలి. రాజ్య ప్రభుత్వం భూమ్మీద కాదు గాని పరలోకంలోనే ఉంటుంది.
[31వ పేజీలోని చిత్రసౌజన్యం]
Earth: Based on NASA photo