మీరు దానిని జారవిడుచుకోవాలనుకోరు!
జారవిడుచుకోవడమా, దేనిని? అతి సమీపంలోవున్న “దైవికశాంతి సందేశకులు” అనే జిల్లాసమావేశాన్నే! దాదాపు అన్ని ప్రాంతాల్లోను, సమావేశం శుక్రవారం ఉదయం 9:30కు సంగీత కార్యక్రమంతో ఆరంభమౌతుంది. “ఆసక్తిగల శాంతి ప్రచారకులు చెప్పేది వినుట” అనే భాగంలో విశ్వాసాన్ని బలపరచేటటువంటి ఇంటర్వ్యూలను విన్న తరువాత, “దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడు?” అనే ప్రోత్సాహకరమైన ప్రసంగాన్ని మీరు ఆస్వాదిస్తారు.
శుక్రవారం మధ్యాహ్నం ఉండే ఆసక్తికరమైన ముఖ్యాంశ ప్రసంగం “దైవికశాంతి సందేశకులుగా మన పాత్ర.” “దేవుడు కోరేవాటిని నేర్చుకొనేలా ఇతరులకు సహాయపడుట” అనే భాగం క్రొత్తవారికి బోధించడంలో సలహాలనిస్తుంది. దీని తర్వాత, “వినోదంలో దాగివున్న ఉరులను పసిగట్టండి” అనే సమయోచితమైన గోష్ఠి ఉంటుంది. శుక్రవారం కార్యక్రమం “అపవాదిని ఎదిరించండి—ఎలాంటి తిరుగుబాటునైనా సహించకండి,” “దేవునివాక్య యథార్థతను నమ్మకంగా సమర్థించుట” అనే ప్రసంగాలతో ముగుస్తుంది.
శనివారం ఉదయం కార్యక్రమం “సందేశకులు శాంతి సువార్తను తెస్తున్నారు” అనే మూడు భాగాల గోష్ఠిలో శిష్యులను చేసే పని యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెబుతుంది. “యెహోవా సంస్థలోనే ఆనందంతో ఇచ్చుట,” “సమర్పణ బాప్తిస్మముల ద్వారా జీవమును శాంతిని పొందుట” అనే ప్రసంగాలతో ఆ సెషన్ ముగుస్తుంది, ఆ తర్వాత క్రొత్త శిష్యులు బాప్తిస్మం పొందే అవకాశముంది.
శనివారం మధ్యాహ్నం, “వివిధ అంశాలపై యెహోవా ఆలోచనలను పరిశీలించండి” అనే ప్రసంగం ‘నేడు క్రైస్తవులు వేరుచేసే పనిలో పాల్గొంటున్నారా?,’ ‘మరణ శిక్షను గూర్చిన బైబిలు దృక్కోణం ఏమిటి?’ అనే ప్రశ్నలకు జవాబులనిస్తుంది. “శాంతికరమైన దేవుడు మిమ్మును లక్ష్యపెడుతున్నాడు” అనే ఆనందదాయకమైన మూడు భాగాల గోష్ఠిని, ముఖ్యంగా “కుటుంబ జీవితంలో దైవికశాంతిని వెంబడించండి” అనే ముగింపు ప్రసంగాన్ని కూడా ఆస్వాదిస్తారు.
ఆదివారం ఉదయం కార్యక్రమంలో “నిజమైన సందేశకులను గుర్తించుట” అనే మూడు భాగాల గోష్ఠిని, “దేవుని వాక్యం విని, విధేయులుకండి” అనే ప్రసంగం కూడా ఉంటాయి. కథాపాత్రలకు తగిన వేషములు ఉపయోగించబడిన నాటకంతో ఉదయకాల కార్యక్రమం ముగుస్తుంది, న్యాయాధిపతియైన గిద్యోనును గూర్చిన బైబిలు వృత్తాంతం నుండి అది చక్కని పాఠాలను తెలియజేస్తుంది.
ఆదివారం మధ్యాహ్నం ఆ సమావేశం యొక్క చివరి సెషన్లో “చివరకు నిజమైన శాంతి!—ఎక్కడ నుండి వస్తుంది?” అనే శీర్షికగల బహిరంగ ప్రసంగం విశేషమైనదిగా ఉంటుంది. చివరికి, “దైవికశాంతి సందేశకులుగా ముందుకు సాగుట!” అనే పురికొల్పే ప్రసంగంతో సమావేశం ముగింపుకు వస్తుంది.
హాజరయ్యేందుకు ఇప్పుడే పథకాలను వెయ్యండి. మీకు అతి సమీపంలో ఉన్నదానిని కనుగొనేందుకు, స్థానిక యెహోవాసాక్షుల రాజ్య మందిరాన్ని సంప్రదించండి లేదా ఈ పత్రిక ప్రకాశకులకు వ్రాయండి. జూన్ 8 (ఆంగ్లం) తేజరిల్లు! సంచిక ఇండియాలో సమావేశం జరిగే ప్రాంతాల జాబితాను ఇస్తుంది.