కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 5/15 పేజీలు 24-28
  • యెహోవా కనికరాన్ని గూర్చి యోనా నేర్చుకొనుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా కనికరాన్ని గూర్చి యోనా నేర్చుకొనుట
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ముద్రంలో గండం!
  • సముద్రంలోకి!
  • యోనా మనఃపూర్వక ప్రార్థనలు
  • యోనా విధేయుడౌతాడు
  • అలిగిన ప్రవక్త
  • “యోనానుగూర్చిన సూచక క్రియ”
  • ఆయన తన తప్పుల నుండి నేర్చుకున్నాడు
    వాళ్లలా విశ్వాసం చూపించండి
  • ఆయన తన తప్పుల నుండి నేర్చుకున్నాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • ఆయన కనికరం గురించిన పాఠం నేర్చుకున్నాడు
    వాళ్లలా విశ్వాసం చూపించండి
  • కనికరం చూపించడానికి సంబంధించి ఆయన ఒక పాఠం నేర్చుకున్నాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 5/15 పేజీలు 24-28

యెహోవా కనికరాన్ని గూర్చి యోనా నేర్చుకొనుట

యెహోవా తన ప్రవక్తకు ఓ పనిని నియమించాడు. సా.శ.పూ. తొమ్మిదవ శతాబ్దం, మరి ఇశ్రాయేలులో యెరోబాము II పరిపాలిస్తున్నాడు. యోనా, జెబూలూనీయుల పట్టణమైన గత్హేపెరుకు చెందినవాడు. (యెహోషువ 19:10, 13; 2 రాజులు 14:25) తన స్వగ్రామం నుండి ఈశాన్య దిక్కున 800 కిలోమీటర్ల దూరాన అంటే అష్షూరీయులు రాజధానైన నీనెవె పట్టణానికి దేవుడు యోనాను పంపిస్తున్నాడు. నీనెవెవారు దేవునివలనకల్గే నాశనాన్ని ఎదుర్కోవల్సివుంటుందని ఆయన హెచ్చరించాల్సివుంది.

‘ఆ దేశానికి ఆ ప్రజల దగ్గరకు వెళ్లడమా? వాళ్ళు కనీసం దేవునికి సమర్పించుకున్నవారు కూడా కాదే. ఆ రక్తపిపాసులైన అష్షూరీయులు, ఇశ్రాయేలీయుల్లా ఎన్నడూ యెహోవాతో నిబంధనగా చేసుకోలేదు. అంతెందుకు ఆ దుష్ట జనాంగపు ప్రజలు నా హెచ్చరికను ఓ బెదిరింపు అనుకొని ఇశ్రాయేలును జయించవచ్చు! నా వల్ల కాదు! నేను పోను. యొప్పేకు పారిపోయి దానికి వ్యతిరేక దిశలో మహా సముద్రం అవతలివైపున ఉన్న తర్షీషుకు ఓడలో వెళ్లిపోతాను. ఆ అలాగే చేస్తాను!’ అని యోనా అనుకునివుంటాడు.—యోనా 1:1-3.

ముద్రంలో గండం!

యోనా త్వరలోనే మధ్యధరా తీర ప్రాంతంలో ఉన్న యొప్పేను చేరుకున్నాడు. నీనెవెకు పశ్చిమంగా 3,500 కిలోమీటర్ల దూరమందన్న స్పెయిన్‌కు చెందిన తర్షీషుకు వెళ్లేందుకు ఓడ రుసుము చెల్లించి, ఓడ ఎక్కుతాడు. ఓడ సముద్రంలోకి వెళ్లిన తర్వాత, అలసిపోయిన ప్రవక్త క్రింది అంతస్తుకు వెళ్లి నిద్రపోతాడు. ఇంతలో యెహోవా ఆ సముద్రంపైకి ఓ పెద్ద గాలిని రప్పిస్తాడు, దానితో భయపడ్డ ప్రతి నావికుడూ సహాయం కొరకు తమ తమ దేవుళ్ళకు ప్రార్థనలు చేస్తారు. ఓడ ఎంతగా కొట్టుమిట్టాడుతోందంటే దాన్ని తేలిక చేసేందుకు దానిలోని సామాన్లను బయటికి విసిరేసారు. అయినప్పటికీ, ఓడ నిశ్చయంగా బ్రద్ధలౌతుందని అనిపించింది, మరి ఉద్రేకుడైన ఓడ నాయకుడు ఇలా అరవడం యోనా విన్నాడు: “ఓయీ నిద్రబోతా, నీకేమివచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండ ఆ దేవుడు మనయందు కనికరించునేమో.” అందుకు యోనా లేచి పైకి వెళ్తాడు.—యోనా 1:4-6.

“ఎవనిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని” నావికులు అనుకుంటారు. ఆ చీటి యోనా పేరు మీద పడుతుంది. “యెవరినిబట్టి ఈ కీడు మీకు సంభవించెనో, నీ వ్యాపారమేమిటో, నీ వెక్కడనుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, యీ సంగతియంతయు మాకు తెలియజేయుము” అని నావికులు అన్నప్పుడు అతని మనస్తాపాన్ని ఊహించండి. తాను “ఆకాశమందుండు దేవుడైన యెహోవా”ను ఆరాధించే హెబ్రీయుడనని, “సముద్రమునకును భూమికిని సృష్టికర్తయైన”వాని యెడల భయభక్తులుగలవాడనని యోనా చెబుతాడు. దేవుని సమాచారాన్ని విధేయతతో నీనెవె పట్టణానికి తీసుకుపోయే బదులు అతను యెహోవా సన్నిధినుండి పారిపోతున్నందువల్ల తుపాను వచ్చింది.—యోనా 1:7-10.

“సముద్రము మామీదికి రాకుండ నిమ్మళించునట్లు మేము నీకేమి చేయవలెనని” నావికులు అడుగుతారు. సముద్రం మరింత అల్లకల్లోలమౌతుండగా యోనా ఇలా అంటాడు: “నన్ను బట్టియే యీ గొప్పతుపాను మీమీదికి వచ్చెనని నాకు తెలిసియున్నది; నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి, అప్పుడు సముద్రము మీమీదికి రాకుండ నిమ్మళించును.” యెహోవా సేవకుడు సముద్రంలో పడవేయబడి మరణించడాన్ని ఇష్టపడక, ఆ మనుష్యులు దాన్ని దరికి చేర్చేందుకు ప్రయత్నిస్తారు. విఫలులైన నావికులు, “యెహోవా, నీ చిత్తప్రకారముగా నీవే దీని చేసితివి; ఈ మనుష్యునిబట్టి మమ్మును లయము చేయకుందువు గాక; నిర్దోషిని చంపితిరన్న నేరము మామీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసికొనిరి!”—యోనా 1:11-14.

సముద్రంలోకి!

అప్పుడు నావికులు యోనాను ఓడలోనుండి సముద్రంలోకి పడేశారు. అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలోకి అతను మునిగిపోతుండగా దాని ఉద్రిక్తత తగ్గడం ప్రారంభమైంది. అది చూసి, “ఆ మనుష్యులు యెహోవాకు మిగుల భయపడి, ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబళ్లు చేసిరి.”—యోనా 1:15, 16.

యోనా నీళ్లలోకి మునిగిపోతూ నిస్సందేహంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఓ నునుపైన గొట్టంగుండా తానో పెద్ద గుహలోకి జారుతున్నట్లుగా భావిస్తాడు. ఆశ్చర్యమేమంటే అతను ఇంకా ఊపిరి పీల్చుకోగలడు! తన తల మీదినుండి సముద్రపు నాచును తీసేసుకుంటూ తాను నిజంగానే ఓ ప్రత్యేకమైన స్థలంలో ఉన్నట్లు కనుగొంటాడు. ఎందుకంటే “గొప్ప మత్స్యము ఒకటి యోనాను మ్రింగవలెనని యెహోవా నియమించియుండగా యోనా మూడు దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను.”—యోనా 1:17.

యోనా మనఃపూర్వక ప్రార్థనలు

ఆ పెద్ద చేప కడుపులో యోనాకు ప్రార్థించే సమయముండింది. అతను చెప్పిన కొన్ని మాటలు కొన్ని కీర్తనలకు పోలి ఉన్నాయి. తన నిరాశనూ పశ్చాత్తాపాన్ని వ్యక్తపరుస్తూ చేసిన ప్రార్థనలను యోనా ఆ తర్వాత వ్రాశాడు. ఉదాహరణకు, ఆ మత్స్యం కడుపు అతనికి సమాధిగా మారుతుందనుకున్నాడు. అందుకనే ఆయన ఇలా ప్రార్థించాడు: “నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవిచేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను; పాతాళగర్భములోనుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన నంగీకరించియున్నావు.” (యోనా 2:1, 2) సాంవత్సరిక పండుగల కొరకు వెళ్ళేటప్పుడు బహుశా ఇశ్రాయేలీయులు పాడిన రెండు యాత్రాకీర్తనలు అలాంటి భావాలనే వ్యక్తం చేస్తున్నాయి.—కీర్తన 120:1; 130:1, 2.

సముద్రంలోకి తాను దిగపోవడాన్ని గుర్తుతెచ్చుకుంటూ యోనా ఇలా ప్రార్థిస్తున్నాడు: “నీవు [యెహోవా] నన్ను అగాధమైన సముద్ర [మధ్య] గర్భములో పడవేసి యున్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొనియున్నవి, నీ తరంగములును నీ కరుళ్లును నన్ను కప్పియున్నవి.”—యోనా 2:3; కీర్తన 42:7; 69:2, పోల్చండి.

అవిధేయతవల్ల తాను దైవిక అనుగ్రహాన్ని పోగొట్టుకుంటానని, దేవుని ఆలయాన్ని ఎన్నడూ చూడనని యోనా భయపడతాడు. అతను ఇలా ప్రార్థిస్తాడు: “నీ సన్నిధిలోనుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయముతట్టు మరల చూచెదననుకొంటిని.” (యోనా 2:4; కీర్తన 31:22ను పోల్చండి.) యోనా పరిస్థితి ఎంత బాధాకరంగా ఉందంటే అతను ఇలా అంటున్నాడు: “ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొనియున్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించియున్నది, సముద్రపు నాచు నా తలకుచుట్టుకొనియున్నది.” (యోనా 2:5; కీర్తన 69:1ని పోల్చండి.) “నేను మరెన్నటికిని ఎక్కిరాకుండ [సమాధివలె] భూమి గడియలు వేయబడియున్నవి; పర్వతముల పునాదులలోనికి [మత్స్యం కడుపులోనికి] నేను దిగియున్నాను, నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములోనుండి [మూడవ దినాన] పైకి రప్పించియున్నావు.”—యోనా 2:6; కీర్తన 30:3తో పోల్చండి.

చేప కడుపులో ఉన్నప్పటికీ, ‘నేను ప్రార్థించలేనంత దిగులుగా ఉన్నాను’ అని యోనా అనుకోలేదు. బదులుగా, “కూపములోనుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా [మృత్యువు సమీపంలో ఉన్నప్పుడు] నేను యెహోవాను [శక్తి కనికరాల్లో అసమానుడైనవానికి విశ్వాసంతో] జ్ఞాపకము చేసికొంటిని; నీ పరిశుద్ధాలయములోనికి నీయొద్దకు నా మనవి వచ్చెను” అని ప్రార్థిస్తాడు. (యోనా 2:7) పరలోక ఆలయం నుండి దేవుడు యోనాను విని అతన్ని రక్షించాడు.

అంతంలో యోనా, “అసత్యమైన వ్యర్థ దేవతలయందు లక్ష్యముంచువారు [అబద్ధదేవతల యొక్క జీవం లేని విగ్రహాలను విశ్వసించేవారు] తమ కృపాధారమును [ఈ లక్షణాన్ని కనుపర్చే వానిని విడనాడడం ద్వారా] విసర్జింతురు. కృజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు [యెహోవా దేవునికి] బలుల నర్పింతును, నేను [ఇప్పుడు గానీ లేక ఇతర సందర్భాల్లోగానీ] మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవాయొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను.” (యోనా 2:8, 9; కీర్తన 31:6; 50:14 పోల్చండి.) కేవలం దేవుడు మాత్రమే తనను మరణమునుండి విడిపించగలడని తెలిసి, పశ్చాత్తాపం నొందిన ప్రవక్త (అతనికి ముందున్న దావీదు సొలొమోను రాజులవలె) యెహోవాకు రక్షణను ఆపాదించారు.—కీర్తన 3:8; సామెతలు 21:31.

యోనా విధేయుడౌతాడు

ఎంతో ఆలోచనాపూర్వకమైన యథార్థమైన ప్రార్థన తర్వాత, తాను వచ్చినమార్గం గుండానే బైటికి నెట్టివేయబడినట్లు భావిస్తాడు. చివరికి, అతను నేలమీదికి కక్కివేయబడ్డాడు. (యోనా 2:10) తన విమోచనకు కృతజ్ఞుడై యోనా దేవుని ఈ వాక్యానికి విధేయుడౌతాడు: “నీవు లేచి నీనెవె మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము.” (యోనా 3:1, 2) యోనా అష్షూరు రాజధానికి బయలుదేరతాడు. అది ఏ రోజో తెలుసుకున్నప్పుడు, తాను చేప కడుపులో మూడు రోజులు ఉన్నట్లు గ్రహిస్తాడు. ఈ ప్రవక్త యూఫ్రటీసు నదిని దాని గొప్ప పడమటి మలుపు వద్ద దాటి, ఉత్తర మెసపటోమియాకు తూర్పుగుండా ప్రయాణిస్తూ టైగ్రీస్‌ నది దగ్గరకు వచ్చి, గొప్ప పట్టణాన్ని చివరికి చేరుకుంటాడు.—యోనా 3:3.

యోనా పెద్ద పట్టణమైన నీనెవెలోకి ప్రవేశిస్తాడు. అతను ఒక రోజు నడిచి ఆ తర్వాత ఇలా ప్రకటిస్తాడు: “ఇక నలువది దినములకు నీనెవె పట్టణము నాశనమగును.” అష్షూరీయా భాష మాట్లాడే పరిజ్ఞానం యోనాకు అద్భుత రీతిలో అనుగ్రహింపబడిందా? అది మనకు తెలియదు. అయితే అతను హెబ్రీ భాషలో మాట్లాడుతూ మరొకరు అనువదిస్తున్నప్పటికీ, అతని ప్రచారం ఫలితాలను తెస్తుంది. నీనెవె ప్రజలు దేవునియందు విశ్వాసముంచడం ప్రారంభిస్తారు. వారిలో అల్పుల నుండి గొప్పవారివరకు అందరూ ఉపవాసాన్ని ప్రకటించి గోనెపట్ట కట్టుకుంటారు. ఆ మాట నీనెవె రాజుకు చేరినప్పుడు అతను తన సింహాసనం మీదినుండి లేచి తన రాజ వస్త్రాలను తీసివేసి, గోనెపట్ట కట్టుకుని, బూడిదెలో కూర్చుంటాడు.—యోనా 3:4-6.

యోనా ఎంత ఆశ్చర్యపోయాడో! “ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయముకాకుండ తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏదియు పుచ్చుకొన కూడదు, పశువులు గాని యెద్దులుగాని గొఱ్ఱెలుగాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు, మనుష్యులందరుకు తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను, మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను” అని అష్షూరీయుల రాజు దండోరావేయిస్తాడు. —యోనా 3:7-9.

నీనెవెవారు రాజాజ్ఞకు లోబడతారు. వారు తమ చెడు విధానం నుండి వెనుదిరిగారని దేవుడు చూసినప్పుడు, వారి మీదికి రప్పిస్తానని చెప్పిన వినాశనం విషయంలో ఆయన బాధపడతాడు, కనుక దాన్ని ఆయన రప్పించడు. (యోనా 3:10) వారి పశ్చాత్తాపం, వినయం, విశ్వాసాలవల్ల వారి మీదికి తీసుకురావాలని ఉద్దేశించిన తీర్పును వారి మీదికి తీసుకురాకూడదని యెహోవా నిర్ణయించుకుంటాడు.

అలిగిన ప్రవక్త

నలభైరోజులు గతించాయి కానీ నీనెవెకు ఏమీ జరగలేదు. (యోనా 3:4) నీనెవె పట్టణస్తులు నాశనంకారని గ్రహించిన తర్వాత, యోనా ఎంతో చింతాక్రాంతుడై కోపం తెచ్చుకుని, “యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేననుకొంటిని గదా? అందువలననే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయును గల దేవుడవై యుండి, పశ్చాత్తాపపడి కీడుచేయక మానుదువని నేను తెలిసికొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని, నేనిక బ్రతుకుటకంటె చచ్చుట మేలు; యెహోవా, నన్నిక బ్రతుకనియ్యక చంపుమని యెహోవాకు మనవి చేసెను.” అందుకు యెహోవా ఈ ప్రశ్నతో ప్రతిస్పందించాడు: “నీవు కోపించుట న్యాయమా?”—యోనా 4:1-4.

దానితో యోనా విసురుగా పట్టణం నుండి వెళ్ళిపోతాడు. తూర్పు వైపుకు పోయి, ఓ పందిలి వేసుకుని, ఆ పట్టణానికి ఇక ఏమి జరుగుతుందో చూసేందుకు దాని నీడలో కూర్చుంటాడు. ఆ పిదప యెహోవాయే ‘సొరచెట్టొకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకుపైగా నీడ యిచ్చునట్లు చేస్తాడు.’ యోనా దాన్ని చూసి ఎంత సంతోషించాడో! అయితే సాయంత్రమయ్యేటప్పటికి ఓ పురుగు ఆ మొక్కను తొలిచేలా యెహోవా చేస్తాడు, వెంటనే అది వాడిపోవడం మొదలై, త్వరలోనే మొత్తం వాడిపోతుంది. తూర్పు వడగాలిని కూడా దేవుడు పంపిస్తాడు. ఆ ప్రవక్త తలకు ఎండ దెబ్బ తగిలినప్పుడు అతను సొమ్మసిల్లుతాడు. తాను చావాలని పదే పదే కోరుకుంటాడు. అవును అనేకసార్లు యోనా, “బ్రదుగుటకంటె చచ్చుట నాకు మేలనుకొనెను.”—యోనా 4:5-8.

ఇప్పుడు యెహోవా మాట్లాడుతాడు. ఆయన యోనాను ఇలా అడుగుతాడు: “ఈ సొరచెట్టునుగురించి నీవు కోపించుట న్యాయమా?” అందుకు యోనా ఇలా జవాబిస్తాడు: “ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే.” సారాంశపూర్వకంగా యెహోవా ఆ ప్రవక్తతో ఇలా అంటాడు: ‘నీవు సొరచెట్టు విషయంలో బాధపడ్డావే. కానీ నువ్వు కష్టపడలేదు పెంచలేదు. అది ఒక రాత్రిలోనే పుట్టింది పెరిగింది ఒక రాత్రిలోగానే వాడిపోయింది.’ దేవుడు ఇంకా ఇలా తర్కించాడు: ‘మరి నేను అనేక పెంపుడు జంతువులేగాక, కుడియడములేవో తెలియని 1,20,000 మంది నివాసులున్న గొప్ప పట్టణమైన నీనెవె విషయంలో నేను బాధపడకూడదా?’ (యోనా 4:9-11) దానికి సరైన సమాధానం స్పష్టమే.

యోనా పశ్చాత్తాపపడి తన పేరున్న బైబిలు పుస్తకాన్ని వ్రాసేందుకు జీవిస్తాడు. నావికులు యెహోవాకు భయపడ్డారనీ, ఆయనకు బలియర్పించారనీ మ్రొక్కుబడులు చెల్లించారని అతనెలా తెలుసుకున్నాడు? దైవిక ప్రేరణవల్ల లేక బహుశ ఆలయం వద్ద నావికుల నుండి గానీ లేక ప్రయాణీకుల్లోని ఒకరి నుండి గానీ తెలుసుకునియుండవచ్చు.—యోనా 1:16; 2:4.

“యోనానుగూర్చిన సూచక క్రియ”

శాస్త్రులు పరిసయ్యులు యేసుక్రీస్తును సూచక క్రియలు చూపమని అడిగినప్పుడు ఆయన ఇలా చెప్పాడు: “వ్యభిచారులైన చెడ్డ తరమువారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్తయైన యోనానుగూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియయైనను వారికి అనుగ్రహింపబడదు.” యేసు ఇంకా ఇలా చెప్పాడు: “యోనా మూడు రాత్రింబగళ్లు తిమింగలము కడుపులో ఏలాగుండెనో అలాగు మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్భములో ఉండును.” (మత్తయి 12:38-40) యూదుల రోజులు సూర్యాస్తమయం నుండి ప్రారంభమౌతాయి. క్రీస్తు, సా.శ. 33లో నీసాను 14 శుక్రవారం నాడు మరణించాడు. ఆ రోజు సూర్యాస్తమయం కాకముందు ఆయన భౌతికకాయం సమాధిలో ఉంచబడింది. నీసాను 15 ఆ సాయంకాలం నాడు ప్రారంభమై శనివారం సూర్యాస్తమయం వరకూ కొనసాగింది, అంటే వారంలోని ఏడవ మరియు చివరి రోజన్నమాట. ఆ సమయంలో నీసాను 16 ప్రారంభమై మనం ఆదివారం అని పిలిచే రోజు సూర్యాస్తమయం వరకూ కొనసాగింది. తత్ఫలితంగా, నీసాను 14న యేసు మరణించి కనీసం కొంత సమయంవరకూ సమాధిలో ఉన్నాడు, నీసాను 15 రోజంతా సమాధిలో ఉన్నాడు, మరి నీసాను 16 రాత్రి సమాధిలోనే ఉన్నాడు. ఆదివారం ఉదయం కొందరు స్త్రీలు సమాధివద్దకు వచ్చినప్పుడు, ఆయన అప్పటికే పునరుత్థానుడయ్యాడు.—మత్తయి 27:57-61; 28:1-7.

యేసు సమాధిలోనే ఆయారోజుల్లో కొంతకొంత భాగంగా మూడు రోజులూ ఉన్నాడు. ఆ విధంగా ఆయన శత్రువులకు “యోనానుగూర్చిన సూచక క్రియ” అందింది కానీ యేసు ఇలా చెప్పాడు: “నీనెవెవారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నీనెవెవారు ఈ తరమువారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనాకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.” (మత్తయి 12:41) అది ఎంత వాస్తవం! యూదులు తమ మధ్య యేసును, అంటే యోనాకంటె గొప్పవాడైన ప్రవక్తను కల్గివున్నారు. యోనా సూచన నీనెవెవారికి సరిపోయినప్పటికీ, ఆ ప్రవక్తకన్నా యేసు మరింత అధికారంతోనూ, దాన్ని సమర్థించే రుజువుతోనూ ప్రకటించాడు. అయినప్పటికీ, యూదుల్లో అనేకులు దాన్ని విశ్వసించలేదు.—యోహాను 4:48.

యూదులు ఒక జనాంగంగా యోనాకంటె గొప్పవాడైన ప్రవక్తను వినయంతో అంగీకరించలేదు మరియు వారు ఆయనయందు విశ్వాసముంచలేదు. అయితే మరి వారి పూర్వికుల విషయమేమిటి? వారికి కూడా విశ్వాసమూ వినయమూ లేకపోయాయి. వాస్తవానికి, పశ్చాత్తాపపడ్డ నీనెవెవారికీ, విశ్వాసమూ విధేయత పూర్తిగా లేని, లోబడని ఇశ్రాయేలీయులకూ మధ్య ఉన్న తేడాను చూపించేందుకే యెహోవా యోనాను నీనెవెకు పంపించాడని స్పష్టమౌతోంది.—ద్వితీయోపదేశకాండము 9:6, 13.

యోనా మాటేమిటి? దేవుని దయ ఎంత గొప్పదో ఆయన నేర్చుకున్నాడు. అంతేకాకుండా, నీనెవెవారి ఎడల యెహోవా కనికరం కనుపర్చినప్పుడు యోనా సణగగా యెహోవా చూపిన ప్రతిస్పందన, మన పరలోకపు తండ్రి మన కాలంలోని ప్రజలకు కనికరాన్ని చూపించినప్పుడు మనంకూడ అసంతృప్తిని ప్రకటించకుండా ఉండేలా చేయాలి. వాస్తవానికి, ప్రతి సంవత్సరం వేలాదిమంది యెహోవా వైపుకు విశ్వాసంతో, వినయ హృదయాలతో తిరుగుతున్నందుకు మనం ఆనందిద్దాము.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి