“ఇది యెహోవా పని”
మెక్సికోలోని మోంటెర్రీ నగరపు ఒక వార్తాపత్రిక ఎల్ నోర్టెలోని ఒక ఆర్టికిల్ శీర్షిక అది. ఆ ఆర్టికిల్ యెహోవాసాక్షుల క్రొత్త సమావేశ మందిరాన్ని గూర్చినది.
మోంటెర్రీ మెక్సికోలోని ఉత్తర భాగాన ఉన్న, 23,00,000 (నగరశివార్లతో సహా) జనాభాగల నగరం, ఆ నగరంలో 19,200 మంది రాజ్య ప్రచారకులున్నారు. సౌకర్యంగా ఉండే సీట్లతోను, ఎయిర్ కండీషన్‌తోను ఉన్న ఓ అందమైన ఉపయోగించగల సమావేశ మందిరాన్ని నిర్మించడానికి దాదాపు ఒకటిన్నర సంవత్సరాలకు పైగా సాక్షులు ఐక్యతతో తమ ప్రయత్నాలను చేశారు. యెహోవాసాక్షుల పరిపాలక సభలోని ఒక సభ్యుడు ప్రతిష్ఠాపన ప్రసంగాన్నిచ్చినప్పుడు స్థానిక సాక్షులు ఆనందించారు. ఆ కార్యక్రమంలో మోంటెర్రీలోని పనిని గూర్చిన క్లుప్త చరిత్ర, మరియు నిర్మాణంలో భాగం వహించిన వారితో ఇంటర్వ్యూలు చేర్చబడ్డాయి. తర్వాత హాజరైన 4,500 మంది ప్రతిష్ఠాపన ప్రసంగాన్ని విని ఆనందించారు.
“మరిన్ని, మరింత పెద్దవి, మరింత శ్రేష్ఠమైన రాజ్య మందిరాలు మరియు సమావేశ మందిరాల” కొరకైన సన్నాహాలు అని వర్ణించబడినవాటిలో, మెక్సికోలో ఇటీవల నిర్మించబడిన సమావేశ మందిరాల్లో ఇది మూడవది.
మెక్సికోలో 4,43,000 కన్నా ఎక్కువ మంది ప్రచారకులతో, 1995 జ్ఞాపకార్థ దినానికి 14,92,500 మంది హాజరుతో, మోంటెర్రీలోని ఈ సమావేశ మందిరంలాంటి క్రొత్త సమావేశ మందిరాలు దైవిక సంకల్పాన్ని తప్పక నెరవేర్చుతాయి.