కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 4/15 పేజీలు 22-27
  • యెహోవా ఆశీర్వాదంతో విస్తరణ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా ఆశీర్వాదంతో విస్తరణ
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • హృదయానందకరమైన కార్యక్రమం
  • ప్రతిష్ఠించబడిన భవనాలు
  • ఎందుకు మరిన్ని గృహవసతులు అవసరం
  • 90 సాండ్స్‌ వెనుకనున్న చరిత్ర
  • యెహోవా ఆశీర్వాదం స్పష్టం
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 4/15 పేజీలు 22-27

యెహోవా ఆశీర్వాదంతో విస్తరణ

న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌నందలి తమ ప్రపంచ కార్యాలయమున్న ప్రాంతంలో యెహోవా దేవుడు తన సాక్షుల విస్తరణను నిజంగా ఆశీర్వదించాడని 1995, సెప్టెంబరు 18 సాయంకాలాన జరిగిన ప్రతిష్ఠాపన కార్యక్రమం నొక్కిచెప్పింది.

ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని 6,000 కన్నా ఎక్కువ మంది విన్నారు. ఆ కార్యక్రమం మొదలైన బ్రూక్లిన్‌లో, అలాగే ఇతర ప్రాంతాల్లోను, న్యూయార్క్‌లోని, పాటర్‌సన్‌ మరియు వాల్‌కిల్‌ సమీపాన ఉన్న యెహోవాసాక్షుల పెద్ద వసతులతో సహా కెనడాలోని టొరొంటో సమీపాన ఉన్న తమ బ్రాంచ్‌లోను వారు సమావేశమయ్యారు. బ్రూక్లిన్‌లో కాకుండా మిగిలినచోట్లలో ఉన్నవారు ప్రసార అనుబంధం గల టెలిఫోను ద్వారా కార్యవ్యవహారాలను వినగలరు.

హృదయానందకరమైన కార్యక్రమం

ఆ కార్యక్రమాన్ని వింటున్న బేతేలు సేవకులు అని పిలువబడే స్వచ్ఛంద సేవకులు ప్రపంచవ్యాప్తంగా 16,400 మంది కంటే ఎక్కువ సభ్యులుగల బేతేలు కుటుంబంలోని అత్యధిక భాగమై ఉన్నారు. దాదాపు వంద దేశాల్లో సేవచేస్తున్న అలాంటి సభ్యులు అక్కడ బైబిలు సాహిత్యాన్ని ముద్రించి, ప్రపంచంలో ఉన్న 78,600 కన్నా ఎక్కవ సంఘాల్లోవున్న యెహోవాసాక్షులకు సేవామద్దతును ఇస్తున్నారు.

సాయంకాలం 6:30కి పాటతోను, కార్ల్‌ క్లైన్‌ ప్రార్థనతోను ప్రతిష్ఠాపన కార్యక్రమం మొదలైనప్పుడు ఎంతో ఎక్కువగా ఎదురుచూడబడింది. కార్యక్రమ అధ్యక్షుడు లాయిడ్‌ బారీ ఆ సందర్భం యొక్క ప్రాముఖ్యతను గూర్చి క్లుప్తంగా వ్యాఖ్యానిస్తూ అందరినీ ఆప్యాయంగా ఆహ్వానించాడు. అల్బర్ట్‌ ష్రోడర్‌ ఆ వారపు కావలికోట పాఠాన్ని పునఃసమీక్షించాడు, ఆ తర్వాత, డానియేల్‌ సిడ్లిక్‌ “బేతేలులో మన పరిశుద్ధ సేవ” అనే విషయంపై మాట్లాడాడు. ఈ కార్యక్రమంలోని మొదటివారందరూ యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యులే.

తరువాతి రెండు కార్యక్రమాలు—“వసతుల కొరకు పెరుగుతున్న మన అవసరాన్ని తీర్చుకోవడం, 1974-1995,” మరియు “బేతేలు పునర్నవీకరణను మరియు బ్రూక్లిన్‌లో నిర్మాణాన్ని గూర్చిన ఉన్నతాంశాలు”—అనే ప్రతిష్ఠించబడిన కట్టడాల నిర్మాణాన్ని లేదా సంపాదించడాన్ని గూర్చిన ముఖ్యాంశాలను చర్చించాయి. ఇవ్వబడిన వ్యాఖ్యానాలు ఇప్పుడు దాదాపు వెయ్యిమంది బేతేలు సేవకులు ఉంటున్న ఇటీవలే తయారైన భవనంపై శ్రద్ధను కేంద్రీకరించాయి. 115 మీటర్ల ఎత్తున్న ఈ భవనం 90 సాండ్స్‌ వద్దనున్న ప్రింటింగ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ను ఆనుకొని ఉంది.

ఈ కార్యక్రమంలో వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ అధ్యక్షుడైన మిల్టన్‌ హెన్‌షెల్‌ ఇచ్చిన ప్రతిష్ఠాపన ప్రసంగం విశిష్టమైనది. యెహోవా సేవలో ఉపయోగించేందుకు కట్టడాలను ప్రతిష్ఠించడానికి బైబిలు దృష్టాంతాలను ఆయన నొక్కిచెప్పాడు. కార్యవ్యవహారాలు ఒక పాట తరువాత, పరిపాలక సభ సభ్యుడైన కారీ బార్బర్‌ ప్రార్థనతో ముగిశాయి. కాని కార్యక్రమంలోని కొన్ని ముఖ్యమైన అంశాలేమిటి?

ప్రతిష్ఠించబడిన భవనాలు

1969, మే 2న బ్రూక్లిన్‌లో ఒక బేతేలు నివాసగృహం ప్రతిష్ఠించబడినప్పటి నుండి మరో 17 నివాసగృహాలు చేర్చబడ్డాయని బేతేలు గృహ అధ్యక్షుడు జార్జ్‌ కవుచ్‌ వివరించాడు.a ఇవి క్రొత్తగా నిర్మించబడ్డాయి లేదా కొన్న తరువాత పునర్నవీకరించబడ్డాయి. ఇది నిజానికి, 1940లలో కొని, బేతేలు నివాసగృహాలుగా మార్చబడిన 17 నివాసగృహాలుగల ఈ రెండు చిన్న కట్టడాల ప్రతిష్ఠాపన, అలాగే 1982, మార్చి 15న యెహోవాసాక్షుల కార్యనిర్వాహక కార్యాలయ ప్రతిష్ఠాపన జరిగినప్పటినుండి నిర్మించబడిన లేదా కొనుగోలు చేయబడిన కర్మాగారం మరియు కార్యాలయ వసతుల ప్రతిష్ఠాపన అది.b

360 ఫర్మన్‌ స్ట్రీట్‌లో ఉన్న భవనం ప్రతిష్ఠించబడిన భవనాలన్నింటికన్నా పెద్దది. అది మొదట 1928లో నిర్మించబడింది, యెహోవాసాక్షులు దానిని 1983, మార్చి 15న కొని, పూర్తిగా మార్చేశారు. దాని నేల భాగం కనీసం 93,000 చదరపు మీటర్లు లేదా దాదాపు 23 ఎకరాలు ఉంటుంది. ప్రతిష్ఠాపన చేయబడినదానిలో ఇమిడివున్న మిగిలిన భవనాలు 175 పెర్ల్‌ స్ట్రీట్‌ వద్దనున్న కర్మాగారం మరియు ఇటీవలి సంవత్సరాల్లో నిర్మించబడిన పెద్ద గరాజ్‌లు చేరి ఉన్నాయి.

ఎందుకు మరిన్ని గృహవసతులు అవసరం

1969లో చివరి బ్రూక్లిన్‌ బేతేలు నివాస గృహం ప్రతిష్ఠించబడినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా దేవుని రాజ్యసువార్తను ప్రకటించే సాక్షుల శిఖరాగ్ర సంఖ్య 13,36,112గా ఉండింది. కాని 1995లో 51,99,895 మంది ఆ పని చేస్తున్నారు, అంటే మూడున్నర రెట్లకన్నా ఎక్కువే! కనుక, బైబిలు సాహిత్యం కొరకు పెరుగుతున్న అవసరాన్ని తీర్చేందుకు, బ్రూక్లిన్‌ బేతేలు కుటుంబంలో స్థిరంగా ఉన్న సభ్యుల సంఖ్యను 1969లో 1,042 నుండి 3,360 కన్నా ఎక్కువగా పెంచడం జరిగింది, వారు ఇప్పుడు 22 నివాసగృహాల్లో నివసిస్తున్నారు!

జార్జ్‌ కవుచ్‌ 1974 నుండి 1995 వరకు అదనపు గృహవసతుల అవసరమెలా తీర్చబడింది అనే దాని గూర్చి చర్చించాడు. 1970లలో పెరుగుతున్న బేతేలు కుటుంబానికి వసతిని కల్పించేందుకు సమీపాన ఉన్న టవర్స్‌ హోటల్‌లోని అనేక అంతస్తులను యెహోవాసాక్షులు అద్దెకు తీసుకున్నారు. 1973 డిశంబరులో అప్పట్లో వాచ్‌ టవర్‌ సొసైటీ అధ్యక్షుడైన నేథన్‌ నార్‌ ‘1974, అక్టోబరు 1నాటికి టవర్స్‌ హోటల్‌ను మారాలని’ అనుకుంటున్నామని తెలుపుతూ బేతేలు కార్యాలయానికి మరియు టవర్‌ కార్యనిర్వాహక వర్గానికి వ్రాశాడు.

టవర్స్‌లో ఉండే బేతేలు సేవకులను ఉంచడానికి వేరే స్థలం లేదు కనుక సహోదరుడు కవుచ్‌ తాను ఆశ్చర్యపోయాడని చెప్పాడు. టవర్స్‌ కార్యనిర్వాహక వర్గం కూడా ఆశ్చర్యపోయింది, ఎందుకంటే, సొసైటీ ఇచ్చే అద్దె డబ్బుతోనే అది చట్టపరమైన బకాయిలను తీర్చుకునేది. దాని ఫలితమేమిటంటే టవర్స్‌ కార్యనిర్వాహక వర్గం ఆ హోటల్‌ను కొనుక్కోమని యెహోవాసాక్షులను బ్రతిమాలింది. “మేము ఈ పొరుగున ఉన్నప్పటినుండి మీరు పెరుగుతూనే ఉన్నారు, మీకు భవనం అవసరం” అని వారన్నారు.

“దానినిండా అద్దెకున్నవాళ్ళున్నారు. మేము కొంటే, మా వాళ్ళను మాత్రమే అందులో ఉంచాలని మేము కోరుకుంటాం” అని సొసైటీ ప్రతినిధులు జవాబిచ్చారు.

“మీ కోసం మేము భవనాన్ని ఖాళీ చేయిస్తాం” అని టవర్స్‌ కార్యనిర్వాహక వర్గం వాగ్దానం చేసింది. త్వరలోనే యెహోవాసాక్షులు టవర్స్‌ భవంతిని సరైన వెలకు కొనుక్కున్నారు. అత్యంతాసక్తితో వింటున్న తన ప్రేక్షకులను “సహోదరుడు నార్‌ ఆ ఉత్తరాన్ని ఎందుకు వ్రాశాడు?” అని కవుచ్‌ ప్రశ్నించాడు. “బహుశ ఆయనకే తెలియకపోయి ఉండవచ్చు, కాని టవర్స్‌ హోటల్‌ను వాచ్‌ టవర్‌ సొసైటీకి అమ్మేలా అదే చేసింది.”

మొదటి బేతేలు గృహానికి అవతల మరో వీధిలోవున్న ప్రసిద్ధమైన మార్గరెట్‌ హోటల్‌ ముందటి స్థానమైన 97 కొలంబియా హైట్స్‌ను యెహోవాసాక్షులు ఎలా కొన్నారనే విషయాన్ని కూడా ప్రసంగికుడు వివరించాడు. ఆ ప్రాంతం నుండి వీధి క్రింది ఉన్న సొరంగం గుండా బేతేలు కాంప్లెక్స్‌తో సులభంగా సంబంధం పెట్టుకోవచ్చు కనుక ఆ ప్రాంతం చాలా అనుకూలమైనది. 1980 ఫిబ్రవరిలో, ఆ భవనం నమూనా మార్చబడుతుండగా అది కాలిపోయింది. ఆ స్థానాన క్రొత్త భవనాన్ని నిర్మించడం ఆ సొంతదారునికి కష్టమైనందువల్ల ఆ స్థలాన్ని అతడు యెహోవాసాక్షులకు అమ్మివేశాడు.

“ఈ భవనాల్లో ప్రతిదాని వెనుకవున్న ఒక ఆసక్తికరమైన చరిత్ర అనుభవంలో ఒకే విషయాన్ని సూచిస్తుంది, ఏంటంటే, ఆ ప్రత్యేక భవనాన్ని సొంతం చేసుకునేందుకు దృశ్య సంస్థను నడిపింది యెహోవా దేవుడే” అని సహోదరుడు కవుచ్‌ పేర్కొన్నాడు.

90 సాండ్స్‌ వెనుకనున్న చరిత్ర

90 సాండ్స్‌ స్ట్రీట్‌ అతి క్రొత్తది మరియు అతి పెద్దదియునైన నివాసగృహం. 1986, డిశంబరులో యెహోవాసాక్షులు ఆ స్థలాన్ని కొన్నప్పుడు, 160 జే స్ట్రీట్‌లో ఉన్న పెద్ద కర్మాగారానికి అది వసతిని కల్పించింది.c కర్మాగారం కూలగొట్టబడింది, 1990, ఆగస్టు 30న ఆ స్థానాన 30 అంతస్తుల నివాసగృహాల నిర్మాణానుమతి లభించిందని బేతేలు కుటుంబానికి చెప్పబడింది.

పరిపాలక సభ సభ్యుడైన థియోడోర్‌ జారజ్‌ నిర్వహించిన ఇంటర్వ్యూలో సొసైటీ యొక్క బ్రూక్లిన్‌ కర్మాగార అధ్యక్షుడు మాక్స్‌ లార్సన్‌ 90 సాండ్స్‌ స్ట్రీట్‌ నివాసగృహానికి ఎలా అనుమతి లభించిందో వివరించాడు. మునుపు అంటే 1965లో జరిగినదానిని గురించి సహోదరుడు లార్సన్‌ వివరించినది అతికీలకమైనది.

అప్పట్లో సొసైటీ తన మిగిలిన కర్మాగారాలకు ప్రక్కగా ఒక బ్లాకులో పది అంతస్తుల కర్మాగారాన్ని నిర్మించాలని అనుకుంది, కానీ ఆ బ్లాకుల మండలం రెండస్తుల నిర్మాణానికే అనుమతినిచ్చింది. క్రొత్తగా నిర్మించనున్న కర్మాగారానికి బిల్డింగ్‌ ప్రింట్లను తయారు చేస్తానని భవన శిల్పి ఒప్పుకున్నాడు కాని, ఇలా చెప్పాడు: “వాటిని బోర్డుకిచ్చి నన్ను నేను చిక్కుల్లో వేసుకోను.” బోర్డ్‌ ఆఫ్‌ స్టాండర్డ్స్‌ ఆ బ్లాక్‌ కొరకు మండల నిబంధనలను మార్చదని ఆయన నమ్మాడు. బిల్డింగ్‌ ప్రింట్లు అంగీకరించబడినప్పుడు, ఆయన ఆశ్చర్యపడుతూ “మీరు దీన్నెలా సంపాదించారు!” అని అన్నాడు.

కారణమేంటంటే, లార్సన్‌ ఇంకా ఇలా చెప్పాడు, మన పదంతస్తుల కర్మాగారంతో సహా, సమీపంలో ఉన్న బ్లాకులు అలాగే 160 జే స్ట్రీట్‌ బిల్డింగ్‌ కూడా తిరిగి వర్గీకరించబడ్డాయి. మరి అద్భుతంగా, పునర్‌వర్గీకరణ హోటల్‌కు అనుమతినిచ్చింది. అయితే, దాదాపు 25 సంవత్సరాల వరకూ కూడా అంటే మనం క్రొత్త బేతేలు గృహాన్ని నిర్మించేందుకు సరైన స్థానం కోసం చూసేంత వరకూ కూడా ఎవరూ దానిని గమనించలేదని లార్సన్‌ పేర్కొన్నాడు. తర్వాతే మండల నిబంధన తిరిగి కనుగొనబడింది!

“మన 30 అంతస్తుల వసతి కోసం మేం ప్రింట్లను ముద్రించి, వాటిని బిల్డింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు తీసుకువెళ్ళినప్పుడు, ‘మీకక్కడ వసతి సాధ్యం కాదు. అది వస్తువులను తయారీ కోసమే, మీ కోసం వారు మండలాన్ని మార్చరు’ అని మాతో చెప్పారు” అని అంటూ జరిగిన విషయాన్ని సహోదరుడు లార్సన్‌ వివరించాడు.

“‘వారు వాటిని మార్చనక్కరలేదు, అది ఇదివరకే హోటల్‌ కోసం వర్గీకరించబడింది’ అని మేము అధికారులకు తెలియజేశాం. వారు రికార్డులను చూసినప్పుడు వాళ్ళు నమ్మలేకపోయారు! అలా మనం మన 30 అంతస్తుల భవనాన్ని సంపాదించుకున్నాం” అని లార్సన్‌ ముగించాడు.

యెహోవా ఆశీర్వాదం స్పష్టం

బైబిలులోని ఒక కీర్తన రచయిత “యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే” అని వ్రాశాడు. (కీర్తన 127:1) స్పష్టంగా, యేసు తన శిష్యులను చేయమని ఆజ్ఞాపించిన ప్రపంచవ్యాప్త ప్రకటనా పనికి మరియు బోధనా పనికి సౌకర్యం కలిగించే యెహోవాసాక్షుల నిర్మాణపనిపై యెహోవా ఆశీర్వాదం ఉంటోంది.—మత్తయి 24:14; 28:19, 20.

1995 సెప్టెంబరు 18నాటి కార్యక్రమాన్ని వినే ఆధిక్యతను పొందినవారు యెహోవా సేవకుల ప్రపంచ ప్రధాన కార్యాలయ విస్తరణపై యెహోవా ఆశీర్వాదపు రుజువును చూసి ఎంతో పులకించిపోయారు. యెహోవా ప్రజలు ఆయన ఆజ్ఞాపిస్తున్న దానిని చేస్తూ ఉండగా తన ఆశీర్వాదాన్ని కురిపిస్తూనే ఉంటాడని నమ్మకం కలిగివుండగలరు.

[అధస్సూచీలు]

a కావలికోట (ఆంగ్లం) జూన్‌ 15, 1969, పేజీలు 379-82.

b కావలికోట (ఆంగ్లం) డిశంబరు 1, 1982, పేజీలు 23-31.

c తేజరిల్లు! (ఆంగ్లం) డిశంబరు 22, 1987, పేజీలు 16-18.

[23వ పేజీలోని చిత్రం]

90 సాండ్స్‌ స్ట్రీట్‌. • 1995

[24, 25వ పేజీలోని చిత్రం]

ప్రతిష్ఠించబడిన కొన్ని అదనపు నివాసగృహాలు

97 కొలంబియా హైట్స్‌. • 1986

బాసెర్ట్‌ హోటల్‌, 98 మోంటగ్యూ స్ట్రీట్‌. • 1983

34 ఆరెంజ్‌ స్ట్రీట్‌. • 1945

స్టాండిష్‌ హోటల్‌, 169 కొలంబియా హైట్స్‌. • 1981

67 లివింగ్‌స్టన్‌ స్ట్రీట్‌. • 1989

108 జరేలమన్‌ స్ట్రీట్‌. • 1988

టవర్స్‌ హోటల్‌, 79-99 విల్లో స్ట్రీట్‌. • 1975

[26వ పేజీలోని చిత్రం]

175 పెర్ల్‌ స్ట్రీట్‌. • 1983

69 ఆడమ్స్‌ స్ట్రీట్‌. • 1991

360 ఫర్మన్‌ స్ట్రీట్‌. • 1983

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి