కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 4/1 పేజీలు 22-26
  • “క్షయమగు ఆహారం కొరకు కాకుండా, . . . పనిచేయండి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “క్షయమగు ఆహారం కొరకు కాకుండా, . . . పనిచేయండి”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అమ్మ విశ్వాస మాదిరి
  • సమర్పణ, బాప్తిస్మం
  • ప్రపంచ ప్రధాన కార్యాలయంలో సేవ
  • మద్దతునిచ్చే కుటుంబం
  • వివాహం, కుటుంబం
  • ఆత్మీయ ఆహారంచే పోషించబడడం
  • యెహోవా సేవలో సుసంపన్నమైన జీవితం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • రాజ్యానికి ప్రథమస్థానం ఇవ్వడం—సురక్షితమైన, ఆనందభరితమైన జీవితం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • బేతేలు సేవ—మరెక్కువ మంది స్వచ్ఛంద సేవకుల అవసరం ఉంది
    మన రాజ్య పరిచర్య—1995
  • మిమ్మల్ని మీరు అందుబాటులో ఉంచుకోగలరా?
    మన రాజ్య పరిచర్య—2003
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 4/1 పేజీలు 22-26

“క్షయమగు ఆహారం కొరకు కాకుండా, . . . పనిచేయండి”

డేవిడ్‌ లన్‌స్ట్రమ్‌ చెప్పింది

వాచ్‌టవర్‌ కర్మాగార భవనంపై ఓ క్రొత్త సైన్‌ బోర్డును పెయింటు చేస్తూ నేను, నా తమ్ముడు 30 అడుగులపైగా గాలిలో ఉన్నాం. అది 40 సంవత్సరాల క్రిందటనుండి ఇప్పటి వరకూ ఉండి, ఇలా ఉద్బోధిస్తుంది: “దేవుని వాక్యమైన పరిశుద్ధ బైబిలును అనుదినం చదవండి.” ప్రతివారం, వేలాదిమంది ప్రజలు ప్రఖ్యాతిగాంచిన బ్రూక్లిన్‌బ్రిడ్జ్‌పైగా సాగిపోతూ ఈ సైన్‌బోర్డును చూస్తారు.

నా చిఱుప్రాయపు జ్ఞాపకాల్లో కుటుంబమంతటి బట్టలుతికే రోజూ ఉంది. అమ్మ ఉదయం 5 గంటలకు లేచి, పెద్దదైన మా కుటుంబంలోని అందరి బట్టల్ని ఉతికేది మరియు నాన్న పనికి సిద్ధపడేవాడు. వారి తీవ్రమైన చర్చల్లో మరొక చర్చను కల్గివుండేవారు, అది కోట్లాది సంవత్సరాల క్రిందట మానవుడు ఏదోవిధంగా పరిణామం చెందాడని నాన్న వాదించడం, మానవులు దేవుని యొక్క ప్రత్యక్ష సృష్టేనని రుజువు చేయడానికి బైబిలు నుండి అమ్మ చూపించడమే.

నాకు కేవలం ఏడేళ్లే ఉన్నప్పటికీ అమ్మ చెప్పిందే సత్యమని నేను గ్రహించాను. నేను నాన్నను ఎంతగా ప్రేమించానో అంతగా ఆయన నమ్మకాలు భవిష్యత్తు కొరకు ఏ నిరీక్షణను ఇవ్వడంలేదని నేను గ్రహించగలిగాను. అనేక సంవత్సరాల తర్వాత, తాను అధికంగా ప్రేమించిన పుస్తకమైన బైబిల్ని చదివేందుకు ప్రజల్ని ప్రోత్సహించే ఓ సైన్‌ బోర్డును తన కుమారులలో ఇరువురు పెయింటు వేయడాన్ని గురించి తెలుసుకొనిన అమ్మ ఎంత సంతోషించిందో!

కాని నేను ఒక క్రమంగా చెప్పకుండా ముందుకు పోతున్నాను. అటువంటి ఆధిక్యతాయుతమైన పనిని నేనెలా పొందగలిగాను? నేను జన్మించడానికి మూడేళ్ల మునుపు అంటే 1906వ సంవత్సరానికి నేను వెళ్లాల్సి ఉంటుంది.

అమ్మ విశ్వాస మాదిరి

అప్పట్లో అమ్మానాన్నలు నూతన దంపతులు, అరిజొనాలో ఓ గుడారంలో నివసిస్తున్నారు. యెహోవాసాక్షులు అప్పట్లో బైబిలు విద్యార్థులని పిలువబడేవారు, వారిలో ఒకరు వచ్చి చార్ల్‌స్‌తేజ్‌ రస్సెల్‌ వ్రాసిన లేఖనాలపై అధ్యయనం (ఆంగ్లం) అనే పేరుగల పుస్తకాల పరంపరను అమ్మకు ఇచ్చాడు. ఆమె రాత్రంతా మేల్కొని వాటిని చదివి, వెంటనే తాను వెదుకుతున్న సత్యమిదేనని గ్రహించింది. ఉద్యోగాల వేటనుండి తిరిగి వచ్చేవరకూ నాన్న కొరకు వేచివుండలేకపోయింది.

నాన్న కూడా చర్చీలు బోధిస్తున్నదానితో అసంతృప్తి చెందాడు, గనుక కొంతకాలం ఆయన ఈ బైబిలు సత్యాల్ని అంగీకరించాడు. అయినా తరువాత, ఆయన మతం విషయంలో తన మార్గాన్ని తానెన్నుకున్నాడు మరి అమ్మకు కష్టాన్ని కూడా కలుగజేసాడు. కాని తన పిల్లల భౌతిక అలాగే ఆత్మీయ అవసరతలను తీర్చడాన్ని ఆమె ఎన్నడూ మానలేదు.

పగలంతా కష్టపడి పని చేసిన తర్వాత, మా కోసం బైబిలులోని కొంత భాగాన్ని చదివేందుకు లేక మాతో ఏదొక ఆత్మీయ ఆణిముత్యాన్ని పంచుకొనేందుకు రెండో అంతస్తు నుండి మొదటి అంతస్తుకి ప్రతి రాత్రి అమ్మ దిగి రావడాన్ని నేనెన్నటికీ మర్చిపోలేను. నాన్న బాగా కష్టించి పనిచేసేవాడు కూడా, నేను ఎదుగుతుండగా, ఆయన నాకు పెయింటింగ్‌ వృత్తిని నేర్పించాడు. అవును పనిచేయడాన్ని నాన్న నేర్పించాడు కాని ఏ ‘అక్షయమైన ఆహారము’ కొరకు పనిచేయమని యేసు ఉపదేశించాడో దానికొరకు పనిచేయడం అమ్మ నేర్పింది.—యోహాను 6:27.

మా కుటుంబం చివరికి, సీటల్‌కు తూర్పున దాదాపు 180 కిలోమీటర్ల దూరాన, వాషింగ్‌టన్‌ రాష్ట్రంలోని ఎలెన్స్‌బర్గ్‌నందలి చిన్నపట్టణంలో స్థిరపడింది. పిల్లలమైన మేము అమ్మతో బైబిలు విద్యార్థుల కూటాలకు హాజరవ్వడం ప్రారంభించినప్పుడు, మేము రహస్య గృహాల్లో కూడుకునేవారం. ఇంటింటి పరిచర్యలో భాగం వహించే అవసరత నొక్కి చెప్పబడినప్పుడు, మా పఠన గుంపును అందరూ విడిచి వెళ్లిపోయారు. కాని అమ్మ ఎన్నడూ సంశయించలేదు. ఇది, ఎల్లప్పుడూ యెహోవా సంస్థ నడిపింపునందు నమ్మకం ఉంచేందుకు నాపై చెరిగని ముద్రను వేసింది.

అమ్మా నాన్నలకు మొత్తం తొమ్మిదిమంది పిల్లలం కలిగాం. వారి మూడవ బిడ్డగా అక్టోబరు 1, 1909న నేను జన్మించాను. మొత్తానికి మాలో ఆరుగురం అమ్మ శ్రేష్ఠమైన మాదిరిని అనుసరించి, యెహోవా యొక్క ఆసక్తికల్గిన సాక్షులమయ్యాం.

సమర్పణ, బాప్తిస్మం

నేను నా యౌవనారంభంలో ఉన్నప్పుడు, యెహోవాకు సమర్పించుకొని, 1927లో నీటి బాప్తిస్మం తీసుకోవడం ద్వారా నేను దీన్ని సూచించాను. సీటల్‌లో ఓ పురాతన భవనంలో బాప్తిస్మం జరిగింది, అది ఇంతకు మునుపు ఓ బాప్టిస్ట్‌ చర్చ్‌. ఆ పురాతన గోపురాన్ని వారు తీసేసినందుకు నేను సంతోషించాను. బేస్‌మెంటులోని జలాశయం వరకూ మావెంట వచ్చారు, అక్కడ మాకు పొడవైన నల్లని కంబళ్లు ఇవ్వబడ్డాయి. మేము అంత్యక్రియలకు వెళ్తున్నట్లుగా కన్పించింది.

తరువాత కొన్ని నెలల్లోనే మరలా నేను సీటల్‌లో ఉన్నాను, ఈసారి ఇంటింటి సాక్ష్యం ఇచ్చే మొట్ట మొదటి అనుభావాన్ని నేను పొందాను. నాయకత్వం వహిస్తున్న వ్యక్తి “మీరు వీధిలో ఈ వైపునుండి చేయండి, నేను ఆ వైపునుండి చేస్తాను” అని నన్ను ఆదేశించాడు. నేను కంగారు పడినప్పటికీ, రెండు సెట్ల పుస్తకాల్ని ఓ మంచి స్త్రీకి అందించాను. నేను ఎలెన్స్‌బర్గ్‌కు తిరిగి వచ్చేంతవరకూ ఇంటింటి పరిచర్యలో భాగం వహిస్తూనే ఉన్నాను, మరిప్పుడు అంటే దాదాపు 70 సంవత్సరాల తర్వాత కూడా అలాంటి సేవ నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది.

ప్రపంచ ప్రధాన కార్యాలయంలో సేవ

ఎంతో కాలంగడవక ముందే, వాచ్‌టవర్‌ సొసైటీ ప్రపంచ ప్రధాన కార్యాలయమైన బ్రూక్లిన్‌ బేతేలులో సేవించిన ఓ వ్యక్తి, స్వచ్ఛంద సేవకునిగా అక్కడ సేవించమని నన్ను ప్రోత్సహించాడు. మా సంభాషణ జరిగిన కొద్ది కాలానికే, బేతేలులో సహయపడే అవసరతను తెలియజేసే ఓ నోటీసు వాచ్‌టవర్‌ పత్రికలో వచ్చింది. గనుక నేను దరఖాస్తు చేశాను. బ్రూక్లిన్‌ న్యూయార్క్‌లో బేతేలు సేవ కొరకు మార్చి 10, 1930న రమ్మని ఆహ్వానించిన ఉత్తరాన్ని అందుకున్నప్పటి నా ఆనందాన్ని నేనెన్నటికీ మర్చిపోలేను. అలా ‘అక్షయమగు ఆహారం కొరకు పనిచేసే’ నా పూర్తికాల గమనం ఆరంభమైంది.

పెయింటర్‌గా నాకున్న అనుభవాన్నిబట్టి నేను ఏదొకటి పెయింట్‌ చేయడానికి నియమించబడి ఉంటానని ఒకరనుకోవచ్చు. దానికి బదులుగా, కర్మాగారంలో కుట్టు మిషనుపై పనిచేయడమే నా మొదటి పని. ఇది ఎంతో విసుగును కల్గించే పనే అయినా నేను ఆరు సంవత్సరాలకుపైగా ఈ పనిలో ఆనందించాను. మేము ఆప్యాయంగా ప్రాచీన యుద్ధనౌక అని పిలిచే పెద్ద రోటరీ ప్రెస్‌ తయారు చేసిన చిన్న పుస్తకాలు, కన్వేయరు బెల్టు నుండి మా క్రిందంతస్తులోనికి పంపించబడేవి. యుద్ధనౌక నుండి చిన్న పుస్తకాల్ని తీసుకున్నంత వేగంగానే మేము వాటిని కుట్టగల్గడాన్ని చూడడాన్ని మేము ఆనందించాం.

ఆ తర్వాత నేను అనేక డిపార్టుమెంట్లలో పని చేశాను, మేము ఫోనోగ్రాఫ్‌లు చేసిన డిపార్టుమెంటు వాటిలో ఒకటి. మేము గృహస్థుల ఇంటి ముంగిళ్లలో రికార్డు చేయబడిన బైబిలు వర్తమానాల్ని వినిపించడానికి ఈ యంత్రాలను ఉపయోగించాం. మా డిపార్టుమెంటులోని స్వచ్ఛంద సేవకులు వెర్టికల్‌ ఫోనోగ్రాఫ్‌ను రూపొందించి, తయారు చేశారు. ఈ ఫోనోగ్రాఫ్‌ ముందుగానే రికార్డు చేయబడిన వర్తమానాల్ని ప్లే చేయడమేగాక, పుస్తకాల్ని మరి బహుశా ఓ శాండ్‌విచ్‌ను తీసుకు వెళ్లేందుకు పెట్టుకునే ప్రత్యేకమైన అరలను కూడా కల్గివుంది. మిచిగన్‌లోని డిట్రాయిట్‌నందు 1940లో జరిగిన ఓ సమావేశంలో ఈ క్రొత్త ఉపకరణ ఉపయోగాన్ని ప్రదర్శించే ఆధిక్యత నాకు కల్గింది.

అయినా, మేము సాదాసీదా యంత్రాలకన్నా ఎక్కువే తయారు చేశాం. మేము ప్రాముఖ్యమైన ఆత్మీయ సవరింపులను కూడా చేసేవాళ్లం. ఉదాహరణకు, యెహోవాసాక్షులు సిలువతోను, కిరీటాలతోను ఉన్న ఓ పిన్నును ధరించేవారు. కాని యేసు సిలువపైగాక ఓ నిలువు కొయ్యపై చంపబడ్డాడని తర్వాత మేం అర్థం చేసుకున్నాం. (అపొస్తలుల కార్యములు 5:30) గనుక ఈ పిన్నులను ధరించడం మానుకున్నాం. పిన్నుల నుండి అంటింపులను ఊడబెరకడం నా ఆధిక్యతయైవుంది. తర్వాత ఆ బంగారాన్ని కరిగించి అమ్మివేశాం.

మాకు, ప్రతివారమూ తీరికలేని ఐదున్నర రోజుల పని షెడ్యూలు ఉన్నా, వారాంతాన క్రైస్తవ పరిచర్యలో మేము భాగం వహించేవారం. ఓ రోజు, మాలో16 మందిమి అరెస్టు చేయబడి, బ్రూక్లిన్‌లోని జైలులో ఉంచబడ్డాం. ఎందుకు? ఆ రోజుల్లో మేము మతాన్ని, అబద్ధ మతానికి పర్యాయ పదంగా పరిగణించాం. గనుకనే మేము ఓ ప్రక్క “మతం ఓ ఉచ్చు, ఓ రాకెట్టు” అని మరో ప్రక్క “దేవున్ని, రాజైన క్రీస్తును సేవించండి” అనే సైన్‌ బోర్డులను తీసుకువెళ్లేవాళ్లం. ఈ సైన్‌ బోర్డులను తీసుకు వెళ్లినందుకే మేము జైలులో పెట్టబడ్డాం, కాని వాచ్‌ టవర్‌ సొసైటీ న్యాయవాదియైన హేడెన్‌ కవిన్టన్‌ బయటకు రావడానికి బెయిలు ఇచ్చాడు. ఆ సమయంలో ఆరాధనా స్వాతంత్య్రం చేరివున్న అనేక కేసులు అమెరికా సుప్రీం కోర్టులో పోరాడుతున్నాయి మరియు బేతేలులోవుండి, మన విజయాలను గురించిన రిపోర్టులను మొదటిగా వినడం అనేది పులకరింత కలుగజేసింది.

చివరకు, నా పెయింటింగ్‌ అనుభవాన్ని ఉపయోగించే పనులకు నేను నియమించబడ్డాను. న్యూయార్క్‌ నగర ఐదు రాజకీయ విభాగాలలో ఒకటైన స్టేటన్‌ ద్వీపంపై, మనకు డబ్ల్యుబిబిఆర్‌ అనే రేడియో స్టేషన్‌ ఉండేది. ఆ స్టేషన్‌ యొక్క రేడియో టవర్లు 60 అడుగుల ఎత్తుకు పైగా ఉన్నాయి, వాటికి మూడు సెట్ల చట్రంలో బిగించబడిన వైర్లున్నాయి. నా తోటి పనివాడొకరు నన్ను ఎత్తి పట్టుకోగా 9 మీటర్ల ఎత్తు 20 సెంటిమీటర్ల వెడల్పుగల బోర్డుపై నేను కూర్చున్నాను. నేలకు పైగా ఆ చిన్న కుర్చీలో కూర్చొని నేను చట్రంలోని వైర్లకు, టవర్లకు పెయింటు వేశాను. ఆ పనిని చేస్తుండగా మేము బాగా ప్రార్థన చేసుకోలేదాయని కొంతమంది నన్ను అడిగారు!

కర్మాగార భవనపు కిటికీలను శుభ్రపర్చడం, కిటికీ గడపలకు పెయింట్‌ వెయ్యడం అనే వేసవికాల పనిని నేను ఎన్నడూ మర్చిపోలేను. మేము దానిని మా వేసవి సెలవు అని పిలిచేవారం. కర్రలతో కట్టిన మా పరంజాను మేము కట్టి, గిలకతో ఎనిమిది అంతస్తుల భవనం పైకి క్రిందకీ మా అంతట మేమే లాగుకునేవాళ్లం.

మద్దతునిచ్చే కుటుంబం

1932లో మా నాన్నగారు మరణించాడు, నేను ఇంటికి వెళ్లి అమ్మను చూడడానికి సహాయపడాలేమోనని నేను అనుకున్నాను. కాబట్టి ఒకరోజు మధ్యాహ్న భోజనానికి ముందు, సంస్థ అధ్యక్షుడైన సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ కూర్చునే ప్రధాన బల్లపై నేను ఓ నోట్‌ను పెట్టాను. అందులో ఆయనతో మాట్లాడాలని నేను విన్నవించుకున్నాను. నా ఆసక్తిని గురించి తెలుసుకొని, ఇంకా ఇంటిలోనే ఉన్న సహోదర సహోదరీలు నాకు ఉన్నారని తెలుసుకొని, “బేతేలులో ఉండి, ప్రభువు పనిని చెయ్యాలని మీరు అనుకుంటున్నారా?” అని ఆయన అడిగాడు.

“అవును ఉండాలని అనుకుంటున్నాను” అని నేను జవాబిచ్చాను.

కాబట్టి, ఇక్కడ ఉండాలనే నా నిర్ణయంతో మా అమ్మ ఏకీభవిస్తుందో లేదో తెలుసుకోవడానికి ఆమెకు వ్రాయమని ఆయన సలహా ఇచ్చాడు. నేను దానిని పాటించాను, నా నిర్ణయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని వ్యక్తపరుస్తూ ఆమె వ్రాసింది. సహోదరుడైన రూథర్‌ఫర్డ్‌ దయను, సలహాను నేను నిజంగా అభినందిస్తున్నాను.

నేను బేతేలులో ఉన్న అనేక సంవత్సరాల కాలంలో, నా కుటుంబానికి నేను క్రమంగా వ్రాసి, యెహోవాను సేవించమని మా అమ్మ నన్ను ప్రోత్సహించినట్లుగానే వారిని ప్రోత్సహించేవాడిని. అమ్మ జూలై 1937లో మరణించింది. ఆమె మా కుటుంబానికి ఎంత ఉత్ప్రేరణగా ఉందో! మా పెద్దన్న పెద్దక్కలైన పాల్‌, ఎస్తర్‌లు మా చెల్లియైన లొయస్‌ మాత్రమే సాక్షులు కాలేదు. అయినా, పాల్‌ మన పని విషయంలో అనుకూలంగానే ఉన్నాడు, ఆయన స్థలాన్ని ఇచ్చాడు, దానిలో మా మొదటి రాజ్యమందిరాన్ని మేం నిర్మించుకున్నాం.

1936లో మా చెల్లి ఇవా పయినీరు లేక పూర్తికాల ప్రచారకురాలైంది. అదే సంవత్సరంలో ఆమె రల్ఫ్‌ థామస్‌ను పెండ్లి చేసుకుంది, మరి 1939లో వారు యెహోవాసాక్షుల సంఘాలను సేవించేందుకు ప్రయాణపనికి నియమించబడ్డారు. తరువాత వారు మెక్సికోకు వెళ్లారు, అక్కడ వారు 25 ఏండ్లు రాజ్యపనికి సహాయపడడంలో గడిపారు.

1939లో మా చెల్లెళ్లు అలాస్‌, ప్రాన్సస్‌లు కూడా పయినీరుసేవను చేపట్టారు. 1941లో సెయింట్‌ లూయిస్‌ సమావేశంలో ఫోనోగ్రాఫ్‌ తయారు చేయడానికి నేను సహాయపడిన అదే పరికరం యొక్క ఉపయోగాన్ని ప్రదర్శిస్తున్న కౌంటరు వెనుక అలాస్‌ను చూడడం అనేది ఎంత సంతోషకరమైందో! కుటుంబ బాధ్యతలనుబట్టి కొన్నిసార్లు అలాస్‌ పయినీరు సేవకు అంతరాయం కల్గినా, మొత్తంమీద ఆమె పూర్తికాల పరిచర్యలో 40 సంవత్సరాలకుపైనే గడిపింది. ప్రాన్సస్‌ 1944లో వాచ్‌టవర్‌ బైబిలు గిలియడ్‌ పాఠశాలకు వెళ్లి, ప్యూర్టోరికోలో మిషనరీగా కొంతకాలం పనిచేశాడు.

కుటుంబంలో ఆఖరివారైన జోయల్‌, ఎల్‌వుడ్‌లు ఇరువురూ 1940ల తొలి భాగంలో మాన్‌టనాలో పయినీర్లయ్యారు. జోయల్‌ నమ్మకమైన సాక్షిగా జీవిస్తున్నాడు, ఇప్పుడు ఒక పరిచర్య సేవకునిగా సేవిస్తున్నాడు. 1944లో బేతేలునందు నాతో ఎల్‌వుడ్‌ చేరి, నా హృదయానికి ఎంతో ఆనందాన్ని కల్గించాడు. నేను ఇల్లు విడిచే నాటికి వాడికి ఐదేళ్లకన్నా తక్కువే. ముందు చెప్పినట్లుగా “దేవుని వాక్యమైన పరిశుద్ధ బైబిలును అనుదినం చదవండి” అనే కర్మాగార భవనంపై ఉన్న సైన్‌బోర్డును పెయింటు వేయడంలో మేము కలిసి పనిచేశాం. సంవత్సరాల తరబడి ఆ సైన్‌ బోర్డును చూసిన వారిలో ఎంతమంది తమ బైబిల్ని చదివేందుకు ప్రోత్సహించబడ్డారోనని నేను తరచూ అనుకుంటాను.

ఎల్‌వుడ్‌, ఎమాప్లిట్‌ను పెండ్లి చేసుకునేంత వరకూ అంటే 1956 వరకూ బేతేలులో సేవచేశాడు. ఎల్‌వుడ్‌ ఎమాప్లిట్‌లు అనేక సంవత్సరాలు పూర్తికాల సేవలో కలిసి పనిచేశారు, కొంతకాలం కెన్యా, ఆఫ్రికా అలాగే స్పెయిన్‌లో సేవించారు. ఎల్‌వుడ్‌ క్యాన్సర్‌ బారినపడి, 1978లో స్పెయిన్‌లో మరణించాడు. ఎమా ఈనాటి వరకూ పయినీరు పనిలో స్పెయిన్‌లోనే ఉండిపోయింది.

వివాహం, కుటుంబం

1953 సెప్టెంబరు నెలలో, నేను వెళ్తున్న బ్రూక్లిన్‌ సెంట్రల్‌ సంఘంలో ఒక పయినీరైన అలాస్‌ రివెరను పెండ్లి చేసుకోవడానికి బేతేల్ని విడిచి పెట్టాను. నేను పరలోక నిరీక్షణను కల్గివున్నానని అలాస్‌కు తెలియజేశాను, అప్పటికీ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఆమె ఆసక్తిగానే ఉంది.—ఫిలిప్పీయులు 3:14.

బేతేలులో 23 సంవత్సరాలు జీవించిన తర్వాత నేను, అలాస్‌ పయినీరు పనిలో కొనసాగడానికి ఓ పెయింటర్‌గా లౌకిక పనిని ఆరంభించడానికి ఎంతో సర్దుకోవాల్సి వచ్చింది. అలాస్‌ ఎప్పుడూ మద్దతును ఇచ్చేది, తన ఆరోగ్య కారణాలనుబట్టి పయినీరు సేవను ఆపివేయాల్సినప్పుడు కూడా. 1954లో మా మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నాం. ప్రసవం సుళువుగా జరగకపోయినా, మా కొడుకు జాన్‌ బాగున్నాడు. సిజేరియన్‌ ఆపరేషన్‌ సమయంలో అలాస్‌ చాలా రక్తాన్ని కోల్పోయింది గనుక డాక్టర్లు ఆమె బ్రతుకుతుందని అనుకోలేదు. ఓ స్థాయిలో వాళ్లు నాడిని కూడా పట్టుకోలేక పోయారు. కాని ఆ రాత్రి ఆమె బ్రతికి బయటపడింది, సకాలంలో పూర్తిగా కోలుకుంది.

కొన్ని సంవత్సరాల తర్వాత, అలాస్‌ నాన్నగారు మరణించినప్పుడు, ఆమె తల్లితోపాటు ఉండడానికి లాంగ్‌ ఐలాండ్‌కు మేము తిరిగి వెళ్లాం. మాకు కారు లేనందున, నేను నడిచిగాని బస్సును, సబ్‌ రైల్వేను ఉపయోగించిగాని రాకపోకలు చేసేవాడిని. ఆవిధంగా నేను పయినీరు పనిలో కొనసాగగల్గాను, నా కుటుంబానికి మద్దతును ఇవ్వగల్గాను. పూర్తికాల పరిచర్యలోని ఆనందాలు ఏ త్యాగాలకన్నా ఎంతో మించినవి. సాక్షి అయ్యేందుకు ఆశాజనకమైన బేస్‌బాల్‌ కెరీర్‌ని వదులుకొన్న జో నాటాలే వంటి ప్రజలకు సహాయపడడం నాకు లభించిన అనేకమైన ఆశీర్వాదాల్లో ఒకటి.

1967లో న్యూయార్క్‌ ప్రాంతంలోని పరిస్థితులు విషమిస్తుంతుండగా, అలాస్‌, జాన్‌లను నా స్వంత పట్టణమైన ఎలెన్స్‌బర్గ్‌లో జీవనం కొనసాగించడానికి తీసుకొని తిరిగి వెళ్లాలని నిశ్చయించుకున్నాను. మా అమ్మగారి మనుమలు, మునిమనుమలు అనేకమంది, పూర్తికాల పరిచర్యలో భాగం వహించడాన్ని నేను ఇప్పుడు ప్రతిఫలదాయకమైందని కనుగొన్నాను. కొంతమంది బేతేలులో సేవిస్తున్నారు కూడా. తన భార్యా పిల్లలతోపాటు జాన్‌ కూడా యెహోవాను నమ్మకంగా సేవిస్తున్నాడు.

విచారకరంగా, నేను నా ప్రియమైన భార్య అలాస్‌ను 1989లో మరణమందు కోల్పోయాను. పూర్తికాల పరిచర్యలో తీరికలేకుండా ఉండడం ఆ నష్టాన్ని భరించేలా నాకు సహాయపడింది. నేను, నా చెల్లి అలాస్‌ ఇప్పుడు పయినీరు సేవను కలిసి ఆనందిస్తున్నాం. మరలా ఒకే గూటిలో జీవించడం, ఈ అతి ప్రాముఖ్యమైన పనిలో తీరికలేకుండా ఉండడం ఎంత శ్రేష్ఠమైనదో కదా!

దాదాపు 25 సంవత్సరాల తర్వాత, మొదటిసారిగా 1994 వసంతకాలంలో నేను బేతేల్ని సందర్శించాను. 40 సంవత్సరాలకంటే మునుపు నేను కలిసి పనిచేసిన అనేకమందిని చూడడం ఎంత ఆనందమో కదా! 1930లో నేను బేతేలుకు వెళ్లినప్పుడు, కుటుంబంలో 250 మందిసభ్యులు మాత్రమే ఉండేవారు కాని నేడు బ్రూక్లిన్‌లోని ఆ బేతేలు కుటుంబ సభ్యులు 3,500 మందికి పైగా ఉన్నారు!

ఆత్మీయ ఆహారంచే పోషించబడడం

మా ఇంటికి సమీపంలోవున్న యాకిమా నది పొడుగునా చాలాసార్లు వేకువ జామున నేను నడవడానికి వెళ్లేవాడిని. అక్కడ నుండి మంచుతో కప్పబడిన రానిర్‌ పర్వతాన్ని అంటే గాలిలో 4,300 మీటర్లకు పైగానున్న గోపురాల్ని నేను చూడగలను. వన్య జీవనం సమృద్ధిగావుంది. కొన్నిసార్లు నేను లేడిని చూశాను, ఒక్కసారి నేను కణుజును కూడా చూశాను.

ఈ నిమ్మళమైన, ఏకాంత సమయాలు, యెహోవా అద్భుత ఏర్పాట్లను నేను ధ్యానించడానికి అనుమతించాయి. మన దేవుడైన యెహోవాను నమ్మకంగా సేవించడంలో కొనసాగేందుకు బలం కొరకు నేను ప్రార్థించాను. నేను నడుస్తుండగా పాటలను విశేషంగా, “యెహోవా హృదయమును ఆనందపరచుట” అనే పాటను పాడడాన్ని ఇష్టపడేవాన్ని, ఆ పాటలోని మాటలు ఇలా చెబుతున్నాయి: “దేవా చేస్తాము నీ చిత్తం; జ్ఞానంతో చేస్తాం నీ కార్యం. అప్పుడే నీ హృదయాన్ని ఆనందపరచెదము.”

యెహోవా హృదయాన్ని ఆనందపరిచే పనిని చేయడాన్ని నేను ఎంపిక చేసుకున్నందుకు నేను ఆనందిస్తున్నాను. వాగ్దానం చేయబడిన పరలోక బహుమానాన్ని నేను పొందేంతవరకూ ఈ పనిని చేయడంలో నేను కొనసాగాలని ప్రార్థిస్తున్నాను. ‘అక్షయమగు ఆహారం కొరకు పనిచేయడంలో’ తమ జీవితాల్ని ఉపయోగించేందుకు ఈ వివరణ ఇతరుల్ని కూడా ప్రేరేపించాలనేదే నా కోరిక.—యోహాను 6:27, NW

[23వ పేజీలోని చిత్రం]

“దేవుని వాక్యమైన పరిశుద్ధ బైబిలును అనుదినం చదవండి” అనే సైన్‌ బోర్డును ఎల్‌వుడ్‌ పెయింట్‌ వేస్తున్నాడు

[24వ పేజీలోని చిత్రం]

గ్రాన్ట్‌ సూటర్‌, జాన్‌ కుర్జెన్‌లతో కలిసి 1940లో సమావేశమందు క్రొత్త ఫోనోగ్రాఫ్‌ను ప్రదర్శించడం

[25వ పేజీలోని చిత్రం]

1944లో సత్యమందున్న మాలో పూర్తికాల పరిచర్యయందు ఉన్నవారు: డేవిడ్‌, అలాస్‌, జోయల్‌, ఇవా, ఎల్‌వుడ్‌ మరియు ఫ్రాన్సస్‌

[25వ పేజీలోని చిత్రం]

జీవించివున్న రక్తసంబంధులు ఎడమ నుండి: అలాస్‌, ఇవా, జోయల్‌, డేవిడ్‌ మరియు ఫ్రాన్సస్‌

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి