కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 1/15 పేజీ 31
  • పాఠకుల నుండి ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల నుండి ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఇలాంటి మరితర సమాచారం
  • నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము
    నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము
  • కుటుంబ సంతోషానికి రహస్యమేదైనా ఉందా?
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
  • కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి
    కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి
  • నిత్యభవిష్యత్‌ నిమిత్తం ఒక కుటుంబంగా వృద్ధిచెందుట
    నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 1/15 పేజీ 31

పాఠకుల నుండి ప్రశ్నలు

“పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము” దేవుని “బట్టి కుటుంబమని పిలువబడుచున్న”దని ఎఫెసీయులు 3:14, 15 చెబుతుంది. పరలోకంలో కుటుంబాలు ఉన్నాయా, ప్రతి మానవ కుటుంబం ఏదో ఒక విధంగా యెహోవానుబట్టి కుటుంబమని పిలువబడుతుందా?

తండ్రి, తల్లి మరియు పిల్లలు ఉండి, వారందరూ ఒకరికొకరు శారీరకరీతిలో సంబంధీకులై ఉండే భూసంబంధ కుటుంబాల వంటివి పరలోకంలో లేవు. (లూకా 24:39; 1 కొరింథీయులు 15:50) దేవదూతలు వివాహం చేసుకోరని యేసు స్పష్టంగా సూచించాడు, వారు సంతానాన్ని ఉత్పత్తి చేస్తారని ఏదీ కూడా సూచననివ్వడం లేదు.—మత్తయి 22:30.

అయితే, యెహోవా దేవుడు తన పరలోక సంస్థను వివాహం చేసుకున్నాడని బైబిలు సూచనార్థక రీతిలో మాట్లాడుతోంది; ఆయన ఆత్మీయభావంలో వివాహం చేసుకున్నాడు. (యెషయా 54:5) ఆ పరలోక సంస్థ దేవదూతల వంటి సంతానాన్ని ఉత్పత్తి చేస్తుంది. (యోబు 1:6; 2:1; 38:4-7) కాబట్టి ఈ భావంలో, పరలోకంలో ఒక అద్భుతమైన ఆత్మీయ కుటుంబం ఉనికిలో ఉంది.

అంతేకాకుండా, యేసుక్రీస్తు మరియు 1,44,000 మందితో కూడిన సంఘమైన ఆయన పెండ్లికుమార్తెతో కూడిన ఒక క్రొత్త సూచనార్థక కుటుంబం పరలోకంలో అభివృద్ధి చెందుతోంది. (2 కొరింథీయులు 11:2) పరలోక జీవితం కొరకు ఎదురు చూస్తున్న ఈ అభిషిక్తుల్లో అనేకులు ఇప్పటికే మరణించారు. కొందరు భూమిపై ఇంకా సజీవంగా ఉన్నారు. అందరు “గొఱ్ఱెపిల్ల” యొక్క పరలోక “వివాహోత్సవ”ము కొరకు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. బైబిలు ఆ వివాహాన్ని, దగ్గరపడుతున్న మహాశ్రమ సమయంతో అంటే మహాబబులోను నాశనం, ఆ తర్వాత సాతాను యొక్క మిగతా విధానం తుడిచిపెట్టబడటంతో ముడిపెడుతోంది.—ప్రకటన 18:2-5; 19:2, 7, 11-21; మత్తయి 24:21.

ఎఫెసీయులు 3:15నందు అపొస్తలుడైన పౌలు, భూసంబంధ కుటుంబాలను గురించి మాట్లాడుతూ, ప్రతి ప్రత్యేక కుటుంబమూ యెహోవానుండి సూటిగా తన పేరును పొందుతుందని సూచించడంలేదు. బదులుగా, ఒక పేరును తరతరాల వరకూ కాపాడే విస్తృత కుటుంబ బంధాలను గురించి పౌలు మనస్సులో ఉందన్నది స్పష్టం. యెహోషువ 7:16-19 ఒక ఉదాహరణను అందిస్తోంది. యెహోవా అక్కడ ఆకాను తప్పిదాన్ని బట్టబయలు చేస్తున్నాడు. మొదట, ఆ తప్పిదాన్ని యూదా గోత్రంపై మాత్రమే కేంద్రీకరించడం లేక దానికి మాత్రమే పరిమితం చేయడం జరిగింది. తర్వాత అది జెరహీయుల వంశానికి మాత్రమే కేటాయించబడింది. తుదకు, ఆకాను కుటుంబం వెల్లడయ్యింది. తన భార్యాబిడ్డలతోపాటు ఆకాను, తన ముత్తాతైన జబ్ది కుటుంబంలో (లేక వంశంలో) ఒక భాగంగా దృష్టించబడ్డాడు లేక పరిగణించబడ్డాడు. ఆ కుటుంబం తమ పూర్వికుడైన జెరహు నామాన్ని కాపాడిన ఒక విస్తృత గుంపుగా ఉంది.

హెబ్రీయులలో అలాంటి కుటుంబ బంధాలు ఎంతో గొప్ప ప్రాముఖ్యతను కలిగివుండేవి, వాటిలోని అనేక కుటుంబాల పేర్లు బైబిలులో వ్రాయబడ్డాయి. అవసరమైన సందర్భాల్లో, కుటుంబం పేరును తర్వాతి తరాలకు కొనసాగించేందుకు వంశోద్ధారకులను ఉత్పత్తి చేయడానికి దేవర లేక మరిది వివాహ ధర్మం నిర్వహించాల్సిన ఏర్పాట్లను చేయడం ద్వారా అవి కాపాడబడటానికి దేవుడు మద్దతునిచ్చాడు.—ఆదికాండము 38:8, 9; ద్వితీయోపదేశకాండము 25:5, 6.

అలాంటి పెద్ద లేక విస్తృత కుటుంబాలకు మరో ఉదాహరణగా, దావీదు కుమారునిగా యేసు విషయాన్ని తీసుకోండి. దావీదు మరణించిన తర్వాత కొన్ని శతాబ్దాలవరకు యేసు జన్మించలేదు గనుక, ఆయన రాజైన దావీదుకు పుట్టిన సంతానంలో ఒకడు కాదన్నది స్పష్టమౌతుంది. అయినప్పటికీ, యూదులకు సాధారణంగా తెలిసినరీతిలో, మెస్సీయకుగల ఒక గుర్తింపు చిహ్నమేమంటే ఆయన దావీదు వంశంనుండి వచ్చినవాడైవుండాలి. (మత్తయి 22:42) యేసు తన తల్లి ద్వారా, పెంచిన తండ్రి ద్వారా కూడా దావీదు వంశంనుండి వచ్చాడు.—మత్తయి 1:1; లూకా 2:4.

అయితే అలాంటి కుటుంబాలు తమ పేర్లను యెహోవానుండి ఎలా పొందుతాయి? వాస్తవమేమంటే, అబ్రాహాము మరియు ఇస్సాకు విషయంలో వలె యెహోవా అక్షరార్థంగా ఆ కుటుంబ పెద్దలకు నామకరణం చేసిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. (ఆదికాండము 17:5, 19) అవి ప్రత్యేక సందర్భాలు. అయితే చాలా మటుకు, కుటుంబాలు తమ పిల్లలకు అందజేసేలా పేరును యెహోవా ప్రతి కుటుంబానికి అనుగ్రహించడు.

అయితే, “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండిం”చుడని యెహోవా ఆదాము హవ్వలకు ఆజ్ఞాపించినప్పుడు ఆయన మానవ కుటుంబ విభాగాన్ని స్థాపించాడు. (ఆదికాండము 1:28) అసంపూర్ణులైన ఆదాముహవ్వలు సంతానాన్ని ఉత్పత్తి చేసేందుకు యెహోవా అనుమతించి, అన్ని మానవ కుటుంబాలకొరకు పునాది వేశాడు. (ఆదికాండము 5:3) కాబట్టి, అనేక భావాల్లో కుటుంబ పేర్లకు దేవుడు ప్రారంభికుడని పిలువబడవచ్చు.

కుటుంబ పేర్లను తరతరాల వరకు సజీవంగా ఉంచాల్సిన అవసరతవుందని నేడు అనేక సంస్కృతులు భావించవు. అయినప్పటికీ, అన్ని దేశాల్లోని క్రైస్తవులు కుటుంబ వ్యవస్థ విషయమై యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేస్తారు మరియు తమ వ్యక్తిగత కుటుంబ విభాగాన్ని విజయవంతం చేయడానికి కృషిచేయడం ద్వారా ఆయనకు ఘనత తెస్తారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి