కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 12/1 పేజీలు 14-19
  • అలసిపోయినవారికి యెహోవా శక్తినిస్తాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అలసిపోయినవారికి యెహోవా శక్తినిస్తాడు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రార్థన యొక్క శక్తి
  • సహోదరత్వంలోని వాత్సల్యం
  • దేవుని వాక్య శక్తి
  • “గాలికి మరుగైనచోటు” వలెనున్న పెద్దలు
  • యెషయా 40:31—“యెహోవా మీద ఆశపెట్టుకున్న వాళ్లు కొత్త బలం పొందుతారు”
    బైబిలు వచనాల వివరణ
  • విడిచిపెట్టకండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • అలసినవారిని యెహోవా బలపరుస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • “యెహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 12/1 పేజీలు 14-19

అలసిపోయినవారికి యెహోవా శక్తినిస్తాడు

“యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు.”—యెషయా 40:31.

1, 2. తనయందు నమ్మకముంచే వారికి యెహోవా ఏమిస్తాడు, మనం ఇప్పుడు ఏమి పరిశీలిస్తాము?

పక్షిరాజులు ఆకాశంలో ఎగిరే అత్యంత శక్తివంతమైన పక్షులు. అవి తమ రెక్కలను తాటించకుండా ఎంతో దూరం ప్రయాణించగలవు. రెండు కంటే ఎక్కువ మీటర్ల వరకు తమ రెక్కలను చాపగల “పక్షుల రాజు” అయిన స్వర్ణ పక్షిరాజు “పక్షిరాజులన్నిటిలోకి అత్యంత ప్రభావం గలది; కొండలు మరియు మెట్టలపై ఎగురుతూ, [అది] పర్వతశ్రేణిపై గంటలతరబడి ఎగురుతుంది, తర్వాత ఆకాశంలో ఒక నల్లని చుక్కలా కనిపించే వరకు అది చక్కర్లు కొడుతూ పైకెగురుతుంది.”—ది అడుబాన్‌ సొసైటీ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ నార్త్‌ అమెరికన్‌ బర్డ్స్‌.

2 పక్షిరాజుకున్న ఎగిరే సామర్థ్యాన్ని మనస్సులో ఉంచుకొని, యెషయా ఇలా వ్రాశాడు: “సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు [యెహోవా] శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యౌవనస్థులు తప్పక తొట్రిల్లుదురు యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.” (యెషయా 40:29-31) తనపై విశ్వాసం ఉంచేవారికి, యెహోవా ఎగిరే పక్షిరాజు యొక్క అలయని రెక్కలవంటి రెక్కలనిచ్చినట్లు, కొనసాగేందుకు శక్తినిస్తాడని తెలుసుకోవడం ఎంత ఓదార్పునిస్తుంది! అలిసినవారికి శక్తినిచ్చేందుకు ఆయన చేసిన కొన్ని ఏర్పాట్లను ఇప్పుడు పరిశీలించండి.

ప్రార్థన యొక్క శక్తి

3, 4. (ఎ) ఏమి చేయమని యేసు తన శిష్యులను కోరాడు? (బి) మన ప్రార్థనలకు సమాధానంగా యెహోవా ఏమి చేయాలని మనం ఎదురు చూస్తాము?

3 “విసుకక నిత్యము ప్రార్థన చేయు”డి అని యేసు తన శిష్యులను కోరాడు. (లూకా 18:1) శక్తిని తిరిగి పొంది, జీవిత ఒత్తిళ్లు మరీ ఉద్ధృతంగా అనిపించినప్పుడు విడిచిపెట్టడాన్ని నివారించేందుకు, యెహోవా ఎదుట మన హృదయాన్ని కుమ్మరించడం నిజంగా సహాయం చేస్తుందా? అవును, కాని మనం మనస్సులో ఉంచుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి.

4 మన ప్రార్థనలకు ప్రత్యుత్తరంగా యెహోవా ఏమి చేయాలని మనం ఎదురుచూస్తామో ఆ విషయంలో మనం వాస్తవిక దృక్పథం కలిగివుండాలి. ఎంతో కృంగిపోయిన ఒక క్రైస్తవురాలు ఆ తర్వాత ఇలా తెలియజేసింది: “ఇతర అనారోగ్యాల విషయంలో వలెనే, యెహోవా ఈ సమయంలో అద్భుతాలు చేయడు. కాని ఈ విధానంలో వీలైనంతగా మనం ఎదుర్కోవడానికి మరియు స్వస్థత పొందడానికి మనకు సహాయం చేస్తాడు.” తన ప్రార్థనలు ఎందుకు తేడాను కలుగజేశాయో వివరిస్తూ, ఆమె ఇంకా ఇలా చెప్పింది: “నేను రాత్రి పగలు యెహోవా పరిశుద్ధాత్మను పొందగలిగేదాన్ని” కాబట్టి, మనల్ని కృంగదీసే జీవిత ఒత్తిళ్ల నుండి యెహోవా మనల్ని కాపాడడు, కాని ఆయన “తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను” ఇస్తాడు. (లూకా 11:13; కీర్తన 88:1-3) మనకు ఎదురయ్యే ఏ శ్రమనైనా లేదా ఒత్తిడినైనా ఎదుర్కోవడానికి ఆ ఆత్మ మనల్ని సమర్థులను చేస్తుంది. (1 కొరింథీయులు 10:13) అవసరమైతే, దేవుని రాజ్యం అతి సమీపంలో ఉన్న నూతన లోకంలో నుండి ఒత్తిడి కలుగజేసే సమస్యలన్నిటినీ నిర్మూలించే వరకు సహించడానికి కావలసిన “బలాతిశయాన్ని” కూడా అది మనకివ్వగలదు.—2 కొరింథీయులు 4:7.

5. (ఎ) మన ప్రార్థనలు ప్రభావవంతంగా ఉండాలంటే, ఏ రెండు విషయాలు ప్రాముఖ్యం? (బి) మనం ఒక శారీరకమైన బలహీనతతో పోరాడుతుంటే మనం ఎలా ప్రార్థించవచ్చు? (సి) పట్టుదలతో కూడిన, ప్రత్యేకంగా తెలియజేసే మన ప్రార్థనలు యెహోవాకు ఏమి తెలియజేస్తాయి?

5 అయితే, మన ప్రార్థనలు ప్రభావవంతంగా ఉండాలంటే, మనం పట్టుదల కలిగివుండాలి, వివరంగా తెలియజేయాలి. (రోమీయులు 12:12) ఉదాహరణకు, మీరు కొన్నిసార్లు శారీరకమైన బలహీనతతో పోరాడుతున్నప్పుడు అలిసిపోతే, ప్రతి దినారంభంలో, దినమంతటిలో ఆ ప్రత్యేకమైన బలహీనతకు లొంగిపోకుండా ఉండడానికి సహాయం చేయమని యెహోవాను వేడుకోవచ్చు. దినమంతటిలోను అలాగే ప్రతి రాత్రి నిద్రపోవడానికి ముందు ప్రార్థించండి. మీరు విఫలమైతే, ఆయన క్షమాపణ కొరకు యెహోవాను అడగండి, కాని ఆ పొరపాటు జరుగడానికి కారణమేమిటో, భవిష్యత్తులో అది జరుగకుండా ఉండేందుకు మీరేమి చేయగలరో కూడా ఆయనతో మాట్లాడండి. అలాంటి పట్టుదలతో కూడిన మరియు ప్రత్యేకంగా తెలియజేసే ప్రార్థనలు పోరాటంలో గెలవాలన్న మీ కోరిక యొక్క యథార్థతను “ప్రార్థనాలకించువానికి” తెలియజేస్తాయి.—కీర్తన 65:2; లూకా 11:5-13.

6. మనం ప్రార్థించడానికి అనర్హులమని మనం భావించినప్పటికీ, యెహోవా మన ప్రార్థనలు వినాలని మనం ఎందుకు సరైనవిధంగా అపేక్షించవచ్చు?

6 అయితే కొన్నిసార్లు, అలసిపోయినవారు తాము ప్రార్థించడానికి అనర్హులమన్నట్లు భావిస్తారు. మునుపు అలా భావించిన ఒక క్రైస్తవ స్త్రీ ఆ తర్వాత ఇలా తెలియజేసింది: “అది చాలా ప్రమాదకరమైన ఆలోచనా విధానం ఎందుకంటే, దాని భావం మనకు తీర్పుతీర్చే బాధ్యతను మనం మనపైకి తీసుకున్నట్లవుతుంది, కాని ఆ పని మనది కాదు.” వాస్తవానికి, “దేవుడు తానే న్యాయకర్త.” (కీర్తన 50:6) ‘మన హృదయము మనయందు దోషారోపణ చేసినను . . . దేవుడు మన హృదయముకంటె అధికుడని’ బైబిలు మనకు అభయమిస్తుంది. (1 యోహాను 3:20) ప్రార్థించడానికి మనల్ని మనం అనర్హులుగా తీర్పు తీర్చుకున్నప్పటికీ, యెహోవా మన గురించి ఆ విధంగా భావించడని తెలుసుకోవడం ఎంతటి ఓదార్పునిస్తుంది! మనం అలా అనర్హులమని భావించడానికి కారణమైన మన జీవితంలోని పరిస్థితులతో సహా ఆయనకు మన గురించి “సమస్తము” తెలుసు. (కీర్తన 103:10-14) ఆయన కనికరం మరియు అవగాహన యొక్క లోతు “విరిగి నలిగిన హృదయము” నుండి వచ్చే ప్రార్థనలను వినడానికి ఆయనను పురికొల్పుతాయి. (కీర్తన 51:17) “దరిద్రుల మొఱ్ఱ వినక చెవి మూసికొను”వానిని తానే ఖండిస్తున్నప్పుడు సహాయం కొరకు మనం చేసే విజ్ఞప్తులను వినడాన్ని ఆయన ఎలా నిరాకరించగలడు?—సామెతలు 21:13.

సహోదరత్వంలోని వాత్సల్యం

7. (ఎ) మనం శక్తిని తిరిగి పొందడానికి సహాయం చేసేందుకు యెహోవా చేసిన మరో ఏర్పాటేమిటి? (బి) మన సహోదరత్వం గురించి ఏమి తెలుసుకోవడం మనల్ని బలపర్చేదై ఉండగలదు?

7 మనం శక్తిని తిరిగి పొందడానికి సహాయం చేసేందుకు యెహోవా చేసిన మరో ఏర్పాటు మన క్రైస్తవ సహోదరత్వం. సహోదరులు సహోదరీలతో కూడిన ప్రపంచవ్యాప్త కుటుంబంలో భాగమైవుండడం ఎంతటి అమూల్యమైన ఆధిక్యత! (1 పేతురు 2:17) జీవిత ఒత్తిళ్లు మనల్ని కృంగదీసినప్పుడు, శక్తిని తిరిగి పొందడానికి మన సహోదరత్వంలోని వాత్సల్యం మనకు సహాయం చేయగలదు. అదెలా? ఒత్తిడి కలుగజేసే సవాళ్లను ఎదుర్కొంటున్నది మనం మాత్రమే కాదని తెలుసుకోవడమే ఎంతో బలపర్చేదిగా ఉండగలదు. అలాంటి ఒత్తిళ్లను లేక శ్రమలను ఎదుర్కొని, మనకున్నలాంటి భావాలనే కలిగివున్న కొందరు నిస్సందేహంగా మన సహోదర సహోదరీలలో ఉన్నారు. (1 పేతురు 5:9) మనం ఎదుర్కొంటున్నది అసామాన్యమైనది కాదని, మన భావాలు అసాధారణమైనవి కావని తెలుసుకోవడం ధైర్యాన్నిస్తుంది.

8. (ఎ) మన సహోదరత్వంలో ఎంతో అవసరమైన సహాయాన్ని కనుగొని, ఓదార్పును ఎలా పొందవచ్చో ఏ ఉదాహరణలు చూపిస్తాయి? (బి) మీరు వ్యక్తిగతంగా “నిజమైన సహవాసి” ద్వారా ఏ విధంగా సహాయాన్ని లేక ఓదార్పును పొందారు?

8 సహోదరత్వంలోని వాత్సల్యంలో, మనం చింతలో ఉన్నప్పుడు ఎంతో అవసరమైన సహాయాన్ని, ఓదార్పును అందజేసే ‘నిజమైన సహవాసులను’ మనం కనుగొనవచ్చు. (సామెతలు 17:17) తరచూ, కావలసిందల్లా దయతో కూడిన కొన్ని మాటలు లేక తలంచి చేసే క్రియలు. పనికిరాననే భావాలతో పోరాడిన ఒక క్రైస్తవురాలు ఇలా గుర్తు తెచ్చుకుంటుంది: “నాకున్న ప్రతికూల భావాలను అధిగమించడానికి నాకు సహాయం చేసేందుకు నాతో అనుకూల విషయాలు మాట్లాడిన స్నేహితులున్నారు.” (సామెతలు 15:23) తన చిన్న కుమార్తె మరణంతో, ఒక సహోదరికి సంఘకూటాల్లో రాజ్య గీతాలు పాడడం, ప్రాముఖ్యంగా పునరుత్థానం గురించి తెలియజేసే పాటలు పాడడం మొదట్లో కష్టంగా ఉండేది. ఆమె ఇలా గుర్తుచేసుకుంటుంది, “ఒకసారి, అవతలివైపు కూర్చున్న ఒక సహోదరి నేను ఏడవడం చూసింది. ఆమె నా దగ్గరికి వచ్చి, నా చుట్టూ తన చెయ్యి వేసి, మిగిలిన పాట నాతో కలిసి పాడింది. నాకు సహోదర సహోదరీల ఎడల ఎంతో ప్రేమ కలిగింది, మనకు సహాయం లభించేది అక్కడ రాజ్యమందిరంలోనే అని గుర్తిస్తూ, కూటాలకు వెళ్లగలుగుతున్నందుకు నేను ఎంతో సంతోషించాను.”

9, 10. (ఎ) మన సహోదరత్వం యొక్క వాత్సల్యానికి మనం ఎలా దోహదపడగలము? (బి) ప్రాముఖ్యంగా ఎవరికి మంచి సహవాసం అవసరం? (సి) ప్రోత్సాహం అవసరమైన వారికి సహాయం చేసేందుకు మనం ఏమి చేయగలము?

9 అయితే, క్రైస్తవ సహోదరత్వం యొక్క వాత్సల్యానికి దోహదపడవలసిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి మన సహోదర సహోదరీలు అందరినీ చేర్చుకోగలిగేలా మన హృదయాలు “విశాల”మవ్వాలి. (2 కొరింథీయులు 6:13) అలసిపోయిన వారు తమ ఎడల సహోదరత్వం యొక్క ప్రేమ చల్లబడిపోయిందని భావించడం ఎంత దుఃఖకరం! అయినప్పటికీ, కొందరు క్రైస్తవులు విడిచిపెట్టబడ్డామని, నిర్లక్ష్యం చేయబడ్డామని భావించినట్లు నివేదించబడింది. సత్యాన్ని వ్యతిరేకించే భర్తగల ఒక సహోదరి ఇలా వేడుకుంది: “పెంపొందింపజేసే స్నేహాన్ని, ప్రోత్సాహాన్ని, ప్రేమపూర్వకమైన సహవాసాన్ని ఎవరు కోరుకోరు, ఎవరికి అవసరం లేదు? మాకు అవి అవసరమని దయచేసి మన సహోదర సహోదరీలకు గుర్తు చేయండి!” అవును, ప్రాముఖ్యంగా జీవితంలోని పరిస్థితులు తమను కృంగదీసిన వారికి—అవిశ్వాసులైన భర్త లేక భార్య గలవారికి, ఒంటరి తల్లి లేక తండ్రికి, దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు గలవారికి, వృద్ధులకు, మరితరులకు—మంచి సహవాసం అవసరం. దాని గురించి మనలో కొందరికి గుర్తు చేయవలసిన అవసరం ఉందా?

10 సహాయం చేయడానికి మనం ఏమి చేయవచ్చు? మనం మన ప్రేమను విస్తృతంగా వ్యక్తపరుద్దాము. ఆతిధ్యమిచ్చేటప్పుడు, ప్రోత్సాహం అవసరమైనవారిని మనం మరచిపోకుండా ఉందాము. (లూకా 14:12-14; హెబ్రీయులు 13:2) అంగీకరించేందుకు వారి పరిస్థితులు అనుమతించవని అనుకునే బదులు, వారిని ఏవిధంగానైనా ఎందుకు ఆహ్వానించకూడదు? ఆ తర్వాత వారిని నిర్ణయించుకోనివ్వండి. వారు అంగీకరించలేకపోయినప్పటికీ, ఇతరులు తమ గురించి తలంచారని తెలుసుకోవడం ద్వారా వాళ్లు నిస్సందేహంగా ప్రోత్సహింపబడతారు. శక్తిని తిరిగి పొందడానికి కేవలం వారికి అవసరమైనది అదే కావచ్చు.

11. అలిసిపోయినవారికి ఏ విధాలుగా సహాయం అవసరం కావచ్చు?

11 కృంగిపోయినవారికి మరితర విధాల్లో సహాయం అవసరం కావచ్చు. ఉదాహరణకు, ఒంటరియైన ఓ తల్లికి, పరిపక్వతగల ఒక సహోదరుడు తండ్రిలేని తన కుమారునియందు శ్రద్ధ చూపించవలసిన అవసరం ఉండవచ్చు. (యాకోబు 1:27) తీవ్రమైన ఆరోగ్యసమస్య ఉన్న సహోదరునికి లేక సహోదరికి కొనుగోలు చేయడానికి లేక ఇంటిపనులు చేసుకోవడానికి కొంత సహాయం అవసరం కావచ్చు. పెద్దవయస్కులు కొంత సహవాసాన్ని కోరుకోవచ్చు లేక పరిచర్యకు వెళ్లడానికి వారికి కొంత సహాయం అవసరం కావచ్చు. అలాంటి సహాయం యొక్క అవసరత ఎల్లప్పుడూ ఉన్నట్లయితే, అది నిజంగా ‘మన ప్రేమ యొక్క యథార్థతకు పరీక్షలా’ ఉండవచ్చు. (2 కొరింథీయులు 8:8) దానిలో ఇమిడివున్న సమయాన్ని, ప్రయాసను బట్టి అవసరతగల వారినుండి దూరం వెళ్లిపోయే బదులు, అర్థంచేసుకొనేవారిగా ఉండి, ఇతరుల అవసరతలకు ప్రతిస్పందించడం ద్వారా క్రైస్తవ ప్రేమ యొక్క పరీక్షలో సఫలమౌదాము.

దేవుని వాక్య శక్తి

12. మనం శక్తిని తిరిగి పొందడానికి దేవుని వాక్యం మనకెలా సహాయం చేస్తుంది?

12 తిండి తినడం మానివేసే వ్యక్తి తన బలాన్ని లేక శక్తిని త్వరలోనే కోల్పోతాడు. అలాగే, మనం కొనసాగడానికి యెహోవా మనకు శక్తినిచ్చే మరో మార్గం ఏమిటంటే, మనం ఆత్మీయంగా సరైన ఆహారం పొందేలా చూడడమే. (యెషయా 65:13, 14) ఆయన ఏ ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించాడు? అన్నిటి కంటే మిన్నగా, ఆయన వాక్యమైన బైబిలు. (మత్తయి 4:4; హెబ్రీయులు 4:12 పోల్చండి.) మనం తిరిగి శక్తిని పొందడానికి అది మనకెలా సహాయం చేయగలదు? మనం ఎదుర్కొనే ఒత్తిళ్లు మరియు సమస్యలు మన బలాన్ని క్షీణింపజేయడం ప్రారంభమైనప్పుడు, బైబిలు కాలాల్లోని నమ్మకమైన స్త్రీ పురుషుల భావాల గురించి నిజ జీవిత పోరాటాల గురించి చదవడం నుండి మనం బలాన్ని పొందవచ్చు. యథార్థత యొక్క విశేషమైన ఉదాహరణలే అయినప్పటికీ, వారు “మనవంటి స్వభావముగల” మానవులే అయివుండిరి. (యాకోబు 5:17; అపొస్తలుల కార్యములు 14:15) వాళ్లు మనకున్నలాంటి శ్రమలను ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు. కొన్ని ఉదాహరణలను పరిశీలించండి.

13. బైబిలు కాలంలోని నమ్మకమైన స్త్రీ పురుషులు మనవంటి భావాలను అనుభవాలను కలిగివుండేవారని ఏ లేఖనాధార ఉదాహరణలు చూపుతున్నాయి?

13 పితరుడైన అబ్రాహాముకు పునరుత్థానమందు విశ్వాసం ఉన్నప్పటికీ, తన భార్య మరణాన్ని బట్టి ఆయన ఎంతో వ్యధ చెందాడు. (ఆదికాండము 23:2; హెబ్రీయులు 11:8-10, 17-19 పోల్చండి.) పశ్చాత్తాపపడిన దావీదు తన పాపాలు తాను యెహోవాను సేవించడానికి తనను అనర్హుణ్ణి చేశాయని భావించాడు. (కీర్తన 51:11) మోషేకు అసమర్థుడనన్న భావాలుండేవి. (నిర్గమకాండము 4:10) “క్రీస్తు యొక్క పనిని” నెరవేర్చడాన్ని తనకున్న తీవ్రమైన అనారోగ్యం పరిమితం చేసిందని తెలుసుకున్నప్పుడు ఎపఫ్రొదితు కృంగిపోయాడు. (ఫిలిప్పీయులు 2:25-30) పౌలు పాపయుక్తమైన శరీరానికి వ్యతిరేకంగా పోరాడవలసి వచ్చింది. (రోమీయులు 7:21-25) ఫిలిప్పీ సంఘంలోని ఇద్దరు అభిషిక్త సహోదరీలైన యువొదియ మరియు సుంటుకేలకు ఒకరితో ఒకరు సర్దుకుపోవడానికి కొంత కష్టంగా ఉండెనన్నది స్పష్టమౌతుంది. (ఫిలిప్పీయులు 1:1; 4:2, 3) ఈ నమ్మకమైన వారికి మనవంటి భావాలు, అనుభవాలు ఉన్నప్పటికీ, వారు విడిచిపెట్టలేదని తెలుసుకోవడం ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుందో కదా! యెహోవా కూడా వారిని విడిచిపెట్టలేదు.

14. (ఎ) తన వాక్యం నుండి బలం పొందడానికి మనకు సహాయం చేసేందుకు యెహోవా ఏ ఉపకరణాన్ని ఉపయోగించుకున్నాడు? (బి) కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలు సామాజిక, కుటుంబ మరియు భావోద్రేక అంశాలపై శీర్షికలను ఎందుకు ప్రచురించాయి?

14 తన వాక్యం నుండి బలం పొందడానికి సహాయం చేసేందుకు, మనకు “తగినవేళ అన్నము” స్థిరమైన రీతిలో అందజేస్తూ ఉండడానికి యెహోవా నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతిని ఉపయోగించుకుంటున్నాడు. (మత్తయి 24:45) బైబిలు సత్యాన్ని పరిరక్షించి, దేవుని రాజ్యం మానవుని ఏకైక నిరీక్షణ అని ప్రకటించడానికి నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు ఎంతో కాలంగా కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలను ఉపయోగిస్తున్నాడు. ప్రాముఖ్యంగా గడిచిన కొన్ని దశాబ్దాలుగా, దేవుని ప్రజల్లో కొంతమంది కూడా ఎదుర్కొంటున్న సామాజిక, కుటుంబ మరియు భావోద్రేక సవాళ్లపై సమయోచితమైన లేఖనాధార శీర్షికలను ఈ పత్రికలు అందజేస్తున్నాయి. అలాంటి సమాచారం ఏ సంకల్పంతో ప్రచురించబడింది? తప్పకుండా, ఈ సవాళ్లను ఎదుర్కొంటున్న వారు దేవుని వాక్యం నుండి బలాన్ని మరియు ప్రోత్సాహాన్ని పొందడానికి సహాయం చేసేందుకే. కాని, మన సహోదర సహోదరీలు కొందరు బహుశా ఎదుర్కొంటున్న దాన్ని గురించి స్పష్టమైన అవగాహన కలిగివుండడానికి కూడా అలాంటి శీర్షికలు మనందరికీ సహాయం చేస్తాయి. ఆ విధంగా, పౌలు యొక్క ఈ మాటలను వినడానికి మనమందరం బాగా సిద్ధమై ఉన్నాము: “ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి, అందరియెడల దీర్ఘశాంతముగలవారై యుండుడి.”—1 థెస్సలొనీకయులు 5:14.

“గాలికి మరుగైనచోటు” వలెనున్న పెద్దలు

15. పెద్దలుగా సేవచేస్తున్నవారి గురించి యెషయా ఏమి ప్రవచించాడు, ఇది వారిపై ఏ బాధ్యతనుంచుతుంది?

15 మనం అలిసిపోయినప్పుడు మనకు సహాయం చేసేందుకు యెహోవా మరొకటి కూడా ఏర్పాటు చేశాడు—సంఘ పెద్దలు. వీరి గురించి ప్రవక్తయైన యెషయా ఇలా వ్రాశాడు: “మనుష్యుడు గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉండును. ఎండినచోట నీళ్లకాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను ఉండును.” (యెషయా 32:1, 2) కాబట్టి యెహోవా తమ గురించి ప్రవచించిన దానికి తగినట్లు ఉండవలసిన బాధ్యత పెద్దలకు ఉంది. వారు ఇతరులకు ఓదార్పు మరియు విశ్రాంతి అనుగ్రహించే మూలములుగా ‘ఉండి’ “ఒకని భారముల [లేక, “కష్టం కలిగించే విషయాలను”; అక్షరార్థంగా, “భారమైన విషయాలను”] నొకడు భరిం”చుటకు సుముఖత కలిగివుండాలి. (గలతీయులు 6:2) దీన్ని వారెలా చేయగలరు?

16. ప్రార్థించడానికి అనర్హులమని భావించేవ్యక్తికి సహాయం చేయడానికి పెద్దలు ఏమి చేయవచ్చు?

16 మునుపు చెప్పినట్లుగా, అలసిపోయిన ఒక వ్యక్తి కొన్నిసార్లు ప్రార్థించడానికి అనర్హుడనన్నట్లు భావించవచ్చు. పెద్దలు ఏమి చేయవచ్చు? వాళ్లు ఆ వ్యక్తితోపాటు, ఆ వ్యక్తి కొరకు ప్రార్థించవచ్చు. (యాకోబు 5:14) అతడు లేక ఆమె యెహోవాచే మరియు ఇతరులచే ఎంతగా ప్రేమించబడుతున్నారో అర్థం చేసుకోవడానికి సహాయం చేసేందుకు అలిసిపోయిన వ్యక్తి సమక్షంలో యెహోవాకు ప్రార్థించడం తప్పకుండా ఓదార్పుకరంగా ఉండగలదు. పెద్ద యొక్క పట్టుదలతో కూడిన, హృదయపూర్వకమైన ప్రార్థనను వినడం దుఃఖపడే వ్యక్తి విశ్వాసాన్ని బలపర్చడానికి సహాయం చేయగలదు. ఆ వ్యక్తి కొరకు చేయబడిన ప్రార్థనలకు యెహోవా సమాధానమిస్తాడన్న నమ్మకం పెద్దలకు ఉన్నట్లయితే, ఆ నమ్మకాన్ని అతడు లేక ఆమె పంచుకోవచ్చని అతడు లేక ఆమె గ్రహించడానికి సహాయం చేయవచ్చు.

17. పెద్దలు ఎందుకు సహానుభూతితో వినే శ్రోతలై ఉండాలి?

17 “ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు . . . నిదానించువాడునై యుండవలెను” అని యాకోబు 1:19 చెబుతుంది. అలిసిపోయిన వారు తిరిగి శక్తి పొందడానికి సహాయం చేసేందుకు, పెద్దలు సహానుభూతితో వినేవారై కూడా ఉండాలి. కొన్ని సందర్భాల్లో సంఘ సభ్యులు ఈ విధానంలో పరిష్కరించబడలేని సమస్యలు లేక ఒత్తిళ్లతో పోరాడుతుండవచ్చు. కాబట్టి, వాళ్లకు అవసరమైనది, వారి సమస్యకు “పరిష్కారం” కాదు కాని వారు మాట్లాడడానికి ఒక మంచి శ్రోత—వారెలా భావించాలో చెప్పే వ్యక్తి కాదుగాని, తీర్పు తీర్చే దృక్పథం లేకుండా వినేవ్యక్తే.—లూకా 6:37; రోమీయులు 14:13.

18, 19. (ఎ) అలిసిపోయిన వారి భారాన్ని మరింత అధికం చేయడాన్ని నివారించేందుకు వినడానికి వేగిరపడడం ఒక పెద్దకు ఎలా సహాయం చేయగలదు? (బి) పెద్దలు ‘సానుభూతి’ చూపించినప్పుడు ఏమి జరుగుతుంది?

18 పెద్దలారా, మీరు వినడానికి వేగిరపడడం అలిసిపోయిన వ్యక్తి భారాన్ని అనాలోచితంగా అధికం చేయడాన్ని నివారించేందుకు మీకు సహాయం చేయగలదు. ఉదాహరణకు, ఒక సహోదరుడు గాని ఒక సహోదరిగాని కూటాలకు రావడానికి తప్పిపోతే లేక పరిచర్యలో మందగిస్తే, పరిచర్యలో మరింత ఎక్కువగా భాగం వహించడం గురించి లేక కూటాలకు మరింత క్రమంగా రావడం గురించి అతనికి లేక ఆమెకు ఉపదేశం ఇవ్వడం నిజంగా అవసరమా? బహుశా, అవసరం కావచ్చేమో. కాని పరిస్థితి పూర్తిగా మీకు తెలుసా? అధికమౌతున్న ఆరోగ్య సమస్యలున్నాయా? కుటుంబ బాధ్యతలు ఇటీవలనే మారాయా? అతడిని లేక ఆమెను కృంగిపోయేలా చేసే ఇతర పరిస్థితులు లేక ఒత్తిళ్లు ఉన్నాయా? మరెక్కువ చేయలేకపోతున్నందుకు ఆ వ్యక్తి ఇప్పటికే ఎంతో అపరాధభావం కలిగివుంటాడని మరచిపోకండి.

19 అయితే మరి మీరు ఆ సహోదరునికి లేక సహోదరికి ఎలా సహాయం చేయగలరు? మీరు ఏదైనా ముగింపుకు రాకముందు లేక ఏదైనా ఉపదేశం ఇచ్చేముందు, వినండి! (సామెతలు 18:13) వివేకంగల ప్రశ్నల ద్వారా ఆ వ్యక్తి హృదయంలోని భావాలను ‘పైకి చేదండి.’ (సామెతలు 20:5) ఈ భావాలను అలక్ష్యం చేయకండి—వాటిని గుర్తించండి. యెహోవా మన ఎడల శ్రద్ధకలిగివున్నాడని, కొన్నిసార్లు మన పరిస్థితులు మనల్ని పరిమితం చేయవచ్చని అలిసిపోయిన వ్యక్తికి ధైర్యమివ్వవలసి ఉంటుంది. (1 పేతురు 5:7) పెద్దలు అలాంటి ‘సానుభూతి’ చూపించినప్పుడు, అలిసిపోయినవారు ‘తమ ప్రాణములకు విశ్రాంతి పొందుతారు.’ (1 పేతురు 3:8; మత్తయి 11:28-30) వారు అలాంటి విశ్రాంతి పొందినప్పుడు, మరింత ఎక్కువ చేయమని వారికి చెప్పవలసిన అవసరం ఉండదు; యెహోవాను సేవించడంలో తాము కారణసహితంగా చేయగలిగినదంతా చేయడానికి వారి హృదయాలే వారిని పురికొల్పుతాయి.—2 కొరింథీయులు 8:12; 9:7 పోల్చండి.

20. ఈ దుష్టతరం యొక్క అంతం ఇంత సమీపంలో ఉండగా, మనం ఏమి చేయడానికి నిశ్చయించుకోవాలి?

20 నిజంగా మనం మానవ చరిత్రలోని అత్యంత కష్టభరితమైన కాలంలో జీవిస్తున్నాము. సాతాను లోకంలో జీవించడం యొక్క ఒత్తిళ్లు మనం అంత్యకాలంలోకి లోతుగా వెళ్లుతున్న కొద్ది ఎక్కువవుతున్నాయి. మనం అలిసిపోయి విడిచిపెడితే తాను దాని నుండి ప్రయోజనం పొంది మనల్ని సులభంగా చేజిక్కించుకోవాలని అపవాది వేటాడే సింహంలా ఎదురుచూస్తుంటాడని గుర్తుంచుకోండి. అలిసిపోయిన వారికి యెహోవా శక్తినిస్తాడంటే మనం ఎంత కృతజ్ఞత కలిగివుండవచ్చు! మనకు ఎగిరే పక్షిరాజులాంటి బలమైన రెక్కలనిచ్చినట్లు, మనం కొనసాగడానికి మనకు కావలసిన శక్తినిచ్చేందుకు ఆయన చేసిన ఏర్పాట్ల నుండి మనం పూర్తి ప్రయోజనాన్ని పొందుదాము. ఈ దుష్ట తరం యొక్క అంతం ఇంత సమీపంలో ఉండగా, నిత్యజీవమనే బహుమానం కొరకైన మన పరుగుపందెంలో పరుగెత్తడాన్ని ఆపడానికి ఇప్పుడు సమయం కాదు.—హెబ్రీయులు 12:1.

మీ సమాధానమేమిటి?

◻ మన ప్రార్థనలకు సమాధానంగా యెహోవా ఏమి చేయాలని మనం ఎదురుచూడవచ్చు?

◻ మనం మన క్రైస్తవ సహోదరత్వం నుండి ఏయే విధాలుగా బలాన్ని పొందవచ్చు?

◻ తిరిగి శక్తిని పొందడానికి దేవుని వాక్యం మనకెలా సహాయం చేస్తుంది?

◻ అలిసిపోయిన వారు తిరిగి శక్తిని పొందడానికి పెద్దలు ఏమి చేయగలరు?

[17వ పేజీలోని చిత్రం]

మనం ఆతిథ్యమిచ్చేటప్పుడు, ప్రోత్సాహం అవసరమైన వారిని మనం మరచిపోకుందాము

[18వ పేజీలోని చిత్రం]

వారు ఎంతగా ప్రేమించబడుతున్నారో గ్రహించడానికి అలిసిపోయినవారికి సహాయం చేయమని పెద్దలు యెహోవాను అడుగవచ్చు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి