కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 10/15 పేజీలు 3-4
  • భయం—మిత్రువా శత్రువా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • భయం—మిత్రువా శత్రువా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాకు భయపడేలా మీహృదయాన్ని మలచుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • మనుష్యులకు కాక దేవునికి ఎందుకు భయపడవలెను?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • యెహోవా భయంలో ఆనందాన్ని కనుగొనేందుకు నేర్చుకోవడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • యెహోవాకు భయపడండి, ఆయన ఆజ్ఞలను గైకొనండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 10/15 పేజీలు 3-4

భయం—మిత్రువా శత్రువా?

“ఎలా చనిపోవాలా అని నేను ఆలోచిస్తున్నాను. నన్ను తుపాకితో కాల్చడం నాకిష్టంలేదు, కానీ ఒకవేళ అలా జరగవల్సివస్తే, నేను త్వరగా చనిపోయేట్లుగా ఇదిగో సరిగ్గా నా తల మీదే తగలాలని నేను కోరుకుంటున్నాను.”

ఆ మాటలను, 14 ఏండ్ల ఓ అమ్మాయి చెప్పడాన్ని లాస్‌ ఏంజెల్స్‌ టైమ్స్‌ విలేఖరి విన్నాడు. ఇటీవలి హత్యలను గూర్చి అంటే పెద్దలనూ ఇతర యౌవనులనూ యౌవనులు చంపడాన్ని గూర్చి ఆయన విద్యార్థులతో ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆ నివేదిక శీర్షికాంశం: “భయంగల లోకం.”

అనేకులు భయంగల లోకంలో జీవిస్తున్నారన్న విషయం మీకు బాగా తెలుసు. దేని గూర్చి భయం? ఏ ఒక్క భయాన్ని ప్రత్యేకించి చెప్పడం కష్టమే. ఈ ప్రక్కన ఉన్న బాక్సులో మీ స్నేహితులుగానీ లేక మీ ప్రాంతంలోని అనేకమంది ప్రజలుగానీ భయపడే విషయాలను కనుగొనగలరేమో చూడండి. ఈ బాక్సు నవంబరు 22, 1993 న్యూస్‌వీక్‌లోనిది మరియు “10 నుండి 17 ఏండ్ల వయస్సు మధ్యలో ఉన్న 758 మంది పిల్లలూ వారి తలిదండ్రుల” అభిప్రాయ సేకరణా ఫలితాలను అది చూపిస్తుంది.

ఆ యౌవనులను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తే, భయపడేందుకు భూకంపాల భయం వంటి మరిన్ని కారణాలను వారు చెప్పవచ్చు. జనవరి 1994 నాడు లాస్‌ ఏంజెల్స్‌ నందు విపత్కరమైన కంపనం సంభవించిన తర్వాత టైమ్‌ పత్రిక ఇలా నివేదించింది: “ఉద్వేగాఘాత పర్యంత ఒత్తిడి సూచనల్లో, అదుపులేని జ్ఞాపకాలూ పీడకలలూ నిద్రపట్టకపోవడం, ఒకని జీవితాన్ని అదుపు చేసుకోలేపోతున్నందుకు కోపపడడం ఉన్నాయి.” ఆ ప్రాంతాన్ని విడిచిపోవాలని నిశ్చయించుకున్న ఓ వ్యాపారస్థుడు ఇలా అన్నాడు: “లెక్కలోకి వచ్చేది నష్టం కాదు. భయం మాత్రమే. క్రింది అంతస్తులో మీరు మీ బూట్లు వేసుకునే పడుకుంటారు. మీకు నిద్ర పట్టదు. ప్రతి రోజు రాత్రి భూకంపం సంభవిస్తుందా అన్నట్లు మీరు ఎదురుచూస్తూ ఊరికే అలా కూర్చుంటారు. అది బాగోదు.”

టోక్యోనుండి వచ్చిన ఏప్రిల్‌ 11, 1995 నాటి నివేదిక శీర్షికాంశం, “విపత్తుల పరంపర జపాన్‌ దేశీయులను భయపెడుతోంది.” అది ఇలా చెప్పింది: “అపాయకరమైన నెర్వ్‌గ్యాస్‌ . . . జపాన్‌ దేశీయుల మానసిక స్థితిపై తీవ్రమైన గాయాన్ని కలిగించింది ఎందుకంటే అది భవిష్యత్తును గూర్చి నూతన అనిశ్చయతలను మూకుమ్మడిగా సృష్టించిన సంఘటనల పరంపరలో ఒక భాగంగా వచ్చింది. . . . ఒకప్పుడు రేయింబవళ్లు భద్రతగల ప్రాంతాలుగా పేరుపొందిన వీధుల్లో ప్రజలు తాము భద్రంగా ఉన్నామని ఇప్పుడు ఏమాత్రం భావించడంలేదు.” మరి భయపడేది కేవలం వృద్ధులు మాత్రమే కాదు. “ప్రత్యేకంగా తమ భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న విషయాన్ని గూర్చి స్పష్టమైన అవగాహన లేని యౌవనుల మధ్యే ఈ చింత ఎక్కువగా ఉందని [సెయిజో విశ్వవిద్యాలయపు] ప్రొఫెసర్‌ ఇషికావా చెప్పారు.”

“విపరీతమైన భయం మెదడులో రసాయనిక చర్యల్ని తారుమారు చేస్తుంది, అలా జరగడం వల్ల ఎన్నో దశాబ్దాల తర్వాత కూడా వినాళ గ్రంథులను ఉత్పత్తిచేసే ద్రవపు హెచ్చుతగ్గుల ప్రభావానికి ప్రజలు మరింతగా గురవుతుంటారు” అని రుజువు సూచిస్తోంది. మెదడు ఓ భయంకరమైన పరిస్థితిని ఎలా వివరిస్తుందనే విషయాన్ని, అంటే మనం ఆ భయానికి సంబంధించిన వివరాలను ఎలా పరిశీలిస్తాము మరియు దానికి ఎలా ప్రతిస్పందిస్తాము అన్న వాటిని అర్థం చేసుకునేందుకు శాస్త్రజ్ఞులు ప్రయత్నిస్తున్నారు. ప్రొఫెసర్‌ జోసెఫ్‌ లీడో ఇలా వ్రాశారు: “ఓ జీవి భయాన్ని తెలుసుకునేలా చేసే ఓ పరిస్థితినిబట్టి నరాల మార్గాన్ని తెలుసుకోవడం ద్వారా, ఈ విధమైన జ్ఞాపకాల సహజ ప్రక్రియను వివరించగలమని ఆశిస్తున్నాము.”

అయితే మనలో అనేకులం భయానికి సంబంధించిన రసాయనిక లేక నరాల సంబంధిత విషయాల్లో ఎక్కువ ఆసక్తిని కల్గిలేము. మనం ఎందుకు భయపడతాము? మనం ఎలా ప్రతిస్పందించాలి? మేలు కలిగించే భయమేదైనా ఉందా? అనే ప్రశ్నలకు జవాబును పొందడంలో మనం ఎక్కువ ఆసక్తిని కల్గివుంటాము.

కొన్నిసార్లు భయం మీకు సహాయపడుతుందని బహుశ మీరు అంగీకరించవచ్చు. ఉదాహరణకు, మీరు మీ ఇంటికి చేరుకునేసరికి చీకటి పడిందనుకోండి. తలుపును మీరు గట్టిగా వేసివెళ్లినప్పటికీ, ఇప్పుడు కొద్దిగా తెరుచుకుని ఉంది. కిటికీలోనుండి మీకు కదలాడే నీడలు కనిపిస్తున్నాయి. వెంటనే ఏదో అయ్యిందని గ్రహించి మీకు టెన్షన్‌ పెరుగుతుంది. బహుశ ఓ దొంగో లేక కత్తినుపయోగించే దుండగుడో లోపల ఉండవచ్చు.

అలాంటి పరిస్థితుల్లో తెలియకుండానే వారు భయపడడం మీరు అపాయకరమైన పరిస్థితుల్లో అనాలోచితంగా చిక్కుకోకుండా ఉండేందుకు సహాయపడుతుంది. మీరు ముందు జాగ్రత్తలు తీసుకునేందుకు భయం సహాయపడుతుంది లేక మీరు అపాయాన్ని ఎదుర్కొనకముందు మీరు సహాయాన్ని పొందేందుకు తోడ్పడుతుంది. అలాంటి అనేక ఉదాహరణలున్నాయి: అధిక ఓల్టేజీ ఉందని హెచ్చరించే గురుతు; మీ ప్రాంతంలో భయంకరమైన వరద రాబోతోందనే రేడియో ప్రకటన; బాగా రద్దీగా ఉన్న రోడ్డుగుండా మీరు కారులో ప్రయాణిస్తున్నట్లైతే దానిలోనుండి వచ్చే చెవులు తూట్లుపడే శబ్దం.

కొన్ని సందర్భాల్లో భయం నిశ్చయంగా ఓ నేస్తంకావచ్చు. అది మనలను మనం కాపాడుకునేందుకు గానీ వివేకంతో ప్రవర్తించేందుకు గానీ సహాయపడగలదు. అయితే, ఎడతెగని భయం లేక తీవ్రమైన భయం నేస్తం కాదని మీకు బాగా తెలుసు. అది శత్రువు. అది మనకు ఎగ ఊపిరిని, గుండె వడిగా కొట్టుకోవడాన్ని, మూర్ఛనూ వణుకునూ వాంతి అవుతుందనే భావనను మరియు ఒకరి పరిసరాల్లోనుండి వేరైపోయామన్న భావనను తీసుకురాగలవు.

మన కాలం, భూమ్మీద భయానకమైన మరియు తీవ్రమైన భయాల ద్వారా గుర్తించబడుతుందని బైబిలు నిర్దిష్టంగా చెబుతోందన్నది మీకు ఎంతో ఆసక్తిని కల్గించవచ్చు. అదెలా మరి మీ జీవితం మరియు ఆలోచనపై అది ఎలా ప్రభావాన్ని కల్గివుండగలదు? అంతేకాకుండ, బైబిలు దృక్కోణం నుండి, ప్రత్యేకంగా సహాయకరమైన మరియు మంచిదైన దైనందిన భయముందని ఎందుకు చెప్పవచ్చు? దాన్ని మనం చూద్దాము.

[3వ పేజీలోని బాక్సు]

తమకు తమ కుటుంబానికి ఎక్కువ చింత కలిగించే విషయమేదని ప్రశ్నించినప్పుడు పెద్దలూ పిల్లలూ ఈ విషయాలంటే భయమని చెప్పారు:

పిల్లలు — తలిదండ్రులు

56% కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా దౌర్జన్యపూరితమైన నేరం 73%

53% ఓ వయోజనుడు ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం 60%

43% ఆహారం కొనుక్కునే స్తోమతలేకపోవడం 47%

51% డాక్టరుకు చూపించుకునే స్తోమత లేకపోవడం 61%

47% ఇల్లు కట్టుకునే స్తోమత లేకపోవడం 50%

38% కుటుంబ సభ్యుడు ఒకరు మాదకద్రవ్యాల సమస్య కలిగివుండడం 57%

38% వారి కుటుంబం కలిసి జీవించకపోవడం 33%

మూలం: న్యూస్‌వీక్‌, నవంబరు 22, 1993

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి