కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 8/15 పేజీ 32
  • అమాయకులైన బాధితులకు విముక్తి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అమాయకులైన బాధితులకు విముక్తి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 8/15 పేజీ 32

అమాయకులైన బాధితులకు విముక్తి

మానవుడు ఇంతవరకూ చేసిన నేరాల్లో అతి జుగుప్సాకరమైనది—పిల్లలను ఆచారం ప్రకారంగా బలి అర్పించడం. అలాంటి అసహ్యకరమైన ఆచారాలు ఉండేవంటే కొందరు నమ్మరు. ఫోనీసియా ఆరాధనకు గుర్తైన దీన్ని భూగర్భ శాస్త్రజ్ఞులు కనుగొన్న విషయాలు ధ్రువపర్చాయి.

ఉన్నత కుటుంబాల్లోని పిల్లలు, టానిట్‌ మరియు బాల్‌-హమ్మన్‌ వంటి దేవుళ్లకు మంటలో అర్పించబడ్డారు. కార్థేజ్‌నందు, పసిబిడ్డలు క్రొనస్‌ యొక్క రాగి విగ్రహానికి బలిగా కాల్చబడేవారు. ఆ బిడ్డ బంధువులు ఏడ్చేందుకు అనుమతించబడేవారుకారని సా.శ.పూ. మొదటి శతాబ్దపు చరిత్రకారుడైన డయడొరస్‌ సికలస్‌ చెబుతున్నారు. రోదనవల్ల వచ్చే కన్నీళ్లు ఆ బలి విలువను తగ్గిస్తాయని బహుశ వారు విశ్వసించినట్లున్నారు.

కొంతకాలంవరకు, యెరూషలేము వద్ద పురాతన తోఫెత్‌లో ఇలాంటి ఆచారకర్మ నిర్వహించబడేది. మండుతున్న మోలేకు కడుపులోకి బిడ్డలను విసురుతుండగా ఆ బిడ్డ ఏడ్పులు వినపడకుండేలా అక్కడి ఆరాధికులు నాట్యం చేస్తూ తంబురాలను వాయించేవాళ్లు.—యిర్మీయా 7:31.

ఇతరుల దుఃఖాన్ని వినకుండా క్రౌర్యంతో తమ చెవులను మూసుకునేవారిమీద యెహోవా ఎంతో కోపగించుకుంటాడు. (సామెతలు 21:13 పోల్చండి.) పిల్లలకు వాత్సల్యాన్ని కనపర్చే దేవునిగా, ‘నీతిమంతుల అనీతిమంతుల పునరుత్థానంలో’ అలాంటి అమాయక బాధితులను కూడా యెహోవా తప్పక లేపుతాడు.—అపొస్తలుల కార్యములు 24:15; నిర్గమకాండము 22:22-24.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి