రక్తమార్పిడులను పునఃపరిశీలించడం
ఎయిడ్స్ ఉన్న ఈ అంధకార యుగంలో, ఆసుపత్రిలో ఉన్న ఒక రోగి ఆరోగ్యానికి వచ్చే పెద్ద ముప్పు ఆపరేషన్ రూమ్లో పొంచివుంటుంది. “రక్తం నుండి సూక్ష్మక్రిమిని పూర్తిగా మేము ఎన్నడూ తీసివేయలేము,” అని డా. రిచర్డ్ స్పెన్స్ చెప్పారు. ఆయన ఒక దశాబ్దం కన్నా ఎక్కువకాలంవరకూ, అమెరికాలోని న్యూ జెర్సిలోని, కామ్డెన్ నందలి కూపర్ హాస్పిటల్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్లోని రక్తమార్పిడి లేకుండా చేసే శస్త్రచికిత్సా కేంద్రాన్ని నడిపించారు.
బైబిలు ఆధారంగా రక్తమార్పిడిని నిరాకరిస్తారని ప్రఖ్యాతిగాంచిన, అనేకమంది యెహోవాసాక్షులకు ఈ కేంద్రం చికిత్స చేసిందనడంలో ఆశ్చర్యం లేదు. (లేవీయకాండము 17:11; అపొస్తలుల కార్యములు 15:28, 29) అయితే, రక్తమార్పిడివల్ల కాలేయపు వాపు, ఎయిడ్స్, మరితర రోగాలు వంటివి రాగల అపాయాల విషయంలో చింతగల సాక్షులుకాని అనేకమంది రోగులు కూడా ఆ కేంద్రానికి వస్తున్నారు. “ఎయిడ్స్ వ్యాధి ప్రవేశం, రక్తాన్ని పరిశీలించాల్సిన అవసరాన్ని తెచ్చింది,” అని విజ్ఞానం, వైద్యంపై కొరియర్-పోస్ట్ వారపు నివేదిక (ఆంగ్లం) అనే పత్రిక చెప్పింది. “అయితే కొన్ని కేసులు పరిశీలనకు అందకుండా పోతాయి, ఎందుకంటే అది పరిశీలనలో కనుగొనబడక ముందే వాళ్లు ఆ వైరసును కల్గివుండగలరు.”
అలాంటి అపాయాల కారణంగా, రక్తరహిత శస్త్రచికిత్సా కేంద్రం రక్తమార్పిడికి ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తుంది. వాటిలో, ఒక రోగి రక్తాన్ని అతనిలోకే మరలా ఎక్కించడం కూడా చేరివుంది—కొన్ని నిర్దిష్ట సందర్భాల్లో ఈ పద్ధతిని కొందరు సాక్షులు అభ్యంతరకరమైనదానిగా పరిగణించని ఒక పద్ధతి.a మరో చికిత్స ఏమిటంటే, ఒక రోగి రక్తాన్ని వృద్ధి చేసేందుకు మందులను ఉపయోగించడం. దానికితోడు, రక్త మార్పిడి అవసరంలేకుండానే ప్రాణవాయువును అందించేందుకు సహాయపడడానికి అప్పుడప్పుడు ఉపయోగించేందుకు రక్తానికి కృత్రిమ ప్రత్యామ్నాయం కూడా ఉంది. “యెహోవాసాక్షులకు శ్రేష్ఠమైన వైద్యం కావాలి, అయితే వారికి రక్తమార్పిడికి ప్రత్యామ్నాయాలు కావాలి” అని డాక్టర్ స్పెన్స్ చెబుతున్నారు.
యెహోవాసాక్షులు, తమ మత విశ్వాసాన్ని గౌరవించే వైద్యులవద్దనుండి పొందిన సహాయ సహకారాలకు ఎంతో కృతజ్ఞులై ఉన్నారు. తత్ఫలితంగా, వారు నిజంగానే “శ్రేష్ఠమైన వైద్యాన్ని” పొందారు మరియు యెహోవా దేవుని ఎదుట వారు పరిశుద్ధమైన మనస్సాక్షిని కల్గివున్నారు.—2 తిమోతి 1:3.
[అధస్సూచీలు]
a ఈ పద్ధతిని గూర్చిన సవివరణాత్మక చర్చ మరియు దీని విషయంలో వ్యక్తిగతంగానూ జాగ్రత్తగానూ తీసుకోవల్సిన నిర్ణయాలు మార్చి 1, 1989 కావలికోట (ఆంగ్లం) 30-1 పేజీల్లో ఉన్నాయి.