కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 6/15 పేజీలు 28-31
  • కష్టతరమైన ఆర్థిక సమయాల్లో అవివాహజీవితం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కష్టతరమైన ఆర్థిక సమయాల్లో అవివాహజీవితం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ పరిస్థితిని పూర్తిగా వినియోగించుకోండి
  • విషయాలను అనుకూల దృక్పథంతో చూడండి
  • మీరు మీ పరిచర్యను విస్తృతపర్చుకోగలరా?
  • భవిష్యత్తుకొరకు భద్రత
  • ఒంటరితనానికి, వివాహానికి సంబంధించిన జ్ఞానయుక్త సలహాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • అవివాహిత స్థితి—పరధ్యానంలేని కార్యకలాపానికి మార్గం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • అవివాహితులుగా ఉన్నా యెహోవా సేవలో సంతృప్తిగా ఉన్నారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • వివాహం—దేవుని ప్రేమపూర్వక ఏర్పాటు
    ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 6/15 పేజీలు 28-31

కష్టతరమైన ఆర్థిక సమయాల్లో అవివాహజీవితం

“నేను నా 25వ ఏట పెళ్లి చేసుకోవాలనుకున్నాను,” అని తూర్పు ఆఫ్రికాలో నివసించే చక్స్‌ చెప్పాడు. “నా మనస్సులో ఒక అమ్మాయి ఉండేది, మరి ఆమెకు నేనంటే ఇష్టముండేది. ఉన్న సమస్యల్లా డబ్బు. మా నాన్నగారికి, మా అన్నకు ఉద్యోగాల్లేవు, మరి మా తమ్ముళ్లూ చెల్లెళ్లూ చదువుకుంటున్నారు. పోషించబడేందుకు కుటుంబంలో అందరూ నాపై ఆధారపడేవారు. ఆ తర్వాత, గాయం మీద కారం చల్లినట్లుగా, మా తలిదండ్రులు అస్వస్థతకు గురయ్యారు అంటే, వైద్య ఖర్చులకొరకు ఇంకా డబ్బు సంపాదించాలన్నమాట.”

ఒక యెహోవాసాక్షియైన చక్స్‌, భార్యను పోషించలేని కారణంగా వైవాహిక జీవితంలో ప్రవేశించాలనుకోలేదు. మొదటి తిమోతి 5:8లోని పౌలు మాటలను ఆయన బాగా గ్రహించాడు: “ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపకపోయినయెడల వాడు విశ్వాస త్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడైయుండును.”

“నేను ఎంతో కష్టపడి పనిచేశాను, కానీ పెళ్లి పథకాలు వేసుకునేందుకు డబ్బు ఎన్నడూ సరిపోయేదికాదు. తత్ఫలితంగా, మా పెళ్లి పథకాలు పదేపదే వాయిదాపడేవి. చివరికి, మరొకరెవరో ఆమెను పెళ్లి చేసుకోవడానికి వాళ్ల నాన్నగార్ని అడిగారని అమ్మాయి దగ్గరనుండి నాకు ఉత్తరం వచ్చింది. వాళ్ళ నాన్నగారు ఒప్పుకున్నారు. ఆమె ఉత్తరం వచ్చిన కొన్ని రోజుల్లోనే ఆ కుటుంబాల వాళ్లు ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు.”

చక్స్‌లా, అనేకమంది క్రైస్తవ పురుషులు తమ పెళ్లి పథకాలు క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులవల్ల విఫలం కావడమో లేక ఆలస్యంకావడమో చూశారు. అనేక దేశాల్లో అధిక ద్రవ్యోల్బణం ఉంది. ఉదాహరణకు, ఒక మధ్య ఆఫ్రికా దేశంలో, ధరలు ఒక్క సంవత్సరంలోనే 8,319 శాతం అకస్మాత్తుగా పెరిగాయి! కొన్ని దేశాల్లో ఉద్యోగాలను కనుక్కోవడం చాలా కష్టం. తరచూ, వేతనాలు ఎంత తక్కువగా ఉన్నాయంటే ఒక వ్యక్తి తనను తాను పోషించుకోవడమే చాలా కష్టం, మరి ఇక భార్యా పిల్లలనుగూర్చి చెప్పనవసరమేలేదు. నైజీరియాలోని ఒక యౌవనుడు తనకు దొరికిన పూర్తికాల ఉద్యోగానికి నెలకు కేవలం 17 డాలర్లు వస్తాయని వాపోయాడు, అంటే తాను పనిచేసే స్థలంనుండి ఒక నెలకు రాకపోకలకు సరిపోయేంత బస్సు ఖర్చులకంటే తక్కువన్నమాట!

అనేకమంది అవివాహిత క్రైస్తవ స్త్రీలు కూడా, ఆర్థిక కష్టాలవల్ల తమ పెళ్లి ఆలోచనా సౌధాలు కూలిపోయాయని కనుగొంటున్నారు. తరచూ వారు తమ కుటుంబ సభ్యులను పోషించేందుకు పనిచేయాల్సివుంటుంది. కొందరు అవివాహిత పురుషులు, ఈ పరిస్థితిని చూసి, ఇలాంటి పరిస్థితుల్లో వివాహం చేసుకుంటే భార్యనేకాదు ఆమె కుటుంబాన్ని కూడా పోషించేందుకు సంపాదించాల్సి వస్తుందని గ్రహించి పెళ్లిచేసుకునేందుకు వెనకాడుతారు. ఓ విశ్వవిద్యాలయ పట్టభద్రురాలైన ఐయో, తనను తాను, తన తల్లిని, తన తమ్ముళ్లనూ చెల్లెండ్లనూ పోషించుకునేందుకు చాలా కష్టపడుతుంది. “నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, కానీ ఇతరులు వచ్చి, నాపై ఆధారపడే వారిని [ఆర్థిక బాధ్యతలను] చూసి, పారిపోతారు” అని ఆమె వాపోతోంది.

ఆర్థిక మాంద్యమున్నప్పటికీ, అనేకమంది పెళ్లికాని క్రైస్తవులు పెళ్లి చేసుకోవాలని మరియు పిల్లలను కనాలని బంధువులూ మరితరుల ఒత్తిడికి తాము గురౌతున్నట్లుగా గమనించారు. కొన్నిసార్లు ఈ ఒత్తిడి అపహాసంగా మారుతుంది. ఉదాహరణకు, ఆఫ్రికానందలి కొన్ని భాగాల్లో ఒక వ్యక్తికి నమస్కారం చెప్పేటప్పుడు అతని లేక ఆమె యొక్క భార్య లేక భర్త మరియు పిల్లల యోగక్షేమాలను గూర్చి తెలుసుకోవడం అనవాయితీ. కొన్నిసార్లు అలాంటి ప్రతికూలప్రశ్నలు పెళ్లిగాని వ్యక్తులను వెక్కిరించేందుకు ఉపయోగించబడతాయి. తన 40వ పడిలో ఉన్న జాన్‌ ఇలా చెబుతున్నాడు: “ప్రజలు నన్ను వెక్కిరించి ‘మీ భార్య ఎలావుంది?’ అని అడిగినప్పుడు, ‘ఆమె వస్తోంది’ అని చెప్పేవాణ్ణి. నిజమేమిటంటే, నేను నా భార్యను పోషించుకోలేకపోతే నేను వివాహం ఎలా చేసుకోగలను?”

జాన్‌ మరియు అతని వంటి ఇతరులనేకుల పరిస్థితిని ఒక యోరొబా సామెతల్లో సంక్షిప్తంగా ఇలా ఉంది: “త్వరపడి పెళ్లిచేసుకోవడం గొప్ప విషయం కాదు; కుటుంబాన్ని పోషించడమే మహా కష్టం.”

మీ పరిస్థితిని పూర్తిగా వినియోగించుకోండి

మనం ఎంతగానో కోరుకున్నది జరగనప్పుడు మనం కలత చెందడం ఎంతో సులభం కదా. సామెతలు 13:12 ఇలా చెబుతోంది: “కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును.” బహుశ మీరు వివాహం చేసుకోవాలనుకుని, ఆర్థిక పరిస్థితివల్ల చేసుకోలేనప్పుడు మీరు ఇలా భావించవచ్చు. బహుశ, “కామతప్తులు” అని అపొస్తలుడైన పౌలు వర్ణించినవారిలో మీరు ఉన్నట్లైతే ఇది మరి వాస్తవంకావచ్చు.—1 కొరింథీయులు 7:9.

దీన్ని అధిగమించడం అంత సులభం కాకపోవచ్చు, కానీ సహించేందుకు మరియు మీ పరిస్థితిలోనే మీరు ఆనందాన్ని కనుగొనేందుకు మీరు చేయగల పనులున్నాయి. అవివాహిత పురుషుడైన యేసుక్రీస్తు, కోరిక సఫలం కాకపోవడం వల్ల వచ్చే నిరుత్సాహాన్ని అధిగమించేందుకు మీకు సహాయపడగల ఆచరణాత్మక బైబిలు సూత్రాన్ని అందించాడు. ఆయన ఇలా చెప్పాడు: “పుచ్చుకొనుటకంటే ఇచ్చుట ధన్యము.”—అపొస్తలుల కార్యములు 20:35.

మీ కుటుంబంకొరకు అలాగే మీ సంఘంలోని ఇతరులకొరకు మీరు మంచి పనులను చేయడం ద్వారా దీన్ని అన్వయించుకోవచ్చు. బహుశ క్రైస్తవ పరిచర్యలో మీరు మీ పనిని అధికం చేసుకోవచ్చు. నిస్వార్థంగా ఇవ్వడంలో మీరు పూర్తిగా నిమగ్నమైనట్లైతే, మీరు ‘స్థిరచిత్తులై మీ ఇష్ట ప్రకారము జరుప శక్తిగలవారైనట్లు’ కనుగొనగలరు.—1 కొరింథీయులు 7:37.

మరో అవివాహిత వ్యక్తి అయిన అపొస్తలుడైన పౌలు ఈ సహాయకరమైన ఉపదేశాన్ని ఇచ్చాడు: “దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.” (ఎఫెసీయులు 5:15, 16) అనేకమంది అవివాహిత క్రైస్తవులు ప్రార్థన, దేవుని వాక్య పఠనం మరియు క్రైస్తవ కూటాల్లో పాల్గొనడం వంటివాటి ద్వారా యెహోవాకు సన్నిహితులయ్యేందుకు తమ సమయాన్ని ఉపయోగించుకోవడం వల్ల ‘తమ ప్రాణములకు విశ్రాంతిని’ కనుగొన్నారు. (మత్తయి 11:28-30) మీరు దీన్ని చేసినట్లైతే, కష్టతరమైన ఆర్థిక పరిస్థితితో మీరు మరి విజయవంతంగా పోరాడగలుగుతారు. మీరు చివరికి వివాహం చేసుకుంటే శ్రేష్ఠమైన భర్త లేక భార్యగా మిమ్మల్ని తయారు చేస్తూ, మీరు అధిక ఆత్మీయతను కనపర్చేందుకు కూడా, అది సహాయపడుతుంది.

తనను సేవించేవారందరి విషయంలో యెహోవా శ్రద్ధ కల్గివుంటాడని ఎన్నడూ మర్చిపోవద్దు. మీరు అనుభవిస్తున్న సమస్యలూ కష్టాలు ఆయనకు తెలుసు. ఆత్మీయంగానూ భావోద్రేకపరంగానూ మీ భావి జీవితంలో మీకు ఏది మంచిదో కూడా మన ప్రేమపూర్వకమైన పరలోకపు తండ్రికి తెలుసు. ఓపికతో మీ అనుదిన జీవితంలో ఆయన వాక్యపు సూత్రాలను మీరు అన్వయించుకుంటే, ఆయన తన నిర్ణీత సమయంలో ఉపశమనాన్ని తీసుకొస్తాడన్న హామీ మరియు మీ శాశ్వత మంచికొరకు మీ అవసరతలనూ మరియు కోరికలనూ తీరుస్తాడన్న హామీలకు మీరు కల్గివుండగలరు. బైబిలు ఇలాంటి హామీనిస్తోంది: “యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన [యెహోవా] యే మేలును చేయక మానడు.”—కీర్తన 84:11.

విషయాలను అనుకూల దృక్పథంతో చూడండి

ఒంటరిగా ఉండడం వల్ల నిర్దిష్టమైన ప్రయోజనాలున్నాయని కూడా జ్ఞాపకముంచుకోండి. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “తన . . . వివాహం చేసుకొని తన బ్రహ్మచర్యమును త్యజించినవాడు మంచిపని చేస్తున్నాడు, కానీ అలా వివాహం చేసుకోకుండా ఉండువాడు మరి మంచి పని చేస్తున్నాడు.”—1 కొరింథీయులు 7:38, NW.

వివాహంకంటే అవివాహ జీవితం ఎందుకు “మంచి పని”? పౌలు ఇలా వివరించాడు: “పెండ్లికానివాడు ప్రభువును ఏలాగు సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. పెండ్లియైనవాడు భార్యను ఏలాగు సంతోషపెట్టగలనని లోకవిషయమైనవాటిని గూర్చి చింతించుచున్నాడు. అటువలెనే పెండ్లికాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయియుండుటకు ప్రభువు విషయమైన కార్యములనుగూర్చి చింతించుచుందురు గాని పెండ్లియైనది భర్తను ఏలాగు సంతోషపెట్టగలనని లోకవిషయమైనవాటిని గూర్చి చింతించుచున్నది.”—1 కొరింథీయులు 7:32-34.

మరో మాటలో, వివాహిత క్రైస్తవులు తమ జీవిత భాగస్వాముల అవసరతలూ, ఇష్టాయిష్టాలను గూర్చి ఉచితంగానే ఆసక్తిని కల్గివుంటారు. అయితే అవివాహిత క్రైస్తవులు యెహోవా సేవను మరింత శ్రద్ధతో చేయగలరు. వివాహం చేసుకున్నవారికి పోలిస్తే, అవివాహిత క్రైస్తవులు, “తొందర యేమియు లేక ప్రభువు సన్నిధానవర్తనులై” ఉండేందుకు మంచిస్థానంలో ఉన్నారు.—1 కొరింథీయులు 7:35.

అవివాహిత క్రైస్తవునికి ఏ పరధ్యాసలూ లేవని పౌలు చెప్పడం లేదు. మీరు ఆర్థిక సమస్యలతో కృంగిపోయినట్లైతే, మీ పరిచర్యనుండి మిమ్మల్ని ప్రక్కకు త్రిప్పే అపాయమున్న అనేక విషయాలు ఉన్నట్లుగా మీరు భావిస్తారు. అయినప్పటికీ, దేవున్ని సేవించేందుకుగల వ్యక్తిగత స్వేచ్ఛ అన్నది అవివాహిత పురుషునికి గానీ స్త్రీకి గానీ తరచు వివాహితులకంటే ఎక్కువగా ఉంటుంది.

అవివాహ జీవితాన్ని శ్రేష్ఠమైన పద్ధతిగా సిఫారసు చేస్తున్నప్పటికీ, వివాహం చేసుకోవడం తప్పని అపొస్తలుడైన పౌలు చెప్పలేదు. ఆయన ఇలా వ్రాశాడు: “నీవు పెండ్లిచేసికొనినను పాపము లేదు.” అయితే ఆయన ఇలా హెచ్చరించాడు: “అట్టివారికి [పెండ్లి చేసుకొనువారికి] శరీరసంబంధమైన శ్రమలు కలుగును.”—1 కొరింథీయులు 7:28.

అలా అనడంలో ఆయన భావమేమిటి? వివాహం కొన్ని విధాలైన కలతలను తెస్తుంది. ఆర్థిక మాంధ్యమున్న సమయాల్లో, తన భార్యను మరియు పిల్లలను ఎలా పోషించాలనే ఒక తండ్రి శ్రద్ధ అలాంటి శ్రమలో ఒక భాగమైవుండవచ్చు. అనారోగ్యం కూడా కుటుంబంపైకి ఆర్థిక మరియు భావోద్రేకపరమైన బాధలను తీసుకురాగలదు.

మీ పరిస్థితి మీరు ఇష్టపడేది కాకపోయినప్పటికీ, మీరు వివాహం చేసుకుని, పిల్లలను పోషించే బాధ్యత కల్గివుండడం కంటే ఇప్పుడు మీరు మరింత శ్రేష్ఠమైన స్థానంలో ఉన్నారు. మీరు ఇప్పుడు అనుభవించే కష్టాలు తాత్కాలికమైనవే; దేవుని నూతన విధానంలో అవి తీసివేయబడతాయి మరియు కొన్ని బహుశ అంతకంటే ముందే తీసివేయబడతాయి.—కీర్తన 145:16 పోల్చండి.

మీరు మీ పరిచర్యను విస్తృతపర్చుకోగలరా?

అందరూ అలా చేయలేకపోయినా, ఆర్థిక సమస్యలున్నప్పటికీ కొందరు పూర్తికాల సేవలో చేరగలిగారు. ముందు ప్రస్తావించిన చక్స్‌, తన కుటుంబాన్ని పోషించేందుకు స్టేషనరీ వస్తువులను కొని అమ్మేవాడు. తన పెళ్లి పథకాలు విఫలమైన సమయంలోనే, స్థానిక వాచ్‌టవర్‌ సొసైటీ బ్రాంచి కార్యాలయంలో తాత్కాలిక నిర్మాణపనిని చేసేందుకు తనను ఆహ్వానిస్తున్న ఒక ఉత్తరాన్ని పొందాడు. డబ్బు సంపాదించేవాడుండడనే ఉద్దేశంతో, వెళ్లకుండా ఉండడం మంచిదని అన్నాడు. అయితే, చక్స్‌ మాత్రం, తన స్టేషనరీ వ్యాపారాన్ని స్థాపించేందుకు యెహోవా సహాయపడ్డాడు కనుక తాను రాజ్యాసక్తులను ముందుంచాలని, పోషించగల దేవుని సామర్థ్యమందు విశ్వసించాలని నమ్మాడు. (మత్తయి 6:25-34) అంతేకాకుండ, అది కేవలం మూడు నెలల పనేకదా అని తలంచాడు.

చక్స్‌ ఆ ఆహ్వానాన్ని అంగీకరించి తన వ్యాపారాన్ని తన అన్న చేతికి అప్పగించాడు. ఆరు సంవత్సరాల తర్వాత, చక్స్‌ పూర్తికాల సేవలోనే కొనసాగుతూ, క్రైస్తవ సంఘంలో పెద్దగానూ మరియు వివాహం చేసుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగానూ ఉన్నాడు. తన జీవితంలోని విషయాలు మారిన విధానాన్ని బట్టి బాధపడుతున్నాడా? చక్స్‌ ఇలా అంటున్నాడు: “నేను కావాలనుకున్నప్పుడు నేను పెళ్లి చేసుకోలేకపోయినందుకు బాధపడ్డాను, కానీ పరిస్థితులన్నీ మంచికే మారాయి. అప్పుడు నేను పెళ్లి చేసుకుని ఒక కుటుంబాన్ని కల్గివున్నట్లైతే బహుశ అనుభవించలేనటువంటి అనేక ఆనందాలను సేవాధిక్యతలను నేను అనుభవించాను.”

భవిష్యత్తుకొరకు భద్రత

కష్టతరమైన పరిస్థితుల్లో, భవిష్యత్‌ ఆర్థిక కష్టాల నుండి ఒక రక్షణగా వివాహ భద్రత కావాలని అనేకులు కోరుకుంటారు. అప్పులలో మునిగిపోయిన కొన్ని దేశాలు, వయస్సుమళ్లినవారికి చాలా తక్కువ సహాయాన్ని అందిస్తాయి లేక అసలు ఏ సహాయాన్నీ అందించవు. కనుక తలిదండ్రులు తరచూ తమ కుటుంబాలపై ఆధారపడతారు, తమ వృద్ధాప్యంలో తమను పోషించేందుకు తమ పిల్లలపై ఆధారపడతారు. తత్ఫలితంగా, తమ ఆర్థిక పరిస్థితి అపాయంలో ఉన్నప్పటికీ ఒంటరి స్త్రీపురుషులు వివాహం చేసుకునేందుకు పిల్లలను కనేందుకు తరచూ ఒత్తిడి చేయబడతారు.

అయితే వివాహం చేసుకోవడం, పిల్లలను కల్గివుండడమూ భద్రతనివ్వవు. కొందరు లౌకిక పిల్లలు వయస్సుమళ్లిన తమ తలిదండ్రులను చూసుకునేందుకు ఇష్టపడడంలేదు, ఇతరులు అలా చేయలేకపోతున్నారు, మరితరులు తమ తలిదండ్రులకంటే ముందే మరణిస్తున్నారు. దేవుని ఈ వాగ్దానాన్ని మనస్సులో ఉంచుకుని, క్రైస్తవులు తమ భద్రతకొరకు మరో చోట చూస్తున్నారు: “నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను.”—హెబ్రీయులు 13:5.

యెహోవాను పూర్తికాలం సేవించేందుకుగాను వివాహం చేసుకోవడంలో ఆలస్యం చేసినవారు ఎడబాయబడలేదు. క్రిస్టియానా అవివాహిత మరియు 32 సంవత్సరాల ప్రాయముగలది. ఆమె గడచిన తొమ్మిదేళ్లు నైజీరియానందు క్రమపయినీరుగా సేవచేసింది. ఆమె ఇలా చెబుతోంది: “తన సేవకులను ఎన్నడూ ఎడబాయనని మనకు హామీ ఇచ్చిన యెహోవాయందు నేను నమ్మికనుంచుతున్నాను. ఆయన వాగ్దానమే నా నమ్మకం. నా ఆత్మీయ మరియు భౌతిక విషయాల్లో యెహోవా శ్రద్ధ వహిస్తాడు. ఆయన నాకు ఎంతో ఉదారమైన తండ్రిగా ఉన్నాడు. ఉదాహరణకు, సాక్షుల అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పయినీరింగు చేసేందుకు నేను వెళ్లాను. అక్కడ చాలా కొద్ది సదుపాయాలే ఉన్నప్పటికీ, వాటితో సర్దుకుపోయేందుకు నేను నేర్చుకున్నాను. నాకు సన్నిపాత విషజ్వరం వచ్చి నన్ను ఆసుపత్రిలో చేర్చినప్పుడు, ముందు నేను ఉండివచ్చిన సంఘంలోని సహోదరులు నాకు సహాయపడేందుకు వచ్చారు.

“పూర్తికాల సేవవల్ల నేను ఎంతో సంతృప్తిని పొందాను. విశ్వ సృష్టికర్తతో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమంది సహోదర సహోదరీలతోను కలిసి పనిచేయగల్గడం ఎంతో గొప్ప అధిక్యతగా నేను భావిస్తున్నాను. తమ చుట్టూ జరిగేవాటివల్ల కలతచెంది నిరుత్సాహపడిన అనేకమంది యౌవనులను నేను చూస్తున్నాను. నా మట్టుకు నాకు, నా జీవితం అర్థవంతంగా ఉంది; నేను భవిష్యత్తువైపు విశ్వాసంతో చూస్తాను. యెహోవాతో మంచి సంబంధాన్ని కల్గివుండడమే నేడు మనం ఎదుర్కొనే సమస్యలకు శ్రేష్ఠమైన పరిష్కారాన్నివ్వగలము.”

మీరు పెళ్లి చేసుకోవాలని కోరుకుంటూ ఆర్థిక మాంధ్యంవల్ల అలా చేసుకోలేకపోతున్నట్లైతే, నిరుత్సాహపడకండి! మీరు ఒంటరిగా లేరు. యెహోవా సహాయంతో అలాంటి శ్రమలను ఎదుర్కొనే అనేకమంది ఉన్నారు. ఇతరులకు మంచి పనులు చేయడంలోనూ మీ ఆత్మీయతను అభివృద్ధి చేసుకోవడంలోనూ మీరు కృషి చేయడం ద్వారా మీరున్న పరిస్థితిని మీరు బాగా ఉపయోగించుకోండి. దేవునికి దగ్గిరవ్వండి; ఆయన మీ ఎడల నిజంగానే శ్రద్ధ కల్గివున్నాడు కనుక ఆయన మీకు తప్పక సహాయం చేస్తాడు.—1 పేతురు 5:7.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి