కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 6/15 పేజీలు 9-12
  • ఓర్పు—ఎందుకు చాలా అరుదుగా ఉంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఓర్పు—ఎందుకు చాలా అరుదుగా ఉంది?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అసహనపు ఉదాహరణలు
  • అసహనానికి గల కారణాలు
  • ఓర్పు—ఎందుకు అంత విలువైంది
  • ప్రోత్సాహకరమైన ఉదాహరణలు
  • ఓర్పువల్ల వచ్చే ప్రతిఫలాలు
  • ఓర్పు చూపిస్తూ ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • మీరు ఓర్పును ప్రదర్శించగలరా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • యెహోవా ఓర్పును అనుకరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • యెహోవా, యేసు చూపించే దీర్ఘశాంతం నుండి నేర్చుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 6/15 పేజీలు 9-12

ఓర్పు—ఎందుకు చాలా అరుదుగా ఉంది?

అమిలియో తన అరవయ్యో పడిలో ఉన్నాడు.a ఆయన తన పెద్ద కుమారుని సమాధి చేసే విషాదకరమైన పని మీద ఓహాయియోకు వచ్చాడు. ప్రశాంతంగా ఉన్న కొండతట్టు మార్గంలో తన స్నేహితుల్లో కొందరితో మాట్లాడుతూ నడుస్తుండగా, ఓ కారు ఇంటి ఎదుటి వీధి నుండి రోడ్డు వైపుకు వెనకకు చాలా వేగంగా రావడం చూసి అమిలియో భయపడ్డాడు. ఆ కారు అతన్ని కొట్టినంతపనైంది, అందుకు కోపంతో అసహనంతో, అమిలియో డ్రైవరుమీద అరిచి, తన చేతితో కారు డిక్కీని బాదాడు. దాంతో వాగ్వాదము చెలరేగింది. ఆ డ్రైవరు అమిలియోను నెట్టేసినట్లున్నాడు, దాంతో ఆయన కిందపడి తల పేవ్‌మెంటుకు గట్టిగా కొట్టుకుంది. తలకు గాయం తగలడం వల్ల కొన్ని రోజులకు అమిలియో చనిపోయాడు. ఎంతటి విషాదకరమైన పరిణామమోకదా!

ఓర్పు చాలా అరుదైన లక్షణంగా ఉన్న లోకంలో మనం జీవిస్తున్నాము. వాహానాలను నడిపించే అనేకులు శరవేగంతో నడిపిస్తారు. ఇతరులు, పరిమిత వేగంతో ప్రయాణించే కారులను సన్నిహితంగా అనుసరిస్తూ వెంటాడుతారు. అయితే మరికొందరు మరో వాహనం వెనుకనుండే ఓపికలేనందున తమ లేన్లును దాటుతుంటారు. ఇంట్లో, కుటుంబ సభ్యులు కోపోద్రేకులై, ఉగ్రులౌతారు. కొందరు క్రైస్తవులు సహితం, తమ ఆత్మీయ సహోదరుల పొరపాట్లు లేక తప్పిదాలకు అధికంగా కలతచెందుతారు.

ఓర్పు ఎందుకు చాలా అరుదుగా ఉంది? ఎప్పుడూ అది అలాగే ఉంటుందా? మన కాలంలో ఓర్పును కల్గివుండడం ఎందుకు అంత కష్టము?

అసహనపు ఉదాహరణలు

ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు తన భర్తను సంప్రదించేందుకు వేచి ఉండని ఓ స్త్రీని గూర్చి బైబిలు చెబుతోంది. ఆమె పేరు హవ్వ. ఆదామును సంప్రదించకుండానే, బహుశ కాస్త అసహనంవల్ల, తినవద్దని చెప్పిన పండును తినేసింది. (ఆదికాండము 3:1-6) ఆమె భర్త విషయమేమిటి? మొదట తన పరలోక తండ్రియైన యెహోవాను సహాయం లేక నడిపింపుల కొరకు సమీపించకుండానే హవ్వను అనుసరిస్తూ పాపంచేయడం ద్వారా ఆయన కూడా అసహనాన్ని కనపర్చి ఉంటాడు. వారి అత్యాశ, బహుశ అసహనంతో చేరినదై పాపంలోకి నడిపిస్తూ, మనందరికి ఎంతో ప్రాణాంతకమైన పరిణామాలను తెచ్చిపెట్టింది. వారినుండి మొండితనం, అసహనంతో సహా మనం పాపాలను చేసే ప్రవృత్తిని వారసత్వంగా పొందాము.—రోమీయులు 5:12.

మన మొదటి తలిదండ్రులు పాపం చేసిన 2,500 సంవత్సరాల తర్వాత దేవుని ఎన్నుకోబడిన ప్రజలైన, ఇశ్రాయేలీయులు గంభీరమైన ఎడతెగని విశ్వాస రాహిత్యాన్ని అలాగే అసహనాన్ని కనపర్చారు. యెహోవా వారిని ఐగుప్తు దాసత్వం నుండి అద్భుతమైన రీతిలో విడిపించినప్పటికీ వారు ఆయన “కార్యములను వెంటనే మరచిపోయిరి” అంతేకాదు, “ఆయన ఆలోచనకొరకు కనిపెట్టుకొనకపోయిరి.” (కీర్తన 106:7-14) అనేకమారులు, వారు అసహనాన్ని కనపర్చేవారు కనుక వారు గంభీరమైన తప్పిదాలను చేసేవారు. వారు బంగారు దూడను చేసి దాన్ని ఆరాధించారు; యెహోవా వారికొరకు అందించే ఆహారమైన మన్నా విషయంలో సణిగారు; అంతేకాకుండ వారిలో అనేకులు దైవికంగా నియమించబడిన యెహోవా ప్రతినిధియైన మోషేకు ఎదురుతిరిగారు. నిజానికి, వారి అసహనం వారు దుఃఖించేందుకు మరియు వారి వినాశనానికి దారితీసింది.

ఇశ్రాయేలీయుల మొట్ట మొదటి మానవ రాజైన సౌలు, తన కుమారులు రాజ్యానికి వారసులయ్యే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకు? ఎందుకంటే యెహోవాకు బలి అర్పించాల్సిన ప్రవక్తైన సమూయేలు కొరకు వేచివుండలేదు. మనుష్యుల భయం, సౌలు సమూయేలుకంటే ముందే బలి అర్పించేలా చేసింది. సౌలు ఆ ఆచరణను ముగించిన వెంటనే సమూయేలు కనిపించినప్పుడు ఆయన ఎలా భావించివుంటాడో ఊహించుకోండి! కొన్ని నిమిషాలు ఆయన వేచివుండగలిగితే ఎంత బాగుండేది!—1 సమూయేలు 13:6-14.

తొందరపడి పండు తీసుకునే బదులు ఆదాము కొరకు హవ్వ వేచివుండివుంటే ఎంత బాగుండేది! యెహోవా సలహాకొరకు ఎదురుచూడాలనే విషయాన్ని ఇశ్రాయేలీయులు జ్ఞాపకముంచుకుని ఉన్నట్లైతే ఎంత బాగుండేది! అవును, ఓర్పు వారిని అలాగే మనలను ఎంతో దుఃఖం మరియు వేదన నుండి కాపాడేందుకు సహాయపడివుండేది.

అసహనానికి గల కారణాలు

నేడు అసహనానికి గల ముఖ్య కారణాన్ని అర్థంచేసుకునేందుకు బైబిలు మనకు సహాయపడుతుంది. మన తరం “అపాయకరమైన కాలములలో” జీవిస్తున్నట్లుగా 2 తిమోతి 3వ అధ్యాయం వివరిస్తోంది. ప్రజలు, “స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు, . . . అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు” అని అది చెబుతోంది. (2, 3 వచనాలు) అలాంటి అత్యాశతో కూడిన మరియు స్వార్థపూరితమైన దృక్పథం అనేకమంది ప్రజల హృదయాల్లోనూ మనస్సులలోనూ ఉంది, అది నిజమైన క్రైస్తవులతో సహా అందరూ ఓర్పును కనపర్చడాన్ని కష్టతరం చేస్తుంది. లౌకిక ప్రజలు వాహనాలను మరీ వేగంగా నడిపించడం లేక క్యూలో ముందుకు దూసుకుపోవడం, లేక మనలను నానా మాటలు అనడం వంటివాటిని మనం చూసినప్పుడు మన ఓర్పు పూర్తిగా నశించిపోతుంది. మనం వారిని అనుకరించేందుకో లేక వారికి ప్రతీకారం చేసేందుకో మనం శోధించబడవచ్చు, దానివల్ల వారి స్వార్థపూరితమైన గర్వపు స్థాయికి మనం దిగజారిపోతాము.

కొన్నిసార్లు మన స్వంత తప్పుడు నిర్థారణలే మనం ఓర్పును కోల్పోయేలా చేస్తాయి. తొందరపడి తీసుకున్న, తప్పుడు అభిప్రాయాలకూ మరియు అసహనం, కోపం కలిసివున్న ప్రవర్తనకు మధ్య సంబంధాన్ని జ్ఞానియైన సొలొమోను రాజు ఎలా చిత్రీకరించాడో గమనించండి: “అహంకారము గలవానికంటె శాంతముగలవాడు శ్రేష్ఠుడు ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయును.” (ప్రసంగి 7:8, 9) ఒక విషయానికి ప్రతిస్పందించే ముందు దానిని గూర్చిన పూర్తి, సరైన అవగాహనను పొందేందుకు మనం సమయం తీసుకున్నట్లైతే, మనం ఇతరులను ఎక్కువగా అర్థంచేసుకోగలము, ఇతరుల ఎడల ఎక్కువ సానుభూతిని ఓర్పును కల్గివుండగలము. మరోవైపు, అహంకారమూ స్వార్థపూరితమైన దృక్పథము, మోషేను వేధించిన సణుగుకునే మొండి ఇశ్రాయేలీయుల్లా, మనం కుంచితబుద్ధిగలవారిగానూ, అసహనులుగానూ ద్వేషపూరితమైనవారిగానూ ఉండేలా చేస్తుంది.—సంఖ్యాకాండము 20:2-5, 10.

ప్రపంచంలో ఓర్పు లేకపోవడానికి మరో కారణం యెహోవా నుండి వైదొలగడం వల్ల ఏర్పడిన నిరీక్షణ లేని పరిస్థితి. యెహోవాయందు నిరీక్షణ కల్గివుండవల్సిన మానవుని అవసరాన్ని గూర్చి దావీదు ఇలా వ్రాశాడు: “నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది.” (కీర్తన 62:5) యెహోవా అంటే ఎవరో తెలియని ప్రజలకు పరిమితమైన వారి నిరుత్సాహజనకమైన వైఖరి ఉంటుంది కనుక, సమయం మించిపోకముందే వారు ప్రతి చిన్న సుఖాన్ని, లాభాన్ని పొందేందుకు ప్రయత్నిస్తారు. వారి ఆత్మీయ తండ్రియైన అపవాదియగు సాతానులాగే తాము చేసే పనులు ఇతరులకు ఎంత హానికలుగజేస్తాయి అన్న విషయాన్ని పట్టించుకోరు.—యోహాను 8:44; 1 యోహాను 5:19.

నేడు ఓర్పు చాలా అరుదుగా ఉండడంలో ఏ ఆశ్చర్యమూ లేదు. ఈ దుష్ట, స్వార్థపూరితమైన విధానం, దాని దేవుడైన సాతాను మరియు మన పాపపూర్ణమైన శరీరపు పాపప్రవృత్తి వల్ల అందరూ, చివరికి యథార్థవంతులు సహితం ఓర్పుకల్గివుండడాన్ని కష్టతరం చేస్తుంది. అయినప్పటికీ, “ఓపిక కలిగియుండుడి,” అని బైబిలు మనకు ఉద్బోధిస్తోంది, ప్రత్యేకంగా దేవుని ఉద్దేశం నెరవేర్చే విషయంలో అలా చెబుతోంది. (యాకోబు 5:8) ఓర్పు ఎందుకు అంత విలువైనది? అది మనకు ఏ ఫలితాలను తీసుకురాగలదు?

ఓర్పు—ఎందుకు అంత విలువైంది

“అవి కూడా ఓర్పుతో సహిస్తూ ఎదురుచూసే వారికి మాత్రమే సహాయపడతాయి.” ఆంగ్ల కవియైన జాన్‌ మిల్టన్‌ సుమారు మూడువందల సంవత్సరాలకు పూర్వం, “ఆన్‌ హిజ్‌ బ్లైండ్‌నెస్‌” అనే తన భావగీతంలో ఆ మాటలు వ్రాశాడు. ఆ పద్యారంభములో, అతను తన 40వ పడిలో గ్రుడ్డివాడైనందువల్ల దేవునిని సంపూర్ణంగా సేవించలేకపోతున్నానే అన్న ఆయన భావన విషయంలో తన నిరుత్సాహాన్ని కలవరాన్ని అతను వ్యక్తపర్చాడు. అయితే పైన పేర్కొనబడినట్లు పద్యంలోని చివరి చరణంలో కనిపించేట్లుగా ఒక వ్యక్తి శ్రమలను ఓర్పుతో సహిస్తూ, సేవించేందుకు గల అవకాశాలను ప్రశాంతంగా వెదుక్కోవడం ద్వారా దేవున్ని ఆరాధించగలడని ఆయన గ్రహించాడు. ఓపికతో దేవునిపై ఆధారపడే విలువను మిల్టన్‌ గ్రహించాడు.

మనలో అనేకులకు మంచి కనుదృష్టి ఉండవచ్చు, అయితే మనమందరమూ కోపగించుకునే లేక కలవరపడే పరిమితులు మనకందరికీ ఉన్నాయి. మనం ఓర్పును ఎలా కల్గివుండగలము, ఎలా కనపర్చగలము?

ప్రోత్సాహకరమైన ఉదాహరణలు

బైబిలు ఓర్పును గూర్చి మనకు ఎన్నో మంచి ఉదాహరణలను అందిస్తుంది. యెహోవా ఓర్పు కోట్ల మంది మానవులు నిత్యజీవాన్ని పొందడాన్ని సాధ్యపరుస్తుంది. (2 పేతురు 3:9, 15) తన కాడిని ఎత్తుకొని, “[మన] ప్రాణములకు విశ్రాంతి”ని పొందమని యేసు ఇచ్చిన దయాపూర్వకమైన ఆహ్వానంలో తన తండ్రి యొక్క అద్భుతమైన ఓర్పును ఆయన పరిపూర్ణంగా ప్రతిబింబింపజేస్తున్నాడు. (మత్తయి 11:28-30) యెహోవా మరియు యేసు ఉదాహరణలపై ధ్యానించడం మనం మరింత ఓర్పును కల్గివుండేందుకు సహాయపడుతుంది.

యాకోబు కుమారుడైన యోసేపు, కోపగించుకోడానికి, ద్వేషించడానికి, లేక పగపెట్టుకోవడానికి ఎక్కువ కారణాలున్న వ్యక్తిగా కన్పిస్తాడు. అతనిని చంపేందుకు పథకాలు వేసి చివరికి అతన్ని దాసునిగా అమ్మేయడం ద్వారా అతని సహోదరులు అతనితో ఎంతో అన్యాయంగా వ్యవహరించారు. ఐగుప్తులో, పోతీఫరు ఎంతో శద్ధ్రాసక్తులతో నమ్మకంగా సేవచేసినప్పటికీ, యోసేపును అన్యాయంగా నిందించి, చెరసాలలో వేశారు. అలాంటి పరీక్షలు బహుశ యెహోవా ఉద్దేశాలను నెరవేరుస్తాయేమోననే అవగాహనతో, అతను తన శ్రమలన్నిటినీ ఓర్పుతో సహించాడు. (ఆదికాండము 45:5) యోసేపు దీనత్వమూ అవగాహనతోసహా యెహోవానందు విశ్వాసాన్ని నిరీక్షణను పెంపొందించుకున్నాడు కనుకనే, ఎంతో కష్టతరమైన పరిస్థితుల్లో కూడా అతను ఓర్పును కనపర్చగలిగాడు.

మరో ఆవశ్యకమైన సహాయం యెహోవా పరిశుద్ధాత్మ. ఉదాహరణకు, మనకు ముక్కోపమూ, వ్యంగ్యంగా మాట్లాడే అలవాటూ ఉందనుకోండి, అప్పుడు మనం ఆత్మ ఫలాలను పెంపొందించుకునేందుకుగాను పరిశుద్ధాత్మ సహాయం కొరకు మనం ప్రార్థించగలము. దీర్ఘశాంతం, ఆశానిగ్రహం వంటి దాని ఫలాలన్నింటి గూర్చి ధ్యానించడం, అవి ఓర్పుతో సన్నిహిత సంబంధాన్ని ఎలా కల్గివుంటాయో మనం నేర్చుకునేందుకు మనకు సహాయపడుతుంది.—గలతీయులు 5:22, 23.

ఓర్పువల్ల వచ్చే ప్రతిఫలాలు

ఓర్పు కల్గివుండడం మనకు ఎన్నో ప్రయోజనాలను తీసుకువస్తుంది. అది మన వ్యక్తిత్వాన్ని బలపరుస్తుంది అంతేకాకుండ అది మనం కర్కోటకంగానూ అవివేకంగానూ పనులు చేయకుండా ఉండేలా మనలను కాపాడుతుంది. కష్టతరమైన లేక ఒత్తిడిగల పరిస్థితులకు ప్రతిస్పందించడంలో తొందరపడడంవల్ల మనలో ఎవరం బాధాకరమైన తప్పులను చేయకుండా ఉన్నాము? మనం దయలేని మాటలను పలికి ఉంటాము లేక కర్కషంగా ప్రవర్తించి ఉంటాము. ఓ మామూలు సంఘటన, మన ప్రియమైనవారితో ఇరుపక్షాలవారూ గెలవని ఓ పోరాటంగా మారేందుకు మనం అనుమతించి ఉంటాము. చాలా కోపం, కలత, వేదన తర్వాత, ‘నేను కొంచెం ఓపిక పట్టివుంటే బాగుండేదికదా’ అని మనం బాధపడివుంటాము. ఓర్పును కనపర్చడం మనలను అన్ని విధాలైన దుఃఖాలనుండి కాపాడగలదు. ఆ వాస్తవం మాత్రమే మన జీవితాలకు అధిక శాంతిని, స్థిరత్వాన్ని మరియు సంతృప్తిని ఇస్తుంది.—ఫిలిప్పీయులు 4:5-7.

ఓర్పును కల్గివుండడం మనం నెమ్మదిగల, నమ్మకంగల హృదయాన్ని కల్గివుండేందుకు కూడా మనకు సహాయపడుతుంది. అది మనం మరింత శ్రేష్ఠమైన శారీరక, భావోద్రేక మరియు ఆత్మీయ ఆరోగ్యాన్ని అనుభవించేందుకు నడుపగలదు. (సామెతలు 14:30) అదుపులోపెట్టకపోతే, మహోద్రేకం, తీవ్రమైన భావోద్రేక మరియు శారీరక అస్వస్థతలకు అలాగే మరణానికి కారణంకాగలదు. మరోవైపు, ఓర్పుకల్గివుండడం వల్ల, ప్రత్యేకంగా మన ఆత్మీయ సహోదరులు మరియు కుటుంబ సభ్యుల ఎడల మనం మరింత అనుకూల దృక్పథాన్ని కల్గివుండగలం. అప్పుడు మనం ఇతరులకు చికాకు పుట్టించేట్లుగానూ విమర్శనాత్మకంగాను ఉండకుండా, ఇతరులను పరిగణించే వారిగానూ సహాయకరంగానూ ఉండేందుకు ఎక్కువ మొగ్గును కనపరుస్తాము. తద్వారా, మనతో సహవసించడం ఇతరులకు మరింత సులభతరంగానూ మరింత ఆనందదాయకంగానూ ఉంటుంది.

ప్రత్యేకంగా క్రైస్తవ సంఘంలోని పెద్దలు ఓర్పును కనపర్చవల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు తోటి క్రైస్తవులు గంభీరమైన సమస్యలతో వారిని సమీపిస్తారు. ఈ యథార్థమైన వారు అయోమయంలోపడి, కలతచెంది, లేక కృంగిపోయి ఉంటారు, అదే సమయంలో పెద్దలు తామే వ్యక్తిగత లేక కుటుంబపరమైన సమస్యల వల్ల అలసిపోయివుంటారు లేక మనోవ్యాకులత కలిగి ఉంటారు. అయితే, అలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో పెద్దలు ఓర్పును కల్గివుండడం ఎంత ప్రాముఖ్యమోకదా! ఈ విధంగా వారు “సాత్వికముతో” బోధిస్తారు మరియు ‘మందను కనికరంతో’ చూస్తారు. (2 తిమోతి 2:24, 25; అపొస్తలుల కార్యములు 20:28, 29) అమూల్యమైన ప్రాణాలు అపాయంలో ఉన్నాయి. కనికరం, ప్రేమ మరియు ఓర్పుగల పెద్దలు సంఘానికి ఎంతటి ఆశీర్వాదమోకదా!

కుటుంబ యజమానులు తమ ఇంటివారిని ఓర్పుతోనూ, అవగాహనతోనూ మరియు కనికరంతోనూ చూసుకోవాలి. తమ కుటుంబ సభ్యులందరూ కూడా ఇలాంటి లక్షణాలే కల్గివుండాలని వారు అపేక్షించాలి, అందుకు వారిని ప్రోత్సహించాలి. (మత్తయి 7:12) ఇది కుటుంబంలో ప్రేమ మరియు శాంతి కల్గివుండడానికి ఎంతగానో దోహదపడుతుంది.

ప్రాంతీయ పరిచర్యలో పాల్గొనేటప్పుడు క్రైస్తవ పరిచారకులు ఓర్పును కనపర్చడం, ఈ సేవలో అధిక ఆనందాన్ని అనుభవించేందుకు సహాయపడుతుంది. వారు ఎదుర్కొనే ఏ అలక్ష్యానైనా లేక వ్యతిరేకతనైనా ఇంకా చక్కగా సహించగలరు. కోపచిత్తులైన ఇంటివారితో వాదించే బదులు, ఓర్పుగల ప్రచారకులు నెమ్మదిగా జవాబు చెబుతారు లేక ఏమీ చెప్పకుండా వెళ్లిపోతారు, అలా శాంతిని, ఆనందాన్ని వారు కోల్పోరు. (మత్తయి 10:12, 13) అంతేకాకుండ, క్రైస్తవులు ప్రతి ఒక్కరితోనూ ఓర్పు మరియు కనికరంతో వ్యవహరించినప్పుడు, గొర్రెవంటి వారు రాజ్య వర్తమానంవైపుకు ఆకర్షింపబడతారు. ప్రపంచవ్యాప్తంగా, ఓర్పుతో చేసే ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదించాడు గనుక లక్షలాది మంది దీనులైన సత్యాన్వేషకులు యెహోవా యొక్క ప్రేమ పూర్వక సంఘంలోకి వస్తున్నారు.

నిజమే, ఓర్పును కల్గివుండడం మనకు మంచి ఫలితాలను తెస్తుంది. తొందరపడడం వల్ల లేక మన నోటికి కళ్ళెము పెట్టుకోకపోవడంవల్ల వచ్చే అనేక ప్రమాదాలను మరియు సమస్యలను నివారించగలము. మనం మరింత ఆనందంగానూ, నెమ్మదిగానూ, బహుశ మరింత ఆరోగ్యంగానూ ఉంటాము. మనం మన పరిచర్యలోనూ మన సంఘంలోనూ మన ఇంటిలోనూ మనం ఎంతో ఆనందాన్ని మరియు శాంతిని అనుభవించగలము. అయితే, అన్నిటికంటే ప్రాముఖ్యంగా, మనం దేవునితో సన్నిహిత సంబంధాన్ని అనుభవించగలము. కనుక యెహోవా కొరకు ఎదురుచూడండి. ఓర్పును కల్గివుండండి!

[అధస్సూచీలు]

a పేరు మార్చబడింది.

[10వ పేజీలోని చిత్రాలు]

అనుదిన జీవితంలో మీరు ఎంత ఓర్పు కల్గివున్నారు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి