కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 6/15 పేజీలు 3-4
  • ద్వేషం ఎన్నటికైనా అంతమౌతుందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ద్వేషం ఎన్నటికైనా అంతమౌతుందా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ద్వేషపు విత్తనాలను నాటడం
  • ద్వేషం వల్ల వచ్చే పర్యవసానాలు
  • ద్వేషమనే విషచక్రానికి కారణం ఏంటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2022
  • ద్వేషాన్ని లేకుండా చేయడం సాధ్యమే!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2022
  • ఎందుకింత ద్వేషం?
    తేజరిల్లు!—1997
  • ద్వేషమే లేని కాలాన్ని త్వరలో చూస్తాం!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2022
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 6/15 పేజీలు 3-4

ద్వేషం ఎన్నటికైనా అంతమౌతుందా?

మీరు కొన్ని దూరదర్శని వార్తాప్రసారాలను చూసివుంటే, ద్వేషం అన్నది మీకు క్రొత్త విషయం అయ్యుండదు. ఇంచుమించు ప్రతిదినమూ రక్తపు మరకలను విడిచిపెడుతున్నట్లు అనిపించేవాటిని అంటే నరమేధానికి కారణమౌతున్న సర్వసాధారణమైన విషయమే ద్వేషం. బెల్ఫాస్ట్‌నుండి బోస్నియా వరకు, జెరుషలెమ్‌ నుండి జొహానిస్‌బర్గ్‌ వరకూ దగ్గరున్న నిర్భాగ్యులను ఊచకోతకోశారు.

సాధారణంగా, దాడిచేసేవారికి తాము బాధించేవారెవరో తెలియదు. బహుశ వారు “మరో జట్టుకు చెందడమే” వారి “నేరం” కాబోలు. చూపరులను భయకంపితులను చేసే ప్రతికక్షలే, అలాంటి మరణాలు గత ఆత్యాచారాలకో లేక ఒక విధమైన “జాతి ప్రక్షాళనకు సంబంధించిన ప్రతికారం కావచ్చు. ఇరుపక్షాలవారూ భయపెట్టుకోవడంలో సంభవించే, అలాంటి మరణాలు మునుపెప్పుడో ఉన్న విద్వేషం లేక ఒక విధమైన “జాతి విధ్వంసకాండకు” పగతీర్చుకోవడమే కావచ్చు. దౌర్జన్యం జరిగిన ప్రతిసారి శత్రు వర్గాల మధ్య ద్వేషపు జ్వాలలు మరింతరగులుకునేలా చేస్తుంది.

మరలా మరలా సంభవించే ఈ భయానకమైన ద్వేషము పెరుగుతూనే ఉన్నట్లుంది. తెగ, వర్గం మరియు జాతి లేక మత గుంపుల రక్త సంబంధుల మధ్య పారంపర్య కలహాలు రేగుతూనే ఉన్నాయి. ద్వేషం ఎన్నటికైనా తీసివేయబడగలదా? దానికి జవాబు చెప్పాలంటే, ద్వేషానికి గల కారణాలను మనం అర్థంచేసుకోవాల్సిన అవసరముంది ఎందుకంటే మనం జన్మతః ద్వేషంగలవారం కాదు.

ద్వేషపు విత్తనాలను నాటడం

సరాజేవోకు చెందిన జ్లాటా ఫిలిపోవిక్‌ అనే బోస్నియాకు చెందిన ఒక యౌవనస్థురాలు ద్వేషించడం ఇంకా నేర్చుకోలేదు. జాతి వైషమ్యాన్ని గూర్చి ఆ అమ్మాయి తన డైరీనందు ఏకధాటిగా ఇలా వ్రాసుకుంది: “ఎందుకు? దేని కొరకు? తప్పు ఎవరిది? అని నేను ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాను. నేను ప్రశ్నిస్తాను కాని దానికి బదులు లేదు. . . . నా స్నేహితురాండ్ర మధ్య, మా స్నేహితుల మధ్య, మా కుటుంబంలోనూ, సర్బులూ క్రోయేట్లు మరియు ముస్లిమ్‌లు ఉన్నారు. మేము మంచి వాళ్లతోనే సహవసిస్తాము, చెడ్డవాళ్లతో సహవసించం. మరి చెడ్డవారిలో ఉన్నట్లుగానే మంచి వాళ్లలోనూ సర్బులు క్రోయేట్లు ముస్లిమ్‌లు ఉన్నారు.”

అయితే మరో వైపు పెద్దవాళ్లనేకులు దీనికి భిన్నంగా ఆలోచిస్తారు. తాము ద్వేషించేందుకు తమకు తగిన కారణముందని వారు నమ్ముతారు. ఎందుకు?

అన్యాయం. ద్వేషానికి గల ముఖ్య కారణం అన్యాయం మరియు హింసే కావచ్చు. బైబిలు చెబుతున్నట్లుగా, “అన్యాయము అనుభవించుటవలన జ్ఞానులు వెర్రివారగుదురు.” (ప్రసంగి 7:7, NW) ప్రజలు బాధించబడినప్పుడు లేక క్రూరంగా హింసించబడినప్పుడు, తమను హింసించినవారి ఎడల వారు ద్వేషాన్ని పెంచుకోవడం సులభమౌతుంది. మరి అది నిర్హేతుకమైనప్పటికీ, లేక “వెర్రి” అయినప్పటికీ, ఈ ద్వేషమన్నది తరచు ఒక గుంపంతటిపైన కలుగుతుంది.

అన్యాయం నిజమైందైనా లేక ఊహాజనితమైనదైనా, ద్వేషానికి ప్రాముఖ్యమైన కారణం కావచ్చు, కానీ అది ఒక్కటే కారణం కాదు. మరొకటి దురభిమానము.

దురభిమానము. దురభిమానము తరచూ ఒక తెగ లేక జాతి గుంపులను గూర్చిన విషయాలు తెలియకపోవడం నుండి చిగురిస్తుంది. వదంతుల కారణంగా, పారంపర్య శత్రుత్వంవల్ల లేక ఒకరు లేక ఇద్దరు వ్యక్తులతోగల చేదు అనుభవాలవల్ల, కొందరు ఒక తెగంతటికీ లేక జాతియంతటికీ ప్రతికూల లక్షణాలను ఆపాదించగలరు. ఒకసారి దురభిమానం నాటుకున్న తర్వాత, అది ప్రజలు వాస్తవాన్ని చూడకుండా వారికి అంధత్వాన్ని కలుగజేస్తుంది. “మనకు కొందరు వ్యక్తులు తెలియదు కనుక మనం వారిని ద్వేషిస్తాం; మరి మనం వారిని ద్వేషిస్తాం కనుకనే మనం వారిని తెలుసుకునేందుకు ప్రయత్నించము,” అని చార్ల్స్‌ కెలెబ్‌ కొల్టన్‌ చెప్పారు.

మరోవైపు రాజకీయ నాయకులూ చరిత్రకారులూ తమ రాజకీయ లేక జాతిపరమైన లక్ష్యాలకొరకు దురభిమానాన్ని బుద్ధిపూర్వకంగా వృద్ధిచేస్తారు. దానికి హిట్లర్‌ ప్రథమ ఉదాహరణ. హిట్లర్‌ యువజనోద్యమంలో మాజీ సభ్యుడైన జాయార్జ్‌ ఇలా చెబుతున్నాడు: “మొదటిగా యూదులను, తర్వాత రష్యన్లలను, ఆ తర్వాత ‘రీచ్‌ శత్రువు’లందరినీ ద్వేషించడమెలాగో మాకు నాజీ ప్రచారం నేర్పింది. ఓ యౌవనునిగా, నాకు చెప్పబడిన విషయాన్ని నేను నమ్మాను. ఆ తర్వాతే, నేను మోసపోయానని గ్రహించాను.” నాజీ జర్మనీలోలా మరియు ఇతర స్థలాల్లోలా, తెగాంతర లేక జాత్యంతర దురభిమానం, ద్వేషానికి మరో మూలమైన జాతీయవాదానికి ఆపాదించబడంవల్ల సమర్థించబడింది.

జాతీయవాదంలోవలె, వర్గవాదం మరియు కులవాదం. ద్వేషాన్ని వృద్ధి చేసుకోవడం (ఆంగ్లం) అనే తన పుస్తకంలో చరిత్రకారుడైన పీటర్‌ గే, మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఏమి సంభవించిందో ఇలా వివరిస్తున్నారు: “భక్తిని కనపర్చే పోరాటం విషయంలో ఇతర వాటన్నిటి మీద జాతివాదమే బలమైనదని నిరూపించుకుంది. తన దేశం ఎడల ప్రేమ మరియు దాని శత్రువుల ఎడల ద్వేషమే, దీర్ఘకాలీన పందొమ్మిదవ శతాబ్దం ఉత్పన్నం చేసిన కలహానికి అతి పటిష్టమైన వ్యవస్థీకరణయని రుజువైంది.” జర్మన్‌ జాతీయ భావన “ద్వేషపు గానం” అనే ఓ యుద్ధ గానాన్ని వ్యాప్తిచేసింది. బ్రిటన్‌ మరియు ఫ్రాన్స్‌నందలి ద్వేషోన్మాదులు, జర్మన్‌ సైనికులు స్త్రీలను బలాత్కరించడం మరియు పిల్లలను హత్య చేయడం గురించి కట్టుకథలను కల్పించారు అని గే వివరిస్తున్నారు. ఓ ఆంగ్లేయ సైనికుడైన సీగ్‌ఫ్రీడ్‌ సాసూన్‌, బ్రిటన్‌ యుద్ధ ప్రచారాన్ని సంక్షిప్తంగా ఇలా వివరిస్తున్నాడు: “జర్మన్లను హతమార్చేందుకే మనిషి సృజించబడ్డాడనిపించేది.”

జాతీయవాదంలోవలె, ఒక జాతి గుంపునుగానీ లేక తెగను గానీ మరీ పైకెత్తడం, ఇతర జాతి గుంపులు లేక తెగల ఎడల ద్వేషాన్ని అధికం చేసేందుకు తోడ్పడగలదు. పశ్చిమ ఐరోపా మరియు ఉత్తర అమెరికాలను కులవాదం పీడిస్తుండగా, అనేక ఆఫ్రికా దేశాల్లో తెగేయవాదం దౌర్జన్యాన్ని రేపుతూనే ఉంది. జాతీయవాదంతో ముడిపెట్టగల మరో విభాజ్యనీయమైన విషయం మతం.

మతం. పరిష్కరించేందుకు ఎంతో కష్టతరమైన అనేక ప్రపంచ వివాదాలకు బలమైన మత మద్దతు ఉంది. ఉత్తర ఐర్లాండ్‌, మధ్యప్రాచ్యము మరియు ఇతర ప్రాంతాల్లో ప్రజలు తాము అనుసరిస్తున్న మతాన్నిబట్టి ద్వేషించబడతారు. రెండు శతాబ్దాలకంటే అధిక కాలానికి పూర్వం, ఆంగ్ల రచయితయైన జోనథాన్‌ స్విఫ్ట్‌ ఇలా చెప్పాడు: “మనం ద్వేషించేలా ప్రభావితం చేసేందుకు సరిపడా మతం మనకుంది కానీ ఒకరినొకరు ప్రేమించుకునేలా చేసేందుకు సరిపడా మాత్రంలేదు.”

ఓస్నాబ్రుక్‌ బిషప్‌కు 1933లో హిట్లర్‌ ఇలా తెలియజేశాడు: ‘యూదుల విషయంలో, 1,500 సంవత్సరాలగా కాథోలిక్‌ చర్చి చేపట్టిన పద్ధతినే నేను అనుసరిస్తున్నాను. అతని ద్వేషపూరితమైన యూదుల సంహారాన్ని అనేకమంది జర్మన్‌ చర్చి నాయకులు ఎన్నడూ ఖండించలేదు. ఎ హిస్టరీ ఆఫ్‌ క్రిస్టియానిటీ అనే తన పుస్తకంలో పాల్‌ జాన్సన్‌ ఇలా పేర్కొన్నాడు: “చర్చి నుండి బహిష్కరించబడిన కాథోలిక్కులు తాము కాల్చబడేందుకు సిద్ధంగా ఉన్నామని తమ వీలునామాలో పేర్కొన్నారు, . . . అయితే వారు నిర్బంధ శిబిరాల్లో లేక మృత్యు శిబిరాలల్లో పని చేయడాన్ని మాత్రం అది నివారించలేదు.”

కొందరు మతనాయకులు ద్వేషానికి మద్దతునివ్వడమే కాకుండా—వారు దాన్ని పవిత్రపర్చారు. స్పెయిన్‌ అంతర్యుద్ధం 1936లో ప్రారంభమైనప్పుడు, కాథోలిక్‌ ప్రీస్టులు రిపబ్లికన్లవైపున్నప్పటికీ పోప్‌ పయస్‌ XI రిపబ్లికన్లలను ‘పచ్చి పైశాచిక దేవ ద్వేషమని’ ఖండించాడు. అదే విధంగా, అంతర్యుద్ధం జరుగుతుండగా స్పెయిన్‌కు చెందిన కార్డినల్‌ గోమా అనే ప్రధానాచార్యుడు, ‘సాయుధ పోరాటం లేకుండ శాంతి ఒప్పందం చేసుకోవడం అసాధ్యమని’ చెప్పాడు.

మతపర ద్వేషం తగ్గుముఖం పడుతున్నదనేందుకు ఏ సూచనా లేదు. హద్దులేని మానవ హక్కు (ఆంగ్లం) అనే 1992 నాటి పత్రిక, గ్రీకు ఆర్థడాక్స్‌ చర్చి అధికారులు యెహోవాసాక్షులకు వ్యతిరేకంగా ద్వేషాన్ని రేపుతున్న విధానాన్ని నిరసించింది. అనేక ఉదాహరణల్లో, 14 సంవత్సరాల ఇద్దరు సాక్షులపై గ్రీక్‌ ఆర్థడాక్స్‌ మతగురువు మోపిన నిందను అది ఎత్తి చూపింది. ఆ నిందేమిటి? వారు ‘అతను తన మతాన్ని మార్చుకునేలా చేసేందుకు ప్రయత్నించారని’ అతడు వారిని నిందించాడు.

ద్వేషం వల్ల వచ్చే పర్యవసానాలు

ప్రపంచవ్యాప్తంగా, అన్యాయం, దురభిమానం, జాతీయవాదం మరియు మతం ద్వారా ద్వేషానికి సంబంధించిన విత్తనాలు విత్తబడి, వృద్ధి చేయబడుతున్నాయి. వాటి అనివార్య ఫలాలేమిటంటే, కోపం, కలహం యుద్ధం మరియు వినాశనం. మొదటి యెహాను 3:15 నందు బైబిలు చెప్పిన విషయం, ఇది ఎంత గంభీరమైనదో గమనించేందుకు సహాయపడుతుంది: “తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు.” ఎక్కడైతే ద్వేషం వర్థిల్లుతుందో అక్కడ శాంతి—అసలు ఉంటే—అస్థిరంగా ఉంటుందన్నది ఖాయం.

నోబుల్‌ బహుమతి గ్రహీత మరియు మారణహోమంనుండి తప్పించుకున్న ఎలీ వెసిల్‌ ఇలా వ్రాశారు: “జరిగిన విషయాన్ని గూర్చి సాక్ష్యం చెప్పడమే బ్రతికి బయటపడ్డవాని కర్తవ్యం. . . . ఈ విషయాలు జరిగే అవకాశముంది అని, దుష్టత్వానికి పట్టపగ్గాలులేకుండా పోగలదని ప్రజలను హెచ్చరించాలి. వర్గాల మధ్య ద్వేషం, దౌర్జన్యం, విగ్రహారాధనలు ఇంకా వర్థిల్లుతూనే ఉన్నాయి.” ద్వేషమన్నది క్రమంగా ఆరిపోయే మంటకాదని 20వ శతాబ్దపు చరిత్ర రుజువునిస్తోంది.

మానవుల హృదయాల్లోనుండి ద్వేషం ఎన్నటికైనా పెరికివేయబడ్తుందా? ద్వేషం ఎల్లప్పుడూ హానికరమైందేనా లేక దాంట్లోనూ మంచి విషయమేమైనా ఉందా? దాన్ని మనం పరిశీలిద్దాము.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి