“ఆనందమయ స్తుతికర్తలు” యెహోవాసాక్షుల జిల్లాసమావేశము
బైబిలు బోధనందించే ప్రతిఫలదాయకమైన మూడు దినాలు మీకొరకు వేచివున్నాయి. కేవలం ఇండియాలోనే 16 సమావేశాలు ఏర్పాటు చేయబడ్డాయి కనుక, మీరు నివసించే ప్రాంతానికి సమీపంలో కూడా ఒక సమావేశం బహుశ జరగవచ్చు. శుక్రవారం ఉ. 9:40కి కార్యక్రమం సంగీతంతో ప్రారంభమయ్యేప్పటికి మీరు హాజరైవుండండి.
శుక్రవారం ఉదయం కార్యక్రమం స్వాగత విషయాలపై కేంద్రీకరిస్తుంది, అలాగే “ప్రపంచవ్యాప్త ఆనందమయ స్తుతికర్తలుగా వేరైవుండడం” అనే ముఖ్యాంశ ప్రసంగం ఉంటుంది. మధ్యాహ్నాం యౌవనులూ, తలిదండ్రులు మరియు విద్య అనే విషయాలపై కార్యక్రమం కేంద్రీకృతమై ఉంటుంది. “నేను వివాహం చేసుకొనేందుకు సిద్ధమైవున్నానా?” అనే ప్రసంగాన్ని యౌవనులు తప్పక వినేందుకు ఇష్టపడతారు. “తమ పిల్లలయందు సంతోషాన్ని పొందే తలిదండ్రులు” అన్న ప్రసంగాన్ని తలిదండ్రులు శ్రద్ధగా వినాలి. మధ్యాహ్న కార్యక్రమం, “విద్య—యెహోవాను స్తుతించేందుకు దానిని వినియోగించండి” అనే ప్రసంగంతో ముగుస్తుంది. అక్కడ చర్చించబడిన విషయాలు, పిల్లలు తమ పాఠశాలల్లో సమర్థవంతంగా కొనసాగేందుకు సహాయపడతాయి.
శనివారం ఉదయం కార్యక్రమం, బాప్తిస్మ విషయంపై ఉంటుంది మరియు బాప్తిస్మం పొందే అర్హతగల వారికి ఆ అవకాశం కల్పించబడుతుంది. ప్రజలను తన ఉరిలో బిగించేందుకు తొలికాలాలనుండీకూడా సాతాను లైంగిక కోరికను ఎలా ఉపయోగించాడన్న విషయంపై స్పష్టమైన చర్చను వినండి. “అపవాది ఉరులను తప్పించుకోండి” అనే ప్రభావవంతమైన ప్రసంగం కూడా ఉంటుంది. “మానవజాతికి దేవుని గూర్చిన జ్ఞానము ఎందుకు అవసరము” అనే ప్రాముఖ్యమైన ప్రసంగంతో ఆ రోజు కార్యక్రమం ముగుస్తుంది.
ఆదివారం ఉదయం, “ఈ విధానంత సమయంలోని ఆనందమయ స్తుతికర్తలు” అనే గోష్ఠి, సమీప భవిష్యత్తులో మనకు ఎదురవ్వబోయే ప్రపంచాన్ని కుదిపే సంఘటనలపై అవధానాన్ని కేంద్రీకరిస్తుంది. మత్తయి 24:21 నందు ఉన్నట్లుగా యేసు మాట్లాడిన “మహాశ్రమల” ప్రారంభానికి ముందు పారిపోవల్సిన అత్యవసరతను అది నొక్కి తెలుపుతుంది.
ఆదివారం ఉదయ కార్యక్రమం, “అర్హులైన వృద్ధులను గౌరవించడం” అనే ప్రాముఖ్యమైన నాటకంతో ముగుస్తుంది. మరి మధ్యాహ్నామందు, “సకల యుగములలో రాజైయున్న వానిని స్తుతించండి!” అనే బహిరంగ ప్రసంగం ఇవ్వబడుతుంది. అది సమావేశమంతటిలోనూ ప్రాముఖ్యమైన విషయంగా ఉంటుంది.
హాజరయ్యేందుకు ఇప్పుడే పథకాలు వేసుకోండి. మీ ఇంటికి సమీపంలో ఉన్న సమావేశాన్ని కనుగొనేందుకు, యెహోవాసాక్షుల రాజ్యమందిరాన్ని సంప్రదించండి లేక ఈ పత్రిక ప్రచారకులను సంప్రదించండి.