కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 3/15 పేజీ 32
  • ఒక బైబిలు విలువెంత

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఒక బైబిలు విలువెంత
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 3/15 పేజీ 32

ఒక బైబిలు విలువెంత

విలియమ్‌ టిండేల్‌ యొక్క క్రైస్తవ గ్రీకు లేఖనాల ఆంగ్ల అనువాదపు ఒక ప్రతి కొరకు సుమారు అయిదు కోట్ల రూపాయలు చెల్లించేందుకు బ్రిటీష్‌ లైబ్రరీ యిటీవల అంగీకరించింది. నాలుగువందల అరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రచురించబడి, దాన్ని నాశనం చేయాలన్న గట్టి ప్రయత్నాలను తప్పించుకున్న టిండేల్‌ మొదటి పూర్తి బైబిలు ఇదే. లండన్‌లో ఈ బైబిలు ప్రజలకు సందర్శనార్థం ఉంచడం జరిగింది.

ఇంగ్లాండ్‌ నందలి బ్రిస్టల్‌ బాప్టిస్ట్‌ కాలేజీ నుండి ఈ టిండేల్‌ బైబిలును కొన్నారు, అక్కడ అది 1784 నుండి ఉంది. కాలేజీ కమిటీ సహాధ్యక్షుడైన డా. రోజర్‌ హేడెన్‌ ఇలా చెప్పారు: “ఇది జాతీయ, సాంస్కృతిక క్రైస్తవత్వపు ఎంతో ప్రాముఖ్యమైన ప్రతి మరియు దాన్ని మేము గ్రంథాలయంలో పెట్టడం ద్వారా, అది ఎందరికో అందుబాటులో ఉండాలన్నది మా కోరిక.”

అనేక సంవత్సరాల వరకూ బైబిలు లాటిన్‌ నందు అందుబాటులో ఉండేది, మరి దాన్ని మతాధికారులూ విద్యావంతులైన ధనికులు మాత్రమే చదివేవారు. ఆయనకు ముందున్న జాన్‌ వైక్లిఫ్‌లా, టిండేల్‌ కూడా అందరూ చదవగల్గి అర్థం చేసుకోగలిగేలా బైబిలును అందుబాటులో ఉండేటట్లు చేయాలనుకున్నాడు. ఆయన్ను వ్యతిరేకించిన ఒక మత గురువుతో ఆయన ఇలా చెప్పాడు: ‘దేవుడు నాకు ఆయుష్షుననుగ్రహిస్తే, నాగలి నడిపే ఒక పిల్లవాడు మీకు తెలిసిన దానికంటె ఎక్కువ లేఖనాలను తెలుసుకునేలా చేస్తాను.’

ఇది చాలా అపాయకరమైన పని, ఎందుకంటే సామాన్య ప్రజలకు లేఖనాలను అందుబాటు చేయడాన్ని మతనాయకులు పూర్తిగా వ్యతిరేకించేవారు. తత్ఫలితంగా, టిండేల్‌ జర్మనీ నుండి ఇంగ్లాండ్‌కు పారిపోయాడు. అక్కడ అసలు గ్రీకు లేఖనాలనుండి ఆయన “క్రొత్త నిబంధనను” అనువదించాడు. సుమారు 3,000 ప్రతులను ముద్రించి, ఇంగ్లాండ్‌కు చాటుగా రవాణా చేయడం జరిగింది. లండన్‌ బిషప్‌ తాను కనుగొనగల ప్రతి ప్రతినీ తీసుకువచ్చి, సెయింట్‌. పౌలు చర్చి ప్రాంగణంలో బహిరంగంగా వాటిని కాల్చాడు. చివరికి, టిండేల్‌ చెరపట్టబడి, విచారింపబడి భిన్నమతావలంభనంపై అబద్ధారోపణ చేయబడ్డాడు. పదిహేనువందల ముప్పై ఆరులో అతని గొంతు పిసికి, కొయ్యపై కాల్చారు. అంతగా అసహ్యించుకోబడిన బైబిలు నేడు ఎంతో విలువైందికావడం ఎంత ఆసక్తికరమో కదా!

యెహోవాసాక్షులు, సరైన బైబిలు జ్ఞానాన్ని వెదకేవారందరికీ దాన్ని అందించేందుకు యథార్థంగా కృషి చేస్తారు. ఇతర అనువాదాలను ముద్రించి, పంచిపెట్టేందుకు తోడుగా, మూల భాషలోనుండి బైబిలునంతటినీ అనువదించారు, అది అటు కచ్చితంగానూ, చదువుకునేందుకు సులభంగానూ ఉంటుంది. ఈ 1995 కల్లా పరిశుద్ధ లేఖనాల నూతనలోక అనువాదం (ఆంగ్లం) 12 భాషల్లో, 7,40,00,000 ప్రతులు ప్రచురించబడ్డాయి. బైబిలుకున్న అసలు విలువ దానిలోని జీవాన్నిచ్చే వర్తమానమే.

[32వ పేజీలోని చిత్రం]

విలియమ్‌ టిండేల్‌

[క్రెడిట్‌ లైను]

From an old engraving in the Bibliothèque Nationale

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి