కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 3/15 పేజీలు 21-24
  • మాకు విరమణ లేదు!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మాకు విరమణ లేదు!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • వారిని ఏది సంతోషపరస్తుంది
  • సర్దుకునే సంసిద్ధత
  • ఆరోగ్య సమస్యలను భరించడం
  • ఇంకా కొనసాగే శ్రద్ధ
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 3/15 పేజీలు 21-24

మాకు విరమణ లేదు!

“మాకు విరమణ లేదు.” జపానునందలి టోక్యోలోని ఒక అసాధారణ గృహాన్ని మీరు దర్శించినప్పుడు మీరు ఆ భావనను పొందుతారు. సుమారు 70 ఏళ్ల ప్రాయమున్న 22 మంది స్త్రీపురుషులుగల కుటుంబం అక్కడ జీవిస్తోంది. వారు రక్తబంధాలతో ఐక్యమైనవారు కారుగాని, ఒకే ఆసక్తియైన—మిషనరీ సేవ వల్ల ఐక్యమయ్యారు. వారు పూర్తికాల సేవలో అందరూ కలిసి 1,026 సంవత్సరాలు పనిచేశారు! వారిలో బహువృద్ధులైన ముగ్గురు 1910లో జన్మించారు. వారిలో ఏడుగురు తాము కౌమార దశలోనే పూర్తికాల సేవను ప్రారంభించారు. జపానులో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రాజ్య ప్రచార పని శైశవ దశలో ఉన్నప్పటి నుండి దాని పురోగతిని వారిలో తొమ్మిది మంది చూశారు.—యెషయా 60:22.

అయితే, ఈ ఆరు అంతస్తుల మునుపటి వాచ్‌టవర్‌ బ్రాంచి కట్టడం, ప్రత్యేకంగా అక్కడున్న మిషనరీల స్ఫూర్తి, వారి ముఖ్య ఉద్దేశం కారణంగా ప్రోత్సాహానికి నిలయంగా ఉంది. వారిలో అనేకులకు తమ వృద్ధాప్యం, అనారోగ్యాల వల్ల శారీరక పరిమితులున్నప్పటికీ, ఈ ఆత్మీయ శూరుల్లో ఒక్కరు కూడా మానుకునేందుకు సిద్ధంగా లేరు. జపానునందలి సాక్షులు, రాజ్యమందిరానికి క్రింద కొంత స్థలాన్ని కేటాయించి మరియు ఒక లిప్ట్‌ను కట్టించి, వారి కొరకు ఆ నిర్మాణాన్ని పూర్తిగా క్రొత్తగా చేయించారు.

వారిని ఏది సంతోషపరస్తుంది

అనేక సంవత్సరాల వరకు తమ పనిలో ఉండడం వల్ల, ఈ మిషనరీలు అదే తమ గృహమని భావిస్తున్నారు. “గత వేసవి కాలంలో జిల్లా సమావేశానికి నేను ఆస్ట్రేలియాకు వెళ్లినప్పుడు, రెండు వారాల తర్వాత ఇంటికి రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను!” అని ఆ కుటుంబంలోని అందరిలోకి పెద్దావిడ చెప్పారు. వారు సేవించే ప్రజలను వారు ప్రేమిస్తున్నారు మరియు వారి యెడల లోతైన అనురాగాన్ని పెంపొందించుకున్నారు. గత కాలపు క్రియలను గుర్తు చేసే ఉత్తరాలనూ ఫోన్‌ కాల్స్‌నూ మిషనరీలందరూ ఎంతో అమూల్యంగా ఎంచుతారు.

శ్రద్ధగా చేసిన పరిచర్య ఫలితం అదే. యెహోవా యెడల ప్రేమతో కదలింపబడి, వివిధ పరిస్థితుల్లో మిషనరీలు దేవుని వాక్యాన్ని అత్యవసర భావంతో ప్రకటించారు. (2 తిమోతి 4:2 పోల్చండి.) “మేము యెహోవాను సేవిస్తున్నందుకు ఆనందంగా ఉండేలా మాకుమేమే శిక్షణనిచ్చుకున్నాము” అని 37 సంవత్సరాలవరకూ జపానునందు సేవచేసిన విరా మాకా చెప్పింది. “ఇంటిబైటకు ఎవరూ రాకపోయినా, యెహోవాను గూర్చి సాక్ష్యమిచ్చేందుకు మేము మాత్రం అక్కడ ఉండేవాళ్లం.”

ఈ మిషనరీల్లో 12 మంది ఎన్నడూ వివాహం చేసుకోలేదు, కానీ వారు ప్రభువును ఏ పరధ్యాస లేకుండా సేవిస్తున్నారు. (1 కొరింథీయులు 7:35) నలభైమూడు సంవత్సరాలుగా మిషనరీగా ఉన్న గ్లాడిస్‌ గ్రెగరీ అందులో ఒకరు. ఆమె ఇలా చెబుతోంది: “యెహోవా సేవలో అధిక స్వేచ్ఛకొరకు నేను పయినీరింగు సేవను చేపట్టాను, తర్వాత గిలియడ్‌కు వెళ్లాను [వాచ్‌టవర్‌ గిలియడ్‌ బైబిలు పాఠశాల] ఆ తర్వాత మిషనరీ పని. అవివాహితగా ఉంటానని నేను ఎన్నడూ తీర్మానించకుండానే, నేను అవివాహితగా ఉన్నాను. మరి నాకున్న అనేకమంది స్నేహితుల్లాగే ఈ విషయంలో నేను ఎన్నడూ బాధపడలేదు.”

సర్దుకునే సంసిద్ధత

వయస్సు మళ్లేకొలది కొందరు మొండివాళ్లు అయినప్పటికీ, ఈ మిషనరీలు సర్దుకుపోయేందుకు ఇష్టపడ్డారు. లూయి డైర్‌, మోలీ హెరోన్‌ మరియు లెనా మార్గెరిట్‌ విన్‌ట్లర్‌, టోక్యో ప్రాంతంలోని నివాస ప్రాంతంలో ఒక చిన్న మిషనరీ గృహమందు ఉండేవారు. వారు అక్కడ 20 సంవత్సరాలకుపైగా జీవించారు మరియు స్థానికంగా ఉన్న ప్రజలకు వారు చాలా చేరువయ్యారు. వారి ప్రాంతాల్లో, విన్‌ట్లర్‌ సహోదరీలకు 40 మంది మ్యాగజీన్‌ రూట్‌ గల ప్రజలుండేవారు, మరి మోలీ, లూయికి 74 మంది ఉండేవారు. తర్వాత, టోక్యో నడిబొడ్డునున్న ఆరంతస్తుల మిషనరీ గృహంలోకి మారమని వారిని సొసైటి కోరడం జరిగింది. “నేను మొదట చాలా నిరాశచెందాను బాధపడ్డాను” అని లెనా ఒప్పుకుంటోంది. అయితే, ఎప్పటిలాగే వారు తమ క్రొత్త పనికి సర్దుకున్నారు. ఇప్పుడు వారు ఎలా భావిస్తున్నారు? “చాలా సంతోషిస్తున్నాము” “ఇప్పుడు మాకొరకు వంట చేసేందుకూ గృహాన్ని శుభ్రపర్చేందుకు ఇద్దరు బేతేలు సహోదరులున్నారు. మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు” అని లెనా జవాబు చెప్పింది. వారందరూ లూయిస్‌తో ఏకీభవిస్తున్నారు ఆమె ఇలా అంటోంది: “యెహోవా సంస్థ మా యెడల చూపించే ప్రేమ శ్రద్ధలు, మేము కొనసాగేందుకు సహాయపడుతున్నాయి.”

నోరిన్‌ థామ్స్‌న్‌ కూడా క్రొత్త పరిస్థితులకు సర్దుకుపోయింది. “పదిహేను సంవత్సరాలవరకూ జపాను అంతా కూడా ఒక్క జిల్లాగా ఉన్నప్పుడు నా భర్తతో [న్యూజీలాండ్‌ వారు] కూడా ప్రాంతీయ సేవలో కలిసి పనిచేసే ఆధిక్యత లభించింది,” అని ఆమె చెప్పింది. అయితే, ఆమె భర్త ఆరోగ్యం కృశించి పోయింది, మరి ఇప్పుడు ఆమె జీవితంలోని అతి గొప్ప శ్రమను ఎదుర్కోవల్సివచ్చింది—అది 18 సంవత్సరాల క్రితం ఆయన మరణం. “ఆ సమయంలో, మిషనరీ సేవలో నేను కొనసాగేందుకు నాకు సహాయపడింది, జపానునందలి సహోదరులు కనపర్చిన ప్రేమతో సహా ప్రార్థన మరియు తీరికలేకుండా సేవచేయడం.”

ఆరోగ్య సమస్యలను భరించడం

“అనేకులకు ఏదొక రకమైన అనారోగ్య సమస్య ఉంది, కానీ వారు ఆనందంగా ఉన్నారు, మరియు సేవించాలనే వారి కోరిక ఎంతో విశేషమైన లక్షణం” అని ఆల్బర్ట్‌ పాస్టర్‌, మిషనరీ గృహ పర్యవేక్షకుడు చెప్పారు. మిషనరీలను చూసుకునేందుకు, ఓ డాక్టర్‌ మరియు నర్స్‌ అయిన ఆయన భార్య ఈ గృహంలో పనిచేసేందుకు నియమించబడ్డారు.

ఒక రోజు సుమారు మూడు సంవత్సరాల క్రితం, ఎల్సీ టానిగ్వా 11వ గిలియడ్‌ పాఠశాల పట్టభద్రురాలు అకస్మాత్తుగా తన ఎడమ కంటిచూపును పోగొట్టుకుంది. నాలుగు నెలల తర్వాత, ఆమె కుడికన్ను కూడా పాడైంది. “మునుపు నేను చేసినట్లుగా ఇప్పుడు చేయలేకపోతున్నానే అని నేను కొన్నిసార్లు నిరాశచెందేదాన్ని. అయితే సంస్థ చేసే అన్ని దయాపూర్వక ఏర్పాట్లు, నా సహచరి మరియు ఇతరుల ప్రేమపూర్వక సహాయం ద్వారా నేను యెహోవా సేవలో ఆనందాన్ని కనుగొన్నాను,” అని ఎల్సీ చెబుతోంది.

గిలియడ్‌లో ఎల్సీ తోటి విద్యార్థులైన షినిచీ తొహరా మరియు తన భార్యయైన మసాకో, తమ ఆరోగ్యం విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నారు. ప్రసంగించడంలో మంచి సామర్థ్యం గల షినిచీకి పాడైన తన కనుదృష్టివల్ల తన నోట్సును చూడలేకపోవడం ఒక పెద్ద సవాలు. ఇటీవలి సంవత్సరాల్లో ఆయనకు పెద్ద మరియు చిన్న శస్త్ర చికిత్సలను జరిగినప్పటికీ, ఆయన ఇప్పుడు సహాయపడుతున్న 90 సంవత్సరాల తన బైబిలు విద్యార్థిని గూర్చి మాట్లాడుతున్నప్పుడు ఆయన కన్నులు మెరుస్తాయి.

తమ “శరీరములో ఒక ముల్లు” ఉన్నప్పటికీ, ఈ మిషనరీలు తమ బలహీనతలను అపొస్తలుడైన పౌలు దృష్టించినట్లు దృష్టిస్తారు ఆయన ఇలా చెప్పాడు: “నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను.” (2 కొరింథీయులు 12:7-10) మరి వారు నిజంగానే బలవంతులు! వారు ప్రతి రోజు ఉదయం ఏడుగంటలకు ఉదయకాల ఆరాధనకు హాజరౌతారు. టిఫిన్‌ చేసిన తర్వాత, ఆరోగ్యంగా ఉన్నవాళ్లు ప్రొద్దున్నే ప్రాంతీయ సేవకు వెళతారు.

క్రమంగా సేవకు వెళ్లేవారిలో రిచర్డ్‌ మరియు మార్టెల్‌ షిరోమా ఉన్నారు. మెదడులోని నరాల్లో కంపనం వల్ల కలిగే అకస్మాత్‌ మూర్ఛను మైర్టిల్‌ 1978 నందు అనుభవించింది, అయితే 1987 వరకూ ప్రాంతీయపనిలో ఆమె తన భర్తతో వెళ్లింది. ఇప్పుడు, తానే 70 ఏళ్లవాడైన రిచర్డ్‌ మైర్టిల్‌కు అన్ని పనుల్లోనూ సహాయం చేస్తాడు. ఆయన ఉదయమే. 5:00కు లేచి, ఆమెకు స్నానం చేయించి, డ్రస్‌ వేసి, ఆమెకు మేకప్‌ వేసి, తినిపిస్తారు. తర్వాత ఆమెను వీల్‌ చేర్‌లో ప్రతి రోజు ఉదయం ప్రాంతీయ సేవకు తీసుకువెళతారు, ఒక గంట పాటు ఇంటింటికి వెళ్లి, తర్వాత బస్‌స్టాపులవద్దనున్న ప్రజలకు సాక్ష్యమిస్తారు. మైర్టిల్‌ ఇక మాట్లాడలేదు, కానీ ఆమె చివరిసారి పలికిన మాటలు, డెన్‌గో, డెన్‌గో జపనీస్‌ భాషలో దాని అర్థం “ప్రకటించడం, ప్రకటించడం.”

వారి కుమార్తె సాండ్రా సుమిడ వారికి సహాయపడేందుకు మిషనరీ గృహానికి మారింది. గుండె పోటు కారణంగా సాండ్రా తన భర్తను కోల్పోయింది. తాను మునుపు తన భర్తతో మిషనరీగా పనిచేసిన గామ్‌ నుండి జపానుకే మరలా నియమించిన వాచ్‌టవర్‌ సొసైటి వారి దయాపూర్వక ఏర్పాటును ఆమె ఎంతగానో మెచ్చుకుంటోంది. “నేను గామ్‌లో ఉన్నాను గనుక మా తలిదండ్రులకు సహాయపడడంలో నేను ఎక్కువగా చేయలేకపోతున్నాని నేను ఎప్పుడూ భావించేదాన్ని. మా చెల్లెలు జోన్‌ ఈ ఇంట్లో వారిని చూసుకుంది. కనుక అవకాశం వచ్చినప్పుడు, అది నాకు చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ నా అవసరముంది అనే భావన, నా భర్త అకస్మాత్‌ మరణం నాటినుండి నాకు మందుగా పనిచేసింది” అని ఆమె చెబుతోంది.

ఇంకా కొనసాగే శ్రద్ధ

తమ వృద్ధాప్యపు ప్రభావాన్ని మిషనరీలు భావించినప్పటికీ, తమ మిషనరీ ఆత్మను విడనాడేందుకు వారు తిరస్కరిస్తారు. (కీర్తన 90:10; రోమీయులు 5:12) మొదటి గిలియడ్‌ పట్టభద్రులుగా జపానుకు వచ్చిన ప్రథములలో ఉన్న జెర్రి మరియు యోషీ, టోమా, ఇప్పటికీ వ్యాపార ప్రాంతమైన షిబూయాకు వెళతారు. “గత 1949 నందు రెండు అంతస్తుల ఈ నిర్మాణం వద్దకు మేము వచ్చినప్పుడు, ఒక కందకం నుండి మరో కందకానికి మేము వెళ్లేవాళ్లము. ఇప్పుడు టోక్యో మహానగరంగా మారింది. మేము ఇప్పుడు ముసలి వాళ్లం మరి ముందు చేసినంతగా ఇప్పుడు చేయలేకపోతున్నాము. అయితే మేము పరిచర్యనుండి తిరిగి వచ్చినప్పుడు, మేము ఎంతో ఉపశమనాన్ని పొందుతాము” అని యోషీ చెబుతోంది.

లిల్లియన్‌ సామ్స్‌న్‌ జపానునందు 40 సంవత్సరాల పాటు మిషనరీగా పనిచేసింది మరి తన పరిచర్యలో ఎంతగానో ఆనందిస్తోంది. “నేనిప్పుడు, హవాయ్‌లో అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసుకుంటున్న నా పాత సహచరియైన ఆడిలిన్‌ నాకొ మునుపు పఠించిన ఒక ఎనభై సంవత్సరాల స్త్రీకి సహాయపడుతున్నాను. ఆ స్త్రీ, పితరుల ఆరాధనా సమస్యను అధిగమించిన తర్వాత ఇటీవల రాజ్య ప్రచారకురాలు అయ్యింది. ఆమె ఆలయానికి వెళ్లి పూజారి భార్యతో, ‘నేను క్రైస్తవురాలిని అయ్యాను!’ అని చెప్పింది.” ఆమె జీవితంలో అలాంటి ఆనందాల వల్ల, లిల్లియన్‌ తన 19వ ఏట తన లౌకిక ఉద్యోగాన్ని మానేసి పయినీరింగు సేవను ప్రారంభించినందుకు ఎన్నడూ బాధపడలేదు.

నలభై అయిదు సంవత్సరాలపాటు మిషనరీ సహభాగస్వాములైన మార్తా హెస్‌ మరియు రూత్‌ అల్రిక్‌, ఈ మిషనరీ గృహంనుండి 35 సంవత్సరాలకు పైగా పనిచేశారు. వారు ఆ ప్రాంతంలో చక్కగా స్థిరపడ్డారు. ఒకసారి ఓ ప్రాంతీయకాపరి మార్తాను ఇలా అడిగారు: “ఇంటింటికి వెళ్లేందుకు మీ ముఖాన్ని నాకు అరువుగా ఇస్తారా?” మార్తా ప్రజలకు బాగా పరిచయం, ప్రాంతీయకాపరి సంభాషణలను ప్రారంభించేందుకు కష్టపడుతున్నప్పుడు ఆమె దగ్గిర మాత్రం పత్రికలను బాగా తీసుకున్నారు.

రూత్‌ ఒక స్త్రీతో మ్యాగజీన్‌ రూట్‌ కల్గివుంది, ఆమె అనారోగ్య సమస్య వల్ల వాటిని చదవలేకపోయింది. అయినప్పటికీ, ఆ స్త్రీ పత్రికలను అంగీకరిస్తూనే ఉంది మరియు దైవము కొరకైన మానవజాతి అన్వేషణ అనే గట్టి అట్ట పుస్తకాన్ని కూడా అంగీకరించింది. ఆ ప్రచురణలను ఎవరూ చదువుతున్నట్లు అన్పించలేదు కనుక వాటిని ఇంకా అందించాలా వద్దా అని రూత్‌ ఆలోచించింది. అప్పుడు ఒకరోజు ఆ స్త్రీ భర్త అన్వేషణ పుస్తకంతో రూత్‌ను సమీపించి, ఇలా అన్నాడు: “ఇది ఎంతో చక్కని పుస్తకం! దాన్ని నేను రెండు సార్లు చదివాను.” రూత్‌ ఆయనకూ ఆయన భార్యకూ బైబిలు పఠనాన్ని ప్రారంభించింది.

ఈ మిషనరీ గృహమే ఆసక్తిగల ప్రజలను ఆకర్షిస్తోంది. ఒక సాయంత్రం, ఒక యౌవనుడు ఈ గృహానికి వచ్చి ఇలా అన్నాడు: “నేను ఇక్కడికి వస్తే, బైబిలును పఠించేందుకు నేను సహాయాన్ని పొందగలనని అనుకుంటున్నాను.” అతనితో బైబిలు పఠనం ప్రారంభించడం జరిగింది. చైనీస్‌ రెస్టారెంట్‌లో ఒక వంటవానిగా, అనేక సంవత్సరాల క్రితం బహిష్కరించబడిన ఒక స్త్రీతో పనిచేసేవాడు. ఆ రెస్టారెంట్‌ వద్ద ఒక ప్రచారకుడు అందించిన పత్రికలు వంటగది చేరుకున్నాయి. ఆ యౌవన వంటవాడు వాటిని ఇష్టపడి, మునుపటి సాక్షిని ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు. వాటికి జవాబు చెప్పలేక, మిషనరీ గృహాన్ని దర్శించమని ఆమె అతనితో చెప్పింది. ఇప్పుడు అతను ఒక పరిచారకునిగానూ పయినీరుగానూ సేవచేస్తున్నాడు. ఈ మధ్యలో, బహిష్కరించబడిన స్త్రీని తిరిగి చేర్చుకోవడం జరిగింది మరి చివరికి ఆమెకూడా క్రమ పయినీర్‌ అయ్యింది.

ఇంట్లోని మిషనరీలందరూ యెహోవా తమకు చేసిన వాటికి ఎంతో మెప్పుదలను కల్గివున్నారు. వారు ఆస్ట్రేలియా, కెనడా, హవాయి, స్విట్జర్లాండ్‌, అమెరికాల నుండి వచ్చారు, మరి వారిలో 11 మంది 11వ తరగతినుండి లేక తొలి గిలియడ్‌ మిషనరీ తరగతులనుండి వచ్చారు. వారు జపాన్‌నందలి రాజ్య పని పురోభివృద్ధిని చూశారు మరి రాజైన దావీదు భావాలను వారు పంచుకుంటున్నారు. ఆయన ఇలా చెప్పాడు: “నేను చిన్నవాడనైయుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి యుండలేదు.” (కీర్తన 37:25) దేవుని ప్రేమపూర్వకమైన శ్రద్ధ యెడల మెప్పుదలతో ఈ మిషనరీలు విరమించుకోకుండా, యెహోవాను సేవిస్తూనే ఉండాలనే దృఢ సంకల్పాల్ని కల్గివున్నారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి