కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 2/15 పేజీలు 3-4
  • దేవుడు మన విధిని ముందే నిర్ణయించాడా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుడు మన విధిని ముందే నిర్ణయించాడా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • విధినిర్ణయం—ఆ పదం భావం
  • అగస్టీన్‌, విధినిర్ణయ పితామహుడు
  • అగస్టీన్‌ వారసులు
  • విధినిర్ణయమా లేక స్వేచ్ఛాచిత్తమా?
  • దేవుని ప్రేమతో విధినిర్ణయం సమన్వయపర్చబడగలదా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • మీ భవిష్యత్తు ముందుగా లిఖించబడిందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • మీ భవితవ్యాన్ని మీరు నియంత్రించుకోగలరా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • మీకు జ్ఞాపకమున్నాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 2/15 పేజీలు 3-4

దేవుడు మన విధిని ముందే నిర్ణయించాడా?

“తరచూ అపార్థం చేసుకోబడే, విధినిర్ణయం అనే పదాన్ని అసలు ఉపయోగించకుండా ఉంటే ఎన్నో ఊహాత్మక సమస్యలు నివారించబడగలవు.” మీరు “విధినిర్ణయం” అనే పదాన్ని ఉపయోగించినా లేక ఉపయోగించడాన్ని వినివున్నా, అలా ఎందుకన్నారని మీరు ఆలోచిస్తారు.

థియో అనే ఇటీవలి ఫ్రెంచ్‌ కాథోలిక్‌ సర్వసంగ్రహ నిఘంటువు ప్రకారంగా, “విధినిర్ణయం” అనే పదాన్ని ఉపయోగించకపోవడమే శ్రేష్ఠం. మరో పుస్తకం ఇలా పేర్కొంటోంది: “నేడు, విధినిర్ణయం వేదాంత వాదాలకు ముఖ్య విషయంగా ఇక లేనేలేదు, అనేకమంది ప్రొటస్టెంట్లకు కూడా అలాగే ఉన్నట్లు ఉంది.”

అయినప్పటికీ, విధినిర్ణయాన్ని గూర్చిన సందేహం చరిత్రంతటిలోనూ అనేకమంది ప్రజల మనస్సులను కలతపర్చింది. సంస్కరణను తెచ్చిన వివాదాంశానికి అది కేంద్రం, అంతేకాకుండ కాథోలిక్‌ చర్చిలో సహితం అనేక శతాబ్దాల వరకూ తీవ్రమైన చర్చనీయాంశమైంది. నేడు అది అంత వివాదాంశం కాకపోయినప్పటికీ, అది ఇప్పటికీ ఒక సమస్యగానే ఉంది. తన విధి ముందుగానే నిర్ణయించబడి ఉందా లేదా అని తెలుసుకోవడం ఎవరికి ఆసక్తిగా ఉండదు?

విధినిర్ణయం—ఆ పదం భావం

చర్చీల్లో “విధినిర్ణయం” అనే పదభావం ఏమిటి? “వ్యక్తిగతంగా పేర్ల ద్వారా సూచించబడినవారిని, నిర్దిష్టమైన వ్యక్తులను నిత్యజీవానికి నడిపించాలనే దైవచిత్తం” అని డిక్షనరే దె థియోలజీ కాథోలిక్‌ పరిగణిస్తుంది. ఈ క్రింది మాటలలో అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన తన పత్రికనందు “పేర్లతో” సూచించబడిన వారే ఏర్పర్చబడినవారని సామాన్యంగా అనుకోవడం జరిగేది: “తన సంకల్పం చొప్పున పిలువబడినవారైన, తన్ను ప్రేమించిన వారికి మేలు కల్గడానికై దేవుడు పనిచేస్తాడు. ఆయనకు ముందుగా తెలిసినవారు తన కుమారునితో సారూప్యం గలవారగునట్లు ఖాయపర్చడానికై, వారికి విధినిర్ణయాన్ని చేశాడు. . . . మరి విధినిర్ణయం చేయబడిన వారిని ఆయన పిలిచాడు; పిలిచినవారిని ఆయన సమర్థించుకున్నాడు; మరి ఆయన సమర్థించినవారిని మహిమపర్చాడు.”—రోమీయులు 8:28-30, రివైజ్డ్‌ స్టాండార్డ్‌ వర్ష్‌న్‌.

తాము జన్మించకముందే, పరలోకమందు క్రీస్తు మహిమలో పాలుపంచుకునేందుకుగాను కొంతమంది ప్రజలను దేవుడు ఏర్పర్చుకున్నాడని భావించేవారు. ఇది దీర్ఘకాలిక చర్చనీయాంశమైన ప్రశ్నకు నడిపిస్తుంది: తాను రక్షించాలని అనుకునే వారిని దేవుడు యథేచ్ఛగా ఏర్పర్చుకుంటాడా, లేక మానవులు స్వేచ్ఛా చిత్తం కల్గివుండి మరియు దేవుని అనుగ్రహాన్ని పొందేందుకు, దాన్ని నిలుపుకొనేందుకు కొంత భాగాన్ని వహించగలరా?

అగస్టీన్‌, విధినిర్ణయ పితామహుడు

ఇతర చర్చి ఫాదర్లు ఇంతకు ముందు విధినిర్ణయాన్ని గూర్చి రాసినప్పటికీ, కాథోలిక్‌ మరియు ప్రొటస్టెంట్‌ చర్చీల సిద్ధాంత పునాదులను వేసినవానిగా అగస్టీన్‌ (సా.శ. 354-430) సామాన్యంగా పరిగణించబడుతున్నాడు. అగస్టీన్‌ ప్రకారం, అనంత కాలం నుండి నిత్యాశీర్వాదాలను పొందే విధినిర్ణయం నీతిమంతులకుంది. మరోవైపు, అనీతిమంతులు, కచ్చితమైన భావంలో దేవుడు వారి విధినిర్ణయాన్ని చేయనప్పటికీ, తమ పాపములకు తగిన శిక్షయైన తిరస్కారాన్ని పొందుతారు. అగస్టీన్‌ వివరణ స్వేచ్ఛా చిత్తానికి కొంత స్థానాన్ని కూడా విడవలేదు, ఆ విధంగా ఎంతో వివాదానికి తావునిచ్చింది.

అగస్టీన్‌ వారసులు

విధినిర్ణయం మరియు స్వేచ్ఛా చిత్తాన్ని గూర్చిన వివాదం, మధ్య యుగాల్లో తరచూ కనిపించించేది, మరి సంస్కరణోద్యమ సమయంలో అది తీవ్రస్థాయికి చేరుకుంది. వ్యక్తిపర విధినిర్ణయం అన్నది, ఏర్పర్చబడినవారి భవిష్యత్‌ యోగ్యతలను లేక మంచి పనులను దేవుడు ముందుగా చూడకుండానే స్వేచ్ఛా ఎంపికను చేయడం అని లూథర్‌ విశ్వసించాడు. కాల్విన్‌ తన ద్వందాన్వయ విధినిర్ణయ సిద్ధాంతాన్ని గూర్చి మరింత తీవ్రమైన నిర్థారణకొచ్చాడు: కొందరు నిత్య రక్షణకు నిర్ణయించబడ్డారు, మరితరులు నిత్య దండనకు నిర్ణయించబడ్డారు. అయినప్పటికీ, కాల్విన్‌ కూడా దేవుని ఎంపిక యథేచ్ఛేనని, గూఢమైనదని కూడా పరిగణించాడు.

విధినిర్ణయ వివాదాంశం మరియు దానికి సన్నిహిత సంబంధంగల “కరుణను”—మనుష్యులను రక్షించి, నీతిమంతులనుగా తీర్చే దేవుని కార్యాలను పేర్కొనేందుకు చర్చీలు ఉపయోగించే పదం—గూర్చిన వివాదం ఎంత పెద్దదైయ్యిందంటే, కాథోలిక్‌ పోప్‌ పర్యవేక్షక అనుమతి లేకుండ ఆ అంశంపై ప్రచురించడాన్ని 1611 నందు నిషేధించింది. కాథోలిక్‌ చర్చిలోనే, అగస్టీన్‌ బోధలు 17 మరియు 18 శతాబ్దాల్లోని ఫ్రాన్స్‌కు చెందిన జాన్‌సెనీవాదుల నుండి ఎంతో మద్దతును పొందాయి. వారు ఎంతో నిష్టూరమైన, శిష్టమైన క్రైస్తవత్వాన్ని ప్రబోధించారు అంతేకాకుండ కులీన పాలనలో కూడా దాన్ని అనుసరించేవారు ఉండేవారు. అయినా, ఈ విషయంలో వివాదం చల్లారలేదు. రాజైన లూయిస్‌ XIV, జాన్‌సెనీవాద ఆలోచనకు పుట్టినిల్లయిన పోర్ట్‌రాయల్‌కు చెందిన క్రైస్తవ మఠాన్ని నాశనం చేయమని ఆదేశించాడు.

సంస్కరింపబడిన ప్రొటస్టెంట్‌ చర్చీల్లో ఈ చర్చ ఎంతకీ అంతమవ్వలేదు. ఇతర గుంపులతో సహా, యాకోబస్‌ అర్మినియస్‌ను అనుసరించిన నిరసనవాదులు, తన స్వంత రక్షణ విషయంలో మానవునికి కొంత భాగం ఉంటుందని నమ్మారు. డార్‌డ్రెట్చ్‌ యొక్క ప్రొటస్టెంట్‌ అధికారసభ (1618-19) కచ్చితమైన కాల్వినీయ మత ఛాందస్సతను అంగీకరించినప్పుడు ఆ వివాదాన్ని తాత్కాలికంగా పరిష్కరించింది. లెవెంచూన్‌ ద ల రాఫోర్మ్‌—ల మంన్‌ ద యాన్‌ కాల్విన్‌ అనే పుస్తకం ప్రకారం, విధినిర్ణయం మరియు స్వేచ్ఛా చిత్తం విషయం మీద జర్మనీనందు రేగిన దెబ్బలాట, “రాజీపడడానికి, అలాగే వేదాంతులతో చెడుగా ప్రవర్తించడానికి, వారిని చెరలో పెట్టించడానికి, బహిష్కరణ వంటివాటిని చేసేందుకు చేసిన” దీర్ఘకాలీన “విఫల ప్రయత్నాలకు” జన్మనిచ్చింది.

విధినిర్ణయమా లేక స్వేచ్ఛాచిత్తమా?

మొదటి నుండీ, విధినిర్ణయమూ స్వేచ్ఛా చిత్తమనే పూర్తిగా విరుద్ధమైన ఈ ఆలోచనలు ఎన్నో తీవ్రమైన వివాదాలకు దారితీశాయి. అగస్టీన్‌ మాత్రం ఈ అసంగతతను వివరించలేకపోయాడు. కాల్విన్‌ కూడా ఇది దేవుని సర్వాధిపత్య చిత్తానికి సంబంధించిన మాట అనీ, కనుక వివరించలేనిదని గ్రహించాడు.

అయితే ఈ ప్రశ్నలను మరి స్పష్టంగా అర్థం చేసుకునేందుకు గాను దేవుని లక్షణాలూ మరియు వ్యక్తిత్వాన్ని గూర్చిన బైబిలు ప్రకటన మనకు సహాయం చేస్తుందా? తదుపరి శీర్షిక ఈ విషయాలను వివరంగా పరిశీలిస్తుంది.

[4వ పేజీలోని చిత్రాలు]

కాల్విన్‌

లూథర్‌

జాన్‌సెన్‌

[క్రెడిట్‌ లైను]

Pictures: Bibliothèque Nationale, Paris

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి