కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 2/1 పేజీ 31
  • పాఠకులనుండి ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకులనుండి ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 2/1 పేజీ 31

పాఠకులనుండి ప్రశ్నలు

బైబిలు నందు చెప్పబడిన ఫిలిష్తీయులు ఎవరు?

బైబిలు తరచూ ఫిలిష్తీయులని పిలువబడిన ప్రజల గురించి మాట్లాడుతుంది, వారు దేవుని ప్రాచీన కాలంనాటి ప్రజలు వాగ్దాన దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు కనానులో నివసించేవారు. గొల్యాతు అనే పేరుగల దీర్ఘకాయుడైన ఫిలిష్తీయ శూరుని దావీదు ఎదుర్కొన్న వృత్తాంతంలో ఉన్నతపర్చబడినట్లుగా, చాలాకాలం వరకు, ఈ ప్రాచీన ఫిలిష్తీయులు దేవుని ప్రజలను వ్యతిరేకించారు.—1 సమూయేలు 17:1-3, 23-53.

ప్రాచీన ఫిలిష్తీయులు కఫ్తోరు నుండి కనాను యొక్క నైరుతి తీరానికి వలస వెళ్లారని బైబిలు సూచిస్తుంది. (యిర్మీయా 47:4) కఫ్తోరు ఎక్కడ ఉంది? ది ఇంటర్‌నేషనల్‌ స్టాండర్డ్‌ బైబిల్‌ ఎన్‌సైక్లోపీడియా (1979) యిలా తెలియజేస్తుంది: “సాక్ష్యాధారం కచ్చితమైన జవాబు ఇవ్వకపోయినప్పటికీ, ప్రస్తుతమున్న వ్రాతలు తెలియజేసే దాని ప్రకారం ఆ ప్రాంతం బహుశా క్రేతు ద్వీపం (లేక బహుశా నాగరీకంగా కలిసివున్న క్రేతు మరియు అయుగెన్‌ ద్వీపాలు) అయివుండవచ్చునని సూచిస్తున్నది.”—సంపుటి 1, 610వ పేజీ.

దీనికనుగుణ్యంగా, పరిశుద్ధ లేఖనముల నూతన లోక అనువాదం [ఆంగ్లం] ఆమోసు 9:7 నందు యిలా తెలియజేస్తుంది: “‘ఇశ్రాయేలీయులారా, మీరును కూషీయులును నా దృష్టికి సమానులు కారా?’ యిదే యెహోవా వాక్కు. ‘నేను ఐగుప్తు దేశములోనుండి ఇశ్రాయేలీయులను, క్రేతు (కఫ్తోరు) దేశములో నుండి ఫిలిష్తీయులను, కీరుదేశములోనుండి సిరియనులను రప్పించ లేదా?’”

క్రేతు నుండి జొప్పా మరియు గాజాలకు మధ్యనున్న నైరుతి తీరమైన ఫిలిష్తియా అని పిలువబడిన కనాను ప్రాంతానికి ఎప్పుడు ఈ ప్రాచీన సముద్రప్రాంత ప్రజలు వలస వెళ్లారో తెలియదు. వారు ఈ లోతైన తీర ప్రాంతంలో అబ్రాహాము, ఇస్సాకుల కాలంలోనే ఉన్నట్లున్నది.—ఆదికాండము 20:1, 2; 21:32-34; 26:1-18.

దేవుడు వారికి వాగ్దానం చేసిన దేశంలోకి ఇశ్రాయేలీయులు ప్రవేశించిన తర్వాత చాలాకాలం వరకు ఫిలిష్తీయులు శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతూనే ఉన్నారు. (నిర్గమకాండము 13:17; యెహోషువ 13:2; న్యాయాధిపతులు 1:18, 19; 3:2-4; 15:9, 10; 1 సమూయేలు 4:1-11; 7:7-14; 13:19-23; 1 రాజులు 16:15) యూదా రాజైన ఉజ్జియా పరిపాలన వరకు ఫిలిష్తీయులు గాతు, యబ్నె, అష్డోదు అనే వారి పట్టణాల్లో ఉండిపోయారు. (2 దినవృత్తాంతములు 26:6) బైబిలు వృత్తాంతాల్లో వారి యితర ప్రముఖ పట్టణాలు ఎక్రోను, అష్కెలోను, గాజా.

ఫిలిష్తీయుల నగరమైన గాజాను అలెగ్జాండర్‌ ది గ్రేట్‌ గెలుచుకున్నాడు, కాని కొంతకాలానికి, ఫిలిష్తీయులు స్పష్టంగా ప్రత్యేక ప్రజగా ఉండడం మానేశారు. ప్రొఫెసరైన లారెన్స్‌ ఇ. స్టాజర్‌ బిబ్లికల్‌ ఆర్‌క్యాలజీ రివ్యూ (మే/జూన్‌ 1991) నందు యిలా వ్రాశాడు: “ఫిలిష్తీయులు కూడా బబులోనుకు బంధీలుగా కొనిపోబడ్డారు. . . . అయితే, బంధీలుగా కొనిపోబడిన ఫిలిష్తీయులకు ఏం జరిగిందో చెప్పే నివేదికలు లేవు. బహుశా నెబుకద్నెజరు విజయం తర్వాత అష్కెలోనులో ఉండిపోయిన వారు తమ జాతి గుర్తింపును కోల్పోయివుండవచ్చు. వారు చరిత్ర నుండి కేవలం అదృశ్యమైపోయారు.”

పాలస్తీనా అనే ఆధునిక పేరు లాటిన్‌ మరియు గ్రీకు పదాల నుండి తీసుకొనబడింది, అవి వెనుకకు “ఫిలిష్తియా” అనే హెబ్రీ పదానికి, నడిపిస్తాయి. అరబిక్‌ భాషలోని కొన్ని బైబిలు తర్జుమాలు “ఫిలిష్తీయులు” అనే పదానికి, ఆధునిక పాలస్తీనీయులకు ఉపయోగించే పదంతో సుళువుగా గందరగోళమైపోయే పదాన్ని ఉపయోగిస్తాయి. అయితే, టుడేస్‌ అరబిక్‌ వర్షన్‌ ప్రాచీన ఫిలిష్తీయుల నుండి ఆధునిక పాలస్తీనీయులను వేరుచేస్తూ, మరో అరబిక్‌ పదాన్ని ఉపయోగిస్తుంది.

[31వ పేజీలోని చిత్రం]

అష్కెలోను నందలి కొన్ని శిథిలాలు

[క్రెడిట్‌ లైను]

Pictorial Archive (Near Eastern History) Est.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి