“ఇటువంటిదేది నేను ఎన్నడూ చూడలేదు!”
సాన్టైగో, చిల్ నందు జరిగే నాలుగు రోజుల యెహోవాసాక్షుల “దైవిక బోధ” జిల్లా సమావేశానికి వెయ్యిమంది ప్రతినిధులను పంపేందుకు అర్జెంటీనా నందలి వాచ్‌టవర్ సొసైటీ కార్యాలయం 1993లో ఆహ్వానింపబడింది. అర్జెంటీనా సాక్షులు విదేశీ సమావేశానికి ఒక పెద్ద గుంపుగా ప్రయాణించడానికి ఆహ్వానింపబడడం ఇదే మొదటిసారి.a ప్రతిస్పందన ఎలా ఉంది? దాదాపు 8,500 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి, వారిలోనుండి 1,039 ప్రతినిధులు ఎంపిక చేయబడ్డారు.
బ్యానస్ అరీజ్ నుండి సాన్టైగోకు చేసే ఈ 1,400 కిలోమీటర్ల ప్రయాణం కొరకు మొత్తం 14 బస్సులు ఏర్పాటు చేయబడ్డాయి. ఇరవై ఆరు గంటల ప్రయాణం అందమైన దృశ్యాలతో కొనసాగింది. ప్రతినిధులు అన్డెస్ పర్వతాలను దాటి, పశ్చిమార్థగోళం వద్ద అత్యంత ఎత్తున అంటే 6,960 మీటర్ల వద్ద అకాన్కువా సమీపానికి చేరారు. ఏటవాలుగా ఉన్న చిలీకి వంకులు వంకులుగానున్న దిగుడు దారిలో ప్రయాణించడం ప్రత్యేకంగా మరుపురానిదిగా ఉండింది. సవాలుతో కూడిన ఆ మార్గాలగుండా చాకచక్యంగా నడిపించినందుకు డ్రైవర్లు అభినందించబడ్డారు!
అయితే, అత్యంత అందమైన దృశ్యాన్ని సమావేశం వద్దనే కనుగొనవచ్చు. జాతి విభేదాలతో జాతి ఉద్రిక్తతలతో నిండివున్న లోకంలో, 24 దేశాల నుండి వచ్చిన 80,000 మంది కలిసి ఉండడాన్ని చూడడం ఎంత ఉత్సాహకరంగా ఉందో—అది నిజంగా ఒక అంతర్జాతీయ సహోదరత్వం! సమావేశానికి వచ్చినవారి మధ్యనున్న ఐక్యతను మొదటిసారి చూసి, కొంతమంది బస్సు డ్రైవర్లు యెహోవాసాక్షుల గురించి మరింత ఎక్కువ తెలుసుకోవడానికి ఆసక్తి వ్యక్తపర్చారు. “ఇటువంటిదేది నేను ఎన్నడూ చూడలేదు!” అని వారిలో ఒకరు ఆశ్చర్యపోయారు.
[అధస్సూచీలు]
a అర్జెంటీనాలో 1949 నుండి 1982 వరకున్న ప్రభుత్వ నిషేధాలు అలాంటి పనిని అసాధ్యం చేశాయి.