కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 2/1 పేజీలు 14-19
  • పరిశుద్ధ సేవను అందిస్తున్న గొప్ప సమూహము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పరిశుద్ధ సేవను అందిస్తున్న గొప్ప సమూహము
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘సింహాసనము ఎదుట నిలువబడుట’
  • “తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై”
  • “ఖర్జూరపుమట్టలు చేతపట్టుకుని”
  • ‘రాత్రింబగళ్లూ పరిశుద్ధ సేవ చేయుట’
  • ‘ప్రతి జనములో, వంశములో, ప్రజలలో, ఆయా భాషలు మాట్లాడువారిలో నుండి’
  • “మహాశ్రమలనుండి వచ్చినవారు”
  • ఒక మహాగొప్ప సమూహము
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
  • ‘ఇదిగో! ఒక గొప్పసమూహం’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • యెహోవా సింహాసనము ఎదుట ఒక గొప్పసమూహం
    అద్వితీయ సత్యదేవుని ఆరాధనలో ఐక్యమగుట
  • యెహోవా సింహాసనము ఎదుట ఒక గొప్ప సమూహం
    అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధించండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 2/1 పేజీలు 14-19

పరిశుద్ధ సేవను అందిస్తున్న గొప్ప సమూహము

“రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు.”—ప్రకటన 7:15.

1. పందొమ్మిదివందల ముప్పై అయిదులో ఆత్మీయ అవగాహనయందు ఏ మైలురాయిని చేరుకున్నారు?

మే 31 1935 నాడు, వాషింగ్టన్‌ డి.సి. నందు యెహోవాసాక్షుల సమావేశంలోని ప్రతినిధులు ఎంతో ఆనందించారు. అక్కడ, మొట్టమొదటి సారిగా ప్రకటన 7:9 నందున్న గొప్ప సమూహము మిగిలిన బైబిలంతటితోనూ మరియు అప్పటికే బయల్పడడం ప్రారంభమైన సంఘటనలతోనూ స్పష్టంగా గుర్తించబడ్డాయి.

2. పెరిగే సంఖ్యాకులు తమను పరలోక జీవితానికి దేవుడు పిలువలేదని గ్రహించారని ఏది సూచిస్తుంది?

2 సుమారు ఆరు వారాల ముందు, ప్రభువు రాత్రి భోజన ఆచరణ యందు యెహోవాసాక్షుల సంఘాల్లో హాజరైన 10,681 మంది (సుమారు ఆరుగురిలో ఒకరు) రొట్టె, ద్రాక్షారసపు చిహ్నాల్లో పాల్గొనలేదు, అంతేకాకుండ వీరిలో 3,688 మంది దేవుని రాజ్యాన్ని చురుకుగా ప్రచురపర్చేవారు. వారు చిహ్నాలు తీసుకోడంలో ఎందుకు పాల్గొనలేదు? ఎందుకంటే వారు బైబిలు నుండి నేర్చుకున్న దాని ఆధారంగా వారిని దేవుడు పరలోక జీవితానికి పిలువలేదని అయితే మరో విధంగా యెహోవా ప్రేమపూర్వక ఏర్పాట్లలో తాము పాలుపంచుకోవచ్చని వారు గ్రహించారు. కనుక ఆ సమావేశంలో, “భూమిపై నిరంతరం జీవించే నిరీక్షణ గల వారందరూ లేచి నిలబడతారా?” అని ప్రసంగీకుడు అడిగినప్పుడు ఏమి జరిగింది? వేలమంది లేచి నిలుచున్నారు, దాని వెంట ప్రేక్షకులు చాలా సేపువరకు ఉత్సాహధ్వనులు చేశారు.

3. గొప్ప గుంపును గుర్తించడం ప్రాంతీయ సేవకు పునరుద్ధరించబడిన ప్రోత్సాహాన్ని ఎందుకు అందించింది, మరి దీని విషయంలో సాక్షులు ఎలా భావించారు?

3 ఆ సమావేశంలో ప్రతినిధులు నేర్చుకున్నవి తమ పరిచర్యలో వారికి నూతన ప్రోత్సాహాన్ని యిచ్చింది. ఇప్పుడు, అంటే పాత విధానాంతానికి ముందుగా పరదైసు భూమిపై నిరంతరం జీవించే దృష్టితో జీవాన్ని కాపాడుకునేందుకు యెహోవా ఏర్పాటులోకి ఎంతో కొంతమంది మాత్రమే కాదు అనేకానేకమంది ప్రజలకు అవకాశమివ్వబడడాన్ని వారు గుణగ్రహిస్తారు. సత్యాన్ని ప్రేమించేవారికి అక్కడ ఎంతో హృదయానందకర సమాచారం అందించబడింది! గొప్ప పని చేయవల్సి ఉందని యెహోవాసాక్షులు గ్రహించారు—ఓ ఆనందమయమైన పని. సంవత్సరాల తర్వాత పరిపాలక సభలో సభ్యుడైన జాన్‌ బూత్‌ యిలా జ్ఞాపకం చేసుకున్నాడు: “ఆ సమావేశం ఆనందించేందుకు మనకు ఎంతో అందించింది.”

4. (ఎ) పందొమ్మిదివందల ముప్పై అయిదు నుండి గొప్ప సమూహపు అసలు సమకూర్పు ఎంత విస్తారంగా జరిగింది? (బి) తమకున్నది సజీవ విశ్వాసమని గొప్ప సమూహంలోని వారు ఏ విధంగా రుజువును అందిస్తున్నారు?

4 తర్వాత వచ్చిన సంవత్సరాల్లో, యెహోవాసాక్షుల సంఖ్య చాలా త్వరగా పెరిగింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో వారిపై ఉద్ధృతమైన హింసలు విరుచుకుపడినప్పటికీ, ఒక్క దశాబ్దంలోనే వారి సంఖ్య సుమారు మూడింతలైంది. అంతేకాకుండ, 1935 నందు బహిరంగంగా సాక్ష్యమిస్తున్న 56,153 మంది ప్రచారకుల సంఖ్య 1994 కల్లా 230 కన్నా ఎక్కువ దేశాల్లో 49,00,000 మంది రాజ్య ప్రచారకులకు పెరిగింది. వీరిలో అనేకమంది, యెహోవా అనుగ్రహించే భూ పరదైసులో పరిపూర్ణజీవం కొరకు ఎంతగానో ఎదురుచూస్తూ నిరీక్షిస్తున్నారు. చిన్న మందతో పోలిస్తే, వారు నిజంగానే గొప్ప సమూహమయ్యారు. వారికి నమ్మకం ఉందని చెప్పి కూడా, దాన్ని ప్రదర్శించని ప్రజలు కారు వారు. (యాకోబు 1:22; 2:14-17) అందరూ దేవుని రాజ్యాన్ని గూర్చిన సువార్తను యితరులతో పంచుకుంటారు. ఆ ఆనందమయ గుంపులో మీరున్నారా? చురుకైన సాక్షిగా ఉండడం ఒక ప్రాముఖ్యమైన గుర్తింపు చిహ్నమే, అయితే అందులో అంతకంటే ఎక్కువే యిమిడివుంది.

‘సింహాసనము ఎదుట నిలువబడుట’

5. గొప్ప సమూహము ‘సింహాసనము ఎదుట నిలువబడివున్నారనే’ వాస్తవాన్ని బట్టి ఏది సూచించబడుతోంది?

5 అపొస్తలుడైన యోహానుకు యిచ్చిన దర్శనంలో వారు ‘సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడటం’ ఆయన చూశాడు. (ప్రకటన 7:9) ఈ సందర్భంలో వర్ణించినట్లుగా, దేవుని సింహాసనం ఎదుట వారు నిలువబడడం, యెహోవా సర్వాధిపత్యానికి వారు పూర్తి గుర్తింపునిస్తున్నారని సూచిస్తుంది. దీనిలో చాలా యిమిడి ఉంది. ఉదాహరణకు: (1) తన సేవకుల విషయంలో ఏది మంచో ఏది చెడో నిర్ణయించే యెహోవా హక్కును వారు గుణగ్రహిస్తారు. (ఆదికాండము 2:16, 17; యెషయా 5:20, 21) (2) తన వాక్యం ద్వారా యెహోవా వారితో మాట్లాడే వాటిని వింటారు. (ద్వితీయోపదేశకాండము 6:1-3; 2 పేతురు 1:19-21) (3) పర్యవేక్షించే బాధ్యతను, యెహోవా అప్పగించినవారికి విధేయులవ్వవల్సిన ప్రాముఖ్యతను వారు గుణగ్రహిస్తారు. (1 కొరింథీయులు 11:3; ఎఫెసీయులు 5:22, 23; 6:1-3; హెబ్రీయులు 13:17) (4) అపరిపూర్ణులైనప్పటికీ, వారు దైవపరిపాలనా నడిపింపుకు ప్రతిస్పందించేందుకు యథార్థంగా కృషి చేస్తారు, అది సణుగుకుంటూ కాదు, హృదయాంతరం నుండి, సంసిద్ధతతో చేస్తారు. (సామెతలు 3:1; యాకోబు 3:17, 18) వారు ఎంతగానో గౌరవించి గాఢంగా ప్రేమించే యెహోవాకు పరిశుద్ధ సేవను అందించేందుకు సింహాసనము ఎదుట నిలుచున్నారు. ఈ గొప్ప సమూహం విషయంలో అక్కడ సింహాసనం ఎదుట ‘నిలువబడియుండుట’ అన్నది సింహాసనం మీద కూర్చున్న వాని అంగీకారాన్ని సూచిస్తుంది. (ప్రకటన 6:15-17 పోల్చండి.) అంగీకారం దేనిపై ఆధారపడి ఉంటుంది?

“తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై”

6. (ఎ) గొప్ప సమూహము ‘తెల్లని వస్త్రములు ధరించుకొని’ ఉండడం అంటే ఏమిటి? (బి) యెహోవా ముందు గొప్ప సమూహము నీతియుక్త స్థానాన్ని ఎలా కల్గివుండగలదు? (సి) క్రీస్తు చిందించిన రక్తం యందు విశ్వాసం గొప్ప సమూహంలోని వారి జీవితాలను ఎంత మేరకు ప్రభావితం చేయగలదు?

6 అపొస్తలుడైన యోహాను చూసిన దాన్ని వర్ణించడంలో, గొప్ప సమూహములోని సభ్యులు ‘తెల్లని వస్త్రములు ధరించుకొని’ ఉన్నట్లు చెబుతున్నాడు. ఆ తెల్లని వస్త్రములు యెహోవా యెదుట వారి స్వచ్ఛమైన నీతియుక్తమైన స్థానాన్ని సూచిస్తాయి. అలాంటి స్థానాన్ని వారు ఎలా పొందగల్గారు? వారు “గొఱ్ఱెపిల్ల ఎదుట” నిలబడి ఉన్నట్లుగా మనం యోహాను దర్శనంలో ముందుగానే చూశాము. యేసుక్రీస్తు “లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల” అని వారు గుర్తిస్తారు. (యోహాను 1:29) దర్శనమందు దేవుని సింహాసనమందు ఉన్న పెద్దలలో ఒకరు యిలా వివరించడం యోహాను విన్నాడు: ‘గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసికొనిరి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉన్నారు.’ (ప్రకటన 7:14, 15) సూచనార్థకంగా, క్రీస్తు విమోచనా రక్తంలో విశ్వాసముంచడం ద్వారా వారు తమ వస్త్రములను ఉదుకుకున్నారు. విమోచనను గూర్చి బైబిలు బోధించే వాటికి వారు కేవలం మానసిక మద్దతునే యివ్వరు. దాని యెడల వారికిగల మెప్పుదల వారు అంతరంగంలో ఎలా ఉన్నారన్న దాన్ని ప్రభావితం చేస్తుంది; ఆ విధంగా వారు “హృదయమందు” విశ్వసించుదురు. (రోమీయులు 10:9, 10) వారు తమ జీవితాలతో వ్యవహరించే విధానంపై యిది ఎంతో ప్రభావాన్ని కల్గివుంటుంది. విశ్వాసం వల్ల, వారు క్రీస్తు బలి ఆధారంగా తమను తాము యెహోవాకు సమర్పించుకుంటారు, నీటి బాప్తిస్మము ద్వారా వారు ఆ సమర్పణను సూచిస్తారు, వారి సమర్పణకు అనుగుణంగా వారు నడచుకుంటారు, అంతేకాకుండ ఆ విధంగా వారు దేవునితో ఒక అంగీకారయుక్త సంబంధాన్ని అనుభవిస్తారు. జాగ్రత్తగా కాపాడుకోవల్సిన ఎంత చక్కని ఆధిక్యత అది!—2 కొరింథీయులు 5:14, 15.

7, 8. గొప్ప సమూహం తన దుస్తులను మరకలు లేకుండ ఉంచుకునేందుకు యెహోవా సంస్థ ఎలా సహాయపడింది?

7 వారి చిరకాల శ్రేయస్సు యెడల ప్రేమపూర్వక శ్రద్ధతో, వారి గుర్తింపు దుస్తులను మలినపర్చే లేక అపవిత్రపర్చే దృక్పథాన్ని ప్రవర్తనను, యెహోవా సంస్థ తరచూ సూచించింది. ఎందుకంటే మాటలు చెప్పినప్పటికీ ప్రకటన 7:9, 10 నందున్న ప్రవచనార్థక వర్ణనకు ఒక వ్యక్తి నిజంగా సరితూగకుండాపోయేలా చేస్తాయి. (1 పేతురు 1:15, 16) ముందు ప్రచురించబడిన వాటిని ధృవపరుస్తూ యితరులకు బోధించి, మిగిలిన సమయాల్లో వ్యభిచారం జారత్వం వంటి వాటిలో పాల్గొనడం పూర్తిగా తప్పవుతుందని 1941లోనూ అలాగే దాని తర్వాతనూ కావలికోట పదే పదే చూపింది. (1 థెస్సలొనీకయులు 4:3; హెబ్రీయులు 13:4) యెహోవా ఏర్పర్చిన క్రైస్తవ వివాహ సూత్రాలు అన్ని దేశాల్లోనూ అనువర్తించబడగలవని 1947 నందు నొక్కి తెల్పడం జరిగింది; స్థానిక ఆచారం దేన్ని అంగీకరించినప్పటికీ, బహుభార్యత్వం పాటించేవారు యెహోవాసాక్షులుగా ఉండనేరరు.—మత్తయి 19:4-6; తీతు 1:5, 6.

8 వారెక్కడ ఉన్నప్పటికీ అపవిత్రమైనవిగా నిరాకరించలేని కార్యాలను, అంటే పొగాకును చెడుగా ఉపయోగించడం వంటివాటిని అందరూ పూర్తిగా త్యజించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులకు 1973లో చూపించబడింది—అది రాజ్యమందిరంలోనే లేక పరిచర్య చేసే సమయంలోనే కాకుండ, లౌకిక ఉద్యోగాల వద్ద లేక ప్రజలు చూడలేని ఏకాంత ప్రాంతాల్లో అయినా పాటించాల్సిందే. (2 కొరింథీయులు 7:1) యెహోవాసాక్షుల జిల్లా సమావేశమందు 1987లో, దేవుని యెదుట పవిత్రమైన స్థానాన్ని వహించేందుకుగాను ద్వంద్వ జీవితాన్ని జీవించకుండా జాగ్రత్తవహించాలని క్రైస్తవ యౌవనులకు గట్టి సలహా యివ్వడం జరిగింది. (కీర్తన 26:1, 4) “తండ్రియైన దేవుని యెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి” యందు ‘ఇహలోకమాలిన్యము అంటకుండ’ ఉండడం యిమిడి ఉంది కనుక, లౌకికాత్మలోని వివిధ విషయాలను గూర్చి కావలికోట మరలా మరలా, హెచ్చరికలను చేసింది.—యాకోబు 1:27.

9. మహా శ్రమల తర్వాత దేవుని సింహాసనం ముందు అంగీకృతంగా ఎవరు నిల్చుంటారు?

9 ఎవరైతే దేవుని అంగీకృత సేవకులుగా ఆత్మీయంగానూ మరియు నైతికంగానూ పవిత్రంగా ఉండేలా విశ్వాసం చేత కదిలించబడతారో వారే యింకా రాబోవు మహాశ్రమల తర్వాత, ‘సింహాసనము ఎదుట నిలుచుని ఉంటారు.’ ఈ ప్రజలు క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించడమే కాకుండ యథార్థంగా కొనసాగేవారు కూడా.—ఎఫెసీయులు 4:24.

“ఖర్జూరపుమట్టలు చేతపట్టుకుని”

10. గొప్ప సమూహంలోనివారి చేతుల్లో యోహాను చూసిన ఖర్జూరపు మట్టల ప్రాముఖ్యత ఏమిటి?

10 అపొస్తలుడైన యోహాను గమనించిన దాని ప్రకారంగా గొప్ప సమూహపు విశేషమైన లక్షణాల్లో, ‘వారిచేతుల్లో ఖర్జూరపుమట్టలు ఉండడం’ ఒకటి. దాని ప్రాధాన్యతేమిటి? హెబ్రీ కాలెండరు ప్రకారం రాబోయే ఎండాకాలం కోత తర్వాత చేసుకునే అతి ఆనందభరితమైన యూదుల పర్ణశాల పండుగను ఆ ఖర్జూరపు మట్టలు, యోహానుకు గుర్తుచేసి ఉండవచ్చన్నది నిశ్చయం. ధర్మశాస్త్రానికి అనుగుణంగా, పండగ సమయంలో నివసించేందుకుగాను యితర చెట్ల కొమ్మలతో సహా ఈతమట్టలతో పర్ణశాలలను తయారు చేస్తారు. (లేవీయకాండము 23:39-40; నెహెమ్యా 8:14-18) హలెల్‌ కీర్తనలు (కీర్తన 113-118) పాడే సమయంలో కూడా ఆలయం వద్ద ఆరాధికులు తమ చేతులను ఊపుతారు. గొప్ప సమూహము ఖర్జూరపు మట్టలను పట్టుకుని ఊపడం, యేసు యెరూషలేములోనికి సవారీ చేస్తుండగా ఒక గుంపు ఆరాధికులు ఖర్జూరపు మట్టలను చేతపట్టుకుని ఆనందంగా ఊపుతూ వారు యిలా అనడాన్ని యోహానుకు గుర్తుచేసి ఉండవచ్చు: “ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతించబడునుగాక.” (యోహాను 12:12, 13) కనుక ఖర్జూరపు మట్టలను ఊపడం, యెహోవా రాజ్యాన్ని ఆయన అభిషక్త రాజునూ గొప్ప సమూహం ఆనందంగా స్తుతించడమని సూచిస్తోంది.

11. దేవుని సేవకులు యెహోవా సేవలో నిజంగా ఆనందాన్ని ఎందుకు పొందగలరు?

11 అది ఎలాంటి ఆనందభరితమైన స్ఫూర్తి అంటే, యెహోవాను సేవించడంలోనూ గొప్ప సమూహము నేటికీ దాన్ని కనపరుస్తోంది. దాని భావం వారు ఏ కష్టాలనూ ఎదుర్కోవడంలేదని గానీ లేక ఏ దుఃఖాన్ని లేక బాధనూ అనుభవించడం లేదని గానీ కాదు. అయితే యెహోవాను సేవించడంలోనూ ప్రీతిపర్చడంలోనూ వచ్చే సంతృప్తి, ఆ విషయాలను తొలగించేందుకు సహాయపడుతుంది. ఆ విధంగా, తన భర్తతో 45 సంవత్సరాలు గుటెమిలా నందు పనిచేసిన ఒక మిషనరీ అప్పట్లో తమ చుట్టూవున్న గత పరిస్థితులను గూర్చి, కష్టపడి పని చేసినదాన్ని గూర్చి, మరియు రాజ్య సమాచారంతో ఇండియన్ల గ్రామాలను (రెడ్‌యిండియన్ల) చేరే ప్రయత్నమందు తమ జీవితంలో భాగమైన అపాయకరమైన ప్రయాణాలను గూర్చి చెప్పింది. చివరికి ఆమె యిలా చెప్పింది: “మా జీవితంలో అవి ఎంతో ఆనందించిన సమయాలు.” ఆమె తన వృద్ధాప్యం అనారోగ్యాల ప్రభావాన్ని భావిస్తున్నప్పటికీ, ఆమె తన డైరీలో చివరిగా రాసిన వాటిలో ఈ మాటలున్నాయి: “ఈ జీవితం ఎంతో బాగుంది, ఎంతో ఫలదాయకమైంది.” ప్రపంచవ్యాప్తంగా, యెహోవాసాక్షులు తమ పరిచర్యను గూర్చి యిలా భావిస్తున్నారు.

‘రాత్రింబగళ్లూ పరిశుద్ధ సేవ చేయుట’

12. పగలుగానీ రాత్రిగానీ, ఈ భూమ్మీద యెహోవా ఏమి గమనిస్తాడు?

12 ఈ ఆనందభరితమైన ఆరాధికులు యెహోవాకు ‘రాత్రింబగళ్లూ పరిశుద్ధ సేవను’ చేస్తున్నారు. (ప్రకటన 7:15) ఈ పరిశుద్ధ సేవలో ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది పాల్గొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రై ప్రజలు పడుకున్నప్పుడు, యితర ప్రాంతాల్లో సూర్యుడు ఉదయించి సాక్ష్యమివ్వడంలో యెహోవాసాక్షులు తీరికలేకుండ పని చేస్తున్నారు. ఎడతెగక భూమి గుండ్రంగా తిరుగుతున్నప్పుడు, రాత్రింబగళ్లూ యెహోవా స్తుతులను వారు ఆలపిస్తున్నారు. (కీర్తన 86:9) అయితే, ప్రకటన 7:15 నందు సూచించిన రాత్రింబగళ్లూ సేవచేయడమన్నది మరింత స్వకీయమైంది.

13. “రాత్రింబగళ్లూ” సేవించడం అన్నప్పుడు లేఖనాలు ఏ భావాన్ని కల్గివున్నాయని సూచిస్తున్నాయి?

13 గొప్ప సమూహములోని వ్యక్తులు రాత్రింబగళ్లూ పరిశుద్ధ ఆరాధనను అందిస్తారు. అంటే వారు చేసే ప్రతిదీ పరిశుద్ధ ఆరాధనగా దృష్టించబడుతుందని దాని భావమా? వారు చేసేదేమైనప్పటికీ, యెహోవాను గౌరవించే విధంగా వారు చేసేందుకు నేర్చుకుంటారన్నది నిజం. (1 కొరింథీయులు 10:31; కొలొస్సయులు 3:23) అయితే, ‘పరిశుద్ధ సేవ’ ఒకరు యెహోవా ఆరాధనలో నేరుగా యిమిడే విషయానికి మాత్రమే అన్వయించబడుతుంది. “రాత్రింబగళ్లు” ఒక పనిని చేయడం క్రమబద్ధతనూ లేక ఏకరీతినీ అలాగే యథార్థమైన ప్రయత్నాన్ని సూచిస్తుంది.—పోల్చండి: యెహోషువ 1:8; లూకా 2:37; అపొస్తలుల కార్యములు 20:31; 2 థెస్సలొనీకయులు 3:8.

14. మన వ్యక్తిగత ప్రాంతీయ సేవ, “రాత్రింబగళ్లు” సేవ చేయడం అని వర్ణించినదానికి తగినంత చేసేందుకు ఏది సహాయపడుతుంది?

14 వారు భూమ్మీది యెహోవా మహా అత్మీయ ఆలయ ప్రాంగణమందు సేవ చేస్తూ ఉండగా, గొప్ప సమూహములోని వ్యక్తులు ప్రాంతీయ పరిచర్యలో క్రమంగానూ ఏకరీతిగాను చేసేందుకు ప్రయత్నిస్తారు. ప్రతివారం, ప్రాంతీయ సేవలో కనీసం కొంతైనా భాగం వహించాలనే గురిని అనేకులు కల్గివున్నారు. ఇతరులు తమను తాము క్రమ పయినీర్లుగా చేసుకునేందుకు లేక సహాయపయినీర్లుగా చేసుకునేందుకు కృషి చేస్తున్నారు. తరచూ, వీరు వీధుల్లోనూ ప్రొద్దున్నే అంగళ్ళలోనూ సాక్ష్యమివ్వడంలో పనిరద్దీని కల్గివుంటారు. ఆసక్తి గలవారికి వీలుగా కొందరు సాక్షులు బాగా పొద్దుగూకిన తర్వాత బైబిలు పఠనాలను నిర్వహిస్తున్నారు. వస్తువులను కొనుక్కునేటప్పుడు, ప్రయాణించేటప్పుడు, మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో, టెలిఫోను ద్వారా వారు సాక్ష్యమిస్తూ ఉంటారు.

15. ప్రాంతీయ పరిచర్య కాకుండ, మన పరిశుద్ధ సేవలో మరింకేది కూడా యిమిడి ఉంది?

15 సంఘకూటాల్లో పాల్గొనడం కూడా మన పరిశుద్ధ సేవలో ఒక భాగమే; క్రైస్తవ సమావేశాల నిర్మాణం వాటిని చూసుకునే పని కూడా అంతే. యెహోవా సేవలో, తమ క్రైస్తవ సహోదర సహోదరీలకు ఆత్మీయంగానూ శారీరకంగాను సహాయపడి ప్రోత్సహించేందుకు ప్రయత్నించడం యిమిడి ఉన్నాయి. దీనిలో మన ఆసుపత్రి అనుసంధాన కమిటి ఇమిడి ఉంది. అన్ని విధాల బేతేలు సేవలు, అలాగే మన సమావేశాల్లో స్వచ్ఛంద సేవ, అన్నీ పరిశుద్ధ సేవలే. నిజానికి, మన జీవితం, యెహోవాతో మన సంబంధంపై ఆధారితమైతే, అది పరిశుద్ధ సేవతో నిండివుంటుంది. లేఖనాలు చెబుతున్నట్లుగా, యెహోవా ప్రజలు ‘రాత్రింబగళ్లూ పరిశుద్ధ సేవను’ చేస్తున్నారు అంతేకాకుండ అలా చేయడంలో వారు గొప్ప ఆనందాన్ని పొందుతున్నారు.—అపొస్తలుల కార్యములు 20:35; 1 తిమోతి 1:11.

‘ప్రతి జనములో, వంశములో, ప్రజలలో, ఆయా భాషలు మాట్లాడువారిలో నుండి’

16. గొప్ప సమూహము ‘ప్రతి జనాంగములోనుండి వస్తుందని’ అన్న దాన్ని ఏది నిరూపిస్తుంది?

16 గొప్ప సమూహములోనివారు అన్ని జనములలో నుండి వస్తున్నారు. దేవుడు పక్షపాతి కాడు, అంతేకాకుండ యేసుక్రీస్తు ద్వారా అందించే విమోచన క్రయధనం అందరికీ వర్తించేందుకు సరిపడా ఉంది. గొప్ప సమూహము లేఖనాధారంగా మొట్ట మొదట 1935 నందు గుర్తించబడినప్పుడు, యెహోవాసాక్షులు 115 దేశాల్లో చురుకుగా ఉన్నారు. అనేక దేశాల్లో, గొఱ్ఱె వంటి వారిని వెతకడం, 1990లకల్లా రెండింతల కంటే ఎక్కువకు పెరిగింది.—మార్కు 13:10.

17. అన్ని ‘జాతులు, ప్రజలు, భాషలు’ గల ప్రజలందరినీ గొప్ప సమూహంలో చేర్చేందుకు ఏమి చేయడం జరిగింది?

17 గొప్ప సమూహంలోని బావి సభ్యులను వెతకడంలో, యెహోవాసాక్షులు జాతీయ గుంపులకే కాకుండ ఆ దేశాల్లోని జాతి, ప్రజలు, భాషల వారికి కూడా శ్రద్ధనిచ్చారు. ఈ ప్రజలను చేరేందుకు, సాక్షులు బైబిలు ప్రచురణలను 300లకంటే ఎక్కువ భాషల్లో ప్రచురిస్తున్నారు. దీనిలో, అర్హులైన అనువాదకుల టీమ్‌లకు శిక్షణనిచ్చి, వారిని పోషించడం, ఈ భాషల్లో పనిచేయగల కంప్యూటర్‌ పరికరాలను అందించడం, అలాగే అసలు ముద్రణలు చేయడం యిమిడి ఉన్నాయి. కేవలం గత అయిదు సంవత్సరాల్లోనే, 9,80,00,000 మంది ప్రజలు మాట్లాడే 36 అదనపు భాషలను ఈ పట్టికలో చేర్చడం జరిగింది. దానికి తోడు, ఈ ప్రజలు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేలా సహాయపడేందుకు సాక్షులు వారిని వ్యక్తిగతంగా కలుసుకునే ప్రయత్నం చేస్తారు.—మత్తయి 28:19, 20.

“మహాశ్రమలనుండి వచ్చినవారు”

18. (ఎ) మహా శ్రమలు ప్రారంభమైనప్పుడు ఎవరు రక్షించబడతారు? (బి) అప్పుడు ఏ ఆనందమయ ప్రకటనలు చేయబడుతాయి?

18 ప్రకటన 7:1 నందు సూచించిన నాశనకర వాయువులను దూతలు విడుదల చేసినప్పుడు, అభిషక్తులైన ‘మన దేవుని దాసులు’ యెహోవా యొక్క ప్రేమపూర్వక రక్షణను అనుభవిస్తారు, అంతేకాకుండ, నిజమైన ఆరాధనలో వారితో కూడా దాన్ని అనుభవిస్తారు. చేరిన గొప్ప సమూహము కూడా అపొస్తలుడైన యోహానుకు చెప్పబడినట్లుగా, గొప్ప సమూహములోని వారు తప్పించుకున్నవారిగా ‘మహాశ్రమలనుండి వస్తారు.’ వారు యిలా ప్రకటిస్తూ, కృతజ్ఞత మరియు స్తుతుల కేకను ఎలా వేస్తున్నారో కదా: ‘సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రము!’ దేవుని పరలోకంలోని యథార్థ సేవకులందరూ యిలా ప్రకటించడంలో తమ స్వరాలను కలుపుతారు: “ఆమేన్‌; యుగయుగములవరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక.”—ప్రకటన 7:10-14.

19. తప్పించుకున్నవారు ఏ ఆనందమయ కార్యక్రమంలో కుతూహలంతో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నారు?

19 అది ఎంత ఆనందభరితమైన సమయంగా ఉంటుంది! జీవించేవారందరూ ఏకైక నిజమైన దేవుని సేవకులుగా ఉంటారు! వీటన్నింటిలో మాకు అత్యంత ఆనందం యెహోవాను సేవించడం వల్ల వస్తుంది. చేయవల్సిన పని ఎంతో ఉంది—ఆనందభరితమైన పని! భూమి పరదైసుగా మార్చబడాలి. లక్షలాది మంది మృతులు పునర్థుతానమవ్వాలి, మరి అప్పుడు యెహోవా మార్గాల్లో వారు బోధింపబడాలి. దానిలో భాగం వహించడం ఎంత ఆనందభరితమైన ఆధిక్యత!

మీ వ్యాఖ్యానమేమిటి?

◻ యెహోవాసాక్షుల ప్రాంతీయ సేవలో, 1935 నందు జరిగిన సంఘటనలు ఏ ప్రభావాన్ని కల్గివున్నాయి?

◻ గొప్ప సమూహము “సింహాసనము ఎదుట నిలువబడి” ఉండడం అన్న వాస్తవాన్ని బట్టి ఏమి గమనించబడింది?

◻ గొర్రెపిల్ల రక్తం యెడల మెప్పుదల జీవితాలను ఎలా ప్రభావితం చేయాలి?

◻ ఖర్జూరపు మట్టలను ఊపడం వల్ల ప్రాముఖ్యంగా సూచించబడిందేమిటి?

◻ గొప్ప సమూహము రాత్రింబగళ్లూ పరిశుద్ధ సేవను ఎలా అందిస్తోంది?

[16, 17వ పేజీలోని చిత్రం]

క్రమబద్ధతను, శ్రద్ధను యథార్థమైన ప్రయత్నాన్ని వారి పవిత్ర సేవ ప్రతిబింబిస్తుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి